
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలు) తగ్గించుకునేందుకు మోసాలు, ఉద్దేశ పూర్వక రుణ ఎగవేత కేసుల్లో వేగవంతంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. వృద్ధి మార్గాన్ని ఇదే మాదిరిగా ఇకముందూ కొనసాగించాలని సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు 2021–22 వరకు క్రితం ఆరేళ్లలో రూ.11.17 లక్షల కోట్ల ఎన్‌పీఏలను మాఫీ చేశాయి.
నాలుగేళ్ల కాలం పాటు ఎన్‌పీఏలుగా కొనసాగి, వాటికి నూరు శాతం కేటాయింపులు చేసిన వాటిని బ్యాంక్‌లు మాఫీ చేసి, బ్యాలన్స్ షీట్ల నుంచి తొలగిస్తుంటాయి. అయినా కానీ, ఆ తర్వాత కూడా వాటి వసూలుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి. ఇటీవలే పీఎస్‌బీల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత రిస్‌్కలను అధిగమించేందుకు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు.
బలమైన అంతర్గత ఆడిట్ కార్యాచరణను అనుసరించాలని సూచించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు రుణాలు, తక్కువ వ్యయ డిపాజిట్ల విషయంలో క్రమంగా తమ మార్కెట్ వాటాను కోల్పోతుండడం తదితర సవాళ్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. నికర వడ్డీ మార్జిన్లపైనా ఆందోళన వ్యక్తమైనట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. అధిక ఈల్డ్ వచ్చే రుణ విభాగాలపై దృష్టి సారించాలని, ఫీజులు పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలన్న సూచన వచి్చనట్టు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment