
న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5.0 అమల్లోకి వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వ ఆంక్షలతో, పలు షరతులతో వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. ఇక లాక్‌డౌన్‌కు ముందు తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రతిరోజు తొమ్మిది, పది వేల వరకు కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉండగా త్వరలోనే నాల్గవ ప్లేస్‌లో ఉన్న యూకేను అధిగమించేట్లు తెలుస్తోంది. (కరోనా లక్షణాలుంటే సెలవు తీసుకోండి)
ఇక కేసుల పరంగా దేశంలోని మహారాష్ట్ర ఏకంగా చైనానే దాటేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. జూన్ 15 నుంచి దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రారంభం కానుందని దీని సారాంశం. అయితే ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తూ.. ఇదో తప్పుడు కథనంగా కొట్టిపారేసింది. సంపూర్ణ లాక్‌డౌన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. (తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువే)
Comments
Please login to add a commentAdd a comment