Loan Repayment
-
లోన్ క్లియర్ చేయడం ఆలస్యమైతే ప్రయోజనాలా?: పోస్ట్ వైరల్
ఎవరైనా బ్యాంక్ నుంచి లేదా ఇతర ఫైనాన్సియల్ సంస్థ నుంచి లోన్ తీసివుంటే.. ఎప్పుడెప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రశాంతంగా ఉందామా అనుకుంటారు. కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం మూడేళ్ళలో క్లియర్ చేయాల్సిన లోన్‌ను ఎనిమిదేళ్లలో క్లియర్ చేసాడు. ఎందుకు ఆలస్యం చేసాడు అనేదానికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో షేర్ చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బెంగళూరు పూర్వ విద్యార్థి.. మొదట్లో సాధ్యమైనంత త్వరగా తన లోన్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆలస్యం చేయడంలో లాభాలు ఉన్నాయని కొన్ని లెక్కల ద్వారా తెలుసుకుని.. లోన్ చెల్లించడానికి తొందరపడటం ఉత్తమ చర్య కాదని గ్రహించాడు.ఎంబీఏ గ్రాడ్యుయేట్ లోన్ ఆలస్యంగా చెల్లించాలి, అనుకోవడానికి ప్రధాన కారణం పన్ను ప్రయోజనాలు అని రెడ్డిట్‌లో వెల్లడించారు. బహుశా ఈ ప్రయోజనాల గురించి ఎవరికీ తెలుసుకుండకపోవచ్చు లేదా తెలిసినా పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద, పన్ను చెల్లింపుదారులు ఎనిమిది సంవత్సరాల వరకు చెల్లించే వడ్డీపై 100% పన్ను మినహాయింపు పొందుతారు. రెండు లేదా మూడేళ్ళలో లోన్ క్లియర్ చేస్తే ఈ మినహాయింపు లభించదు. కాబట్టి పూర్తి వ్యవధిలో లోన్ చెల్లించి పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎందుకు తగ్గించకూడదని.. అన్నారు.రెండో కారణం ఏమిటంటే.. ఒక వ్యక్తి రూ. 20 లక్షలు లోన్ తీసుకున్నాడు అనుకుంటే.. 9 శాతం వడ్డీతో మొత్తం రూ. 25 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న మొదటి రోజుల్లో లేదా ఈఎంఐలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్ అవుతుంది. క్రమంగా ఆ వడ్డీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నా డబ్బును తొందరగా తిరిగి చెల్లించడానికి బదులు.. దానిని పొదుపులు & పెట్టుబడులతో సమతుల్యం చేసుకున్నానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్నేను లోన్ తీసుకుని.. దానిని మళ్ళీ చెల్లించే విషయంలో చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ఉత్తమ ఆర్థిక నిర్ణయం అని ఎంబీఏ గ్రాడ్యుయేట్ పేర్కొన్నాడు. అయితే త్వరగా అప్పులు తీర్చుకోవడం మంచిది, కానీ ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండటం కూడా మంచిదని.. అదే తాను నేర్చుకున్న పాఠమని వెల్లడించారు. -
అగ్రి, గృహ రుణాల్లో ఎగవేతలు పెరగొచ్చు
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులతో వ్యవసాయ, గృహ రుణాల్లో వచ్చే ఐదేళ్ల కాలంలో రుణ ఎగవేతలు 30 శాతానికి చేరుకోవచ్చని బీసీజీ సంస్థ అంచనా వేస్తోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి రోజులతో పోల్చి చూస్తే ఉష్ణోగ్రతలు సగటున 1.2 డిగ్రీల మేర పెరిగాయని, ఇది తీర ప్రాంతాల్లో వరదలు, వ్యవసాయ ఉత్పత్తి క్షీణతకు దారితీస్తున్నట్టు తెలిపింది. ఈ తరహా తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో తలసరి ఆదాయం తగ్గినట్టు తెలిపింది.షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో సగం మేర ప్రకృతిపై ఆధారపడి ఉంటాయని, ప్రకృతి విపత్తులు వాటి లాభాలపై ప్రభావం చూపిస్తాయని బీసీజీ వివరించింది. 2030 నాటికి దేశంలోని 42 జిల్లాలు సగటున రెండు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతల పెరుగుదలను ఎదుర్కొంటాయని, ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో 321 జిల్లాలపై ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని తెలిపింది. వాతావరణ మార్పులతో బ్యాంక్‌లకు 150 బిలియన్ డాలర్ల (రూ.12.9 లక్షల కోట్లు) మేర వార్షికంగా వ్యాపార అవకాశాలు రానున్నట్టు బీసీజీ సంస్థ అంచనా వేసింది. పర్యావరణ అనుకూల ఇంధనాలకు సంబంధించి ఈ మేరకు రుణ వితరణ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల (తటస్థ స్థాయి) లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం ప్రభుత్వ నిధులు ఒక్కటితోనే సాధ్యపడదని గుర్తు చేసింది.ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వోలో కొత్తగా 16 లక్షల మందికి చోటుభారీ పెట్టుబడులు అవసరం‘భారత్ బొగ్గు, చమురు వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించింది. ఈ విధమైన ఇంధన పరివర్తనానికి ఏటా 150–200 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు అవసరం. కానీ దేశంలో ప్రస్తుతం వాతావరణ సంబంధిత రుణ వితరణలు 40–60 బిలియన్ డాలర్లుగానే ఉంటున్నాయి. మరో 100–150 బిలియన్ డాలర్లు అవసరం’ అని బీసీజీ ఎండీ, పార్ట్నర్ అభినవ్ భన్సాల్ తెలిపారు. ఇది బ్యాంక్‌లకు గణనీయమైన అవకాశాలను తీసుకొస్తుందంటూ.. ఇందులో ఎక్కువ భాగం 2030–40 మధ్య కాలంలో ఆచరణ రూపం దాల్చొచ్చని అభిప్రాయపడ్డారు. -
రుణాల ప్రీక్లోజర్ ఛార్జీలపై ఆర్బీఐ స్పందన
బ్యాంక్‌లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్ పెనాల్టీ/ ఫోర్క్లోజర్ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్బీఐ(RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్ఈలు తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీర్చుకునే వాటిపైనా ముందస్తు చెల్లింపుల చార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.‘టైర్ 1, టైర్ 2 ప్రాథమిక అర్బన్ కోపరేటివ్ బ్యాంక్‌లు, బేస్ లేయర్ ఎన్బీఎఫ్సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలు (ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంక్‌లు, ఇతర ఎన్బీఎఫ్సీలు) ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి చార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్ పేర్కొంది. ఎంఎస్ఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.రిస్క్ ఇన్వెస్టింగ్‌పై అవగాహన కల్పించాలిఅన్సెక్యూర్డ్ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్సెక్యూర్డ్ రుణాలు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టింగ్ వల్ల తలెత్తే రిస్క్‌ల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్క్‌లు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. -
రుణబంధం పెరుగుతోంది
నూగూరి మహేందర్: ఒకప్పుడు చేబదులు కావాలంటే బంధువునో, స్నేహితులనో అడగాల్సిందే. లేదంటే తెలిసినవారి నుంచి వడ్డీకి అప్పు తీసుకోవాల్సిందే. వ్యక్తులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ఇప్పుడు ఒకరి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఛాయ్ తాగేలోపు అప్పు పుడుతోంది. డబ్బులు పడ్డాయహో అంటూ ఫోన్ మెసేజ్ మోగుతుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా ఖాతాలో, జేబులో డబ్బులు ఉండక్కర్లేదు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు. అంతే కాదు యూపీఐ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలను బట్టి ఇన్స్టంట్ రుణం ఇచ్చేందుకూ బ్యాంకులు క్యూ కడుతున్నాయి. సిబిల్ స్కోర్ లేకున్నా పర్వాలేదంటున్నాయి. అప్పు సరే.. తీర్చేదెలా అన్న సందేహమూ అక్కర్లేదు. సింపుల్‌గా సులభ వాయిదాల్లో (ఈఎంఐ) తీర్చేసే వెసులుబాటూ కల్పిస్తున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లో క్రెడిట్ కార్డులు, రుణాల వృద్ధి చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఈ రుణాల జోరు అభివృద్ధికి సూచికగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీవితం కోసం.. దిగువ–మధ్యతరగతి వినియోగదారులలో రుణాలు తీసుకునే విధానంలో గణనీయ మార్పు వచ్చింది. గతంలో మనుగడ కోసమైతే ఇప్పుడు ఆకాంక్షలు, వ్యాపారం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఈ మార్పు దేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక–ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోందని బ్యాంకింగ్ రంగ సంస్థలు అంటున్నాయి. కస్టమర్లు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నాయి. రుణ లభ్యత, డిజిటల్ ఆధారిత బ్యాంకింగ్ మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడం లోన్ పోర్ట్‌ఫోలియో పెరుగుదలకు దోహదం చేస్తోంది. నడిపిస్తున్న ధోరణులు.. కోవిడ్–19 మహమ్మారి రాక షాపింగ్ తీరుతెన్నులను మార్చేసింది. కన్జ్సూమర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న హోమ్ క్రెడిట్ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ వాటా 2021లో 69% ఉంటే.. 2023లో ఇది 48%కి, 2024 నాటికి 53%కి చేరింది. మహిళా కస్టమర్లలో 60%, మిలీనియల్స్ 59%, జనరేషన్ జెడ్ 58%, మెట్రోలు, టైర్–2 నగరాల్లో 56% మంది ఆన్లైన్ ట్రెండ్‌ను నడిపిస్తున్నారు. యాప్–ఆధారిత బ్యాంకింగ్‌కు మిలీనియల్స్‌లో 69% శాతం సై అంటున్నారు. జెన్ జెడ్ 65%, జెన్ ఎక్స్‌లో 58% యాప్ బేస్ట్ బ్యాంకింగ్ కోరుకుంటున్నారు. దిగువ–మధ్యతరగతి రుణగ్రహీతలలో 43% మందికి ఈఎంఐ కార్డ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన క్రెడిట్ సాధనంగా మారాయి. క్రెడిట్ కార్డ్‌లను 24%, డిజిటల్ లెండింగ్ యాప్‌లను 12% మంది ఎంచుకుంటున్నారు. వృద్ధిలోనూ ‘క్రెడిట్’వాటికే.. 2024 డిసెంబర్ నాటికి దేశంలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య 10.8 కోట్లు.. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు దాదాపు రెండింతలు అయ్యాయి. డెబిట్ కార్డులు ఐదేళ్లలో 80.53 కోట్ల నుంచి 2024 డిసెంబర్ నాటికి 99.09 కోట్లకు చేరాయి. ఏడాదిలో క్రెడిట్ కార్డుల వృద్ధి 10.31 శాతం ఉంటే డెబిట్ కార్డుల విషయంలో ఇది 3.13 శాతమే. క్రెడిట్ కార్డులతో జరిపిన చెల్లింపులు 2024 డిసెంబర్లో రూ.1,88,086 కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 13.9 శాతం ఎక్కువ. 2024 డిసెంబర్లో కార్డులతో చేసిన మొత్తం చెల్లింపుల విలువలో క్రెడిట్ కార్డుల వాటా 82.22 శాతం ఉండటం గమనార్హం. 2023 డిసెంబర్లో ఇది 77.5 శాతం. క్రెడిట్ కార్డుల విభాగంలో మొత్తం పోర్ట్‌ఫోలియోలో ప్రైవేటు బ్యాంకుల వాటానే 69.8 శాతంగా ఉంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు 2024 మార్చి నాటికి చెల్లించాల్సిన మొత్తం 27.7 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరింది. రుణాల వృద్ధి అభివృద్ధికి సూచిక! రుణాలు పెరుగుతుండటం అభివృద్ధికి సూచిక. బ్యాంకుల మద్దతు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. బ్యాంకింగ్ లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ తదుపరి స్థాయికి చేరితేనే ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరుగుతుంది. బ్యాంకులు లాభాల్లో ఉన్నాయంటే అందుకు కారణం అర్హతగల వారికి రుణాలు జారీ చేయడమే. రుణ మార్కెట్లో మొండి బాకీలు సహజం. అయితే సానుకూల ధోరణితోనే రికవరీ చేయాలి. ఆర్థిక స్థోమత చూసి క్రెడిట్ కార్డులు ఇచి్చనంత వరకు ఎటువంటి సమస్య లేదు. – వి.ఎస్.రాంబాబు, జాతీయ కార్యదర్శి, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -
అప్పు తీర్చలేదని.. రాక్షస వివాహం!
యశవంతపుర: ఓ మహిళ అప్పు తీర్చలేదని ఆమె కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆమెను తన కొడుక్కి పెళ్లి చేశాడో వడ్డీ వ్యాపారి. బెళగావి నగరంలోని తళకవాడి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ రాక్షస వివాహ ఘటన జరిగింది. వివరాలు.. ఒక మహిళ రూ.50 వేలును అప్పుగా తీసుకొంది. ఆమె సరిగ్గా వడ్డీని చెల్లించలేదు. దీంతో బంగారు ముక్కెరను లాక్కున్నాడు. ఆమె కూతురిని అపహరించి తన కుమారునికి వివాహం చేశాడు. అతడు బాలికపై బలవంతంగా లైంగికక్రియకు పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ బాలిక శుక్రవారం బెళగావి తళకవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ కమిషనర్ యడా మార్టిన్ ఆదేశాలతో భర్త, అతని తల్లిదండ్రులు సహా మరికొందరిపై కేసు నమోదుచేసి బాలికను రక్షించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. బాలిక చదువుకునేలా సాయం చేస్తామని కమిషనర్ తెలిపారు. -
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్
నేను చెల్లించాల్సిన మొత్తం కంటే.. బ్యాంకులు రెండింతలు ఎక్కువ రికవరీ చేశాయని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.డెట్ రికవరీ ట్రిబ్యునల్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాన్ని రూ. 1200 కోట్ల వడ్డీతో సహా రూ. 6203 కోట్లుగా నిర్ణయించింది. అయితే బ్యాంకులు నా నుంచి ఏకంగా రూ. 14131.60 కోట్లు రికవరీ చేశాయని.. విజయ్ మాల్యా తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ఈడీతో పాటు బ్యాంకులు తాను చెల్లించాల్సిన అప్పుల కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ చేసుకున్నాయని వెల్లడించారు. అప్పులు రికవరీ అయ్యాక కూడా నేను ఆర్ధిక నేరస్తుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు.The Debt Recovery Tribunal adjudged the KFA debt at Rs 6203 crores including Rs 1200 crores of interest. The FM announced in Parliament that through the ED,Banks have recovered Rs 14,131.60 crores from me against the judgement debt of Rs 6203 crores and I am still an economic…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024లోక్‌సభలో గ్రాంట్లకు సంబంధించిన సప్లమెంటరీ డిమాండ్లపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ.. మాల్యాకు చెందిన రూ. 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై మాల్యా స్పందిస్తూ.. ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 9వ తరగతి స్టూడెంట్ ఖాతాలో రూ.87.63 కోట్లునాపైన సీబీఐ క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం, కొంతమంది విమర్శకులు చెబుతున్నారు. సీబీఐ ఏ క్రిమినల్ కేసులు పెట్టింది?. నేను ఒక్క రూపాయి కూడా లోన్ తీసుకోలేదు. దొంగిలించలేదు. కానీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి గ్యారెంటర్‌గా.. ఐడీబీఐ బ్యాంక్ అధికారులతో సహా అనేక మంది ఇతర వ్యక్తులతో కలిసి ఐడీబీఐ బ్యాంక్ నుంచి.. వారి క్రెడిట్ కమిటీ, బోర్డు ఆమోదం పొందిన రూ.900 కోట్ల లోన్ మోసపూరితంగా పొందినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే లోన్, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించాను. 9 సంవత్సరాల తర్వాత మోస, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఎందుకు లేవు? అని కూడా మాల్యా ప్రశ్నించారు.Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 -
ఒక్క ఈఎంఐతో ఐదేళ్లు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. దీన్ని నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం డబ్బు పోగు చేస్తారు. కొంత నగదు సమకూరిన తర్వాత హోంలోన్ తీసుకుని ఇంటిని సొంతం చేసుకుంటారు. నెలవారీ ఈఎంఐల కోసం తిరిగి కష్టపడుతుంటారు. అయితే ఈ లోన్ వ్యవధి సుమారు 25 ఏళ్లపాటు ఉంటుంది. దాంతో భారీగా వడ్డీ చెల్లించాలి. ఆలోపు అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం ఏర్పడితే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ లోన్ కాలపరిమితిని తగ్గించుకుంటే త్వరగా అప్పు తీర్చడంతోపాటు ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చుకోవచ్చు. అయితే త్వరగా ఇంటి రుణం ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.ఉద్యోగం చేస్తున్నవారు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వేతనం పెరుగుతుంది. అలా పెరిగిన డబ్బుతో ఏటా 10 శాతం ఈఎంఐ పెంచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 25 ఏళ్ల కాలానికి తీసుకున్న రుణం.. 10 ఏళ్లలోనే పూర్తవుతుంది.ఏటా 10 శాతం ఈఎంఐ పెంచడం కష్టం అని భావించేవారు తమ ఇంటి రుణాన్ని 13 ఏళ్లలో తీర్చవచ్చు. ఇందుకోసం నెలవారీ వాయిదాను ఏటా ఐదు శాతం వరకు పెంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఖర్చుల విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో రుణంపై వడ్డీ భారమూ తగ్గుతుంది.ఏటా 12 ఈఎంఐలకు బదులుగా కేవలం ఒక ఈఎంఐని అధికంగా చెల్లిస్తే మీ ఇంటిరుణం వ్యవధి ఏకంగా ఐదేళ్లు తగ్గుతుంది. అంటే 25 ఏళ్ల పాటు సాగే రుణ భారాన్ని 20 ఏళ్లలోనే పూర్తి చేసుకోవచ్చు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారంనెలవారీ సంపాదనలో అన్ని ఈఎంఐలు కలిపి 50 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ పరిధిదాటితే ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.సొంతింటిలో అదనంగా ఫ్లోర్లు ఏర్పాటు చేసి గదులు కిరాయికి ఇవ్వొచ్చు. అలా వచ్చే రెంట్‌తో ఈఎంఐ పెంచుకోవచ్చు. దాంతో తక్కువ సమయంలోనే లోన్ పూర్తి చేయవచ్చు. -
లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు
అప్పు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ అండగా నిలిచారు. ఆమె చెల్లించాల్సిన లోన్ మొత్తాన్ని చెల్లించడమే కాకుండా.. అదనంగా మరో రూ. 10 లక్షలు సాయం చేశారు.కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరగడంతో.. మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త పిల్లలను, తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సంధ్యకు కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు లోన్ చెల్లించడం కష్టతరమైంది. చాలీచాలని జీతంతో ముందుకుసాగుతున్న ఈమె సకాలంలో లోన్ తీర్చలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ. 8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని లోన్ ఇచ్చిన కంపెనీలు ఈమెపై ఒత్తిడి తెచ్చాయి.లోన్ చెల్లించడంలో విఫలమవడంతో లోన్ ఇచ్చిన సంస్థలు ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. కట్టు బట్టలతో.. పిల్లలతో సహా సంధ్య రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎంఏ యూసఫ్ అలీ కంటపడటంతో.. తక్షణమే స్పందించారు.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుసంధ్య లోన్ మొత్తం చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా వారి జీవితం కొంత సాఫీగా సాగటానికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో సంధ్య సమస్యలు తీరిపోయాయి. కష్టాల్లో ఉన్న మహిళకు.. లులు మాల్ అధినేత అండగా నిలబడంతో నెటిజన్లు యూసఫ్ అలీని తెగ మెచ్చుకుంటున్నారు. -
Polavaram: గడువులోగా పూర్తి చేయకపోతే ఆ సొమ్ము రుణమే
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది. అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్‌లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా.. » రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి. » కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. » ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. » విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం. » ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. -
Ganta : గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
ఎందెందు వెతికినా.. వాడు అందందే గలడు అన్నట్టు ఏ నేరం చూసినా.. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో టిడిపి నేతలే బయటకు వస్తున్నారు. బ్యాంకు కేసుల నుంచి డ్రగ్స్ దాకా, ఓటుకు కోట్లు నుంచి పేకాట శిబిరాల దాకా టిడిపి క్రైం లిస్టు పెరిగిపోతోంది. గంట మోగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు. -
ఏప్రిల్ నుంచి కీలక ఛార్జీల నిబంధనలు అమలు...
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)రుణ ఎగవేతలపై జరిమానా ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ కీలక నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వేసే జరిమానా ఛార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన ‘ఫెయిర్ లెండింగ్ విధానం’ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లింపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా ఛార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా ఛార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి ఛార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు. -
బ్యాంక్‌లోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే..
బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అన్ని సందర్భాల్లోనూ రుణం దొరకండ అంత తేలికేమీ కాదు. కొందరికి ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం కష్టం అవుతుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తోంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు రుణగ్రహీత ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. రుణ దరఖాస్తును తిరస్కరించేందుకు చాలా కారణాలుంటాయి. అంతకు ముందు తీసుకున్న రుణాల చెల్లింపు తీరు, ఆదాయాన్ని మించిన అప్పుల్లాంటివీ ఇందులో ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరించిన వెంటనే మళ్లీ కొత్తగా వేరే బ్యాంకులో దరఖాస్తు చేయకముందు చాలా విషయాలు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తును బ్యాంకు ఎందుకు తిరస్కరించిందో కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రుణదాతలు కచ్చితంగా దీన్ని తెలియజేస్తారు. క్రెడిట్ స్కోరు 700 పాయింట్ల లోపు ఉన్నప్పుడు రుణ దరఖాస్తును ఆమోదించడం కష్టం. తగినంత ఆదాయం లేకపోవడం, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలు మీ ఆదాయంలో 50-60 శాతానికి చేరడం, వాయిదాలను ఆలస్యంగా చెల్లించడం, ఉద్యోగంలో సమస్యలు, తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి చట్టపరమైన చర్యల వంటి వాటివల్లా దరఖాస్తు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీ క్రెడిట్ నివేదికలో తప్పుడు వివరాలూ కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. వాయిదాలు చెల్లింపులో.. రుణ తిరస్కరణ ఎదురుకాకుండా చూసుకునేందుకు ఆరోగ్యకరమైన రుణ చరిత్రను నిర్వహించడం ఎంతో కీలకం. వాయిదాలను సకాలంలో చెల్లించాలి. 750కి మించి క్రెడిట్ స్కోరున్నప్పుడు రుణ దరఖాస్తును సులభంగా ఆమోదిస్తారు. తక్కువ స్కోరు వల్లే రుణం లభించలేదు అని తేలితే.. ముందుగా స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. చిన్న మొత్తంలో ఉన్న అప్పులను పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు క్రమంగా పెరుగుతుంది. తప్పుడు వివరాలుంటే.. వ్యక్తిగత గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా, సంతకం, పాన్, ఆధార్ ఇలా పలు వివరాలను రుణ దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ రుణదాతల యాప్‌లోనే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ చిన్న పొరపాటు గుర్తించినా, రుణ దరఖాస్తు ఆమోదం పొందదు. కాబట్టి, ముందుగానే ఈ వివరాలు సరిచూసుకోవాలి. నిత్యం లోన్లు అడుగుతుంటే.. కొంతమంది అవసరం లేకపోయినా వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల కోసం బ్యాంకులను సంప్రదిస్తారు. ఇలా మీరు అడిగిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరు స్వల్పంగా తగ్గుతుంది. కాబట్టి, తక్కువ వ్యవధిలోనే బహుళ రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరును గణనీయంగా దెబ్బతీస్తాయి. మీ స్కోరును కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకూ తక్కువ దరఖాస్తులు చేయడం మేలు. అనేకసార్లు దరఖాస్తు చేస్తే.. మీరు అప్పుల మీదే ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంది. తనిఖీలు చేసుకోండి.. క్రెడిట్ నివేదికలో తప్పులు దొర్లినప్పుడు వాటిని వెంటనే గుర్తించేలా ఉండాలి. కాబట్టి, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. కొన్ని క్రెడిట్ బ్యూరోలు నెలకోసారి వీటిని ఉచితంగానే అందిస్తాయి. మీ ఆర్థిక ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఏదైనా పొరపాట్లు ఉంటే, వెంటనే వాటిని గుర్తించి, సరి చేసుకునేందుకు వీలవుతుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడు, అది పెరిగేందుకు కొంత సమయం పడుతుంది. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బాకీల్లాంటివి సకాలంలో చెల్లించాలి. అప్పుడు మీపై బ్యాంకులకు విశ్వాసం పెరిగి, రుణ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలుంటాయి. -
లోన్లపై వేసే ఛార్జీల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
డబ్బు అవసరం అయితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో లోన్ తీసుకుంటారు. కానీ తిరిగి ఆ డబ్బు చెల్లించడంలో జాప్యం జరిగితే కొంత అధికమొత్తంగా పేచేయాల్సి ఉంటుంది. అయితే లోన్ కాంట్రాక్ట్ నోట్ ప్రకారం చెల్లించే పేనల్ ఛార్జీలను గతంలో ఆర్బీఐ సవరించింది. అందుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. లోన్ అకౌంట్లకు సంబంధించి వేసే పేనల్ ఛార్జీలను అమలు చేయడానికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మరో మూడు నెలల సమయం దొరికింది. గతంలోని నిర్ణయించిన దాని ప్రకారం జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావాలి. కానీ, ఏప్రిల్ 1 వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెంటర్(ఎన్బీఎఫ్సీ)లు ఏప్రిల్ 1 నుంచి ఇచ్చే అన్ని ఫ్రెష్ లోన్స్‌పై కొత్త పేనల్ ఛార్జీ రూల్స్ అమలు చేయాలని ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. అయితే ఇప్పటికే ఇచ్చిన లోన్లకు సంబంధించి కొత్త నిబంధనల అమలుకు సంబంధించి ఏప్రిల్ 1 తర్వాత రివ్యూ చేయాలని తెలిపింది. కొత్త రూల్ ప్రకారం, లోన్ కాంట్రాక్ట్‌లోని కండిషన్స్ ఫాలో కాకపోతే బారోవర్లపై వేసే చార్జీలను పేనల్ చార్జీలుగా పరిగణిస్తారు. అంతేతప్పా పేనల్ ఛార్జీలను వడ్డీగా చూడకూడదని ఆర్బీఐ తెలిపింది. ఈ ఛార్జీ అప్పుల వడ్డీలపై కూడా పడుతుంది. రూల్స్ పాటించకపోతే తీవ్రతను బట్టి పేనల్ ఛార్జీ ఉంటుంది. పేనల్ చార్జీలపై అదనంగా వడ్డీ వసూలు చేయకూడదు. -
RBI: ఇకపై లోన్ రికవరీ ఏజెంట్ల సమయం ఇదే..
బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు అవసరాలకు అనుగునంగా నిబంధనల ప్రకారం లోన్లు ఇస్తూంటాయి. వాటిని వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్లు ఉంటారు. అయితే రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రికవరీ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రహీతలు ఫోన్ చేయకూడదనే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. డైరెక్ట్ సేల్స్ ఏజెంట్లు (డీఎస్ఏ), డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లు (డీఎంఏ), రికవరీ ఏజెంట్ల కోసం నియంత్రిత సంస్థలు ఈ నియామవళిని పాటించే విధంగా చూడాలని ఆర్బీఐ భావిస్తుంది. ఆర్బీఐ ప్రతిపాదించబోతున్న నిబంధనల ప్రకారం..రికవరీ ఏజెంట్లు కస్టమర్లను అభ్యర్థించడం, కాల్ చేసే గంటలు, కస్టమర్ సమాచారం గోప్యత, సంస్థలు ఇస్తున్న ఆఫర్లోని ఉత్పత్తుల నిబంధనలు, షరతులను స్పష్టంగా తెలియజేయాలి. బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియన్ సెంటర్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పట్టణ, రాష్ట్ర, కేంద్ర సహకార బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. రికవరీ ఏజెంట్లు తమ రుణ సేకరణ ప్రయత్నాల్లో భాగంగా ఏ వ్యక్తిపై మానసికంగా, శారీరకంగా ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని ఆర్బీఐ డ్రాఫ్ట్ నిబంధనల్లో పేర్కొంది. రుణగ్రహీత కుటుంబ సభ్యులు, రిఫరీలు, స్నేహితులను అవమానించడం లేదా వారి ఇంట్లోకి చొరబడడం, మొబైల్ లేదా సోషల్ మీడియా ద్వారా అనుచిత సందేశాలు పంపడం, అనామక కాల్లు చేయడాన్ని నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నారు. -
అదనపు వడ్డీ కోసం దళిత మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించి..
పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఒక దళిత మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను వివస్త్రను చేసి కర్రలతో చితకబాది బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి భర్త ప్రమోద్ సింగ్ వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారని ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించినా కూడా రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు వారిని వేధించాడన్నారు. భార్యభర్తలు ఇద్దరూ అప్పటికే మొత్తం అప్పు తిరిగి చెల్లించామని చెప్పి అదననపు వడ్డీ చెల్లించడానికి తిరస్కరించడంతో శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు తోపాటు మరో నలుగురు ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారన్నారు. అనంతరం కర్రలతో చితకబాదాక ప్రమోద్ ఆదేశించగా అన్షు బలవంతంగా ఆమెతో మూత్రం తాగించాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి తలకు తీవ్రగాయాలవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్ అతని కుమారుడు అన్షు సహా మిగిలిన ఆనలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్ -
అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!
బాలీవుడ్ చాలారోజుల తర్వాత మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య థియేటర్లలో రిలీజైన 'గదర్ 2' సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుండటమే దీనికి కారణం. కెరీర్ ఇక అయిపోయిందనకున్న టైంలో సన్నీ డియోల్ ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అలాంటిది ఈ హీరో ఇప్పుడు కోట్ల రూపాయల అప్పు చేసి ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అతడి ఖరీదైన విల్లాని వేలానికి రావడంతో ఈ విషయం బయటపడింది. ఏం జరిగింది? ముంబయి జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ డియోల్ కి ఒక విల్లా ఉంది. అయితే దీనిని గ్యారంటీగా పెట్టి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లు లోన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు దాన్ని చెల్లించే విషయంలో మాత్రం మొహం చాటేశాడు. బ్యాంక్ నోటీసులు పంపినా సరే స్పందించలేదు. దీంతో ఏకంగా ఆదివారం (ఆగస్టు 20) ఓ ప్రముఖ పేపర్లో విల్లాని వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. డబ్బుల్లేవా? బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర వారసుడు అయిన సన్నీ డియోల్.. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఇతడికి సరైన హిట్ అనేది లేదు. దీంతో అందరూ ఇతడి గురించి మర్చిపోయారు. ప్రస్తుతం 'గదర్ 2'తో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇలాంటి హీరో లోన్ తీసుకుని కట్టకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పు తీర్చకపోవడం అనేది ఇతడికి పెద్ద సమస్య కాదు. తలుచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో తీర్చేయొచ్చు. కానీ సన్నీ డియోల్ ఎందుకలా చేస్తున్నాడనే విషయం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. చూడాలి మరి ఈ వేలంలో ఏం జరుగుతుందనేది? (ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?) -
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
మోసాలు, ఎగవేతలపై వేగంగా స్పందించాలి
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులను (ఎన్పీఏలు) తగ్గించుకునేందుకు మోసాలు, ఉద్దేశ పూర్వక రుణ ఎగవేత కేసుల్లో వేగవంతంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. వృద్ధి మార్గాన్ని ఇదే మాదిరిగా ఇకముందూ కొనసాగించాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు 2021–22 వరకు క్రితం ఆరేళ్లలో రూ.11.17 లక్షల కోట్ల ఎన్పీఏలను మాఫీ చేశాయి. నాలుగేళ్ల కాలం పాటు ఎన్పీఏలుగా కొనసాగి, వాటికి నూరు శాతం కేటాయింపులు చేసిన వాటిని బ్యాంక్‌లు మాఫీ చేసి, బ్యాలన్స్ షీట్ల నుంచి తొలగిస్తుంటాయి. అయినా కానీ, ఆ తర్వాత కూడా వాటి వసూలుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి. ఇటీవలే పీఎస్‌బీల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత రిస్‌్కలను అధిగమించేందుకు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు. బలమైన అంతర్గత ఆడిట్ కార్యాచరణను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలు, తక్కువ వ్యయ డిపాజిట్ల విషయంలో క్రమంగా తమ మార్కెట్ వాటాను కోల్పోతుండడం తదితర సవాళ్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లపైనా ఆందోళన వ్యక్తమైనట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అధిక ఈల్డ్ వచ్చే రుణ విభాగాలపై దృష్టి సారించాలని, ఫీజులు పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్న సూచన వచి్చనట్టు తెలిపాయి. -
రూ.28 వేల కోట్లకు పైగా బ్యాంకులకు బురిడీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తప్పుడు మార్గాల్లో రూ.28వేల కోట్లకు పైగా రుణాలు పొంది బురిడీ కొట్టించారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పైబడిన 79 మోసాల కేసుల్లో మొత్తం రూ.28,797.03 కోట్ల మేర మోసాలకు గురైనట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.7,111.52 కోట్ల మోసం జరిగింది. నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాల్లో వివరాలు తప్పుగా సూచించడం, తారుమారు చేయడం, రుణగ్రహీతలు తప్పుడు ఆర్థిక నివేదికలు సమర్పించడం, నిర్దేశించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించకపోవడమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు ప్రధాన కారణంగా తేలిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రుణగ్రహీతలు మూడో పార్టీ ఏజెన్సీలు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు కుమ్మక్కు కావడం కూడా ప్రధాన కారణమని తెలిపింది. ఈ నేపథ్యంలో.. బ్యాంకు మోసాలను నివారించేందుకు ఆన్లైన్లో శోధించదగిన డేటాబేస్, సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ రూపంలో గుర్తించనున్నట్లు పేర్కొంది. మోసాలను నియంత్రించడం క్రెడిట్ మంజూరు ప్రక్రియలో తగిన శ్రద్ధ వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు వివరించింది. అలాగే, బ్యాంకుల్లో జరిగిన మోసాల కేసులను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, పోలీసుస్టేషన్లు, సీబీఐ తదితరాల ద్వారా విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. అంతేకాక.. ప్రత్యేక కమిటీ ద్వారా కేసులను పర్యవేక్షించడంతో పాటు బ్యాంకు బోర్డుల ఆడిట్ కమిటీల ముందు త్రైమాసిక సమాచారాన్ని ఉంచడం ద్వారా ఈ మోసాలపై వార్షిక సమీక్ష చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021–22లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ జరిగిన మోసాలు.. (రూ.కోట్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్యాంకు మోసాలు విలువ –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్యాంక్ ఆఫ్ బరోడా 9 2,860.85 బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 4,668.00 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2 896.30 కెనరా బ్యాంక్ 6 2,774.26 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 388.24 ఇండియన్ బ్యాంక్ 7 1,628.36 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 3 874.76 పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 2 364.03 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13 7,111.52 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 4,856.71 యూకో బ్యాంక్ 1 374.96 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 1,999.31 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
మాల్యా దగ్గర లోన్లు చెల్లించేంత డబ్బుంది, కానీ..
ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా వ్యవహారానికి సంబంధించి.. సీబీఐ తాజాగా ముంబై కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో విస్తుపోయే విషయాలను పేర్కొంది దర్యాప్తు సంస్థ. విజయ్ మాల్యా దగ్గర ఆ సమయానికి రుణం తిరిగి చెల్లించడానికి తగినంత డబ్బు ఉనప్పటికీ.. ఆ పని చేయలేదని, బదులుగా ఆయన దేశం విడిచి పారిపోయే ముందు విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అదే సమయంలో బ్యాంకులు సైతం ఆయన నుంచి లోన్లు రికవరీ చేయడంలో విఫలం అయ్యాయంటూ తెలిపింది. 2008-17 మధ్య మాల్యా దగ్గర బ్యాంకు లోన్లు చెల్లించడానికి తగినంత డబ్బు ఉంది. ఆ సమయంలోనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ కోసం అతను లోన్లు తీసుకున్నాడు అని సీబీఐ పేర్కొంది. అయితే.. తన దగ్గర ఉన్న సొమ్ముతో లోన్లు చెల్లించకపోగా.. యూరప్ వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు తన పిల్లలకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో ఉన్న ట్రస్టులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడని గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు చెల్లించి రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశాడు. తన కంపెనీలలో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుండి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ పేర్కొంది. అలాగే ఇంగ్లండ్‌లోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. ఐడీబీఐ-కింగ్‌పిషర్ ఎయిర్‌లైన్స్ 900 కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నాడు. విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయి.. యూకేలో తలదాచుకున్నాడు. ఈ మేరకు అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కూడా. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2019, జనవరి 5వ తేదీన ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను fugitive(పరారీలో) ఉన్నట్లుగా ప్రకటించింది. ఇక.. గత ఛార్జ్‌షీట్‌లో 11 మంది నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ, తాజా ఛార్జ్‌షీట్‌లో ఐడీబీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా పేరును చేర్చింది. మొత్తంగా రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయాడు మాల్యా. ఇదీ చదవండి: ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. వణికిపోయేలా చేసింది! -
లోన్ యాప్స్ ఆగడాలపై ఈడీ దూకుడు
-
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారం తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!
సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం పెంచిన రెపో రేట్ల ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. ఆగస్టు 5న ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. అయితే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లపై పడే వడ్డీ భారాన్నీ తగ్గించుకోవచ్చు. ఈఎంఐ( EMI) లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా? పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకొని కస్టమర్లు వారి ఈఎంఐ కాలాన్ని పెంచుకోవడం, లేదా మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్ టెన్యూర్ పెంచుకుంటే మీ ఈఎంఐ పెంపు ఆప్షన్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ప్రీపేమెంట్ వడ్డీ భారాన్ని తగ్గింపు కోసం కస్టమర్లు ముందస్తు చెల్లింపు చేయవచ్చు. అనగా తమ హోమ్లోన్లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు లోన్ కాలపరిమిత తగ్గింపు ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం మరో ఆప్షన్. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే ఇతర బ్యాంకుకు మార్చుకునే వెసలుబాటు ఉంది. అయితే ఈ ప్రక్రియకు అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. లోన్ తీసుకున్న కస్టమర్లు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకునే ముందే వారికి ఎదురయ్యే లాభనష్టాలను చెక్ చేసుకోవడం మంచిది. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
వేధింపుల వల్లే పాప చనిపోయింది: కుటుంబ సభ్యులు
-
నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లతో గ్రానైట్ కటింగ్ మిషన్ కోసం బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారిపై సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. కెనరా బ్యాంకు నుంచి ఓమ్ సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని అద్లురీ రాజు బాలానగర్ కెనరా బ్యాంకులో రూ. 95 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశాడు. తన వ్యాపార కార్యాలయం పంజాగుట్ట ద్వారాకపూరి కాలనీలో శ్రీదేశి అపార్టుమెంట్లో ఉందని సంబంధింత పత్రాలు బ్యాంకుకు అందించాడు. అనంతరం రూ. 95 లక్షల రుణం బ్యాంకు మంజూరు చేసింది. తరువాత కొన్ని వాయిదాలు చెల్లించి చేతులెత్తేశాడు. వాయిదాలు సక్రమంగా రాకపోవడంతో ఎందుకు చెల్లించడం లేదని, కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అతని కార్యాలయమే లేదని తేలింది. అతడి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, కోటేషన్లు కూడా నకిలీవని తేలాయి. ఒక పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసి రూ. 89 లక్షల వరకు నష్టం చేశారంటూ కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీసీఎస్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అద్లురీ రాజుతో పాటు అతనికి సహకరించిన నరహరి గంటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ‘నీట్’గా దోచేశాడు... ఎంబీబీఎస్ సీటు పేరుతో గోల్మాల్ ) -
అప్పు తీర్చే మార్గం కనిపించడంలేదు.. ఊరు విడిచి వెళ్లిపోతున్నా!
జోగిపేట(అందోల్): బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధి కంసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది. తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకులో రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు. ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది. అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు. రూ.1.42 లక్షలు చెల్లించాల్సి ఉంది కన్సాన్పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి మోటారు కొనుగోలు కోసం, బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకున్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. – రాజు, మేనేజర్ జోగిపేట డీసీసీబీ బ్రాంచ్ -
హిమ్మత్ రఖనా అంటూ కన్నుమూసిన అమ్మానాన్న, ఎల్ఐసీ నోటీసులు, నెటిజనుల స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీమా సంస్థ ఎల్ఐసీ లోన్ రికవరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ విషయం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌కు దృష్టికి చేరింది. వెంటనే దీనిపై జోక్యం చేసుకున్న ఆమె ఈ విషయాన్ని పరిశీలించి తనకు వివరాలు అందించాల్సిందిగా ఎల్ఐసీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన జితేంద్ర పాఠక్ ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ టీచరు. ఎల్ఐసీ నుంచి ఇంటి కోసం రూ.29 లక్షల రుణం తీసుకున్నారు. అయితే గత ఏడాది జితేంద్ర, ఆయన భార్య డా. సీమా పాథక్‌ను కూడా కరోనా పొట్టన పెట్టుకుంది. అప్పటికి వనిషా వయసు 17 సంవత్సరాలు. ఈమెకు పదకొండేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే 29 లక్షల రూపాయల లోన్ తీర్చాలంటూ వనిషా పాఠక్‌కు నోటీసులు పంపింది ఎల్ఐసీ. తక్షణమే లోన్ చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జూన్ 5న ఎల్ఐసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పిల్లల బంధువులు తమ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని తెలియజేశారని ఎల్ఐసీ తెలిపింది. ఇకపై ఎలాంటి నోటీసులు అందవని హామీ ఇస్తూ ఏప్రిల్‌లో లేఖ పంపినట్లు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బాధితుల స్పందన భిన్నంగా ఉంది. ఇదే నిజమైతే మళ్లీ నోటీసులు ఎందుకు వచ్చాయని వనిషా ప్రశ్నించింది. కాగా వనిషా పాఠక్, ఆమె సోదరుడిని ప్రస్తుతం మేనమామ సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి వనిషా 10వతరగతి సీబీఎస్ఈ పరీక్షలలో ఇంగ్లీష్, సంస్కృతం, సైన్స్, సోషల్ సైన్స్‌లో 100 మార్క్‌లు, గణితంలో 97 స్కోర్ చేయడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వనిషా పాఠక్ ఐఐటీ లేదా యూపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని భావిస్తోందట. దేశానికి సేవ చేయాలని తండ్రి కోరిక అని.. ఇపుడు అది తన డ్రీమ్ అని చెప్పింది. అలాగే అద్భుతమైన కవిత్వంతో అమ్మ నాన్నాలకు ఘనమైన నివాళి అర్పించడమే కాదు ఆ దుఃఖాన్ని, కన్నీళ్లను దిగమింగుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజనులు వనిషాకు, ఆమె తమ్ముడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎల్ఐసీ రుణాన్ని తీర్చి, ఆమె చదువు కయ్యే ఖర్చును భరించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నామని తెలిపారని పిల్లల మేనమామ చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయం చేస్తామంటూ ఫోన్లు వస్తూనే ఉన్నాయనీ ఆయన తెలిపారు. అయితే లోన్ రీపేమెంట్లో ఎల్ఐసీ నుంచి కొంత సడలింపు లభిస్తే.. అదే పెద్ద సహాయం అవుతుందన్నారు. -
టార్చర్ ఫ్రమ్ హోమ్!
సాక్షి, హైదరాబాద్: చైనా లోన్ యాప్స్ తరపున పని చేస్తూ రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వారిని వివిధ రకాలుగా వేధిస్తున్న కాల్ సెంటర్లు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్గావ్లో చేసిన దాడుల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం నగరానికి తరలించారు. చైనీయులు సూత్రధారులుగా ఏర్పాటైన సంస్థలు క్యాష్ అడ్వాన్స్, మనీ బాక్స్, అడ్వాన్స్ క్యాష్, లోన్ బజార్, క్యాష్ బస్ పేర్లతో లోన్ యాప్స్ నిర్వహిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకున్న అనేక మంది రుణం తీసుకుంటున్నారు. వడ్డీ, సర్వీస్ చార్జీల భారం నేపథ్యంలో చెల్లించలేకపోయిన వారి నుంచి వసూలు చేయడానికి గుర్గావ్ కేంద్రంగా కాల్‌సెంటర్ ఏర్పాటైంది. అదే ప్రాంతానికి చెందిన హరిప్రీత్ సింగ్, పంకజ్‌ల నేతృత్వంలో ఇది నడుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీలోని లోన్ యాప్స్ కాల్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. దీంతో అప్పటి నుంచి వీరు తమ పంథా మార్చారు. గుర్గావ్లోని కాల్ సెంటర్‌ను మూసేశారు. తమ దందా కొనసాగించడం కోసం కొందరిని టీమ్ లీడర్లుగా ఎంపిక చేసుకుని వారి కింద 12 మందిని టెలీ కాలర్లుగా నియమించారు. ఇలా 15 బృందాలను ఏర్పాటు చేసిన హరి, పంకజ్‌లు టెలీకాలర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. టీమ్ లీడర్లు అందించే రుణగ్రస్తుల జాబితాల ఆధారంగా టెలీకాలర్లు వారి ఇంటి నుంచే ఫోన్లు చేసి, మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధించేలా చేస్తున్నారు. క్యాష్ అడ్వాన్స్ యాప్ నుంచి రుణం తీసుకుని వేధింపులు ఎదుర్కొన్న బాధితుడి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరిలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దీనిని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు గుర్గావ్, ఢిల్లీల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో దాడులు చేసి గుర్గావ్లో టీమ్ లీడర్‌గా పని చేస్తున్న బీహార్ వాసి వికాస్ కుమార్, ఢిల్లీ, గుర్గావ్లకు చెందిన టెలీకాలర్లు శ్వేత, రాహుల్ రాణాలను అరెస్టు చేశారు. వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచి మంగళవారం సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. హరిప్రీత్ సింగ్, పంకజ్‌లతో పాటు మరో ఇద్దరు టీమ్ లీడర్లు అయిన దీపక్, సుమంత్‌లను ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కేసులోనూ వీరు నిందితులు కావడంతో కోర్టు అనుమతితో ఇక్కడకు తరలించాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. (చదవండి: యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఆర్టీసీ...నడిరోడ్డే బస్‌బేలుగా..) -
48 వాయిదాల్లో బకాయిల చెల్లింపు!
సాక్షి, హైదరాబాద్: విద్యుదుత్పత్తి కంపెనీలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు బకాయిపడిన రూ.వేల కోట్లను సులభ వాయిదాల్లో చెల్లించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని ప్రకటించబోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న డిస్కంలు ఈ నెల 18 నాటికి విద్యుదుత్పత్తి కంపెనీలకు ఏకంగా రూ.1,00,018 కోట్ల బకాయిలు, నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయనందుకు మరో రూ.6,839 కోట్ల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంది. తెలంగాణ డిస్కంలు రూ.7,828 కోట్లు, ఏపీ డిస్కంలు రూ.9,983 కోట్ల బకాయి ఉన్నాయి. డిస్కంలు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల మధ్య నగదు ప్రవాహం స్తంభించి మొత్తం రంగంపై దుష్ప్రభావం పడుతోంది. బొగ్గు కొనుగోళ్లకు, నిర్వహణ పెట్టుబడికి నిధుల కొరతతో విద్యుదుత్పత్తి కంపెనీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుల్లో డిస్కంల ఇబ్బందులను తొలగించడానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. తప్పనున్న 19,833 కోట్ల ‘అపరాధ భారం’ ఈ పథకాన్ని ప్రకటించిన తేదీ నాటికి ఉన్న బకాయిల (అపరాధ రుసుముతో సహా) మొత్తంపై తదు పరిగా అపరాధ రుసుము విధించకుండా స్తంభింపజేస్తారు. మొత్తం బకాయిలను 48 వాయిదాల్లో చెల్లించడానికి వెసులుబాటు కల్పించనున్నారు. ఒకవేళ వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే మాత్రం మినహాయించబడిన మొత్తం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఒకే పర్యాయం (వన్ టైం) అమలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా డిస్కంలతో పాటు విద్యుదుత్పత్తి కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగు అవుతాయని కేంద్రం పేర్కొంటోంది. ఈ పథకంతో 48 నెలల్లో డిస్కంలపై రూ.19,833 కోట్ల అపరాధ రుసుం భారం తప్పనుంది. భారీగా బకాయిలున్న తమిళనాడు, మహారాష్ట్ర, డిస్కంలు చెరో రూ.4,500 కోట్లు, ఉత్తరప్రదేశ్ డిస్కంలు రూ.2,500 కోట్లు, ఏపీ, తెలంగాణ డిస్కంలు రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల అపరాధ రుసుం చెల్లింపుల నుంచి మినహాయింపు పొందనున్నాయి. దీంతో ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. అపరాధ రుసుం ఇలా..: గడువులోగా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించకపోతే ఎస్బీఐ రుణాల కనీస వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకుని మొదటి నెల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా జాప్యం జరిగితే ప్రతి నెలా 0.5% చొప్పున, ఎస్బీఐ కనీస వడ్డీ రేటుకు అదనంగా 3% వరకు అపరాధ రుసుం పెంచి చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి. బకాయిలపై అపరాధ∙రుసుములు రూ.వేల కోట్లకు పెరిగి డిస్కంలు ఆర్థికంగా కుదేలు కావడంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొస్తోంది. -
మంచిర్యాల జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు వివాహిత బలి
-
మంచిర్యాల: లోన్ యాప్ కీచక పర్వం.. వివాహిత ఆత్మహత్య
సాక్షి, మంచిర్యాల/ మంచిర్యాల క్రైం: మొబైల్ లోన్ యాప్ సంస్థ వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఆమె చనిపోయిన తరవాత కూడా పదేపదే కాల్స్ చేస్తూ, ఆమె మృతదేహం ఫొటోలు చూపించాలని యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ దారుణం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన వివాహిత బొల్లు కళ్యాణి(30) ‘హలో రూపీ లోన్’యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన ఆమె భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే 20 రోజుల క్రితం ఆమె మంచిర్యాలకు వచ్చింది. అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువకావడంతో ఇటీవల రెండు దఫాలుగా రూ.20 వేలు చెల్లించింది. అయినా ఆ చెల్లింపు వివరాలు అప్డేట్ కాలేదంటూ పదేపదే ఆమెను వేధించసాగారు. వేర్వేరు నంబర్లతో రోజుకు వందల సార్లు ఆమెకు కాల్స్‌చేస్తూ అసభ్య పదజాలంతో దూషించేవారు. ఫోన్‌కాల్ వస్తోందంటే వణికిపోయి.. కాల్స్ మాట్లాడాలంటే భయంతో వణికిపోయిన కళ్యాణి కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వాట్సాప్‌లో ఆమె ముఖాన్ని న్యూడ్ ఫొటోలతో మార్ఫింగ్ చేసి ఆమెకే పంపి, వీటిని అందరికీ షేర్ చేస్తామని బెదిరించేవారు. దీంతో భయాందోళన చెందిన కళ్యాణి ఈ నెల 16న హెయిర్ డై తాగి ఆత్మహత్యకు యత్నించింది. రెండ్రోజులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది 17న సాయంత్రం డిశ్చార్జి అయింది. మళ్లీ అదే తీరుగా యాప్ నిర్వాహకుల వేధించడం మొదలుపెట్టారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇబ్బంది పెట్టొదని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి బుధవారం ఇంట్లోని బాత్రూమ్లోని షవర్‌కు శాలువాతో ఉరేసుకుంది. మరోవైపు ఆమె చనిపోయిందనే విషయాన్ని నమ్మకుండా యాప్ నిర్వాహకులు పదేపదే కాల్స్ చేశారు. కనికరం లేకుండా ఆమె మృతదేహం ఫొటోలు పంపాలంటూ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశారు. అయితే భర్త, అత్తింటివారు తమ కూతురిని డబ్బుల కోసం వేధించడంతోనే యాప్ లోన్ తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, హలో రూపీ లోన్ యాప్‌తో పాటు మరో ఐదారు యాప్‌ల నుంచి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. -
స్కాములెన్ని ఉన్నా.. వన్‌టైమ్ సెటిల్మెంట్లో పీఎన్బీనే మిన్న
వరుస స్కామ్‌లలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతోంది పంబాజ్ నేషనల్ బ్యాంక్. స్కాములు వెంటాడుతున్నా మొండి బకాయిలు వసూలు చేసుకోవడంలో మెరుగైన పనితీరునే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కనబరుస్తోంది. గతేడాది వన్‌టైమ్ సెటిల్మెంట్లో పీఎన్బీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. పార్లమెంటులో దేశంలోని 11 బ్యాంకులు గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 డిసెంబర్ వరకూ, అలాగే అంతకుముందు మూడు ఆర్థిక సంవత్సరాలు) వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా దాదాపు రూ.61,000 కోట్లను రికవరీ చేశాయని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మంత్రి ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... - రిజర్వ్ బ్యాంక్ సూచనల ప్రకారం, తమ బోర్డు ఆమోదించిన లోన్ రికవరీ పాలసీని బ్యాంకులు కలిగి ఉండాలి. తద్వారా రాజీ, వన్–టైమ్ సెటిల్మెంట్ మార్గాలతో మొండిబకాయిలకు సంబంధించి రుణ రికవరీ జరగాలి. కనిష్ట వ్యయంతో సాధ్యమైనంత గరిష్ట ప్రయోజనం పొందేలా రికవరీ ప్రక్రియ ఉండాలి. - బ్యాంకులు తమ నిధులను సత్వరం పొందడం, తిరిగి వాటిని రుణాలకు వినియోగించుకోవడం, తగిన ప్రయోజనం పొందడం (రీసైకిల్) వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రధాన ఉద్దేశం. - ఆయా పక్రియ ద్వారా 11 జాతీయ బ్యాంకులు గడచిన నాలుగు సంవత్సరాల్లో 38,23,432 కేసులను వన్‌టైమ్ సెటిల్మెంట్గా పరిష్కరించాయి. తద్వారా రూ.60,940 కోట్లు రికవరీ చేశాయి. - వన్ టైమ్ సెటిల్మెంట్ విషయంలో 8.87 లక్షల కేసులతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తొలి స్థానంలో నిలిచింది. తరువాత వరుసలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.97 లక్షలు) బ్యాంక్ ఆఫ్ బరోడా (4.34 లక్షలు) ఇండియన్ బ్యాంక్ (4.27 లక్షలు), కెనరా బ్యాంక్ (4.18 లక్షలు) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.02 లక్షలు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.99 లక్షలు), యూకో బ్యాంక్ (2.38 లక్షలు)ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (1.33 లక్షలు) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (63,202) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (20,607) ఉన్నాయి. -
లోన్ డబ్బులు కట్టలేదని ఇంటికి తాళం
-
మరో ఘరానా మోసం!
‘ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి... పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్’ అని ఏనుగు లక్ష్మణకవి ప్రసిద్ధ నీతి పద్యం. ఆకాశంలోని గంగ చివరకు పాతాళానికి చేరినట్టే, వివేకం కోల్పోయి ప్రవర్తిస్తే ఎంతటివారికైనా ఇక్కట్లు తప్పవు. అత్యున్నత స్థానం నుంచి అధఃపాతాళానికీ పడిపోకా తప్పదు. నౌకా నిర్మాణరంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన ఏబీజీ షిప్‌యార్డ్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అదే. తప్పుడు దోవ తొక్కి ‘దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ మోసం’ చేసి, అప్రతిష్ఠ పాలైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర నేరపరిశోధనా సంస్థ (సీబీఐ) ఎట్టకేలకు ఏబీజీ పైనా, దాని డైరెక్టర్ల పైనా కేసులు పెట్టింది. అప్పటి మేనేజ్మెంట్ డైరెక్టర్లు తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు బదలాయించి, లెక్కల్లో సర్దుబాట్లు చేసిన తీరుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. విదేశాల్లోని అనుబంధ సంస్థకు భారీగా పెట్టుబడులు మళ్ళించిన ఏబీజీ ఆ పైన వాటిని పన్ను బెడద లేని తీరాలకు తరలించిందా అన్నది చూడాలి. వెరసి దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టిన మరో బడా సంస్థ బాగోతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక దశలో రూ. 16,600 కోట్ల మేర ఆర్డర్లున్న అగ్రశ్రేణి సంస్థ ఏబీజీ షిప్‌యార్డ్ రూ. 23 వేల కోట్ల అతి పెద్ద బ్యాంక్ కుంభకోణానికి మూలం కావడం ఆశ్చర్యకరమే! 2012– 17 మధ్య అయిదేళ్ళలో 28 బ్యాంకుల కన్సార్టియమ్‌ను వేల కోట్ల అప్పులతో మోసం చేసింది. ఎస్బీఐ, ఐడీబీఐ, ఐసీఐసీఐ లాంటి పేరున్న బ్యాంకులూ ఆ సంస్థ చేతిలో మోస పోవడం విచిత్రం. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌లూ, ఆడిట్ నివేదికలు తెరపైకి వచ్చినా, అప్పులిచ్చిన బ్యాంకులు, చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు చాలాకాలంగా చర్యలు చేపట్టక, నిద్రావస్థలోనే ఉండిపోవడం మరీ విడ్డూరం. పదేళ్ళ క్రితం 2012 –13 నాటికి రూ. 107 కోట్ల నికర లాభాలతో దూసుకుపోతున్న సంస్థ ఆ మరుసటేడే రూ. 199 కోట్ల నష్టానికి జారిపోయి, చివరకు దివాళా తీశానని చేతులెత్తేయడం ఓ గమ్మత్తు. గుజరాత్‌లోని సూరత్ వద్ద తపతీ నది ఒడ్డున మగ్దల్లా ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన షిప్‌యార్డ్ ఉన్న ఏబీజీ ప్రస్థానం మూడున్నర దశాబ్దాల పైచిలుకు క్రితం 1985 మార్చిలో మొదలైంది. 1990లో తొలి షిప్‌ను అందించింది. అప్పటి నుంచి 2013 లోపల 165కి పైగా షిప్పులు రూపొందించిన ఘనత ఆ సంస్థది. ఆ నౌకల్లో నూటికి 80 అంతర్జాతీయ కస్టమర్ల కోసమే. 2000లో కోస్ట్‌గార్డ్ కోసం రెండు బోట్ల తయారీకి తొలి ప్రభుత్వ ఆర్డర్ పొంది, దేశ రక్షణ అవసరాల్లోకీ విస్తరించింది. జలాంతర్గాములు సహా రక్షణ శాఖ ఓడల తయారీకి 2011లో కేంద్రం ఈ సంస్థకు లైసెన్స్ ఇచ్చింది. దహేజ్‌లో రెండో షిప్ యార్డ్ పెట్టి, రూ. 2500 కోట్లతో మూడో షిప్‌యార్డ్‌కు అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకొని, ఆఖరికి మునిగిపోతున్న పడవ లాగా మారిపోయింది. 1995 నుంచి బీజేపీయే పాలిస్తున్న గుజరాత్లో ఈ మోసం పాల్పడడంతో, దేశాన్ని లూఠీ చేస్తున్నవారికి కొమ్ము కాస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కాగా, కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఉండగానే కుంభకోణం జరిగిందన్నది బీజేపీ ప్రతి విమర్శ. వాటిని అటుంచి – అసలు ఒక సంస్థ ఇంత భారీ స్థాయిలో, ఇన్ని బ్యాంకుల్ని మోసం చేసే దాకా అన్ని వ్యవస్థలూ నిద్ర పోయాయా? లేక నిద్ర నటించాయా? మోసం జరిగిందని 2019 జనవరిలో గుర్తించిన ఎస్బీఐ, ఆ నవంబర్ దాకా ఫిర్యాదు దాఖలు చేయలేదు. మరింత సమగ్రంగా 2020 ఆగస్టులో తాజా ఫిర్యాదు చేసింది. మోసాన్ని గుర్తించిన మూడేళ్ళకు ఎట్టకేలకు ఈ ఫిబ్రవరి 7న ఆ సంస్థ చైర్మన్– ఎండీ రిషీ కమలేశ్ అగర్వాల్, ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు దాఖలుకే ఎందుకింత ఆలస్యమైంది? సామాన్యులు రుణం తీసుకోవాలన్నా, తీసుకున్న చిన్న రుణానికి వడ్డీ ఆలస్యమైనా అనేక కష్టాలు తప్పని మన దేశంలో బడాబాబులకు మాత్రం భారీ ఆర్థిక మోసాలకు తెగబడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ‘ఎగ్గొట్టి ఏటవతలకు పోదా’మనే పాత నానుడికి తగ్గట్టు ఇలాంటి ఘరానా దొంగలు ఎందరో దేశం విడిచిపోయి, దర్జాగా విదేశాల్లో కులుకుతుంటే వారిని పట్టితెచ్చి, శిక్షించకపోవడం ఎవరి తప్పు? సొంత సేవింగ్స్ ఖాతాలో సొమ్ము తీసుకోవడానికి కూడా సవాలక్ష రూల్స్ పెట్టే బ్యాంకులు ఇన్ని వేల కోట్లకు ఒక సంస్థ పంగనామాలు పెడుతుంటే, ఏం చేస్తున్నట్టు? విజయ్ మల్యా, ఏబీజీ షిప్‌యార్డ్... ఇలా బడాచోర్ల పేర్లు ఏమైతేనేం, బ్యాంకులే ప్రజాధనాన్ని ఈనగాచి నక్కల పాలు చేస్తుండడం దుస్సహనీయం. ఓ సంస్థ ప్రమోటర్లు దాదాపు 98 డొల్ల సంస్థలు పెట్టి, నిధుల ప్రవాహాన్ని మళ్ళిస్తుంటే, బ్యాంకుల్లోని ఇంటా బయటా ఆడిటర్లు, చివరకు ఆర్బీఐ ఆడిట్లు కూడా కనిపెట్టలేదంటే నమ్మలేం. 2013లోనే 8 లక్షల కోట్ల మేర నిరర్థక ఆస్తులు చూపిన ఏబీజీ వ్యాపారంలో తప్పుల వల్ల కాక, కుమ్మక్కుల వల్లే ఈ పరిస్థితి కోరికొని తెచ్చుకుంది. అందుకే, ఈ తాజా కుంభకోణం మన బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న లోపాలకు ప్రతీక. ఆడిటింగ్, పర్యవేక్షణ, నియంత్రణ ఎంత సంబడంగా ఉన్నాయో చూపెట్టే నిలువుటద్దం. రాజకీయుల ఆశీస్సులు, వారితో కుమ్మక్కు లేకుండా ఇంతలా జరగవనే సర్వసాధారణ అభిప్రాయానికి సరికొత్త బలం. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పంతా మరొకరిపై నెట్టే బదులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి, కఠినచర్యలు తీసుకోవాలి. ఇకపై, ప్రమోటర్లనే కాక బ్యాంక్ అధికారులు, ఆడిటర్లు, పర్యవేక్షక సంస్థలను కూడా జవాబుదారీ చేయాలి. లేదంటే ఇలాంటి మోసాలు యథేచ్ఛగా సాగిపోతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త! -
బ్యాంకులకు భారీ షాక్ ? గాలిలో దీపంగా మారిన రూ. 28 వేల కోట్లు
SREI Infrastructure Finance Limited: చైనా ఎవర్‌గ్రాండ్ ఉదంతం పతాక శీర్షికల్లో ఉండగానే ఆ తరహా ఉపద్రవమే మన దగ్గర ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రియాల్టీ, ఫైనాన్స్ రంగాల్లో దేశవ్యాప్తంగా పేరున్న ఓ సంస్త ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని సమాచారం. భారీగా రుణాలు కోల్‌కతాకు చెందిన శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ దేశ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అంతేకాదు ఫైనాన్స్‌లో కూడా కాలు మోపింది. ఈ సంస్థ పనితీరుని నమ్మి యూకోబ్యాంకు, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో పాటు ప్రైవేటు , ప్రభుత్వ బ్యాంకులు భారీగా రుణాలు అందించాయి. పేలవ పనితీరు గడిచిన కొన్నేళ్లుగా శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్(SREI) నిర్వాహాణా లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కోవిడ్ పంజా కూడా ఈ కంపెనీపై పడింది. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా కటకటలాడే స్థికి చేరుకుంది. దీంతో ఈ నెల ఆరంభంలో ఆ కంపెనీ సీఈవో సైతం రాజీనామా చేశాడు. నిరర్థకమేనా ? ఇప్పటికే శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ సంస్థకు అప్పులు చెల్లించిన బ్యాంకులు ఈ సంస్థని నిరర్థక సంస్థగా గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాయంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగి తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తంగా శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ కంపెనీ పేరు మీద రూ. 30,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఇందులో రూ. 28,000 కోట్ల అప్పులు అంటే దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించినవే ఉన్నాయి. ఆస్తుల వేలం మొత్తం అప్పుల్లో బ్యాంకుల నుంచి నేరుగా తీసుకున్న అప్పులు రూ. 18,000 కోట్లు ఉండగా మిగిలిన రూ. 10,000 కోట్లను ష్యూరిటీలు, బాండ్ల తదితర రూపాల్లో శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ సంస్థ సేకరించింది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమే అయినా కొంత సమయం ఇస్తే అప్పులు చెల్లించేందుకు సంస్థ సిద్ధంగా ఉందంటూ ఆ కంపెనీ ప్రతినిధులు హామీ ఇస్తున్నారు. తదుపరి చర్యలు ఇప్పటికే శ్రేయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ సంస్థ పనితీరుపై బ్యాంకులు అసంతృప్తిగా ఉన్నాయి. నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్ ట్యాగ్‌ను ఇప్పటికే తగిలించాయి. ఈ సంస్థపై తదుపరి చర్యలకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ ఛోక్సీ ఉదంతాలతో దెబ్బ తిన్న బ్యాంకింగ్ సెక్టార్‌పై కోవిడ్ మహమ్మారి మరో పోటు వేసింది. ఇంకా పూర్తిగా ఆ వ్యవస్థ గాడిన పడకముందే శ్రేయ్ రూపంలో మరో ముప్పు ఎదురైంది. చదవండి: ట్విన్ టవర్స్ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి -
క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..
పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఎలాంటి రుణం కావాలన్నా సిబిల్ స్కోర్(క్రెడిట్ స్కోర్) చాలా అవసరం. సిబిల్ స్కోర్ బాగుంటేనే ఫైనాన్షిల్ క్రైసిస్ నుంచి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆదుకుంటాయి. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం..వరల్డ్ వైడ్ గా 190 మిలియన్ల మంది రుణాల్ని తీసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు తేలింది. అయితే ఆర్ధిక వ్యవహారాల్లో కీరోల్ ప్లే చేసే సిబిల్ స్కోర్‌ను పెంచుకునే మార్గాలు అనేకం ఉన్నా..వాటిలో ఉద్యోగస్తులు సిబిల్ స్కోర్‌ను పెంచేందుకు ప్రత్యేక పద్దతులు ఉన్నాయి. లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎందుకు అంత ముఖ్యం? వన్ స్కోర్ సీఈఓ అనురాగ్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 'క్రెడిట్ స్కోరు అనేది 300 నుండి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మన ఆర్ధిక వ్యవహారాలు ఎలా ఉన్నాయో చెబుతోంది. లోన్ కోసం అప్లై చేసినప్పుడు.. ఆ లోన్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని బ్యాంకులు పరిగణలోకి తీసుకునే ముఖ్యమైన బెంచ్ మార్కే ఈ సిబిల్ స్కోర్. ''సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు మీకు లోన్లు ఇచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తాయి. అదే స్కోర్ తక్కువగా ఉంటే మీరు ఆర్ధికంగా ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించి రుణాల్ని ఇచ్చేందుకు తిరస్కరిస్తాయి.అందువల్ల తక్కువ వడ్డీ రేటు, క్రెడిట్ కార్డ్‌లో లిమిట్ ఎక్కువగా కావాలాన్ని ఈ సిబిల్ స్కోర్ చాలా అవసరమని' అనురాగ్ సిన్హా అన్నారు. ఉద్యోగస్తులు తమ సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే చాలా మంది తొలిసారి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని పద్దతులు పాటిస్తే సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చని వన్ స్కోర్ సీఈఓ అనురాగ్ సిన్హా తెలిపారు.అంతేకాదు సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలిపారు. సురక్షితమైన క్రెడిట్ కార్డును పొందాలి: కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి సెక్యూర్ లేని క్రెడిట్ కార్డ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా క్రెడిట్ కార్డ్‌లను అందిస్తుంటాయి. వాటిలో సెక్యూర్ క్రెడిట్ కార్డ్‌లు 75-80 శాతం సిబిల్ స్కోర్ బాగుండేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మంచిదో ముందే తెలుసుకోవాలి. సకాలంలో ఈఎంఐ చెల్లించడం : లోన్ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవలను (ECS) సెట్ చేయడం ద్వారా మీ EMI,లేదా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్లు చేసుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు అనేక కారణాల వల్ల మొత్తం ఈఎంఐని చెల్లించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో చెల్లింపును కోల్పోకుండా డిఫాల్ట్‌ని నివారించడానికి మీరు కనీసం మొత్తాన్ని చెల్లించాలి. ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లయ్ చేయడం : సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ వారిచే ఇవ్వబడే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. మీరు ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లయ్ చేస్తే దాని ప్రభావం సిబిల్ స్కోర్ పై పడుతుంది. సిబిల్ స్కోర్ పూర్తిగా తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ లేకుండా రుణం పొందవచ్చా? తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడానికి ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండటం మంచిది. సిబిల్ స్కోర్ స్కోరు లేనప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్లు ఆధారంగా బ్యాంకులు మీరు ఆర్ధికంగా ఎలా ఉన్నారనే విషయాన్ని అంచనా వేస్తాయి. కాబట్టి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండటమే మంచిది సురక్షిత రుణాల రకాలు: - మాటిగేజ్ లోన్ లేదా ప్రాపర్టీ లోన్ - కారు లోన్ - హౌజ్‌లోన్ - ఏదైనా బిజినెస్ లోన్ (యంత్రాలు/ముడి పదార్థాలు/భవనాలు) - ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు: ఆలస్యంగా చెల్లించడం: ఒకటి లేదా రెండు ఆలస్యమైన క్రెడిట్ కార్డ్ చెల్లింపులు కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆలస్యంగా లోన్ పే చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్, సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. క్రమపద్దతిలో చెల్లించకపోవడం: ఉదాహరణకు తీసుకున్న లోన్ ఈఎంఐ కొన్నిసార్లు చెల్లించాల్సిన మొత్తంలో కొద్ది మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంటాం. అలా పే చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎక్కువ సంఖ్యలో లోన్ల కోసం అప్లయ్ చేయడం: సిబిల్ స్కోర్ అనుగుణంగా బ్యాంకులు రుణాల్ని ఇస్తుంటాయి. అయితే బ్యాంకులు రుణాల్ని ఇచ్చేందుకు తిరస్కరిస్తే మనం వేరే బ్యాంక్ ద్వారా లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇలా చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. మీ సిబిల్ స్కోర్ తక్కువగా చూపించడం: కొన్ని సార్లు మన సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నా.. మోసపూరిత కార్యకలాపాల వల్ల సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని చూపిస్తాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉందని అనిపిస్తే బ్యాంకు అధికారుల్ని సంప్రదించి సిబిల్ స్కోర్‌ను సరిచేయించుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో రుణాల్ని పొందే అవకాశాన్ని కోల్పోతాము. చదవండి: క్రెడిట్ స్కోర్ బాగున్నా, లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా? -
కాటేసిన అప్పులు: తెలంగాణలో ఇద్దరు రైతులు బలవన్మరణం
అప్పుల భారం తాళలేక సాగు చేసే రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కష్టపడి పండించగా దిగుబడి రాక, మార్కెట్లో ధర పలకకపోవడంతో ఆ రైతులు తమ ప్రాణాలను తీసుకున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక తమను తాము బలి తీసుకున్నారు. పొలంలో పురుగుల నియంత్రణకు వాడాల్సిన మందు వారిద్దరూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబాన్ని పోషించలేక... అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరూ రైతులు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. తానూరు (ముధోల్): మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడం, చేసిన అప్పులు తీరే దారి కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైన యువరైతు అశోక్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బెంబర గ్రామానికి చెందిన చుక్కబొట్ల అశోక్ తనకున్న రెండెకరాలతోపాటు మరో ఎకరం భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాలతోపాటు ప్రైవేట్‌గా తీసుకున్న అప్పులు సుమారు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. అప్పులు తీరడం లేదని మనస్తాపానికి గురైన అశోక్ మంగళవారం మధ్యాహ్నం పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధిక, కుమారులు అభిరాం, మణికంఠ ఉన్నారు. అశోక్ తండ్రి భుజంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు మరో ఘటన పెంబి (ఖానాపూర్): అప్పుల బాధతో పురుగుల మందు తాగిన మండలంలోని రాయదారి గ్రామానికి చెందిన రైతు రాథోడ్ బాబుసింగ్ (35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. రాథోడ్ బాబుసింగ్ పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట పూర్తిగా దెబ్బతినగా.. మొక్కజొన్ని పంట సైతం అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. దీంతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా రావేమోనని ఆందోళన చెందిన బాబుసింగ్ శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
‘కరోనా’ అప్పు..తీర్చడానికి జీవితకాలం
‘మిగిలింది’ 10 లక్షల అప్పే రేకుల షెడ్డులాంటి ఈ ఇల్లు కాషాగౌడ్ది. ఆయన ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.10 లక్షల అప్పుచేశాడు. అది కాస్తా తీరి కుదుటపడుతున్న వేళ కరోనా ఆయనతో సహా భార్యను పొట్టనపెట్టుకుంది. వీరిని కాపాడుకునేందుకు కుమారుడు మురళీగౌడ్ రూ.10 లక్షలు వెచ్చించాడు. అమ్మానాన్న దక్కలేదు కానీ.. అప్పు మిగిలింది. అసలే రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కూడదీసుకోలేని పరిస్థితి.. పై చిత్రంలో కనిపిస్తున్న ఇల్లమ్మితే తప్ప అప్పుతీరని దుస్థితి.. అదే జరిగితే భార్యాపిల్లలతో రోడ్డున పడతానంటున్న మురళి..చికిత్సకు లక్షలుపోసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న బాధితులపై వరుస కథనాలు నేటి నుంచి.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పేదరికం వారిపాలిట శాపమైంది. అప్పు వారి జీవన ప్రయాణంలో భాగమైంది. కులవృత్తిపై ఆధారపడి బతుకు సాగించే ఆ కుటుంబం ఇప్పుడు ఛిన్నాభిన్నమైంది. ఎదిగొచ్చిన ముగ్గురు కూతుళ్లను మంచి అయ్యల చేతిలో పెట్టాలని ఆ తండ్రి చేసిన పది లక్షల అప్పు తీర్చేందుకు జీవిత కాలం పట్టింది. ఇక తన బాధలు తీరాయని.. గుండెలపై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్న సమయంలో కరోనా రాకాసి ఆ కుటుంబాన్ని కాటేసింది. సెకండ్ వేవ్‌లో దంపతులిద్దరికీ పాజిటివ్ రాగా.. చికిత్స కోసం మళ్లీ రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. అయినా ఆ ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. ఇప్పుడు ఆ రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు వారి కొడుకుకు దారి కనిపించడం లేదు. ఉన్న ఇల్లు అమ్మితే గానీ అప్పులు తీరేలా లేవు. కానీ.. ఆ ఇల్లు కూడా అమ్ముకుంటే గూడు లేకుండా భార్యా పిల్లలను పోషించేదెలా అని ఆ కొడుకు మధనపడుతున్నాడు. జీవితాంతం అప్పు.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఆకుల లక్ష్మి (65), కాషాగౌడ్ (68) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కొడుకు మురళీగౌడ్ ఉన్నారు. గీతవృత్తిని నమ్ముకుని కాషాగౌడ్ అంతంత మాత్రంగా వచ్చే ఆదాయంతో బతుకు బండిని లాగాడు. భార్య బీడీలు చుట్టేది. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసేందుకు రూ.10 లక్షల అప్పు చేశాడు. కొడుకుకు కూడా వివాహం చేశాడు. 45 ఏళ్లుగా కల్లు అమ్ముతూ.. పైసాపైసా కూడబెట్టి అప్పు తీర్చాడు. అప్పులు తీరాయని, ఇక భార్య, కొడుకుతో మలిదశలో మనశ్శాంతితో జీవించవచ్చని అనుకుంటున్న తరుణంలో గతనెలలో లక్ష్మీ, కాషాగౌడ్ దంపతులకు కరోనా సోకింది. తల్లికి రూ. 7 లక్షలు.. తండ్రికి రూ.3 లక్షలు కొద్దిరోజులు ఈ దంపతులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. లక్ష్మి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కోసం కొడుకు మురళీగౌడ్ తెలిసివారి వద్ద రూ. 7లక్షల అప్పు తీసుకొచ్చాడు. కాషాగౌడ్ పరిస్థితి కూడా అదుపుతప్పడంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రి ప్రాణాలు దక్కించుకునేందుకు మురళి మరో రూ. 3 లక్షల అప్పు చేశాడు. అయితే లక్షలు ఖర్చు చేసినా తల్లి లక్ష్మి ప్రాణం దక్కలేదు. పరిస్థితి విషమించి గత నెల 22న చనిపోయింది. కడసారి చూడకుండానే.. తల్లి మరణించిన విషయం తండ్రి కాషాగౌడ్కు చెప్పకుండానే కొడుకు మురళి అంత్యక్రియలు పూర్తిచేశాడు. తండ్రిని సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం తల్లి మరణించిన విషయాన్ని తండ్రికి నెమ్మదిగా చెప్పిన మురళి.. ఆక్సిజన్ సిలిండర్ సాయంతో గతనెల 31న తల్లి దశదిన కర్మ కోసం కాషాగౌడ్ను ఇంటికి తీసుకొచ్చాడు. కార్యక్రమంలో భాగంగా తలనీలాలు సమర్పించి.. అందరితో మాట్లాడిన కాషాగౌడ్ సాయంత్రానికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో మరణించాడు. వెంటాడిన కష్టాలు.. కాషాగౌడ్ కొడుకు మురళీగౌడ్ తల్లిదండ్రుల మరణంతో ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. తండ్రిలాగే ఇప్పుడు కొడుకు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయా డు. గతంలో తండ్రి గీత వృత్తిలో ఉండగా మురళీగౌడ్ కొద్దిరోజులు కూలీపనికి వెళ్లాడు. తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేశాడు. కొంతకాలం స్వగ్రామంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేశాడు. గతేడాది దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇప్పటికీ కుడికాలు పని చేయడం లేదు. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లు తల్లిదండ్రుల ఆసరా ఉండగా.. మురళీగౌడ్ వారి మరణంతో ఒంటరివాడయ్యాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పోషించుకోవడంతోపాటు.. రూ.10 లక్షల అప్పు ఎలా తీర్చేదని మదన పడుతున్నాడు. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు అమ్మానాన్న మాకోసం జీవితకాలం కష్టపడ్డారు. నా తోబుట్టువుల పెళ్లిళ్లకోసం రూ.10 లక్షల అప్పుతెచ్చితీర్చడానికి జీవితకాలమంతా కష్టపడ్డాడు. అప్పులు తీర్చాక ఇక కష్టాలు పోయాయని అనుకుంటున్న సమయంలో మాయదారి కరోనా మా జీవితాలను నాశనం చేసింది. అమ్మానాన్నలను బతికించుకోవడానికి తెలిసి న చోటల్లా బతిమాలి రూ.10 లక్షల అప్పుతెచ్చాను. అయినా వారి ప్రాణాలు కాపాడుకోలేకపోయా. తెచ్చిన అప్పు తీర్చాలంటే దారి కనిపించడం లేదు. నా కాలు పనిచేయడం లేదు. ఉన్న ఒక్క ఇల్లును అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అమ్మితే ఇద్దరు పిల్లలతో నేను..నా భార్య రోడ్డున పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ స్పందించి అమ్మానాన్నల వైద్యానికి అయిన ఖర్చు అందిస్తే.. జీవితకాలం రుణపడి ఉంటాం. – ఆకుల మురళీగౌడ్ -
రూ. 1.5 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు గర్ల్‌ఫ్రెండ్ హత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో విషాదం చోటు చేసుకుంది. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయమన్నందుకు గర్ల్‌ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేసి.. ఓ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో పడేశాడు నిందితుడు. మృతురాలిని కుషిత పుంజార్‌గా గుర్తించారు పోలీసులు. ఆ వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన బిపిన్ కందులూనా, ముంబైకి చెందిన కుషిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కుషిత గతంలో బిపిన్‌కు 1.5లక్షల రూపాయలు ఇచ్చింది. కొంతకాలం బాగానే సాగిన వీరి బంధంలో కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. తనను వివాహం చేసుకోవాల్సిందిగా కుషిత, బిపిన్ మీద ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేని బిపిన్ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. బిపిన్‌కు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న కుషిత.. గతంలో తాను అతడికి ఇచ్చిన 1.5లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అంతేకాక తనను మోసం చేసినందుకుగాను అతడిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించసాగింది. ఈ క్రమంలో కుషిత మీద కోపం పెంచుకున్న బిపిన్ ఆమెను అవమానించడమే కాక దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేశాడు. హత్య చేసిన తర్వాత బిపిన్ సొంత రాష్ట్రం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు బిపిన్ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చేసుకుందాం.. ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు -
నడి వీధిలో రైతు పరువు వేలం
సాక్షి, మెదక్: రుణాలు చెల్లించని రైతుల పేర్లు, ఫొటోలతో నడి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి పరువు తీశారు మెదక్ జిల్లా కోఆపరేటివ్ అధికారులు. జిల్లాలోని పాపన్నపేట మండలంలో వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం తీసుకున్న లాంగ్ టర్మ్ రుణ బకాయిల వసూళ్ల కోసం అధికారులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. కరోనా కాలంలో అప్పు పుట్టక, పంటలు చేతికి రాక ఇబ్బందుల్లో ఉన్నామని, కాస్త సమయం ఇవ్వమని రైతులు వేడుకున్నా అధికారులు కనికరించలేదు. వెంటనే అప్పు కట్టకపోతే భూములు వేలం వేస్తామని, ఎర్ర జెండాలు పాతుతామని అధికా రులు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. గతేడాది కరోనా, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో తమ పరువు తీసి బజారుకీడ్చడం ఎంతవరకు సమంజసమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటలు వచ్చిన తర్వాత అప్పులు కడతామని, అప్పటి వరకు మానసికంగా చంపొద్దంటూ వేడుకుంటున్నారు. డీసీసీబీ పాపన్నపేట మేనేజర్ ప్రవీణను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బకాయిదారుల ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రింట్ చేయించామని తెలిపారు. చాలా ఏళ్లుగా రుణాలు కట్టని, వేలానికి వచ్చిన వాటికి సంబంధించి ఫ్లెక్సీ వేశారని చెప్పారు. ఎంతో కొంత మొత్తం కడితే గడువు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, బుధవారం వరకే ఈ అవకాశం ఉందన్నారు. చదవండి: అనిల్.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి -
అప్పు తిరిగివ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి...
సాక్షి, కరీంనగర్ : అప్పు తీసుకున్న మహిళ డబ్బులు వెనక్కివాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు ఏడుగురు వ్యక్తులు. ఈ సంఘటన కరీంనగర్లో సోమవారం చోటుచేసుంది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా ఉండే పలువురి వద్ద అప్పు క్రింద డబ్బులు తీసుకుని ఇవ్వక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో అప్పు తీసుకున్న మహిళ త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించి బాధితులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో, తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు వెంటనే ఇప్పించాలని లేకుంటే ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక కార్పోరేటర్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. డబ్బులు ఇప్పించే వరకు దిగమని బాధితులు ససేమిరా అన్నారు. చివరకు ఎస్ఐ ట్యాంక్ పైకి ఎక్కి డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందికి దిగారు. దాదాపు రెండు గంటలపాటు రాత్రిపూట బాధితులు ట్యాంక్ పై హంగామా చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. -
అసభ్య, బూతు సందేశాలు పంపేది ఢిల్లీలోని సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోయిన డిఫాల్టర్స్‌ను వేధించడానికి అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వేర్వేరు స్టేజ్ల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్టేజ్–1 కాల్ సెంటర్లలోని ఉద్యోగులు కేవలం రిమైండర్స్ మాత్రమే పంపిస్తుంటారు. గుర్గావ్లో ఉండే స్టేజ్–2 కాల్ సెంటర్లలోని వారు వేధింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేస్తుంటాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) కేంద్రంగా పనిచేసే స్టేజ్–3 సెంటర్ల నుంచి డిఫాల్టర్లతో పాటు వారి సంబంధీకులకు నకిలీ లీగల్ నోటీసులు, అభ్యంతరకర, అసభ్య సందేశాలు వెళ్తుంటాయి. ఈ యాప్స్ కేసులకు సంబంధించి సిటీ సైబ ర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్, గుర్గావ్ల్లోని కాల్ సెంటర్లపై దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఉద్యోగులనే డైరెక్టర్లుగా.. కలర్ ప్రిడెక్షన్ తరహా మరికొన్ని గేమింగ్స్ యాప్స్ నిర్వహించిన చైనా కంపెనీలు వాటిలో డైరెక్టర్లుగా తమ దేశీయుల్ని నియమించుకున్నాయి. అయితే ఈ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి వీటికి సంబంధించిన కాల్ సెంటర్లలో ఉద్యోగుల్నే డైరెక్టర్లుగా ఉంచుతున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపుతూ వీటిని రన్ చేస్తున్నాయి. గుర్గావ్లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 2, హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్టల్లోని 3 కాల్ సెంటర్లు 30 యాప్స్ కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ లియోఫంగ్ టె క్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రై.లి., పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రై.లి., నబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో బెంగళూరులో రిజిస్టరైన సంస్థల అధీనంలో నడుస్తున్నాయి. పంజగుట్టలోని కాల్ సెంటర్లో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న జీవన జ్యోతితో పాటు సెల్వరాజ్ సింగిలు లియోఫంగ్, హాట్ఫుల్లకు, రవికుమార్ మంగల, వెంకట్లు పిన్ ప్రింట్, నబ్లూమ్లకు డైరెక్టర్లుగా ఉన్నారు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) బెదిరింపులు.. బూతులతో.. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ, డిఫాల్టర్లను అడ్డంగా వేధిస్తున్న అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నిర్వాహకులు కాల్ సెంటర్ల ఉద్యోగుల ద్వారా వేస్తున్న వేషాలు అన్నీఇన్నీ కావు. బాధితుల్ని బెదిరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణా వద్దకు వచ్చాడు. అదే సమయంలో సదరు యాప్‌కు చెందిన కాల్ సెంటర్ నుంచి డబ్బు కట్టాలని, లేదంటే ‘తీవ్ర పరిణామాలు’ ఉంటాయని వాట్సాప్‌లో సందేశం వచ్చింది. దీనికి సమాధానంగా బాధితుడు తాను సైబర్ క్రైమ్ ఠాణా వద్ద ఉన్నాననే దానికి సూచికంగా ఆ స్టేషన్ బోర్డును ఫొటో తీసి షేర్ చేశాడు. ఇది చూసిన కాల్ సెంటర్ ఉద్యోగి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. (చదవండి: ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!) వెనకున్నది చైనీయులే..! దాదాపు నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన ఈ కాల్ సెంటర్ల వెనుక చైనీయులే ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన చైనా జాతీయురాలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వెళ్లింది. అలాగే గుర్గావ్లోని సెంటర్లకు నేతృత్వం వహించిన మరో చైనీయుడి పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ అధికారుల తనిఖీల్లో లభ్యమైంది. ఈ రెండింటితో పాటు ఇతర ఆధారాల నేపథ్యంలోనూ ఈ అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వెనుక చైనా జాతీయుల ప్రమేయమున్నట్లు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో 600 మంది, గుర్గావ్లోని వాటిల్లో 500 మంది టెలికాలర్స్‌గా ఉన్నారు. వీళ్లు కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా షిఫ్ట్‌ల వారీగా, 24 గంటలూ విధులు నిర్వర్తిస్తూ జకార్తా నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ సంస్థల్లోని ఉద్యోగులు ప్రతి 2–3 నెలలకు మారిపోతుండటం వెనుక ఏమైనా కారణముందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి లావాదేవీలు.. మైక్రో ఫైనాన్స్ యాప్స్ నిర్వాహకులు తమ ఆర్థిక లావాదేవీలూ తేలిగ్గా బయటపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వారికి నేరుగా జీతాలు చెల్లించట్లేదు. దీనికోసం ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశాయి. వారికి మరో థర్డ్ పార్టీ నుంచి యూఐపీ, నగదు రూపంలో డబ్బు పంపిస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి జరుగుతున్న ఈ లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా 30 యాప్స్‌కు సంబంధించిన 10 బ్యాంక్ ఖాతాలు, 80 వ్యాలెట్స్ గుర్తించారు. వీటిలోకి నగదు రాకపోకల్ని అధ్యయనం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా కార్యకలాపాలు నడుపుతున్న ఈ సంస్థలు 20 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి హోస్ట్ అవుతున్నాయి. గూగుల్ నిబంధనల ప్రకారం రీ పేమెంట్ పీరియడ్ 60 రోజులు. అయితే ఈ యాప్స్ మాత్రం వారం నుంచి పక్షం రోజుల్నే గడువుగా నిర్దేశించాయి. అందరూ నిందితులు కాదు.. ఈ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో 16 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి మంగళవారం గుర్గావ్, సిటీల్లోని కాల్ సెంటర్ల నుంచి బిందురాణి, జ్యోతి మాలిక్, అమిత్, రమణ్‌దీప్ సింగ్, ప్రభాకర్ ధంగ్వాల్, మధుబాబు సింగి, మనోజ్‌కుమార్ సింగి, మహేశ్ కుమార్ సింగి, తరుణ్, పవన్‌కుమార్, జీవన్ జ్యోతిలను అరెస్టు చేశారు. దాదాపు 700 ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఈ యాప్స్‌తో పాటు వాటి లావాదేవీలకు సంబంధించిన వ్యాలెట్స్ హోస్టింగ్‌కు సంబంధించి గూగుల్ సేవలు అందించే ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ఈ వ్యవహారాల్లో సూత్రధారులపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోపక్క ఈ కాల్సెంటర్లలో పనిచేస్తున్న అందరూ నిందితులు కాదని.. ఎవరైతే అసభ్య సందేశాలు పంపి ఉంటారో వారినే అరెస్టు చేస్తామని సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నుంచి వేధింపులు ఎదురైతే ‘100’కు లేదా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో లేదా స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఈ తరహా కేసులు దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ దందాలో ఎవరూ చిక్కవద్దని సూచించారు. -
లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టంట్ లోన్‌యాప్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్లో తనిఖీలు నిర్వహించి ఇన్స్టంట్ రుణాల పేరుతో పెనాల్టీగా అధిక మొత్తం వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీల్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ఆరుగురు ఆన్లైన్ లోన్ యాప్ కాల్‌సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సునీల్ కాల్‌డేటా ఆధారంగా వీరిని గుర్తించారు. ఇప్పటికే పలు ఆన్లైన్ యాప్ టెలీ కాలర్‌లందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. (యాప్ రుణానికి మరొకరు బలి ) హైదరాబాద్‌లో నిన్న (సోమవారం )3చోట్ల నిర్వహించిన దాడుల్లో 650 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరిపై 41 సీఆర్పీసీ కింద సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మద్యాహ్నం మూడు గంటలకు అడిషనల్ సిపి క్రైమ్స్ షికా గోయల్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆన్లైన్ యాప్స్ నిర్వహణలో ఆసక్తికర అంశాలను గుర్తించారు. కాల్‌సెంటర్ బయట ఉద్యోగులు కస్టమర్లతో పాటించాల్సిన నియమాలంటూ ఓ నోట్ ఉంచారు. ఇందులో కస్టమర్లను గౌరవించాలి, వారితో మర్యాదగా మాట్లాడాలని రాసి ఉంది. కానీ అందుకు పూర్తి విరుద్దంగా లోపల దందా జరుగుతుంది. అప్పు తీసుకున్న కస్టమర్లు గడువులోగా చెల్లించకపోతే కస్టమర్లను బూతుపురాణం తిడుతూ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎంత వసూలు చేస్తే కాల్ సెంటర్ ఉద్యోగులకు అంత ఇన్సెంటివ్‌లు ఇస్తుండటంతో ఉద్యోగులు కస్టమర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలువురు బాధితులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. (లోన్‌యాప్: తల్లి ఫొటోలు మార్ఫింగ్ ) -
లోన్‌యాప్: తల్లి ఫొటోలు మార్ఫింగ్
హైదరాబాద్ : అప్పుల యాప్ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుల యాప్ కథలు రోజుకొకటి బయటికొస్తూనే ఉంది. తాజా అప్పు తీసుకుని సకాలంలో వడ్డీ చెల్లించలేని కారణంగా తన తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన వివరాలిలా ఉన్నాయి.. సింగరేణికాలనీకి చెందిన దావులూరి సాయి అరవింద్ నవంబర్‌లో మై బ్యాంక్ ఋణయాప్ నుండి రూ.2,600 రుణంగా తీసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో వడ్డీతో కలిపి రూ.3,500 చెల్లించాడు. కొద్దిరోజుల తరువాత అదే యాప్ నుండి రూ.30,000 లోన్ తీసుకున్నాడు. ఆ రుణాన్ని వారంలోపు వడ్డీతో కలిసి రూ.55,000 చెల్లించాలనేది యాప్ నిబంధన. రెండోసారి తీసుకున్న అప్పును అరవింద్ సకాలంలో చెల్లించలేకపోయాడు. దాంతో యాప్ నిర్వాహకులు అరవింద్‌ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. అతని ఫోన్ నుంచి యాక్సెస్ చేసుకున్న కాంటాక్ట్ నంబర్లు, వాట్సప్ గ్రూపుల ద్వారా అతన్ని బహిరంగంగా అవమానించటం మొదలుపెట్టారు. అరవింద్ ఫొటోలను డీఫాల్టర్ అంటూ అతడి స్నేహితులకు షేర్ చేశారు. అతని ఫొటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేసి షేర్ చేశారు. అంతటితో ఆగని యాప్ నిర్వాహకులు అరవింద్ తల్లి ఫొటోలను అవమానకర రీతిలో మార్ఫింగ్ చేసి అతడి సన్నిహితుల నంబర్లతో క్రియేట్ చేసిన గ్రూపుల్లో పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. రుణం చెల్లిస్తానని చెప్పినా ఆలస్యమైనందున ప్రతీరోజుకు రూ.3000 వడ్డీ చెల్లించాలని షరతు పెట్టారు. వారి వ్యవహారశైలితో మనస్తాపం చెందిన అరవింద్ యాప్ నిర్వాహకులపై శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైదాబాద్ పోలీసులు మైయాప్ నిర్వాహకులపై ఐపీసీ 384, 420, 504, 506 ఏపీ తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ సెక్షన్ 3, 13 కింద కేసు నమోదు చేశారు. -
యాప్ రుణానికి మరొకరు బలి
-
యాప్ రుణానికి మరొకరు బలి
రాజేంద్రనగర్ : అప్పు ఇచ్చిన సంస్థ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్లైన్ యాప్‌ల నుంచి రూ.50 వేల రుణం తీసుకుని, అధికవడ్డీలు చెల్లించలేక మనోవేదనతో తనువు చాలించాడు. గుంటూరు మంగళ గిరికి చెందిన సునీల్(29) హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఆరునెలల కూతురుతో కలిసి రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో నివసిస్తున్నాడు. కరోనాతో ఉద్యోగం పోవడంతో.. కరోనా పరిణామాల నేపథ్యంలో సునీల్ ఉద్యోగం పోయింది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైన అతడు పలు ఆన్లైన్ యాప్‌ల ద్వారా మొత్తం రూ.50 వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. వీటితో పాటు సునీల్‌కు వ్యక్తిగతంగా మరో రూ.6 లక్షల అప్పు ఉంది. మూడు నెలల క్రితం స్వగ్రామంలో ఉన్న భూమిని విక్రయించి తల్లిదండ్రులు ఆ అప్పు చెల్లించారు. అనంతరం తండ్రి వెంకటరమణ సునీల్‌కి మరో రూ.లక్ష కూడా ఇచ్చాడు. అయితే, ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో పది రోజులక్రితం సునీల్ సైబర్ క్రైంకు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్వయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించగా సునీల్ వెళ్లలేదు. ఇదిలా ఉండగా, అతడికి మూడు రోజులక్రితం బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కంపెనీ నిర్వాహకులు కాల్ చేయగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఉద్యోగం మరొకరికి ఇవ్వండి’అని చెప్పి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. సునీల్ డిఫాల్టర్ అంటూ బంధువులకు మెసేజ్‌లు ఆన్లైన్లో అప్పులు ఇచ్చిన యాప్‌ల నిర్వాహకులు సునీల్ ఫోన్ డేటాను హ్యాక్ చేసి, అతడి స్నేహితులు, బంధువులకు ‘సునీల్ డిఫాల్టర్’అని అతడి ఫొటోతో మెసేజ్‌లు పంపారు. దీంతో సునీల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి భోజ నం చేసేందుకు రమ్మని సునీల్ భార్య తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో, కిటికీ లోంచి చూడగా అతడు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. -
రుణం కాకూడదు భారం!
‘మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. మన దేశంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు.. రుణం ఇచ్చే ముందు దరఖాస్తు దారుల నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని చెల్లింపుల సామర్థ్యంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ మొత్తాన్ని నికర ఆదాయం నుంచి మినహాయించి రుణ అర్హతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు రమణ ప్రతీ నెలా నికరంగా రూ.లక్ష చొప్పున వేతనం పొందుతున్నాడని అనుకుంటే.. అందులో 50 శాతం రూ.50,000 అవుతుంది. అయితే, అప్పటికే రమణ తన కారు కోసం రూ.10,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. దీంతో రమణ వద్ద మిగిలి ఉన్న రుణ చెల్లింపుల సామర్థ్యం రూ.40,000 అవుతుంది. ఈ విధంగా చూస్తే.. 9 శాతం వడ్డీ రేటుపై 15 ఏళ్ల కాలానికి రూ.40 లక్షల గృహ రుణాన్ని రమణ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఆదాయంలో 50 శాతానికి ఈఎంఐను ఖరారు చేస్తే.. మిగిలిన 50 శాతం నుంచి మీ ఖర్చులుపోను భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేసుకునేందుకు దాదాపు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో కొన్నింటి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కొనుగోళ్లను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఎత్తు పల్లాలను ఎదుర్కొనే వెసులుబాటు కూడా తగ్గిపోతుంది. అందుకే మీకున్న గరిష్ట రుణ అర్హత పరిధిలో ఎంత వరకు రుణం తీసుకుంటే.. నెల నెలా చెల్లింపులు చేయడం సౌకర్యంగా ఉంటుందన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీ జీవన వ్యయాలు, ప్రస్తుత ఈఎంఐల మొత్తంతోపాటు.. ఇతర లక్ష్యాల కోసం ఆదాయంలో 15–20 శాతం మేర పొదుపును మినహాయించిన తర్వాతే ఈఎంఐపై స్పష్టతకు రావాలి. విలువను పెంచుకునేందుకు.. పెట్టుబడి కోసం, ఆస్తి కొనుగోలు కోసమో రుణం తీసుకుంటుంటే అందులో ‘లాభం’ సూత్రం దాగుండాలి. తీసుకున్న రుణానికి చేస్తున్న ఖర్చులకు మించి ఆదాయం ఇచ్చేది అయితేనే ప్రయోజనం లభిస్తుంది. లేదా కనీసం మీ నికర విలువను పెంచే వాటిపై రుణాన్ని ఖర్చు చేసినా పయ్రోజనం సిద్ధిస్తుంది. మన దేశంలో రిటైల్ రుణాలపై (గృహ రుణం మినహా) వడ్డీ రేట్లు అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయి. ఈ రేట్లకు మించి పెట్టుబడులపై రాబడినిచ్చే సాధానాలు అరుదే. అయితే, తీసుకుంటున్న రుణాన్ని మీ నికర విలువను (నెట్‌వర్త్) తగ్గించేది కాకుండా పెంచేదానిపై ఇన్వెస్ట్ చేయడం మంచి విధానం అవుతుంది. ఇది ఎలా అంటారా..? భూమి కొనుగోలు, ఉన్నత విద్యార్హతల కోసం రుణం తీసుకోవడం. కొనుగోలు చేసిన భూమి విలువ పెరిగినా.. అదనపు విద్యార్హత అధిక ఆదాయానికి దారితీసినా మీ రుణ లక్ష్యం నెరివేరినట్టే. ఇలా కాకుండా రుణం తీసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో చూడముచ్చటగా ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్, స్మార్ట్‌ఫోన్, హోమ్ థియేటర్ సిస్టమ్స్ వంటివి కొనుగోలు చేశారనుకోండి.. కాలం గడుస్తున్న కొద్దీ అవి విలువను కోల్పోతాయి. వీటి వల్ల రెండు విధాలా నష్టం ఎదురవుతుంది. వీటి కోసం రుణం తీసుకోవడం వల్ల వడ్డీ రూపంలో నష్టం ఒకటి అయితే.. కొనుగోలు చేసిన ఈ వస్తువుల విలువ కొంత కాలానికి జీరోకి చేరుకోవడం మరో నష్టం. వినియోగం కోసం లేక వినోద అనుభవం కోసం రుణం తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అర్థం చేసుకోవాలి. కనీసం జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం తగినంత నిధిని సమకూర్చుకునే వరకు అయినా.. ఇటువంటి వినియోగ, వినోద, విలాసాల కోసం రుణానికి దూరంగా ఉండడం ఆరోగ్యకరం. సామర్థ్యాన్ని మించొద్దు.. వేతన జీవులకు ఏటా ఎంతో కొంత ఆదాయం పెరుగుతుండడం సహజం. అయి తే, కచ్చితంగా పెరుగుతుందని అన్ని సందర్భాల్లోనూ చెప్పలేము. సమీప కాలంలో ఆదాయం పెరుగుతుందన్న అంచనాతో అధిక ఈఎంఐను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పెరిగే వేతనంతో తొందరగా రుణ భారాన్ని తొలగించుకునే అవకాశాన్ని కోల్పోయినట్టవుతారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఉద్యోగ, వేతన కోతలను చవిచూస్తున్నారు. ఆర్థిక సంక్షోభాల్లోనూ లేదా విడిగా ఆయా కంపెనీలు సంక్షోభాల్లోకి వెళ్లిన సందర్భాల్లో ఉద్యోగులకు రిస్క్ ఏర్పడుతుంది. కనుక భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందన్న అంచనాలతో కాకుండా.. ప్రస్తుత చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. మెరుగైన ఆఫర్ రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నేడు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలకు దిగొస్తున్నాయి. బ్యాంకులు రెపో ఆధారిత రుణాలను 6–7 శా తానికే ఆఫర్ చేస్తున్నాయి. కనుక రుణం తీసుకునే ముందు పలు సంస్థలను సంప్రదించి తక్కువ రేటుకు రుణాన్ని పొందడం వల్ల చెల్లింపుల భారాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు. అధిక ఈఎంఐ రుణం తీసుకునే సమయంలో చాలా మంది ఈఎంఐపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. రుణమిచ్చే సంస్థలు చెల్లింపులు సౌకర్యంగా ఉండేందుకు.. దీర్ఘకాలానికి రుణాన్ని, తక్కువ ఈఎంఐపై ఆఫర్ చేస్తుంటాయి. కానీ, కాల వ్యవధిని (లోన్ టర్మ్) దీర్ఘకాలానికి నిర్ణయించడం వల్ల.. రుణ గ్రహీత కంటే రుణదాతకే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ చెల్లింపులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాలానికి 9 శాతం వడ్డీపై తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.50,713 అవుతుంది. దీంతో 15 ఏళ్ల కాలానికి చెల్లించే మొత్తం రూ.91.28 లక్షలు అవుతుంది. ఒకవేళ రుణ కాల వ్యవధి 20 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ రూ.44,986 అవుతుంది. కానీ, 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.1.07 కోట్లకు పెరుగుతుంది. 15 ఏళ్ల కాలంలో వడ్డీ రూపంలో చెల్లించేది రూ.41.2 లక్షలు అయితే, 20 ఏళ్ల కాలంలో రూ.57.9 లక్షలుగా ఉంటుంది. కనుక రుణం విషయంలో కాల వ్యవధిని పెంచుకోకుండా, ఈఎంఐ పెంచుకునే విషయమై బ్యాంకుతో సంప్రదింపులు చేసుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతూ పోతుంటే వాస్తవ ఈఎంఐకి అదనంగా వెసులుబాటు ఉన్నంత మేరకు చెల్లించుకోవడం ఇంకా మంచిది. -
అనిల్.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి
లండన్ : రుణ ఒప్పందంలో భాగంగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 717 మిలియన్ డారల్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 5446 కోట్లు) 21 రోజుల్లోగా చెల్లించాలంటూ రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి శుక్రవారం యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2012 లో రిలయన్స్ కామ్ మూడు చైనీస్ బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి అనిల్ అంబానీ తన వ్యక్తిగత హామీని సమర్పించారు. కాగా సంస్థ ఇప్పుడు దివాలా తీర్పులో ఉండడంతో వడ్డీతో తిరిగి పొందాలని బ్యాంకులు దావా వేసిన రుణంపై డిఫాల్ట్ అవడంతో సదరు బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. కాగా రిలయన్స్‌కు రుణం ఇచ్చిన మూడు చైనా బ్యాంకుల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ముంబై బ్రాంచ్), చైనా డెవలప్మెంట్ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు ఉన్నాయి.(అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు) లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉండడంతో లండన్ హైకోర్టులోని వాణిజ్య విభాగంలో జస్టిస్ నిగెల్ రిమోట్ హియరింగ్ ద్వారా శుక్రవారం విచారణ చేపట్టారు. రుణం తీసుకున్నప్పుడు అనిల్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ తీర్పునిచ్చారు. నిగెల్ చదివిన తీర్పులో హామీ యొక్క 3.2 నిబంధన ప్రకారం, రిలయన్స్ కామ్ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో హామీ ఇచ్చిన వ్యక్తే దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది దివాల చర్య చట్టం కింద వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. 21 రోజుల్లోగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకావం ఉందంటూ తీర్పునిచ్చారు. కాగా ఇంతకుముందు జరిగిన విచారణలో అంబానీ వాదనను కోర్టు తోసిపుచ్చింది.ప్రస్తుతం అనిల్ నికర విలువ సున్నాగా ఉండడంతో అతని కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు పొందే అంశంపై కోర్టు నిరాకరించింది. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక) -
మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!
కరోనా కారక సంక్షోభంలో రుణగ్రహీతలు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు రుణాల ఈఎంఐ చెల్లింపులపై విధించిన మారిటోరియాన్ని మరో మూడునెలలు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మొత్తం ఆరునెలల పాటు ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు కానుంది. ఇది కస్టమర్లకు కొంతమేర సంతోషం కలిగించే అంశమైనా, బ్యాంకులకు ఇబ్బందికలిగించే విషయమని, దీని కారణంగా డిఫాల్టులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు రిటైల్ కస్టమర్లకు ఆప్ట్అవుట పద్ధతిపై హోల్‌సేల్ కస్టమర్లకు ఆప్ట్ ఇన్ పద్దతిపై మారిటోరియం సదుపాయం కల్పిస్తున్నాయి. ఎంత ఉన్నాయి? బ్యాంకులవారీగా చూస్తే ప్రస్తుతం బంధన్‌బ్యాంకు ఇచ్చిన రుణాల విలువలో 71 శాతం మారిటోరియం కింద ఉన్నాయి. ఆర్బీఎల్ రుణాల విలువలో 35 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్బ్యాంకుల్లాంటి దిగ్గజాల రుణాల విలువలో 26-30 శాతం మేర మారిటోరియం కిందకు వస్తున్నాయి. 2008 సమయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో సాగు రంగంలో ఎన్పీఏలు 2012నాటికి 18 శాతానికి పెరిగాయి. నోట్లరద్దువేళ ఇచ్చిన మారిటోరియంతో ఎంఎఫ్‌ఐల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ప్రస్తుతం ఎకానమీ పూర్తిగా స్తంభించిందని, అన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల రుణాల చెల్లింపు మరింత ఆలస్యం కావచ్చంటున్నారు. ఎందుకు కష్టం? ఆరునెలల మారిటోరియం అనంతరం ఏడో నెల ఆరంభంలో రుణగ్రహీత ఆరునెలల వడ్డీని కలిపి చెల్లించాల్సిఉంటుందని, దీంతో చాలామంది కట్టకుండా ఎగ్గొట్టవచ్చని ప్రభుదాస్లీలాధర నిపుణుడు అజయ్ హెచ్చరించారు. వేతనాలు లేని ఈ వేళ అంతమొత్తం ఒకేసారి కట్టాలంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని, ఇది బ్యాంకుల పద్దులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈఎంఐల మారిటోరియం కన్నా రుణ పునర్వ్యవస్థీకరణకు ఆర్బీఐ అనుమతించిఉండాల్సిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆదాయ వనరు జీతమేనని, ఇప్పుడున్న సందర్భంలో సరైన వేతనాల్లేక పెద్ద మొత్తాలు కట్టడం ఇబ్బందిగామారి రిటైలర్లు ఎక్కువగా డిఫాల్ట్ కావచ్చని కొందరి అంచనా. ఇందుకే రిటైల్ రుణాలెక్కువున్న బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లాక్డౌన్ పూర్తయి ఎకానమీలో అన్ని కార్యకలాపాలు పుంజుకుంటేనే బ్యాంకులకు తగిలిన ఎదురుదెబ్బలపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలేంటీ మారిటోరియం? మార్చి ప్రకటన అనంతరం చాలామంది కస్టమర్లు ఈ సదుపాయం వినియోగించుకున్నట్లు బ్యాంకులు తెలిపాయి. ముఖ్యంగా అగ్రి, మైక్రో, కమర్షియల్ వాహనాలు, క్రెడిట్ కార్డుల బకాయిలకు మారిటోరియం విజ్ఞప్తులు అధికంగా వచ్చాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయాలు నిలిచిపోవడంతో కస్టమర్లు రుణ వాయిదాలు కట్టేందుకు ఇబ్బంది పడకూడదని ఆర్బీఐ ఈ వెసులుబాటు ఇచ్చింది. మారిటోరియం సదుపాయం వినియోగించుకున్న వాళ్లు ఈ వాయిదాలను తర్వాత కాలంలో చెల్లించాల్సిఉంటుంది. ఈ సదుపాయం వినియోగించుకొని వాయిదాలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. ఈ సదుపాయాన్ని ఈఎంఐ హాలిడే అని కూడా అంటారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత కస్టమర్లు తిరిగి ఈఎంఐలు చెల్లించేందుకు సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన
సాక్షి, ముంబై : వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, లాక్డౌన్ కరోనావైరస్ సంక్షోభంలో కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థికప్యాకేజీ పై స్పందించారు. తన రుణాలను 100 శాతం చెల్లిస్తాను అని చెప్పేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునే మాల్యా ఈసారీ అదే చేశారు. కోవిడ్-19 ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన మాల్యా తన దైన శైలిలో ట్వీట్ చేశారు. ఇక ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చు. కానీ తనలాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడం న్యాయమా అని వాపోయారు. వరుసగా తన అభ్యర్థనను తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. దయచేసి ఆ నగదును తీసుకొని తన కేసును క్లోజ్ చేయాలని మాల్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (వలస కార్మికుల కేటాయింపులపై చిదబరం వ్యాఖ్యలు) కాగా ఎస్బీఐ నేతృతంలోని బ్యాంకుల సముదాయానికి వేలకోట్ల రుణాలు ఎగవేసిన విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మనీలాండరింగ్ ఆరోపణల కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మాల్యాపై కేసులు నమోదు , ఆస్తుల స్వాధీనం లాంటి చర్యల్ని చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఈడీ చార్జిషీట్లను దాఖలు చేశాయి. అలాగే మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించిన కేంద్రం అతడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో లండన్ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న మాల్యా తన రుణాలను మొత్తం చెల్లిస్తానని, తన అభ్యర్థనను మన్నించాలని పలుసార్లు వేడుకుంటున్న సంగతి తెలిసిందే. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక) Congratulations to the Government for a Covid 19 relief package. They can print as much currency as they want BUT should a small contributor like me who offers 100% payback of State owned Bank loans be constantly ignored ? Please take my money unconditionally and close. — Vijay Mallya (@TheVijayMallya) May 14, 2020 -
అప్పు ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు
వారిద్దరూ అన్నదమ్ములు. వ్యాపార అవసరాలకు అప్పు కావాలని ఓ వ్యక్తిని సంప్రదించారు. నమ్మకం లేకపోతే పొలం తాకట్టు పెడతామని నమ్మించారు. అంతగా అడుగుతున్నారు కదా అని అతనికి జాలి కలిగింది. పొలం తాకట్టు పెట్టుకుని రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ తర్వాత వారి అసలు రూపం బయట పడింది. అప్పు తిరిగి చెల్లించకుండా ఇచ్చిన వ్యక్తినే అంతమొందించారు. నమ్మి రుణం ఇచ్చిన వ్యక్తిపై ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులుమంగళవారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆళ్లగడ్డ రూలర్: ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు కుమ్మరి శ్రీనివాసులు ఆచారి హత్య కేసు నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో డీఎస్పీ పోతురాజు వెల్లడించారు. పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన మూరబోయిన చంద్రమౌళి, సోదరుడు మూరబోయిన నాగరాజు తమ వ్యాపారం నిమిత్తం అదే గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాసులు ఆచారి వద్ద పొలం తాకట్టు పెట్టి ఆరు నెలల క్రితం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. మూడేళ్లలోపు డబ్బు చెల్లిస్తే పొలం వెనక్కి ఇచ్చేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. 20 రోజుల క్రితం చంద్రమౌళి మరో రూ.2లక్షలు శ్రీనివాసులు ఆచారి వద్ద అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి అప్పు ఎగ్గొట్టాలనే పన్నాగంతో శ్రీనివాసులు ఆచారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఉయ్యాలవాడకు చెందిన దూదేకుల సుభాన్‌బాషా, అతని తండ్రి దూదేకుల మాబుసుభాని, ఒగరు సుబ్రమణ్యంలతో రూ.2,40,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పు విషయం మాట్లాడదామంటూ ఫోన్.. ఈనెల 1న చంద్రమౌళి, నాగరాజు.. శ్రీనివాసులుఆచారికి ఫోన్ చేశారు. అప్పు విషయం మాట్లాడాలని, ఎక్కడ ఉన్నావని అడిగారు. తాను ఆళ్లగడ్డకు వెళ్తున్నాని, మళ్లీ మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇదే అదునుగా భావించి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్న ముగ్గురిని రప్పించుకుని ఐదుగురు కలిసి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. అక్కడ శ్రీనివాసులు ఆచారిని కలిశారు. మాట్లాడుకుందామంటూ పాతకందుకూరులోని గోపిరెడ్డి గోడౌన్ సమీపంలోని పంటకాలువ వద్దకు తీసుకెళ్లి పిడబాకులతో పొడిచి హత్య చేశారు. అనంతరం కాలువలో పడేసి వెళ్లారు. కేసును ఛేదించింది ఇలా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే ఉయ్యాలవాడకు చెందిన బడే మస్తాన్ పోలీసులకు లొంగిపోయాడు. చంద్రమౌళి, నాగరాజు తనకు రూ.20 వేలు ఇచ్చి శ్రీనివాసులు ఆచారిని బెదిరించాలని చెప్పారని, తాను అంగీకరించకపోవడంతో వేరేవారితో కలిసి హత్యకు కుట్ర పన్నారని, ఆ విషయం తనకు తెలియడంతో తనను కూడా హత్య చేసుకు ఇరికిస్తారేమోనని ముందుగానే లొంగిపోతున్నానని పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితులపై పోలీసులు నిఘా ఉంచారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉండగా వలపన్ని అరెస్ట్ చేశారు. కేçసును 10 రోజుల్లోనే ఛేదించినందుకు పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ సీఐ సుదర్శనప్రసాద్ పాల్గొన్నారు. -
బాకీ చెల్లించలేదని అనాగరిక చర్య..!
బెంగుళూరు : కర్ణాటకలో కొందరు వ్యక్తులు ఓ మహిళపట్ల అనారికంగా వ్యవహరించారు. బాకీ చెల్లించలేదనే కోపంతో ఓ మహిళను స్తంభానికి కట్టేసి చిత్రవధకు గురిచేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. రాజమణి (30) చామరాజన్ జిల్లాలోని కొల్లెగల్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అక్కడే ఓ చిన్న హోటల్‌ను, చిన్నమొత్తాలలో చీటీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కొందరు వ్యక్తులకు ఆమె రూ.50 వేలు బాకీ పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాకీ తిరిగి చెల్లించలేదు. దీంతో కొందరు వ్యక్తులు ఆమెను కరెంట్ స్తంభానికి కట్టేసి..చెప్పులు, కర్రలతో దాడిచేశారు. బాకీ ఎప్పుడు చెల్లిస్తావని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటనలో ప్రమేయమున్న ఏడుగురిని అరెస్టు చేశారు. -
కేరళ సీఎంకు రాహుల్ లేఖ
తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోగా.. వయనాడ్‌లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి రాహుల్ గాంధీ నియోజకవర్గ సమస్యలపై స్పందించారు. ఈ నెల 25న వయనాడ్‌కు చెందిన ఓ రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన రాహుల్ గాంధీ.. పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. రైతు ఆత్మహత్య విషయం తనకు ఎంతో బాధ కల్గించిందని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యను పట్టించుకోకుండా ఇలానే వదిలేస్తే.. త్వరలోనే మరింత మంది రైతులు ఇదే మార్గాన్ని ఎన్నుకుంటారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు కేరళ ప్రభుత్వం కృషి చేయాలని అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. -
‘అజ్ఞాతవాసి’ అరెస్టు!
సాక్షి, సిటీబ్యూరో: అందినకాడికి అప్పులు చేసి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతూ పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఓ ఘరానా మోసగాడిని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై నగరంలోని రెండు కమిషనరేట్లలో 20 కేసులు ఉండగా... ఐదు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడని, మరో ఏడు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన జి.మధుసూదన్‌రావు వృత్తిరీత్యా వ్యాపారి. బతుకుతెరువు నిమిత్తం 1984లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. 1994లో అబిడ్స్ ప్రాంతంలో షార్ప్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్లు నడిచిన ఇది ఆపై మూతపడింది. ఆపై పారామౌంట్ సర్వైలెన్సెస్ పేరుతో మరో సంస్థను తెరిచాడు. వివిధ సంస్థలకు మానవ వనరులను అందించే వ్యాపారం నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే అనేక మందికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి భారీగా అప్పులు తీసుకున్నాడు. రూ.5 కోట్ల వరకు చేరిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఇతడి చెక్కులను బ్యాంకుల్లో వేసుకోగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో ఇతడిపై హైదరాబాద్, రాచకొండల్లోని వివిధ ఠాణాల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఇప్పటి వరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో అరెస్టు అయిన మధుసూదన్‌రావు బెయిల్‌పై వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకావట్లేదు. ఈ నేపథ్యంలో ఇతడిపై ఏడు నాన్–బెయిలబుల్ వారెంట్లు, ఐదు బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో పాటు మరో ఐదు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. దాదాపు ఏడాది కాలంగా పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మధుసూదన్‌రావు ఎవరికీ దొరకట్లేదు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటైన బృందం ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు సోమవారం పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించింది. -
నమ్మించి మోసం చేశాడయ్యా..
సాక్షి, సంబేపల్లె: అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడయ్యా అని మహిళలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలోని కెకె హరిజనవాడ, కడియాలవాండ్లపల్లె, బండకాడ రాజువారిపల్లె, దిగువరాజువారిపల్లె, హరిజనవాడ, చిన్నబిడికి, మొరంవడ్డెపల్లె, కొత్తవడ్డెపల్లె, నాగిరెడ్డిగారిపల్లె, తాటిగుంట హరిజనవాడ, బుర్రవాండ్లపల్లె, గాలివీటిఇండ్లు, పాలెంగడ్డ పాపన్నగారిపల్లె, హరిజనవాడ, దండూరివాండ్లపల్లె, పెద్దబిడికిలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను, మిథున్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తమకు సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని వాపోయారు. చెప్పిన ప్రకారం రుణాలను మాఫీ చేయకుండా మూలధనం, పసుపు–కుంకుమ పేరుతో మభ్యపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లించక తమను మోసగించాడని, మోసాల బాబును నమ్మమని వారు శ్రీకాంత్‌రెడ్డికి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీపై తమకు నమ్మకం ఉందన్నారు. ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటున్నారని మాట్లాడి తమను అవమానపరిచాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని శెట్టిపల్లె గ్రామంలోని దళితులు ఎమ్మెల్యేకి వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిదంబర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, నాయకులు లక్ష్మీకర్‌రెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి, అనిరు«ధ్‌రెడ్డి, ఆనందకుమార్రెడ్డి, బుల్లి వెంకటరమణ, లక్ష్మణనాయక్, శివయ్య, శ్రీనునాయక్, మహేంద్రనాయక్, వెంకటరమణనాయక్, నరసింహారెడ్డి, నాగూనాయక్, రామాంజులు, నాగయ్య, ప్రభాకర్‌నాయుడు, జనార్ధననాయుడు, శ్రీరాములు, వీరమల్లు పాల్గొన్నారు. -
పెళ్లి అప్పులు తీర్చేందుకు చోరీల బాట
మీర్‌పేట: కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులను తీర్చేందుకు ఓ తండ్రి దొంగగా మారిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, బిజినేపల్లికి చెందిన వంగూరు శ్రీనివాసచారి కార్పెంటర్‌గా పని చేసేవాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చిన అతను కుటుంబంతో సహా కర్మన్‌ఘాట్ శక్తినగర్‌లో ఉంటున్నాడు. ఆరేళ్ల క్రితం అతను కుమార్తె వివాహం నిమిత్తం అప్పులు చేశాడు. వృత్తిలో ఆదాయం లేకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేశించాడు. రాత్రి వేళల్లో ఫంక్షన్‌హాళ్ల వద్ద చిన్నారులకు మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించేవాడు. ఈ తరహాలో కర్మన్‌ఘాట్‌లోని వంగ శంకరమ్మ గార్డెన్స్, స్వాగత్‌గ్రాండ్ ఫంక్షన్‌హాళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో నిందితుడు శ్రీనివాసచారిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.1.70 లక్షల విలువైన 5.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ 40,400 కోట్లు రాబట్టాయి : ఆర్బీఐ నివేదిక
సాక్షి, ముంబై : దివాలా చట్టానికి కోరలుతేవడం, సర్ఫేసి చట్ట సవరణలతో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు ఒత్తడికి లోనయ్యే రుణాల రికవరీలో గణనీయ పురోగతి సాధించాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మార్చి 2018తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ 40,400 కోట్ల రాని బాకీలను వసూలు చేశాయని ఇవి 2017 ఆర్థిక సంవత్సరంలో రూ 38,500 కోట్లుగా నమోదయ్యాయని ఈ నివేదిక తెలిపింది. దివాలా చట్టం (ఐబీసీ), సర్ఫేసి చట్టం, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, లోక్ అదాలత్ వంటి వివిధ మార్గాల్లో బ్యాంకులు మొండి బకాయిలు, రాని బాకీలను పరిష్కరించుకున్నాయని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా బ్యాంకులు రూ 4900 కోట్ల మేర రాని బాకీలను వసూలు చేయగా, సర్ఫేసి చట్టం ద్వారా రూ 26,500 కోట్లను రాబట్టాయని 2017-18లో బ్యాంకింగ్ ధోరణలు, పురోగతిపై ఆర్బీఐ ఈ వారాంతంలో విడుదల చేసిన వార్షిక నివేదికలో పొందుపరిచింది. మొండి బకాయిల సత్వర వసూలుకు సర్ఫేసి చట్టాన్ని సవరిస్తూ బాకీ దారు 30 రోజుల్లోగా తన ఆస్తుల వివరాలను వెల్లడించకుంటే మూడు నెలల జైలు శిక్షతో పాటు పలు కఠిన నిబంధనలు విధించడంతో రుణాల వసూలు ప్రక్రియ వేగవంతమైందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. మరోవైపు బకాయిదారు ఆస్తుల వివరాలతో నిర్ధేశిత గడువులోగా ముందుకు రాకుంటే తనఖాలో ఉంచిన ఆస్తులను ఆయా బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చనే నిబంధన కూడా రుణాల సత్వర వసూళ్లకు ఊతమిస్తోందని పేర్కొంది. ఇక ఐబీసీ ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు అధికంగా వసూలవుతున్నాయని వెల్లడించింది. మొండి బకాయిలు, రాని బాకీల వసూళ్లలో ఐబీసీ ముఖ్యమైన మార్గంగా ఉపకరిస్తోందని తెలిపింది. -
చిన్న ఫ్లాట్లకే ఆదరణ
రెరా, జీఎస్టీ, ఎన్నికల వాతావరణం.. ఇవేవీ కావు ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదని చెప్పడానికి! సరైన ప్రాంతంలో చిన్న సైజు ఫ్లాట్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ విక్రయాలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొనుగోలుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి, చిన్న ఫ్లాట్లను కడితే.. గిరాకీకి ఢోకా ఉండదు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఎక్కువగా ఆధారపడేది ఐటీ ఉద్యోగుల మీదనే. కానీ, నగరంలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే 70 శాతం ఉద్యోగుల నెల జీతం రూ.35 లక్షలలోపే ఉంటుంది. వీరిలో ఎంత శాతం మంది రూ.25 లక్షల ఫ్లాట్లను కొనగలిగే ఆర్థిక స్థోమత ఉంటారన్న విషయాన్ని నిర్మాణ సంస్థలు అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో కనీసం ఆరేళ్ల వరకూ అనుభవం ఉన్నవాళ్లే సొంతిల్లు కొనాలన్న ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే? అప్పటికే పెళ్లి కావటం.. స్థిరమైన నివాసం కోసం ప్రణాళికలు చేస్తుంటారు గనక! పైగా అడ్వాన్స్ సొమ్ము రూ.5–6 లక్షల వరకు పెట్టగలరు కాబట్టి పాతిక లక్షల లోపు ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దురదృష్టం ఏంటంటే? నగరంలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతంలో రూ.25 లక్షల లోపు దొరికే ఫ్లాట్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే సుమారు రూ.30–35 లక్షల వరకు రేటు పెట్టి ఇల్లు కొనేందుకు సాహసం చేస్తున్నారు. కానీ, వీళ్ల సంఖ్య కొద్ది శాతమే. ►ఏడాదికి రూ.10–13 లక్షల వేతనం గల వారు నగర ఐటీ సంస్థల్లో ఇరవై శాతం వరకుంటారు. వీరు దాదాపు రూ.30 లక్షల రుణం తీసుకొని ఇళ్లను కొనగలరు. మార్జిన్ మనీ రూ.6–7 లక్షల వరకూ జేబులో నుంచి పెట్టుకొని రూ.35 లక్షల దాకా ఇంటి కోసం వెచ్చించగలరు. కాకపోతే ఈ రేటుకు హైటెక్ సిటీ, గచ్చిబౌలికి చేరువలో పూర్తయిన గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు దొరకడం కష్టం. ►దాదాపు 6–9 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్న వారిలో ఎక్కువ మంది అప్పటికే ఎక్కడో ఒక చోట ఇళ్లను కొనేసి ఉంటారు కాబట్టి వీరిలో పెట్టుబడి కోణంతో ఇళ్లను కొనేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే రూ.50 లక్షల ఫ్లాట్లయినా కొనగలిగే స్థాయి ఉంటుంది. ►ఐటీ రంగంలో 9–12 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు నగరంలో 10 శాతానికి మించి ఉండదు. వీరి జీతభత్యాలు ఏడాదికి రూ.15 లక్షల పైన ఉన్నప్పటికీ ఫ్లాట్ కోసం రూ.40 లక్షల వరకూ వెచ్చించగలుగుతారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ వేతనజీవులైతే మరొక పది వరకు వెచ్చించగలరు. ఇప్పటికైనా కొత్తగా నిర్మాణాలు చేపట్టే నిర్మాణ సంస్థలు కొనుగోలుదారుల ఆర్థిక స్థోమతను ముందుగా అంచనా వేసి ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ లేకపోయినా 3 పడక గదుల ప్రాజెక్ట్‌లను ప్రారంభించి చేతులు కాల్చుకునే బదులు తక్కువ విస్తీర్ణంలో బడ్జెట్ ఫ్లాట్లను నిర్మించడం ఉత్తమం. -
అప్పు తీర్చనందుకు 14 ఏళ్ల వనవాసం
తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవులకు వెళ్లాడు. జూదంలో ఓడి పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం కూడా చేశారు. కానీ.. కేవలం రూ. 50 వేల అప్పు తీర్చలేక ఓ వ్యక్తి ఈ ఆధునిక కాలంలో కూడా 14 ఏళ్ల పాటు వనవాసం చేయాల్సి వచ్చింది. అంతేకాదు, తనకున్న 2.29 ఎకరాల భూమి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో జరిగింది. చంద్రశేఖర గౌడ (43) 1999 సంవత్సరంలో నెల్లూరు కెమరాజె సహకార సంఘం నుంచి రూ. 50,400 అప్పు తీసుకున్నారు. ఆ అప్పును ఆయన తీర్చలేకపోవడంతో సొసైటీ ఆయనకు చెందిన 2.29 ఎకరాల భూమిని 2002లో రూ. 1.20 లక్షలకు వేలం వేసింది. పొలంలోనే ఉన్న ఆయన ఇంటిని కూల్చేశారు. చివరకు ఏమీ చేయలేక ఆయన దాదాపు 14 ఏళ్ల పాటు అడవుల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సులియా సమీపంలోని అడవులకు వెళ్లిన ఆయన.. ఓ సెకండ్ హ్యాండ్ కారు తీసుకుని, దాన్నే తన ఇంటిగా మార్చుకున్నారు. అక్కడ బుట్టలు అల్లుకుని ఆయన జీవనం కొనసాగించారు. ప్రతి రోజూ అడవి నుంచి 21 కిలోమీటర్ల దూరం నడిచి సులియా వెళ్లి, తాను అల్లిన బుట్టలను ఒక్కోటీ రూ. 40 వంతున అమ్ముతున్నారు. గౌడ కష్టాలు చూసి చలించిన జిల్లా అధికారులు ఆయనకు పునరావాసం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. -
'రజనీ నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేయలేదు'
చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ నుంచి డబ్బు గుంజాలని తానెప్పుడూ ప్రయత్నించలేదని ఫైనాన్సియర్ బొర్రా ముకుల్‌చంద్ వెల్లడించారు. ఫైనాన్సియర్ ....నటుడు, ధనుష్ తండ్రి దర్శక నిర్మాత కస్తూరిరాజాపై చెక్కు మోసం కేసులో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ పేరు చెప్పి అప్పు తీసుకుని మోసం చేసినట్లు ఆ పిటీషన్లో పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంపై నటుడు రజనీకాంత్ బొర్రాపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో బొర్రా తన పరువుకు భంగం కలిగించే విధంగాను, తననుంచి డబ్బు గుంజే ప్రయత్నంలో భాగంగా కోర్టులో పిటీషన్లో తన పేరును పేర్కొనట్లు తెలిపారు. ఈ విషయం ఫైనాన్షియర్ బొర్రా నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తానెప్పుడూ రజనీ నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేయలేదని, ఆయన పేరును ఉపయోగించి దర్శకుడు కస్తూరిరాజా అప్పు తీసుకుని మోసం చేశారని మాత్రమే అన్నానని తెలిపారు. తాను డబ్బు తిరిగి చెల్లించలేదంటే రజనీకాంత్ ఇస్తారని కస్తూరిరాజా అన్నారని చెప్పారు. రజనీకాంత్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని బొర్రా హెచ్చరించారు. -
బకాయిదారుల ఇళ్ల వద్ద ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ధర్నా
-
బకాయిదారుల ఇళ్ల వద్ద ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ధర్నా
విజయవాడ: ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు వినూత్నంగా నిరసనకు దిగారు. మొండి బకాయిదారుల ఇళ్ల ముందు విజయవాడ సత్యానారాయణపురం ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. రూ.కోట్లలో లోన్లు తీసుకుని కట్టడం లేదంటూ ఉద్యోగులు ఆరోపించారు. సుమారు రూ.52కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. లోన్లు కట్టేవరకూ తాము ఇలాగే ధర్నాలు చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు స్పష్టం చేశారు. మరోవైపు నల్లగొండ జిల్లా కోదాడలో మొండి బకాయిల రికవరీ కోసం ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు శాంతి ర్యాలీ నిర్వహించారు.