Rs 500 notes latest news: కరెన్సీకి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కొత్తేం కాదు. నోట్ల రద్దు, కరోనా టైంలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫేక్ కథనాలెన్నో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా 500రూ. నోటు మీద ఓ ప్రచారం వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా 500 రూపాయల నోటు విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (సెక్యురిటీ థ్రెడ్).. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే గనుక ఆ నోటు ఫేక్ అని, చెల్లదు అని!. ఈమేరకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఓ వీడియో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతోంది కూడా. దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు వణికిపోతున్నారు. ఒకవేళ తీసుకున్నా.. ఒకటికి పదిసార్లు తీక్షణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రచారం సాధారణ జనాల్లోనూ ఆందోళన రేకెత్తిస్తోంది.
Factcheck On 500 Currency Note అయితే 500 నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్.. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరిగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, RBI సైతం ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరోPress Information Bureau స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ రెండు నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పీఐబి (PIB) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ వీడియో నకిలీదంటూ ఓ పోస్ట్‌ను ట్విటర్‌లో ఉంచింది. Press Information Bureau అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్‌సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది.
एक वीडियो में यह चेतावनी दी जा रही है कि ₹500 का ऐसा कोई भी नोट नहीं लेना चाहिए, जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास हो।#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) December 7, 2021
▶️यह वीडियो #फ़र्ज़ी है
▶️@RBI के अनुसार दोनों ही नोट वैध हैं
विवरण:https://t.co/DuRgmS0AkN pic.twitter.com/SYyxG9MBs6
Comments
Please login to add a commentAdd a comment