
ఆమెతో కొడుక్కి వడ్డీవ్యాపారి పెళ్లి
యశవంతపుర: ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆమెను తన కొడుక్కి పెళ్లి చేశాడో వడ్డీ వ్యాపారి. బెళగావి నగరంలోని తళకవాడి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ రాక్షస వివాహ ఘటన జరిగింది.
వివరాలు.. ఒక మహిళ రూ.50 వేలును అప్పుగా తీసుకొంది. ఆమె సరిగ్గా వడ్డీని చెల్లించలేదు. దీంతో బంగారు ముక్కెరను లాక్కున్నాడు. ఆమె కూతురిని అపహరించి తన కుమారునికి వివాహం చేశాడు. అతడు బాలికపై బలవంతంగా లైంగికక్రియకు పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ బాలిక శుక్రవారం బెళగావి తళకవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ ఆదేశాలతో భర్త, అతని తల్లిదండ్రులు సహా మరికొందరిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక చదువుకునేలా సాయం చేస్తామని కమిషనర్ తెలిపారు.