Reserve Bank India
-
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనుంది.1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్ సిరీస్ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కింద బిడ్ ఆఫర్ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్‌ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలుఆర్ఎఫ్పీ పత్రం ప్రకారం, ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి. -
రేటు కోతకు వేళాయెనా..!
ముంబై: పశి్చమాసియాలో యుద్ధ వాతావరణంసహా భౌగోళిక ఉద్రికత్తలు, దీనితో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ద్రవ్య పరపతి విధానాన్ని ఆరుగురు సభ్యుల రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు రెపోను వరుసగా 10వ పాలసీ సమీక్షలోనూ 6.5% వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విధాన వైఖరిని మాత్రం 2019 జూన్ నుంచి అనుసరిస్తున్న ‘సరళతర ఆర్థిక విధాన ఉపసంహరణ’ నుంచి ‘తటస్థం’ వైపునకు మార్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది సానుకూలాంశమని, సమీప భవిష్యత్తులో రెపో రేటు తగ్గింపునకు సంకేతమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్‌సూద్ సహా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందన్న భరోసాతో పాలసీ వైఖరి మార్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప, రేటు కోతపై మాట్లాడ్డానికి ఇది తగిన సమయం కాదని ఆర్బీఐ గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలో ముఖ్యాంశాలు... → ఆర్బీఐ తాజా నిర్ణయంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటు యథాతథంగా 6.5% వద్ద కొనసాగుతోంది. → 2024–25 ఆర్థిక సంవత్సరం దేశ ఎకానమీ వృద్ధి రేటు అంచనాను యథాతథంగా 7.2 శాతంగా పాలసీ కొనసాగించింది. ఇప్పటికే వెల్లడైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎకానమీ 6.7 శాతం పురోగతి సాధించగా, క్యూ2, క్యూ3, క్యూ4లలో వృద్ధి రేట్లు వరుసగా 7, 7.4, 7.4 శాతాలుగా నమోదవుతాయని పాలసీ అంచనావేసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందన్న గత విధాన వైఖరిలో మార్పులేదు. క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 4.1 శాతం, 4.8 శాతం, 4.2 శాతాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని, 2025–26 తొలి త్రైమాసికంలో ఈ రేటు 4.3 శాతమని పాలసీ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటుఇటుగా 4 శాతం వద్ద ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. → ఫీచర్ ఫోన్ యూపీఐ123పే పరిమితిని లావాదేవీకి ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచడం జరిగింది. → లైట్ వాలెట్ పరిమితి ప్రస్తుత రూ.2,000 నుంచి రూ.5,000కు పెరిగింది. లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కి ఎగసింది. → తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 4 నుంచి 6వ తేదీల మధ్య జరగనుంది.వృద్ధికి వడ్డీరేట్లు అడ్డుకాదు... ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న విశ్వాసంతోనే పాలసీ విధాన వైఖరిని మార్చడం జరిగింది. అయితే రేటు కోత ఇప్పుడే మాట్లాడుకోవడం తగదు. ఇక వృద్ధిపై ప్రస్తుత వడ్డీరేట్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గత 18 నెలల కాలంలో మాకు ఎటువంటి సంకేతాలు లేవు. భారత్ ఎకానమీ పటిష్ట వృద్ధి బాటలో పయనిస్తోంది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణ నాణ్యతపై అత్యధిక దృష్టి సారించాలి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వృద్ధికి దోహదం.. ఆర్బీఐ విధాన ప్రకటన పటిష్ట వృద్ధికి, ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడే అంశం. పాలసీ వైఖరి మార్చుతూ తీసుకున్న నిర్ణయం.. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద కట్టడి చేయడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ రియలీ్టకి నిరాశ..హౌసింగ్ డిమాండ్‌ను పెంచే అవకాశాన్ని ఆర్బీఐ కోల్పోయింది. రియలీ్టకి ఊపునివ్వడానికి రేటు తగ్గింపు కీలకం. వచ్చే పాలసీ సమీక్షలోనైనా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని ఈ రంగం విజ్ఞప్తి చేస్తోంది. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ వైఖరి మార్పు హర్షణీయం.. ఆర్బీఐ పాలసీ వైఖరి మార్పు హర్షణీయం. రానున్న సమీక్షలో రేటు కోత ఉంటుందన్న అంశాన్ని ఇది సూచిస్తోంది. ఎకానమీ పురోగతికి తగిన పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ తగిన సమయాల్లో తీసుకుంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. – దీపక్‌సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ -
నెమ్మదిగా దారిలోకి.. ద్రవ్యోల్బణం
ముంబై: భారత్‌లో ద్రవ్యోల్బణ నెమ్మదిగా అదుపులోనికి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం అన్నారు. సమీప మధ్యకాలిక సమయంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు 4 శాతానికి తగ్గించడం జరుగుతుందని కూడా భరోసా ఇచ్చారు. లండన్‌లో సెంట్రల్ బ్యాంకింగ్ నిర్వహించిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో రెండేళ్ల కనిష్టస్థాయి 4.25 శాతానికి తగ్గిన నేపథ్యంలో శక్తికాంత్‌దాస్ తాజా ప్రసంగం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల మే నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. జూన్ పాలసీ సమీక్ష సందర్భంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను మొదటి ద్వైమాసిక సమీక్షతో పోల్చితే ఇటీవలి రెండవ ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ తగ్గించింది. కిత్రం 5.2 శాతం అంచనాలను స్వల్పంగా 5.1 శాతానికి కుదించింది. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వరుసగా 4.6 శాతం, 5.2 శాతం, 5.4 శాతం, 5.2 శాతాలుగా ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనా వేసింది. ఎల్‌నినో, రుతుపవనాలపై అంచనాల్లో ఇంకా స్పష్టత లేదని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. తాజాగా శక్తికాంత్ దాస్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ దేశంలో ద్రవ్యోల్బణం లక్ష్యం మేరకు 4 శాతానికి క్రమంగా దిగివస్తుంది. ♦ ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ♦ రేటు నిర్ణయం అంశాలపై ఏమీ చెప్పలేని అనిశ్చితి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. ♦వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అధిక జనాభా, వారి పురోగతిని అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ వృద్ధిపై కూడా ఆర్బీఐ దృష్టిపెడుతుంది. ♦ ధరల స్థిరత్వం లేకుంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మేము గుర్తించాము. ద్రవ్య విధానం– దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వంపై పూర్తి దృష్టి కేటాయింపు ఉంటుంది. ♦ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి (4 శాతం ఎగువన) ఉన్నప్పటికీ మహమ్మారి సంవత్సరాలలో ఆర్బీఐ తన పాలసీ విధానంలో వృద్ధికి ప్రాధాన్యతనిచ్చిం ది. ♦ ఆర్థిక, ద్రవ్య విధానాల చురుకైన సమన్వయం, ప్రతిస్పందన వల్ల ఎకానమీ రికవరీ త్వరిత పునరుద్ధరణకు దోహదపడింది. ♦ బ్యాంకింగ్, డిజిటలైజేషన్, టాక్సేషన్, తయారీ అలాగే కార్మికులకు సంబంధించిన వివిధ నిర్మాణాత్మక సంస్కరణలు గత కొన్ని సంవత్సరాలుగా అమలయ్యాయి. తద్వారా మధ్యస్థ, దీర్ఘకాలంలో బలమైన– స్థిరమైన వృద్ధికి పునాదులు పడ్డాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో క్షీణత తర్వాత స్థూల దేశీయోత్పత్తి త్వరితగతిన మెరుగుపడ్డానికి ఆయా అంశాలు కారణం. ♦ 2023–24లో భారత్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని భావిస్తున్నాం. ఇది 2023లో ప్రపంచ దేశాలకన్నా వేగవంతమైన వృద్ధి రేటు. ♦ మూలధన వ్యయాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత హర్షణీయం. ఇది ఎకానమీలో అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. అలాగే కార్పొరేట్ పెట్టుబడి చట్రంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ♦ నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలపై కూడా ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల వ్యాపార నిర్ణయాల విషయంలో నిరంతరం జోక్యం చేసుకోకుండా, బ్యాంకులు– ఇతర రుణ సంస్థల వ్యాపార నమూనాలను తరచూ లోతుగా పరిశీలిస్తూ, వాటి రుణాలు–డిపాజిట్ల అసమతుల్యతలు, నిధుల స్థిరత్వం నిశితంగా ఆర్బీఐ పరిశీలిస్తుంది. ♦ ఏదైనా అనిశ్చితి, సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉంటే, ముందస్తు హెచ్చరిక సంకేతాల వ్యవస్థను మా బ్యాంకింగ్ కలిగి ఉంది. ఇవి ప్రమాదాన్ని పెంచడానికి దారితీసే సూచనలను, వాటిని కట్టడి చేసే చర్యలును సూచిస్తాయి. సవాళ్లను గుర్తించడానికి బ్యాంకింగ్ వెలుపలి ఆడిటర్ల సహాయసహకారాలనూ తీసుకుంటుంది. -
2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో!
సాక్షి, ముంబై: నల్లధనం కట్టడి పేరిట పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2,000 నోటును తెచ్చిన మోదీ సర్కారు.. అనూహ్యంగా దానికి కూడా చెక్ చెప్పింది. రూ.2,000 నోటును చెలామణీ నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. ‘వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ’క్లీన్ నోట్ పాలసీ’ (డిజిటల్ విధాన ప్రోత్సాహం) ప్రకారం రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం జరిగింది..’ అని ప్రకటనలో పేర్కొంది. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) తక్షణమే రూ.2,000 నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులను కోరినట్లు తెలిపింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా బ్యాంకుల్లో మార్చుకోవడానికి మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. ఒకదఫా రూ.20,000 పరిమితి వరకూ (అంటే రూ.2,000 నోట్లు 10) ఇతర డినామినేషన్లలోకి మార్చుకోవచ్చని తెలిపింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) అలాగే మే 23 నుంచి ఇష్యూ డిపార్ట్మెంట్లను కలిగి ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో (ఆర్వో) కూడా ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా నల్లధనం నిల్వలను పెంచుకునేందుకు అత్యధిక విలువ కలిగిన నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ అనూహ్య చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: 2 వేల నోటు తీసుకురావడమే తప్పు’ 2018–19లోనే ముద్రణ నిలిపివేత పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు సమయంలోనే రూ.2,000 నోటును ప్రవేశ పెట్టడం జరిగింది. అప్పట్లో చెలామణీలో ఉన్న రూ. 500, రూ.1,000 నోట్ల చట్టబద్ధమైన చెల్లుబాటును ఉపసంహరించుకున్న తర్వాత, ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2018–19లోనే ఆర్బీఐ రూ.2,000నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఈ నోట్లు ఇప్పటికే అరుదుగా చెలామణీలో ఉన్నాయి. ఈ నోట్లు చెల్లుతాయా? 2016 నవంబర్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు చేసిన సందర్భంలో ఆ నోట్లు తక్షణమే చెల్లకుండా పోయాయి. దీంతో చాలా మందిలో దీనిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఈసారి సెప్టెంబర్ 30 వరకూ రూ.2,000 నోటు లీగల్ టెండర్ కొనసాగనుంది. అంటే ఈ నోటు సాంకేతికంగా అప్పటివరకూ చెల్లుబాటులోనే ఉంటుందని అర్థం. సాధారణ లావాదేవీలకు రూ.2 వేల నోట్లను వినియోగించవచ్చని ఆర్బీఐ తెలిపింది. అలాగే వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్ 30లోగా మీ వద్ద ఉన్న ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలి లేదా మార్చుకోవాలి. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్చుకోవచ్చు. అవసరాలకు ప్రస్తుత కరెన్సీ స్టాక్ ఓకే.. రూ. 2,000 నోటును ప్రస్తుతం సాధారణ లావాదేవీలకు వినియోగించడం లేదని తాము గమనించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఇతర డినామినేషన్లలో చెలామణీలో ఉన్న నోట్ల నిల్వ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెపె్టంబర్ 30 వరకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించింది. చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? వివాదాలకు దూరంగా కేంద్రం! 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు, ఆయా వ్యవహారాలను చూసే ఆర్బీఐని కేంద్రం తక్కువచేసిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈసారి దీనికి దూరంగా ఉందని, రిజర్వ్ బ్యాంకే కీలక నిర్ణయాన్ని ప్రకటించిందని అంటున్నారు. చెలామణీలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఆర్బీఐ వెలువరించిన వివరాల ప్రకారం.. రూ.2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కు ముందు జారీ అయ్యాయి. వాటి జీవిత కాలం 4–5 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో వీటి విలువ 37.3 శాతం. ఇక 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. అంటే ఈ మొత్తమే ప్రజల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావాలన్నమాట. -
నిబంధనలు పాటించని కెనరా బ్యాంకు: ఆర్బీఐ భారీ పెనాల్టీ
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకునకు భారీ షాక్ ఇచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆగ్రహించిన ఆర్బీఐ భారీ పెనాల్టీ విధించింది. ప్రధానంగా రిటైల్ రుణాలపై ఫ్లోటింగ్ రేట్ వడ్డీని, ఎంఎస్ఎంఈ రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) వడ్డీ రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్ఎంఈలకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో విఫలమైందని గుర్తించినట్టు కేంద్ర బ్యాంకు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన,ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్‌తో లింక్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ అలాగే పలు క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్లను నమోదు చేయటం, 24 నెలలలోపు ముందుగానే ఉపసంహరించుకోవడం, కస్టమర్ల నుండి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలను వసూలు చేసిందనితెలిపింది. కస్టమర్ ప్రొఫైల్‌కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్‌లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను చేపట్టడంలో విఫలమైందని పేర్కొంది. రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో కూడా విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. -
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల గరిష్టానికి ఎగబాకడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో తీవ్ర పతన స్థాయికి చేరుకోవడం సైతం నిరాశపరిచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ అనూహ్య రికవరీ, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. అలాగే ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(గురువారం)కి ముందు అప్రమత్తత వహించారు. ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల మరో దఫా వడ్డీరేట్ల పెంపు అంచనాలు దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఫైనాన్స్, ఆటో, రియల్టీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 391 పాయింట్లు పతనమై 57,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014 వద్ద నిలిచింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా క్షీణించాయి. మెటల్, ఫార్మా, మీడియా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.753 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు గరిష్టంగా 3% వరకు క్షీణించాయి. యూఎస్ ద్రవ్యోల్బణ వెల్లడి తర్వాత అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ అరశాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీలకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.269.88 లక్షల కోట్ల దిగువకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం క్షీణించడంతో ఐటీ కంపెనీ విప్రో షేరు 7% నష్టపోయి రూ 379 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా పతనమై రూ.381 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ► ఇదే క్యూ2 క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన హెచ్‌సీఎల్ షేరు మూడు శాతం బలపడి రూ.982 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.986 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. -
లోన్ యాప్స్ పై ఆర్ బిఐ కొరడా
-
మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీపై ఆర్బీఐ భారీ జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లపై భారీ జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వన్ మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీ లిమిటెడ్లపై ఒక్కొక్కరికి కోటి రూపాయల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 26(6)లో సూచించిన నేరాలకు పాల్పడినందుకు వన్ మొబిక్విక్, స్పైస్ మనీపై జరిమానా విధించినట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటనలో వివరించింది. పిఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 30 నిబంధనల కింద ఆర్బీఐకి ఉన్న అధికారం మేరకు జరిమానాలు విధించనట్లు తెలిపింది. భారత్ బిల్లు చెల్లింపు ఆపరేటింగ్ యూనిట్స్ (బీబీపీఒయులు) నికర విలువ ఆవశ్యకతపై జారీ చేసిన ఆదేశాలను ఈ రెండు సంస్థలు పాటించలేదని, ఆ తర్వాత నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది. విచారణ సమయంలో రాతపూర్వక సమాధానాలను, వ్యక్తిగత విచారణ సమయంలో ఇచ్చిన మౌఖిక సమర్పణలను సమీక్షించింది. ఆ తర్వాత ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని అభియోగాలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు పేర్కొంది. (చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..!) -
రూ. 2 వేల కోట్ల డబ్బు రోడ్డుపైనే..
టీ.నగర్ (చెన్నై): రూ.2 వేల కోట్ల నగదుతో బయలుదేరిన కంటైనర్ లారీ ఒకటి రిపేర్ కారణంగా చెన్నైలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. విషయం తెల్సుకున్న స్థానికులు ఆ లారీని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటన గురువారం చెన్నైలో జరిగింది. మైసూరులోని రిజర్వు బ్యాంకు ముద్రాణాలయం నుంచి రూ.2 వేల కోట్ల నగదుతో నింపిన కంటైనర్ లారీ రిజర్వ్‌బ్యాంకు చెన్నై కార్యాలయానికి గురువారం బయల్దేరింది. రాత్రి 7.30 సమయంలో అమింజికరై, పుల్లా ఎవెన్యూ సిగ్నల్ గుండా వెళ్తున్నపుడు గేర్ బాక్సులో సమస్య తలెత్తి రోడ్డుపై ఆగింది. వెంటనే లారీకి భద్రతగా వస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సిబ్బంది అక్కడికొచ్చారు. వేలకోట్ల నగదు ఉన్న లారీ ఆగిందనే విషయం తెల్సుకున్న స్థానికులు అక్కడ గుమిగూడారు. ఇంతలో రిజర్వ్‌బ్యాంకు అధికారులు, స్థానిక పోలీసులూ వచ్చారు. చివరకు మెకానిక్ వచ్చి సమస్యను సరిచేశాడు. దీంతో లారీ దాదాపు నాలుగు గంటలు అక్కడే నిలిచిపోయింది. ఎట్టకేలకు రాత్రి 11.30 గంటల సమయంలో చెన్నై రిజర్వు బ్యాంకుకు బయల్దేరింది. -
ఆ నోటుకు నేటికి వందేళ్లు
రూపాయ నోటా అని చులకనగా మాట్లాడుతున్నారా? కాసేపు ఆగండి.. అలా చులకనగా మాట్లాడే ఈ నోటుకే, పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా ఏర్పడిది. నేటితో ఈ నోటు వందేళ్లను పూర్తిచేసుకుంది. 1917 నవంబర్ 30న ప్రవేశపెట్టిన ఈ రూపాయి నోటుకు, 2017 నవంబర్ 30తో వందేళ్లు నిండాయి. తొలిసారి ఈ నోటును కింగ్ జార్జ్ వీ ఫోటోతో ఇంగ్లాండ్ దేశం భారత్‌లో ప్రవేశపెట్టింది. నాటి నుంచి వర్తకులు ఈ నోటునే తమ అవసరాలకు విరివిగా వినియోగించారు. అనంతరం 1935 ఏప్రిల్ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు అనుమతిని భారత రిజర్వ్ బ్యాంక్‌కు ఆంగ్లేయులు అప్పగించారని తెలిసింది. 1861 నుంచే కరెన్సీ నోట్ల జారీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతున్నప్పటికీ, 1917లోనే రూపాయి నోటును ప్రవేశపెట్టారు. ప్రపంచ యుద్ధం-1లో ఆయుధాలను తయారుచేసేందుకు రూ.1 కాయిన్లను వాడటంతో, ఈ నోటు ప్రవేశం జరిగింది. 1917లో లాంచ్ చేసిన ఈ నోటు, 10.7 గ్రాముల వెండికి సమానంగా ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390గా ఉంది. అంటే రూపాయి నోటు విలువ దాదాపు 400 వంతు తగ్గిపోయింది. 1994లో నిలిపివేసిన రూపాయి నోటు 2015 మార్చి 6వ తేదీ పునఃదర్శన మిచ్చిందన్నారు. రూపాయి నోటు ముద్రించేందుకు రూ.1.14 ఖర్చవుతున్నట్టు సమాచార హక్కుచట్టంలో వెల్లడైంది. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి పర్యవేక్షణలో ముద్రించిన రూపాయి నోటు ఎక్కువగా ప్రజాదరణ పొందింది. 1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్కే మీనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం ముద్రించారు. 1951లో హిందీలో ముద్రించిన రూపాయి నోటు కూడా విడుదలైంది. పండుగ కాలాల్లో ఆన్లైన్ మ్యూజియంలో కాయిన్లు, కరెన్సీ నోట్లు, స్టాంపులను ప్రదర్శనకు ఉంచుతామని మింటేజ్వరల్డ్.కామ్ సీఈవో సుశిల్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శన కోసం 100 రూ.1 రూపాయి నోట్లను, రూ.15వేలకు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇటీవల కాలంలో చాలా మంది రూ.1 నోట్లను వాడుతున్నారని, దీంతో దీనికి మరింత గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. కానీ వందేళ్లు పూర్తిచేసుకున్న రూ.1 నోటుపై మాత్రం రిజిర్వు బ్యాంకు ఎలాంటి కామెంట్లు చేయలేదు. -
19న ఆర్బీఐ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు (ఆర్బీఐ) ఉన్న స్వయంప్రతిపత్తి హోదాను తీసివేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ‘సేవ్ ఆర్బీఐ’ పేరుతో నాలుగు ఉద్యోగ సంఘాలు కలిపి కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. నవంబర్ 19న దేశవ్యాప్తంగా ఉన్న 17,000 మంది ఉద్యోగులు సామూహిక సెలవులతో కేంద్రానికి తమ నిరసన తెలుపుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా రూ. 3 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు ఆగిపోతాయని అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ ఆల్ ఇండియా ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి.క్రాంతి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డీరేట్ల సవరణపై ఆర్బీఐ గవర్నర్‌కి ఉన్న వీటో హక్కును తీసేయాలనుకోవడాన్ని, ఆర్బీఐ వద్ద ఉన్న అత్యవసర నిధి రూ. 2.43 లక్షల కోట్లలో లక్ష కోట్లు వాడుకోవాలని చూడటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ లాభాలను ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, అత్యవసర నిధిని వాడుకోవాలన్న ప్రయత్నం గర్హనీయమని అన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని హరించే ప్రక్రియను తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కు అమలు చేస్తున్నట్లుగానే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్బీఐ పెన్షనర్లకు పెన్షన్ అప్డేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే అందరి సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.