న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్‌లైన్‌లో నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ మార్చి 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మార్చి 11 నాటి బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment