న్యూఢిల్లీ: కరోనా కాలంలో చదువు అంతా ఆన్‌లైన్‌మయం అయిపోయింది. స్కూల్ విద్యార్థుల నుంచి మొదలుకొని కాలేజీ విద్యార్థుల వరకు డిజిటల్ బోధనపై ఆధారపడుతున్నారు. కానీ అందరి చేతిలో ఫోన్లు అందుబాటులో లేవు. పైగా లాక్‌డౌన్ వల్ల ఇల్లు గడవటమే కష్టంగా ఉన్న పేద విద్యార్థులకు కొత్తగా ఫోన్లు కొనాలంటే మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో "విద్యార్థులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు అందించనుంది" అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (చదవండి: కూతురికి కోసం తల్లే కుక్క పిల్లలా...)
అంతేకాకుండా సదరు వార్తకు ఓ లింక్‌ను జోడించి. ఫోన్లు కావాలనుకునే విద్యార్థులు ఆ లింక్‌ను ఓపెన్ చేసి, అందులో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. దీంతో అనేకమంది ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. అయితే 'ఫ్రీ స్మార్ట్‌ఫోన్' వార్తను కేంద్రం కొట్టిపారేసింది. అసలు ప్రభుత్వం అలాంటి ప్రకటనే చేయలేదని ప్రభుత్వ రంగ సంస్థ పీఐబీ(ప్రెస్ ఇన్‌పర్మేషన్ బ్యూరో) స్పష్టం చేసింది. అలాగే ఉచిత ఫోన్ అందుకోండి.. అంటూ ఉన్న లింక్‌ను కూడా ఓపెన్ చేయవద్దని సూచించింది. ఒకవేళ లింక్‌ను ఓపెన్ చేస్తే మీ వివరాలు తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. (చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్‌వేర్ ముప్పు!)
दावा: कोरोना वायरस के कारण स्कूल और कॉलेज बंद होने के कारण छात्रों की शिक्षा प्रभावित हुई है, इसलिए सरकार सभी छात्रों को मुफ्त एंड्रॉइड स्मार्टफोन दे रही है #PIBfactcheck: यह दावा फर्जी है, केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है. pic.twitter.com/LkFA2rMtSn
— PIB Fact Check (@PIBFactCheck) August 24, 2020
Comments
Please login to add a commentAdd a comment