
సోషల్ మీడియాలో రూ. 500 నోటుకు సంబంధించిన ఓ ఫేక్ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ నోటు నకిలీదో లేక ఒరిజినల్‌దో ఇలా తెలుసుకోవాలని అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB) ట్విట్టర్‌లో తెలిపింది.
కాగా, ఓ 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా RBI గవర్నర్ సంతకంపైన.. ఉన్న నోటు నకిలీది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఆకుపచ్చ గీతకు దగ్గరగా, దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవేనని తెలిపింది. “RBI ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి.” అని పేర్కొంది.
ఈ క్రమంలోనే కొత్తగా విడుదలవుతున్న రూ. 500 నోట్లు ప్రస్తుతం రంగు, పరిమాణం, థీమ్, భద్రతా ఫీచర్ల స్థానం, డిజైన్ అంశాలలో పాత సిరీస్‌కు భిన్నంగా ఉన్నాయని స్పష‍్టం చేసింది. కొత్త నోటు పరిమాణం 66mm x 150mm ఉందని తెలిపింది. ఒక నోటు నకిలీదో కాదో నిర్ధారించుకోవడానికి, ఆర్‌బీఐ పాయింటర్లు, ప్రభుత్వ నిజ నిర్ధారణ సంస్థల్లో తెలుసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని హితవు పలికింది.
एक मैसेज में यह दावा किया जा रहा है कि ₹500 का वह नोट नकली है जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास ना होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 11, 2022
➡️यह दावा #फ़र्ज़ी है।
➡️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।
🔗https://t.co/DuRgmRJxiN pic.twitter.com/AEGQfCM8kZ
ఇది కూడా చదవండి: ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికిన కేంద్ర మంత్రి!
Comments
Please login to add a commentAdd a comment