
బెంగుళూరు : కర్ణాటకలో కొందరు వ్యక్తులు ఓ మహిళపట్ల అనారికంగా వ్యవహరించారు. బాకీ చెల్లించలేదనే కోపంతో ఓ మహిళను స్తంభానికి కట్టేసి చిత్రవధకు గురిచేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. రాజమణి (30) చామరాజన్ జిల్లాలోని కొల్లెగల్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అక్కడే ఓ చిన్న హోటల్‌ను, చిన్నమొత్తాలలో చీటీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కొందరు వ్యక్తులకు ఆమె రూ.50 వేలు బాకీ పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాకీ తిరిగి చెల్లించలేదు. దీంతో కొందరు వ్యక్తులు ఆమెను కరెంట్ స్తంభానికి కట్టేసి..చెప్పులు, కర్రలతో దాడిచేశారు. బాకీ ఎప్పుడు చెల్లిస్తావని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటనలో ప్రమేయమున్న ఏడుగురిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment