కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్‌ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్!
దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది.
An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023
✅This order is #fake
✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb
Comments
Please login to add a commentAdd a comment