ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment