లాక్‌డౌన్‌ పొడగింపు : ఆ ప్రచారం అవాస్తవం | PIB Fact Checks Media Report Claiming PM Didnt Consult COVID-19 Taskforce | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ పొడగింపు : ఆ ప్రచారం అవాస్తవం

Published Wed, Apr 15 2020 3:14 PM | Last Updated on Wed, Apr 15 2020 3:15 PM

PIB Fact Checks Media Report Claiming PM Didnt Consult COVID-19 Taskforce - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసే ముందు కోవిడ్‌-19పై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ను ఆయన సంప్రదించలేదని వచ్చిన వార్తలను పీఐబీ బుధవారం తోసిపుచ్చింది. లాక్‌డౌన్‌ పొడిగింపునకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కోవడ్‌-19పై 21 మంది సభ్యులతో ఏర్పాటైన సైంటిఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను సంప్రదించలేదని ఓ మ్యాగజైన్‌ పేర్కొందని, ఈ వార్త ఫేక్‌ న్యూస్‌ అంటూ పీఐబీ ట్వీట్‌ చేసింది.

చదవండి : ఆదుకునేందుకు ఏకమయ్యారు!

టాస్క్‌ఫోర్స్‌తో సంప్రదింపులు జరిపిన మీదటే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపింది. కాగా లాక్‌డౌన్‌పై నిర్ణయం ప్రకటించేముందు తాము ఏర్పాటు చేసిన కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ను మోదీ ప్రభుత్వం సంప్రదించలేదని వచ్చిన వార్తలు ఫేక్‌ న్యూస్‌ అంటూ ఐసీఎంఆర్‌ చేసిన ప్రకటనను పీఐబీ ట్యాగ్‌ చేసింది. టాస్క్‌ఫోర్స్‌ గతనెలలో 14 సార్లు సమావేశమైందని, ఈ బృందంలోని సభ్యుల ప్రమేయంతోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం​ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 11,000 దాటగా 370 మందికి పైగా మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement