press information bureau
-
‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్లైన్లో నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ మార్చి 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మార్చి 11 నాటి బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. -
‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే
ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ చెక్’ నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ యూనిట్‌కు సంబంధించి కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. కాగా కేంద్ర ఐటీ శాఖ ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను నోటిఫై చేయగా.. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్‌పై స్టే విదిస్తున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ కంటెంట్‌లో ఫేక్, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఐటీ రూల్స్-2021కి కూడా కేంద్రం సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయిని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంత స్టే ఇవ్వడానికి ముంబై హైకోర్టు నిరాకరించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. అయితే బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సి అవసంరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. అంతవరకు మార్చి 20 (బుధవారం) కేంద్రం జారీ చేసిన నోటిఫికేష్‌పై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
మినిమమ్ బ్యాలన్స్ తప్పుడు వార్తల పై క్లారిటీ..!
-
నకిలీల తనిఖీ పేరుతో పెత్తనం?
డిజిటల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వార్తల్లోని సత్యాసత్యాలను ఒక ప్రత్యేక ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ద్వారా తనిఖీ చేయించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ... ఐటీ ‘నియమావళి – 2023’ని సవరించడంపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విస్తృత సంప్రదింపులు లేకుండానే నిబంధనలు రూపొందించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఎ) పౌరులకు ప్రసాదిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని సోషల్ మీడియా వెబ్సైట్లు, డిజిటల్ మాధ్యమాలు కలవరం చెందుతున్నాయి. సమాచారాన్ని తొలగించమని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడుతున్నందునే తాజా ‘ఐటీ నియమావళి, 2023’ వివాదాస్పదం అయింది. ఏప్రిల్ 6న కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫి కేషన్తో ఒక కొత్త సమాచార నియంత్రణ శక్తి ఊపిరి పోసుకుంది! ప్రాథమిక ‘ఐటీ నియమావళి, 2023’కి జోడింపుగా ‘మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నీతి నియమాలు’ (ఇంటర్మీడియేటరీ గైడ్‌లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్)ని చేర్చడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ’ అలాంటి నియంత్రణ శక్తి ఆవిర్భావానికి తావు కల్పించింది.ఈ కొత్త నియమావళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ మీడియాలో వచ్చే నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించి, వాటిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ‘వాస్తవాల తనిఖీ’ (ఫ్యాక్ట్ చెక్) విభాగం ఏర్పాటుకు అధికారాన్ని ఇస్తోంది! సమాజ సంక్షేమాన్ని విస్మరించి, స్వేచ్ఛను హరించేందుకు (ఆర్వేలియన్) అవకాశం ఉన్న ఆ ఫ్యాక్ట్ చెక్ విభాగం... ప్రభుత్వ శాఖలు, మంత్రుల గురించి డిజిటల్ మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు, నివేదికలు, అభిప్రాయాలను వాస్తవాల తనిఖీ పేరిట పరి శీలించి వాటిని తొలగించడం కోసం ఆన్లైన్ మధ్యవర్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ మధ్యవర్తులు ఆన్లైన్ సోషల్ మీడియా కంపెనీలు కావచ్చు. ఐ.ఎస్.పి. (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్)లు, యాప్‌ల రూప కల్పనకు అవసరమై సాంకేతికతల్ని హోస్ట్ చేసే సంస్థలూ కావచ్చు. వాస్తవాల తనిఖీ వల్ల కచ్చితత్వ నిర్ధారణ జరుగుతుందనీ, వాస్తవా లకు మాత్రమే విస్తృతి లభించి, పాఠక పౌరులకు ఏది చేరాలో అదే చేరుతుందనీ ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ’ ఉద్దేశం. ఐటీ యాక్ట్, 2000లోని సెక్షన్ 79 కల్పిస్తున్న ‘నియమాల రూప కల్పన అధికారాన్ని’ ఉపయోగించుకుని ఈ తాజా ఐటీ నియమావళి, 2023 ఏర్పడింది. శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... సెక్షన్ 79, ఐ.టి. నియమావళిని అనుసరించి చట్ట విరుద్ధ చర్యలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కోర్టు ఉత్తర్వు ద్వారా లేదా ప్రభుత్వ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వం పొందడానికి మధ్యవర్తులను ఏర్పరచుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో ‘నకిలీ’, ‘తప్పుడు’, ‘తప్పుదారి పట్టించే’ అనే పదాలు ప్రత్యేకించి లేవు. శాంతి భద్రతలు, దేశ సమగ్రత, నైతికత వంటి విస్తృత వర్గీకరణల కింద మాత్రమే ఐటీ నియమావళి అన్వయం అవుతుంది. అంతమాత్రాన, సరిగా లేని ఏదైనా సమాచారం లేదా ప్రకటన... నకిలీ, తప్పుడు, లేదా తప్పుదారి పట్టించేది అయిపోదు. అయితే నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే వర్గీకరణల కిందికి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ ‘వాస్తవాల తనిఖీ’ పరిధిలోకి రాకపోయి నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైన నిషేధ అధికారంతో ప్రభుత్వం చర్య తీసుకునే ప్రమాదం ఉంది. ఇక ఐటీ నియమావళి, 2023 ‘నకిలీ, తప్పుడు, తప్పుదారి పట్టించే’ సమాచారం ఎలాంటిదన్నది నిర్వచించలేదు. ‘వాస్తవాల తనిఖీ విభాగం’ అర్హతల్ని, విచారణ పరిధుల్ని, విధానాలను పేర్కొన లేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) లో ఇప్పటికే ఉన్న తనిఖీ విభాగం గతంలో పొరబడిన సందర్భాలు కూడా ఉన్నాయి! 2020 డిసెంబర్ 16 పీఐబీ ఒక ఇంటెలిజెంట్ బ్యూరో నియామక సమా చారానికి బూటకంగా ముద్రవేసింది. అయితే ఆ మర్నాడే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... పీఐబీ బూటకం అని భావించిన ఆ నియామక ప్రకటన నిజమైనదేనని ప్రకటించింది. ఇదొక్కటే ఇలాంటి సంఘటన కాదు. పలు పత్రికా ప్రచురణకర్తలు ఇటువంటి వాస్తవాల తనిఖీ తొందరపాట్లపై ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఐటీ నియమావళి, 2023’ మొదట 2023 జనవరి 2న ఒక ముసాయిదా రూపంలో వెలువడింది. ఆ నియమావళిపై 2023 జనవరి 17 లోపు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రభుత్వం డిజిటల్ సంస్థలను, డిజిటల్ వినియోగదారులను కోరింది. అయితే ఆ ముసాయిదా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించడానికి అవసరమైన నిబంధనలను మాత్రమే కలిగి ఉంది. అభిప్రాయాల వెల్లడికి గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ముసాయిదాలో ‘వాస్తవాల తనిఖీ’ అధికా రాలను చేరుస్తూ దానిపై సంప్రదింపుల వ్యవధిని పొడిగించింది. ఈ చర్యే ఆందోళనకు దారి తీసింది. ఎడిటర్స్ గిల్డ్ జనవరి 18న ఒక ప్రకటన విడుదల చేస్తూ, తనిఖీ అధికారాల నిబంధనను వెనక్కు తీసుకోవాలని కోరింది. ఏది నకిలీ సమాచారమో తేల్చే పూర్తి నిర్ణయాధికారం ప్రభుత్వం చేతిలో ఉండకూడదని అభిప్రాయపడింది. జనవరి 19న ‘డిజిపబ్’... ప్రతిపాదిత సవరణల్ని విమర్శించింది. ఆ సవరణలు భారత ప్రభుత్వానికి ఏకపక్షంగా విచక్షణాధికారాలను కట్ట బెడుతున్నాయని ఆరోపించింది. జనవరి 23న ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ... ఈ సవరణలు ప్రభుత్వ చర్యల్ని విమర్శించడాన్ని నిషేధించేందుకు అనుమతిస్తున్నాయని వాదించింది. ఈ అభ్యంతరాలన్నిటికీ జనవరి 25న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు ప్రతిపాదనపై ఫిబ్రవరి ఆరంభంలో పీఐబీతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. అయితే ముఖాముఖీలు గానీ, ఆన్లైన్ ప్రజా సంప్రదింపులు గానీ లేవు. డిజిటల్ సమాచార సంస్థలతో ప్రభుత్వం అసలు సమావేశమే అవలేదు. ‘‘అన్నిటికన్నా ఆశ్చర్య పరుస్తున్నదేమంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్థవంతమైన సంప్రదింపులేవీ జరప కుండానే ముసాయిదాలో సవరణల్ని ప్రకటించడం’’ అని ఎడిటర్స్ గిల్డ్ ఏప్రిల్ 7న పేర్కొంది. వాస్తవానికి ‘ఐటీ నియమావళి, 2021’లో ప్రతి సంవత్సరం సవ రణలు జరుగుతూనే ఉన్నాయి. మొదట 2021 ఫిబ్రవరి 25న ప్రభుత్వం ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌కు ఉన్న అధికారాలను విస్తరిస్తూ నియమాల్లో మార్పులు చేసింది. ఆ మార్పులపై వ్యతిరేకత వ్యక్తం అయింది. 30 రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిపై మూడు హైకోర్టులు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చాయి. 2021 ఆగస్టు 5న బాంబే హైకోర్టు ‘‘ఈ మార్పులు ఆలోచనా స్వేచ్ఛ కోసం ప్రజలు అలమటించేలా చేస్తాయి’’ అని పేర్కొంటే, 2021 సెప్టెంబరు 17న మద్రాసు హైకోర్టు, ‘‘ప్రభుత్వపు ఒక్క కనుసైగతో పౌరులకు సమాచారం అందుబాటులో లేకుండా పోతుంది’’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను సవాలు చేసి వాటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఆ తర్వాత, 2022 అక్టోబర్ 28న ప్రభుత్వం మరికొన్ని సవ రణల్ని ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా వినియోగదారులు సమాచార నియంత్రణ నియమాలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వీలుకల్పించే ఫిర్యాదుల అప్పిలేట్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు 37 విజ్ఞప్తులు రాగా, వాటిల్లో 19 విజ్ఞప్తులను నిర్ణయ మేమిటో వెల్లడించకుండా, ప్రజలకు వాటి యు.ఆర్.ఎల్.లను బహి ర్గతం చేయకుండా అవి పరిష్కరించేశాయి! ఇదంతా ‘రేస్ ఇస్పా లోక్వి టూర్’ (వాస్తవాలు వాటికవే మాట్లాడతాయి) అనే లాటిన్ సామెతను గుర్తు చేస్తోంది. నిజం ఏమిటో నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వ శాఖకు దఖలు పరుస్తున్న ఐటీ నియమావళి, 2023తో వాస్తవాలే మాట్లాడతాయన్న సంగతి కూడా నిర్ధారణలోకి రావచ్చు. అపర్ గుప్తా వ్యాసకర్త న్యాయవాది,ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఆ చానళ్లను మూసేయండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై తప్పుడు, సంచలనాత్మక వార్తలను వ్యాప్తి చేస్తున్న మూడు చానళ్లను మూసేయాల్సిందిగా యూట్యూబ్‌ను కేంద్రం ఆదేశించింది. ఆజ్‌తక్ లైవ్, న్యూస్ హెడ్‌లైన్స్, సర్కారీ అప్డేట్స్ చానళ్లు తప్పుడు వార్తలకు వాహకాలుగా మారాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం మంగళవారం ప్రకటించింది. కేంద్ర పథకాలతో పాటు సుప్రీంకోర్టు, సీజేఐ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కూడా ఇవి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం యూట్యూబ్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆజ్‌తక్ లైవ్ చానల్‌కు ఇండియాటుడే గ్రూప్‌తో సంబంధం లేదని వెల్లడించాయి. ఈ మూడు చానళ్లకు కలిపి 33 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నాయి. వాటి వీడియోలకు 30 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
మందు బాబులూ.. ఆ ప్రకటనను నమ్మకండి
వైరల్: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక.. ఏది నిజమో, ఏది అబద్ధమో ధృవీకరించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆఖరికి ఫ్యాక్ట్ చెక్‌ల పేరుతో చేస్తున్న ప్రయత్నాలు సైతం వర్కవుట్ కావడం లేదు. దీంతో చాలావరకు విషయాలు నిజనిర్ధారణల మధ్య నలిగిపోతున్నాయి. అయితే.. ఫార్మర్డ్ రాయుళ్ల దెబ్బకు కొత్తా.. పాతా.. ఉత్త పుకార్లు వైరల్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా.. మందు బాబుల కోసం మోదీ సర్కార్ తీపి కబురు అంటూ ఓ ప్రకటన విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంటింటికి కరెంట్.. నల్లా కనెక్షన్‌లాగా.. మందు కనెక్షన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నది ఆ వైరల్ వార్త సారాంశం. ఇంటింటికే మద్యం పాలసీలో భాగంగా.. లిక్కర్ పైప్లైన్లను ప్రభుత్వం తీసుకురాబోతోందన్నది ఆ వైరల్ మెసేజ్. ఈ మేరకు హిందీలో ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. ‘గౌరవనీయులైన ప్రధానిగారు మందు బాబుల కోసం లిక్కర్ పైప్‌లైన్ పథకం తీసుకురాబోతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండి. పీఎంవో పేరిట 11 వేల డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లై చేయండి’ అంటూ ఆ ఫేక్ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది. అప్లై చేసుకున్న వాళ్ల ఇళ్లను అధికారులు సందర్శించి.. కనెక్షన్‌ను మంజూరు చేస్తారట. పవర్ మీటర్లకు వాటిని కనెక్ట్ చేసి.. వాడకం ఆధారంగా బిల్లులు వేస్తారట. ఇంత ఫేక్ ప్రకటనపై ఫ్యాక్ట్ చెక్ సైట్ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఊరుకుంటుందా?.. అందుకే వెల్కమ్ చిత్రంలోని నానా పటేకర్ ‘కంట్రోల్’ మీమ్‌తో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు అతిగా ఆశలు పెంచుకోవద్దంటూ మందు బాబులకు చిల్ గాయ్స్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఉంచింది. Chill guys, Don’t get your hopes too high‼️#PIBFactCheck pic.twitter.com/34zeYEKByq — PIB Fact Check (@PIBFactCheck) July 18, 2022 ఇదీ చదవండి: ఇకపై వ్యాక్సిన్ తీసుకుంటే క్యాష్ రివార్డు! -
అలాంటి రూ. 500 నోట్లు చెల్లవా..?
సోషల్ మీడియాలో రూ. 500 నోటుకు సంబంధించిన ఓ ఫేక్ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ నోటు నకిలీదో లేక ఒరిజినల్‌దో ఇలా తెలుసుకోవాలని అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB) ట్విట్టర్లో తెలిపింది. కాగా, ఓ 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా RBI గవర్నర్ సంతకంపైన.. ఉన్న నోటు నకిలీది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఆకుపచ్చ గీతకు దగ్గరగా, దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవేనని తెలిపింది. “RBI ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి.” అని పేర్కొంది. ఈ క్రమంలోనే కొత్తగా విడుదలవుతున్న రూ. 500 నోట్లు ప్రస్తుతం రంగు, పరిమాణం, థీమ్, భద్రతా ఫీచర్ల స్థానం, డిజైన్ అంశాలలో పాత సిరీస్‌కు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేసింది. కొత్త నోటు పరిమాణం 66mm x 150mm ఉందని తెలిపింది. ఒక నోటు నకిలీదో కాదో నిర్ధారించుకోవడానికి, ఆర్బీఐ పాయింటర్లు, ప్రభుత్వ నిజ నిర్ధారణ సంస్థల్లో తెలుసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని హితవు పలికింది. एक मैसेज में यह दावा किया जा रहा है कि ₹500 का वह नोट नकली है जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास ना होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck ➡️यह दावा #फ़र्ज़ी है। ➡️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं। 🔗https://t.co/DuRgmRJxiN pic.twitter.com/AEGQfCM8kZ — PIB Fact Check (@PIBFactCheck) May 11, 2022 ఇది కూడా చదవండి: ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికిన కేంద్ర మంత్రి! -
కరోనా: ఏది నిజం.. ఏది అబద్ధం.. కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: ఏదైనా విపత్తు సంభవించినా, మరేదైనా ఘటన జరిగినా సోషల్ మీడియాని ఫేక్ న్యూస్ ఉప్పెనలా ముంచేయడం సర్వసాధారణంగా మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి ప్లాస్మా డొనేషన్ వరకు ఎన్నో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్‌లో ఇలాంటి ప్రచారాలేవీ నమ్మవద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో వైరల్‌గా మారిన ఏయే సందేశాలు తప్పుడివో కేంద్రం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది. పీరియడ్స్‌లో టీకాపై.. మహిళలు పీరియడ్ రావడానికి అయిదు రోజుల ముందు, పీరియడ్ వచ్చిన అయిదు రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోకూడదు. రుతుస్రావం సమయంలో మహిళల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి టీకా తీసుకోవద్దు కేంద్రం వివరణ పీరియడ్ సమయంలో కూడా మహిళలు నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సహజసిద్ధంగా వచ్చే రుతుస్రావం వంటి శరీరంలో మార్పులు వ్యాక్సిన్‌కి అడ్డంకి కాదు. ఇంటి చిట్కాలపై.. ఇంటివైద్యంతో కరోనా మటుమాయం. మిరియాలు, అల్లం, తేనె కలిపి రోజూ తీసుకుంటే కరోనా దరి చేరదు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) కూడా ఆమోద ముద్ర వేసింది. కేంద్రం వివరణ పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి పేరు మీద సర్క్యులేట్ అయిన ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ఇంటి వైద్యాలతో కరోనాని కట్టడి చేయడం కుదిరే పని కాదు. డబ్ల్యూహెచ్ఒ కూడా ఎన్నడూ అలాంటి ప్రకటన చేయలేదు. ఆవిరితో అడ్డుకట్టపై.. ప్రతీరోజూ ఆవిరి పడితే కరోనా సోకదు. ఈ వాట్సాప్ సందేశం బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ ఆస్పత్రిలో ఎయిర్ మార్షల్‌గా పని చేసే అశుతోష్ శర్మ పేరు మీద సర్క్యులేట్ అయింది. కేంద్రం వివరణ బెంగుళూరులో ఎయిర్ మార్షల్ అశుతోష్ శర్మ అని ఎవరూ లేరు. వైస్ ఎయిర్ మార్షల్‌గా పనిచేస్తున్న అశుతోశ్ శర్మ ఆధ్వర్యంలో బెంగుళూరు ఆస్పత్రి నడుస్తోంది. కానీ ఈ మెసేజ్ ఆయన సర్క్యులేట్ చేయలేదు. రోజూ ఆవిరి పడితే కరోనా సోకదని చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాల్లేవు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ప్లాస్మా దానంపై.. వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా రోగులకి ప్లాస్మా ఇవ్వకూడదు. కేంద్రం వివరణ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తేదీ నుంచి 28 రోజుల పాటు ప్లాస్మా ఇవ్వకూడదు. రక్తంలో యాంటీబాడీలు తగినంత స్థాయిలో లేకపోయినా సరే ప్లాస్మా ఇవ్వడం కుదరదు. గర్భవతులు కూడా ప్లాస్మా ఇవ్వలేరు. కరోనా వ్యాధి లక్షణాల్లేకుండా వస్తే 14 రోజుల తర్వాత, లేదంటే కరోనా నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాతే ఎవరైనా ప్లాస్మా దానం చేయాలి. చదవండి: వాళ్లకు కరోనా ముప్పు తక్కువే.. కానీ ఈ గ్రూప్ రక్తం ఉన్న వారికి! -
ఉచితంగా స్మార్ట్ఫోన్లు ఇవ్వనున్న ప్రభుత్వం?
న్యూఢిల్లీ: కరోనా కాలంలో చదువు అంతా ఆన్‌లైన్‌మయం అయిపోయింది. స్కూల్ విద్యార్థుల నుంచి మొదలుకొని కాలేజీ విద్యార్థుల వరకు డిజిటల్ బోధనపై ఆధారపడుతున్నారు. కానీ అందరి చేతిలో ఫోన్లు అందుబాటులో లేవు. పైగా లాక్డౌన్ వల్ల ఇల్లు గడవటమే కష్టంగా ఉన్న పేద విద్యార్థులకు కొత్తగా ఫోన్లు కొనాలంటే మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో "విద్యార్థులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందించనుంది" అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (చదవండి: కూతురికి కోసం తల్లే కుక్క పిల్లలా...) అంతేకాకుండా సదరు వార్తకు ఓ లింక్‌ను జోడించి. ఫోన్లు కావాలనుకునే విద్యార్థులు ఆ లింక్‌ను ఓపెన్ చేసి, అందులో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. దీంతో అనేకమంది ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. అయితే 'ఫ్రీ స్మార్ట్‌ఫోన్' వార్తను కేంద్రం కొట్టిపారేసింది. అసలు ప్రభుత్వం అలాంటి ప్రకటనే చేయలేదని ప్రభుత్వ రంగ సంస్థ పీఐబీ(ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో) స్పష్టం చేసింది. అలాగే ఉచిత ఫోన్ అందుకోండి.. అంటూ ఉన్న లింక్‌ను కూడా ఓపెన్ చేయవద్దని సూచించింది. ఒకవేళ లింక్‌ను ఓపెన్ చేస్తే మీ వివరాలు తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. (చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!) दावा: कोरोना वायरस के कारण स्कूल और कॉलेज बंद होने के कारण छात्रों की शिक्षा प्रभावित हुई है, इसलिए सरकार सभी छात्रों को मुफ्त एंड्रॉइड स्मार्टफोन दे रही है #PIBfactcheck: यह दावा फर्जी है, केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है. pic.twitter.com/LkFA2rMtSn — PIB Fact Check (@PIBFactCheck) August 24, 2020 -
మరోసారి సంపూర్ణ లాక్డౌన్: నిజమేనా?
న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 5.0 అమల్లోకి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ ఆంక్షలతో, పలు షరతులతో వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. ఇక లాక్‌డౌన్‌కు ముందు తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రతిరోజు తొమ్మిది, పది వేల వరకు కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉండగా త్వరలోనే నాల్గవ ప్లేస్‌లో ఉన్న యూకేను అధిగమించేట్లు తెలుస్తోంది. (కరోనా లక్షణాలుంటే సెలవు తీసుకోండి) ఇక కేసుల పరంగా దేశంలోని మహారాష్ట్ర ఏకంగా చైనానే దాటేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. జూన్ 15 నుంచి దేశంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ ప్రారంభం కానుందని దీని సారాంశం. అయితే ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ.. ఇదో తప్పుడు కథనంగా కొట్టిపారేసింది. సంపూర్ణ లాక్డౌన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. (తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువే) -
పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్..
-
పీఐబీ చీఫ్‌కు కరోనా పాజిటివ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ ధత్వాలియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. పీఐబీకి నాయకత్వం వహించే ధత్వాలియా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధాన ప్రతినిధి. కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో గత రాత్రి 7 గంటల సమయంలో చేర్చించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కేంద్రం జోక్యాన్ని కోరిన మాయావతి ధత్వాలియాకు కరోనా సోకడంతో జాతీయ మీడియా కేంద్రాన్ని సోమవారం రోజున మూసి, శానిటైజ్ చేయనున్నట్లు పీఐబీ అధికారులు వెల్లడించారు. అయితే ధత్వాలియా ఈ మధ్య జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాష్ జవదేకర్లతో కలిసి సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించడంపై అధికారులు దృష్టి సారించారు. చదవండి: కేన్సర్‌తో ఆస్పత్రిలో చేరి.. కరోనాతో..! -
శానిటైజర్ వల్ల చర్మ వ్యాధులు, క్యాన్సర్!
న్యూఢిల్లీ: శానిటైజర్.. కరోనా వచ్చిన తర్వాత మహా నగరం నుంచి మారుమూల పల్లె వరకు ఇది వాడని వారే లేరంటే అతిశయోక్తి కాదేమో. ఏదైనా పని చేసేముందు, చేసిన తర్వాత, వస్తువులను వాడే ముందు, వాడిన తర్వాత ఇలా పదేపదే వాడుతూ దాన్ని ఓ నిత్యావసర వస్తువుగా మార్చివేశాం. అయితే ఈ మధ్య శానిటైజర్ ప్రమాదమంటూ కొన్ని రకాల వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా 50 నుంచి 60 రోజుల పాటు అదే పనిగా శానిటైజర్ వాడితే చర్మ వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశముందని ఓ వార్తా సంస్థ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) పైగా దీనికి బదులుగా సబ్బు వాడటం ఉత్తమమంటూ ఓ ఉపాయాన్ని కూడా సెలవిచ్చింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) మండిపడింది. అది పూర్తి అసత్య వార్తగా కొట్టిపారేసింది. శానిటైజర్లు ప్రజలకు హాని చేయవని స్పష్టం చేసింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు 70 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్లను వాడటం ఉత్తమమని సూచించింది. కాబట్టి భయాలు వీడి నిశ్చింతగా శానిటైజర్లు వాడండి, కోవిడ్‌ను తరిమి కొట్టండి. (పూర్తి ఆటోమేటెడ్ శానిటైజేషన్ డిస్పెన్సర్) -
లాక్డౌన్ పొడగింపు : ఆ ప్రచారం అవాస్తవం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 3వరకూ లాక్డౌన్ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసే ముందు కోవిడ్-19పై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ను ఆయన సంప్రదించలేదని వచ్చిన వార్తలను పీఐబీ బుధవారం తోసిపుచ్చింది. లాక్డౌన్ పొడిగింపునకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కోవడ్-19పై 21 మంది సభ్యులతో ఏర్పాటైన సైంటిఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను సంప్రదించలేదని ఓ మ్యాగజైన్ పేర్కొందని, ఈ వార్త ఫేక్ న్యూస్ అంటూ పీఐబీ ట్వీట్ చేసింది. చదవండి : ఆదుకునేందుకు ఏకమయ్యారు! టాస్క్‌ఫోర్స్‌తో సంప్రదింపులు జరిపిన మీదటే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపింది. కాగా లాక్‌డౌన్‌పై నిర్ణయం ప్రకటించేముందు తాము ఏర్పాటు చేసిన కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ను మోదీ ప్రభుత్వం సంప్రదించలేదని వచ్చిన వార్తలు ఫేక్ న్యూస్ అంటూ ఐసీఎంఆర్ చేసిన ప్రకటనను పీఐబీ ట్యాగ్ చేసింది. టాస్క్‌ఫోర్స్ గతనెలలో 14 సార్లు సమావేశమైందని, ఈ బృందంలోని సభ్యుల ప్రమేయంతోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 11,000 దాటగా 370 మందికి పైగా మరణించారు. There is a media report which makes false claims about the COVID-19 Task Force. The fact is that the task force met 14 times in the last month and all decisions taken involve the members of the task force. Please avoid such conjectures. #COVID2019india #IndiaFightsCorona — ICMR (@ICMRDELHI) April 15, 2020 -
‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..!
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాల్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని మరోమారు స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) పౌరసత్వ చట్టానికి సంబంధించి పలు నిజానిజాలను ట్విటర్లో శనివారం వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నట్టు సీఏఏ వల్ల మనదేశంలోకి నూతన వలసలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో సీఏఏపై ప్రచారంలో ఉన్న అపోహలు.. చట్టం చెబుతున్న వాస్తవాలను #Mythbusters పేరుతో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 28 శాతంగా ఉన్న హిందూ మైనారిటీల సంఖ్య 8 కి చేరిందని వెల్లడించింది. తీవ్రమైన ఉద్రిక్తతల నడుమ ఇప్పటికే చాలామంది మైనారిటీలు ఆయా దేశాల నుంచి ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస పోయారని పేర్కొంది. (చదవండి : ‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’) ఆయా దేశాల్లో మైనారిటీలపై మతపరమైన హింస తగ్గిందని, దాంతో వలసలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఇక అస్సాంలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న లక్షా యాభై వేల మంది బంగ్లా హిందువులకు భారత పౌరసత్వం ఇస్తారనే వార్తల్లో వాస్తవం లేదని చెప్పింది. పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినంత మాత్రాన విదేశీయులెవరైనా భారత పౌరసత్వం పొందగలరు అనుకుంటే పొరపాటే అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మనదేశ పౌరసత్వం కోరుకునే ప్రతి ఒక్కరి దరఖాస్తును అత్యున్నత అథారిటీ పరిశీలిస్తుందని... నిబంధనలకు లోబడి దరఖాస్తులు ఉన్నప్పుడే భారత పౌరసత్వం లభిస్తుందని తేల్చి చెప్పింది. కాగా, గత నాలుగు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. (చదవండి : ‘పౌరసత్వం’పై కాంగ్రెస్ రెచ్చగొడుతోంది: అమిత్) Busting some #Myths : #Mythbusters focusing on North-Eastern India, especially #Assam, surrounding the #CitizenshipAmendmentAct. The 11-points address the most common misconceptions and fears in the region (1/2) #CAB #CAB2019 pic.twitter.com/dJ35FKxcBZ — PIB India (@PIB_India) December 14, 2019 -
సంచలనాలు వద్దు..సత్యానికి దగ్గరగా ఉండాలి
ప్రాంతీయ సంపాదకుల సదస్సులో వెంకయ్య నాయుడు సాక్షి, చెన్నై: మీడియా సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా ఉండే సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో గురువారం నుంచి చెన్నైలో రెండు రోజులపాటు జరుగుతున్న ప్రాంతీయ సంపాదకుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు. వార్తను వార్తగానే చూడాలనీ, అందులో సొంత ఆలోచనల్ని రుద్దవద్దని మీడియా సంస్థలను ఆయన కోరారు. పోటీని తట్టుకునేందుకు, టీఆర్పీని పెంచుకునేందుకు మీడియా చిన్న వార్తలను సంచలనాలుగా చూపిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రాంతీయ మీడియా కీలకపాత్ర పోషిస్తోందని కితాబునిచ్చారు. మానవ హక్కులు ఉన్నది మనుషుల కోసమనీ, తీవ్రవాదుల కోసం కాదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో 40 నగరాలను ప్రభుత్వం ఎంపికచేసిందనీ, త్వరలో జాబితా విడుదల చేస్తామన్నారు. సమావేశంలో తమిళనాడు సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పీఐబీ డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా తదితరులు పాల్గొన్నారు. లెసైన్స్ రాజ్, కోటా రాజ్‌ల కారణంగా 1950 నుంచి మూడు దశాబ్దాలపాటు భారత్ వాణిజ్య, పారిశ్రామిక విప్లవాలను కోల్పోయిందని, డిజిటల్ విప్లవం విషయంలో అలా జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
20 ఏళ్ల తర్వాత కలిపింది!
న్యూఢిల్లీ: సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువకాని వాస్తవమిది. ఢిల్లీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లైబ్రరీలో పనిచేస్తున్న విజయ్ నిత్నావరే(48) ఇరవైఏళ్ల క్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయిన తన తమ్ముడు హన్స్‌రాజ్ కోసం తీవ్రంగా వెతికి ఎట్టకేలకు వారం క్రితం అతన్ని కలుసుకున్నాడు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన హన్స్‌రాజ్ పదోతరగతి ఫెయిల్ అవటంతో 1995లో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పుడు కుటుంబమంతా తీవ్రంగా వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో అన్న విజయ్ ఢిల్లీవచ్చి పీఐబీలో ఉద్యోగంలో కుదరుకున్నారు. కానీ తమ్ముడి కోసం వీలైనన్ని మార్గాల్లో అన్వేషించారు. ఈ పనిలో భాగంగానే గతేడాది తన తమ్ముడిని వెతికివ్వమని ఫేస్బుక్ కార్యాలయాన్ని సంప్రదించారు. వారు సేకరించిన ఆధారాల ప్రకారం మహారాష్ట్రలోని పుణెలో టయోటా కంపెనీలో హన్స్‌రాజ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కూడా కథ పలుమలుపులు తిరిగిన తర్వాత అన్నదమ్ములు ఒక్కటయ్యారు. 20 ఏళ్ల తర్వాత తమ్ముడిని కలిపినందుకు ఫేస్‌బుక్‌కు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఇలా చేయడం పీఐబీకి అలవాటే....
న్యూఢిల్లీ : చెన్నై వరద పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఏరియల్ సర్వేకు సంబంధించిన ఫొటోల విషయంలో ఫొటోషాప్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అభాసుపాలైన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ ఇలా అభాసుపాలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేసిన సమయంలో.. ఆయన ఫొటోలను కూడా ఇదే విధంగా ఫొటోషాప్ చేసి విడుదల చేసిందట. ఈ మేరకు తమ సర్వేలో వెల్లడైందని ఎన్డీటీవీ మంగళవారం వెల్లడించింది. అయితే అందుకు సంబంధించిన చిత్రాలు మాత్రం ప్రస్తుతం పీఐబీ వద్ద లేవని తెలిపింది. చెన్నై మహానగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెన్నై మహానగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అందులోభాగంగా ఆయన కిటికిలో నుంచి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆ దృశ్యాలను పీఐబీ ఫొటోషాప్ చేసి విడుదల చేసింది. ప్రధాని చూస్తున్న ఏరియల్ వ్యూలో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తు భవనాలు అత్యంత సమీపంలో ఉన్నట్లు మార్చిన ఫొటోలను ఉంచారు. సహజంగా ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేస్తున్న వారికి భూ భాగం పైన అంతా పచ్చగా కనిపిస్తుంది తప్ప, ఇళ్లు, అపార్టుమెంట్ల వంటి భవనాలు స్పష్టంగా కనిపించవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుక కరుచుకున్న పీఐబీలను వెబ్సైట్ నుంచి తొలగించి తిరిగి మామూలు ఫోటోలు పెట్టి వివరణ ఇచ్చుకుంది. అయితే మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి నెట్జనులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యంగోక్తులు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. -
పారదర్శకతకే స.హ.చట్టం
తెనాలి రూరల్, న్యూస్‌లైన్: పరిపాలనలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం 2005లో సమాచారహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కార్యాలయ అదనపు డెరైక్టర్ జనరల్ ఎంవీవీఎస్ మూర్తి అన్నారు. స్థానిక అన్నాబత్తుని పురవేదిక వద్ద జరుగుతున్న ‘భారత్ నిర్మాణ్’ పౌర సమాచార ఉత్సవం సోమవారం రెండో రోజు సభా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యుడు సైతం అధికారులను ప్రశ్నించే అవకాశం ఈ చట్టం కల్పించిందన్నారు. కేవలం రూ.10తో సామాన్యుడికి కావాల్సిన ఏ సమాచారం అయినా అన్ని శాఖల నుంచి పొందే వీలువుందని చెప్పారు. నెల రోజు ల్లోగా సమాచారం అందించకపోతే, సమాచార కమిషనర్‌కు లేదా పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చని, అప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి వేతనం నుంచి రూ.25 వేల వరకు జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి రవీంద్ర, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శైలజ, జిల్లా ఆరోగ్యాధికారి ఆర్.రామారావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి శ్రావణచైతన్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం. గోపినాయక్‌లు తమ శాఖల పురోగతి గురించి మాట్లాడారు. భారత్ నిర్మాణ్ ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రసార, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలు, ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం, గ్రామీణాభివృద్ధి, రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ, గ్రామీణ సాగునీరు, తాగునీటి పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలకు సంబంధించిన వివరాలు, ప్రధాన మంత్రి ప్రసంగాల ప్రతులను ప్రజలకు అందజేశారు. ఆయా కార్యక్రమాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ టి.విజయకుమార్‌రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్ రత్నాకర్, క్షేత్ర ప్రచార అధికారి వెంకటప్పయ్య, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ ఆర్వీ రమణనాయక్, మున్సిపల్ కమిషనర్ బి.బాలస్వామి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్, సీడీపీవోలు సులోచన, అనూరాధ, కృష్ణవందన, మహంకాళి శ్రీనివాస్ తదితర అధికారులు పర్యవేక్షించారు.