రూ.2000, 500 నోట్లపై ఏమైనా రాస్తే చెల్లవా? ఇదిగో క్లారిటీ.. | Writing On 2000 500 Currency Notes Make Them Invalid RBI Clarifies | Sakshi
Sakshi News home page

Fact Check: రూ.2000, 500 నోట్లపై ఏమైనా రాస్తే చెల్లవా? ఇదిగో క్లారిటీ..

Published Sun, Jan 8 2023 5:17 PM | Last Updated on Sun, Jan 8 2023 5:30 PM

Writing On 2000 500 Currency Notes Make Them Invalid RBI Clarifies - Sakshi

రూ.2000, 500, 200, 100 కరెన్సీ నోట్లపై పెన్నుతో లేదా పెన్సిల్‌తో ఏమైనా రాస్తే అవి చెల్లవని, ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో ఇది ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది ఇదే నిజమే అని నమ్ముతున్నారు. 

అయితే ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 2000, 500 సహా అన్ని కరెన్సీ నోట్లపై ఏమైనా రాసినా అవి అన్ని బ్యాంకుల్లో చెల్లుతాయని చెప్పింది. దీన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది. అయితే పెన్ను లేదా పెన్సిల్‌తో నోట్లపై రాయడం వల్ల వాటి మన్నిక కాలం తగ్గే అవకాశం ఉందని, అందుకే సాధ్యమైనంత వరకు ఏమీ రాయవద్దని సూచించింది.

కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉన్నా వాటిని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా 2020లోనే జారీ చేసింది. అయితే కొంతమంది ఈ విషయంపై అవగాహన లేక కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉంటే అవి చెల్లవేమో అని భయపడి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇవన్నీ అవాస్తవమని ‍ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కరెన్సీ నోట్లపై పెన్ను, పెన్సిల్‌తో ఏమైనా రాసి ఉ‍న్నా, సిరా మరకలు కన్పించినా అవి చెల్లుతాయి. వినియోగదారులు అవసరమైతే వీటీని తీసుకెళ్లి బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అలాగే నాణేలను కూడా ఇచ్చి కరెన్సీ నోట్లుగా తీసుకోవచ్చు.
చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement