
పౌరులపై ఆర్థికభారం పడనీయం
రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. సాధారణ బడ్జెట్(General budget)పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘‘వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.22 శాతంగా ఉంటే జనవరికల్లా దానిని 4.31 శాతానికి తగ్గించాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగొస్తోంది’’ అని మంత్రి నిర్మల అన్నారు.
ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విపక్ష, అధికార ఎన్‌డీఏ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మోదీ సర్కార్ ఏ ఒక్క రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని నిర్మల బదులిచ్చారు. అయినా విపక్ష సభ్యులు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందలేదు. తర్వాత పలు విపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతర్జాతీయంగా అనిశ్చితి
‘‘అభివృద్ధిని పరుగుపెట్టించే లక్ష్యంతో బడ్జెట్‌కు తుదిరూపునిచ్చాం. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ భరోసానిస్తుంది. ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల ఊతం అందిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందేగానీ తగ్గుదల ఉండబోదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్ రూపకల్పన జరిగింది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధుల కేటా యింపులు తగ్గాయి.
పరిస్థి తులు మారుతున్నా అత్యంత కచ్చితత్వంతో ముందస్తు బడ్జెట్ అంచనాలు వేశాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తు న్నాం. అంతర్జాతీయ పరిస్థి తులు ఎప్పటికప్పుడు మా రుతుండటంతో ఎల్లప్పుడూ ఒకే వ్యూహం పనికిరాదు. అనిశ్చితి రాజ్య మేలుతుండటంతో మన దిగుమతులపై దాని పెను ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెల కొన్న అస్తవ్యస్త ధోరణి మన ఆర్థికాభివృద్ధి పథంలో అవరోధంగా మారుతోంది. ద్రవ్యో ల్బణం కారణంగా టమాటా, ఉల్లి, బంగాళా దుంప చివరకు పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
అననుకూల వాతావరణం కారణంగా దిగుబడులు తెగ్గోసు కుపోవడంతో ఆహార ద్ర వ్యోల్బణం కట్టుతప్పుతోంది. సరుకు రవాణా గొలు సుల్లో ఏవైనా ఆటంకాలుంటే వెంటనే కేంద్ర మంత్రుల బృందం రంగంలోకి దిగి సమయానికి విదేశీ దిగుమతులు వచ్చేలా చూస్తోంది’’ అని నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత బడ్జెట్ తొలిసెషన్‌లో భాగంగా రాజ్యసభను వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ ౖచైర్మన్ హరివంశ్ ప్రకటించారు. మార్చి పదో తేదీ ఉదయం 11 గంటలకు మళ్లీ రాజ్యసభ కార్యకలాపాలు మొదలుకానున్నాయని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment