Retail inflation
-
ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. సాధారణ బడ్జెట్(General budget)పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘‘వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.22 శాతంగా ఉంటే జనవరికల్లా దానిని 4.31 శాతానికి తగ్గించాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగొస్తోంది’’ అని మంత్రి నిర్మల అన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విపక్ష, అధికార ఎన్డీఏ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మోదీ సర్కార్ ఏ ఒక్క రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని నిర్మల బదులిచ్చారు. అయినా విపక్ష సభ్యులు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందలేదు. తర్వాత పలు విపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.అంతర్జాతీయంగా అనిశ్చితి‘‘అభివృద్ధిని పరుగుపెట్టించే లక్ష్యంతో బడ్జెట్‌కు తుదిరూపునిచ్చాం. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ భరోసానిస్తుంది. ప్రైవేట్ రంగానికి పెట్టుబడుల ఊతం అందిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందేగానీ తగ్గుదల ఉండబోదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్ రూపకల్పన జరిగింది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధుల కేటా యింపులు తగ్గాయి. పరిస్థి తులు మారుతున్నా అత్యంత కచ్చితత్వంతో ముందస్తు బడ్జెట్ అంచనాలు వేశాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తు న్నాం. అంతర్జాతీయ పరిస్థి తులు ఎప్పటికప్పుడు మా రుతుండటంతో ఎల్లప్పుడూ ఒకే వ్యూహం పనికిరాదు. అనిశ్చితి రాజ్య మేలుతుండటంతో మన దిగుమతులపై దాని పెను ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెల కొన్న అస్తవ్యస్త ధోరణి మన ఆర్థికాభివృద్ధి పథంలో అవరోధంగా మారుతోంది. ద్రవ్యో ల్బణం కారణంగా టమాటా, ఉల్లి, బంగాళా దుంప చివరకు పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అననుకూల వాతావరణం కారణంగా దిగుబడులు తెగ్గోసు కుపోవడంతో ఆహార ద్ర వ్యోల్బణం కట్టుతప్పుతోంది. సరుకు రవాణా గొలు సుల్లో ఏవైనా ఆటంకాలుంటే వెంటనే కేంద్ర మంత్రుల బృందం రంగంలోకి దిగి సమయానికి విదేశీ దిగుమతులు వచ్చేలా చూస్తోంది’’ అని నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత బడ్జెట్ తొలిసెషన్లో భాగంగా రాజ్యసభను వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ ౖచైర్మన్ హరివంశ్ ప్రకటించారు. మార్చి పదో తేదీ ఉదయం 11 గంటలకు మళ్లీ రాజ్యసభ కార్యకలాపాలు మొదలుకానున్నాయని ఆయన చెప్పారు. -
దిగొస్తున్న ధరలు
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరల క్షీణతతో జనవరిలో మరికాస్త తగ్గి 4.31 శాతానికి పరిమితమైంది. ఇది అయిదు నెలల కనిష్టం. చివరిసారిగా 2024 ఆగస్టులో ఇది 3.65 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది జనవరిలో 5.1 శాతంగాను, డిసెంబర్లో 5.22 శాతంగాను ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం జనవరిలో ఆహార పదార్థాల బాస్కెట్ ద్రవ్యోల్బణం 6.02 శాతంగా ఉంది. గత ఆగస్టులో నమోదైన 5.66 శాతం తర్వాత ఇది కనిష్టం. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినట్లు ఎన్ఎస్వో తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్బీఐ త్వరలో మరోసారి కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. -
నాలుగు నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
భారత రిటైల్ ద్రవ్యోల్బణం(inflation) 2024 డిసెంబర్లో గణనీయంగా క్షీణించి నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. నవంబర్‌లో 5.48 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.22 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదలే(decline) ఇందుకు ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 9.04% నుంచి డిసెంబర్లో 8.39%కి పడిపోయింది.మెరుగైన సరఫరా, అంతర్జాతీయ పరిణామాల్లో మార్పులు డిసెంబర్లో ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని ఎంఓఎస్పీఐ పేర్కొంది. అయినప్పటికీ కూరగాయలు, పండ్లు, వంట నూనెలు వంటి కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు భారీగానే ఉన్నాయని అభిప్రాయపడింది. ఆహార ధరలను ప్రధాన కారణంగా పేర్కొంటూ ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. ఈసారి ద్రవ్యోల్బణం మొత్తంగా తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా 5.76%, పట్టణ ప్రాంతాల్లో 4.58% ద్రవ్యోల్బణం ఉంది. ఆర్బీఐ లక్ష్యం ప్రకారం ఇది 4 శాతానికి మించకూడదు.వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లో గరిష్టంగా 7.79 శాతం నమోదైనప్పటి నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తూ వడ్డీ రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం పరిధిలో ఉంచాలని ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఆర్థిక అస్థిరతల వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గత 11 విధాన పరపతి సమావేశాల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చకుండా స్థిరంగా రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచింది.ఇదీ చదవండి: మస్క్‌కు ప్రభుత్వం ఆహ్వానంప్రస్తుత ఆర్థిక ఒడిదొడుకుల్లో ద్రవ్యోల్బణం తగ్గడం శుభపరిణామమే. కానీ అస్థిరమైన ఆహార ధరలు, ఆర్థిక ప్రతికూలతల వల్ల భవిష్యత్తులో సవాళ్లు తప్పవు. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్న నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐ ఈసారి జరగనున్న మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో కీలకంగా వ్యవహరిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
నవంబర్‌లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్‌లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.తగ్గుతున్న పంటల సాగుదేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టంభౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఆహార ద్రవ్యోల్బణం కీలకంఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ధరలకు రెక్కలు..
న్యూఢిల్లీ: భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో బెంబేలెత్తించింది. 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2%గా నమోదైంది. ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. ⇒ ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెలలో 10.87 శాతం పెరిగింది. ⇒ దేశ వ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.2% ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా, పట్టణ ప్రాంతాల్లో 5.62 శాతంగా నమోదయ్యింది. ⇒1,114 పట్టణ, 1,181 గ్రామీణ మార్కెట్లలో ధరలను వారంవారీగా విశ్లేషించి జాతీయ గణాంకాల కార్యాలయం నెలవారీ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేస్తుంది. -
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24 శాతంగా ఉండేది. అక్టోబర్‌లో ఇది ఏకంగా 10.87 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబరులో నమోదైన 5.87 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో 6.68 శాతానికి చేరింది. పట్టణ ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో 5.05 శాతం నుంచి 5.62 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.81-6 శాతానికి చేరువగా ఉంటుందని రాయిటర్స్ పోల్ ఇటీవల అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా గణాంకాలు వెలువడ్డాయి.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!భగ్గుమంటున్న కూరగాయలువంట సామగ్రి, కూరగాయలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఉల్లిపాయ హోల్‌సేల్ ధరలు కిలోగ్రాముకు రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. -
ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగనుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన 5.5 శాతం ద్రవ్యోల్బణం కంటే అక్టోబర్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల్లో అస్థిరత నెలకొంది. కానీ భారత ఎకానమీని స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ సమర్థంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రధానంగా రెండు అంశాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి యూఎస్ ఎన్నికల ఫలితాలు. మరొకటి ఆర్థిక విధాన మద్దతుకు సంబంధించి చైనా నుంచి ప్రకటనలు వెలువడడం. ఆర్థిక వృద్ధికి ప్రతికూల అంశాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు ఆర్బీఐ 70కి పైగా హైస్పీడ్ ఇండికేటర్లను ట్రాక్ చేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్షరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు–రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
వడ్డీ రేట్ల తగ్గింపు తొందరపాటే
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్‌గా మారుతుందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు. ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్ 6న జరగనుంది. బ్లూంబర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ అంశాలను ప్రస్తావించారు. సెపె్టంబర్ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్‌్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్సర్వ్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ తదితర సంస్థలపై తాజాగా ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
రేటు తగ్గింపునకు తొందరలేదు..!
సింగపూర్: రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలలుగా పూ ర్తిగా అదుపులోనికి వచి్చనప్పటి కీ, రేటు తగ్గింపునకు తొందరపడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఈ దిశలో (రేటు తగ్గింపు) నిర్ణయానికి ఇంకా చాలా దూరం ఉందని ఆయన అన్నారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ ఫోరమ్ 2024’లో దాస్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. → 2022లో గరిష్ట స్థాయి 7.8% వద్ద ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 4% లక్ష్యం దిగువకు చేరింది. అయితే ఇందుకు అనుగుణంగా నిర్ణయాలు (రేటు తగ్గింపు) తీసుకోడానికి ఇంకా చాలా దూరం ఉంది. మరోవైపు (సరళతర ద్రవ్య విధానాల వైపు) చూసే ప్రయత్నం చేయలేము. → ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం చాలా వరకు కష్ట నష్టాలను తట్టుకుని నిలబడుతున్నప్పటికీ, ద్రవ్యో ల్బణం చివరి మైలు లక్ష్య సాధన సవాలుగానే ఉందని పలుసార్లు నిరూపణ అయ్యింది. ద్రవ్యోల్బణం సవాళ్లు ఆర్థిక స్థిరత్వ ప్రమాదాలకు దారితీస్తాయి. → ద్రవ్యోల్బణం కావచ్చు... ప్రతిద్రవ్యోల్బణం కావచ్చు. సమస్య తీవ్రమైనది. ఈ పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సడలించడంలో జాగ్రత్త అవసరం. కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన నిర్వహణలో వివేకం ఉండాలి. మరోవైపు సరఫరా వైపు ప్రభుత్వం చర్యలు చురుకుగా ఉండాలి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ నుండి సరళతర పాలసీ సంకేతాల నేపథ్యంలో రేటు తగ్గింపులకు సంబంధించి మార్కెట్ అంచనాలు ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే పాలసీల మార్పు విషయంలో అన్ని విషయాలను విస్తృత స్థాయిలో పరిగణనలోని తీసుకుంటూ, ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిని అనుసరించని సెంట్రల్ బ్యాంకులు– తమ దేశీయ ద్రవ్యోల్బణం–వృద్ధి సమతుల్యత అంశాలపై నిఘా ఉంచి తగిన పాలసీ ఎంపిక చేసుకోవాలి. భారత్ వృద్ధిలో వినియోగం, పెట్టుబడుల కీలక పాత్ర భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆయన వ్యాఖ్యానిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, ద్రవ్యోలోటు, కరెంటు అకౌంట్ లోటు వంటి అంతర్లీన పటిష్టతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ పురోగతిలో – ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని దాస్ విశ్లేíÙంచారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బయటకు వచి్చందని, 2021–24 మధ్య సగటు వాస్తవ జీడీపీ వృద్ధి 8 శాతం కంటే అధికంగా నమోదైందని గవర్నర్ పేర్కొన్నారు. ద్రవ్య పటిష్టతతోపాటు ప్రభుత్వ భారాలు తగ్గుతుండడం సానుకూల పరిణామమన్నారు. కార్పొరేట్ పనితీరు పటిష్టంగా కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్బీఐ నియంత్రించే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు కూడా బలపడ్డాయని గవర్నర్ తెలిపారు. అన్ని స్థాయిల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం ప్రపంచ పురోగతికి కీలకమని భారత్ భావిస్తున్నట్లు తెలిపారు. 2023లో భారత జీ20 ప్రెసిడెన్సీ, దాని తర్వాత ప్రపంచ దేశాలతో నిరంతర సహకార విధానాలను పరిశీలిస్తే, ఆయా అంశాలు ‘ప్రపంచం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే న్యూ ఢిల్లీ దృష్టిని ప్రతిబింబిస్తాయని దాస్ వివరించారు. పరస్పర సహకారంతోనే ప్రపంచ పురోగతి 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుళజాతి అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం, ఉత్పాదకత లాభాలను సాధించడం, మధ్య–ఆదాయ దేశాలకు రుణ పరిష్కారం వంటివి భారత్ ప్రాధాన్యతలలో కొన్నని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ అభివృద్ధి మెరుగుదల కోసం రాబోయే దశాబ్దాలలో ప్రపంచ క్రమాన్ని పునరి్నర్మించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం మానవజాతి కోసం ఇందుకు సంబంధించి ’ఒక భవిష్యత్తు’ కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లు ఇటీవలి నెలల్లో సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోందని అన్నారు. ఈక్విటీ, బాండ్ ఈల్డ్ వంటి అంశాల్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉంటున్నాయని వివరించారు. అయితే స్టాక్ మార్కెట్లలో ధరల అసాధారణ పెరుగుదల ఒక అనూహ్య పరిణామమన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను అనుసంధానానికి, ఈ విషయంలో అసమతుల్యత పరిష్కారానికి సంస్కరణలు అవసరమని అన్నారు. ప్రపంచ ఆర్థిక భద్రతా వలయాన్ని (జీఎఫ్ఎస్ఎన్) బలోపేతం చేయడంపై కూడా సంస్కరణలు దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.బేస్ మాయతోనే ద్రవ్యోల్బణం తగ్గిందా? 2023 జూలై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ భారీగా (వరుసగా 7.44 శాతం, 6.83 శాతం) ఉన్నందునే 2024 జూలై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) కనబడుతున్నాయని కొందరు నిపుణుల చేస్తున్న వాదనను గవర్నర్ శక్తికాంతదాస్ శక్తికాంతదాస్ తాజా వ్యాఖ్యలు (రేటు తగ్గింపుపై) సమరి్థంచినట్లయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా (మైనస్ లేదా ప్లస్) 4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని కూడా గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా రేటు తగ్గింపును (సరళతర వడ్డీరేట్ల విధానం) కోరుతున్న ప్రభుత్వం– రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్ల జారీ ప్రతిపాదనను సైతం ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
రిటైల్ ధరలు దిగొచ్చాయ్..!
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవ నెల ఆగస్టులో కూడా పూర్తి అదుపులో ఉంది. ధరల స్పీడ్ 3.65%గా (2023 ఇదే నెలతో పోల్చితే) నమోదైంది. అయితే నెలవారీగా 2024 జూలై (ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.6%)తో పోలి్చతే స్వల్పంగా పెరగడం గమనార్హం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం... సూచీలోని ఫుడ్ బాస్కెట్ విభాగంలో ధరల స్పీడ్ ఆగస్టులో 5.66 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 5.42 శాతం. ఒక్క కూరగాయలు చూస్తే, ద్రవ్యోల్బణం 10.71 శాతంగా ఉంది. కాగా, అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. అప్పటి వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే దిగువస్థాయి ధోరణిలో కొనసాగితే ఆర్బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల అంచనా.పరిశ్రమలు పేలవం... పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 2024 జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు కేవలం 4.8%గా నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు దీనికి నేపథ్యం. 2023 జూలై ఈ వృద్ధి రేటు 6.2%. ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి స్వల్పంగా 5.2%కి పెరిగింది. -
కూరగాయలు భగ్గు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ‘యూ’టర్న్ తీసుకుంది. పదకొండు నెలలుగా మెట్లు దిగివస్తూ, 2024 మేలో 4.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్‌లో 28 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 5.08 శాతానికి (2023 జూన్‌తో పోల్చి) చేరింది. అంతక్రితం గడిచిన నాలుగు నెలల్లో ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే తొలిసారి. ఆహారం ప్రత్యేకించి కూరగాయల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 9.36%గా ఉంది. మేలో ఈ రేటు 8.69%. కూరగాయల ధరలు భారీగా 29.32% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 16.07 శాతంగా నమోదయ్యాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి. -
ఆహార ధరలు ఇంకా తీవ్రమే..
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. → మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. → మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది. → స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది. పాలసీ విధానం పునరుద్ఘాటన ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. -
రేటు తగ్గించి.. వృద్ధికి ఊతమివాల్సిన సమయం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యం 4 శాతానికి చేరుకోవడంతో ఇక సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం.. వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికన్నా (4 శాతం) అరశాతమే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ వెలువరిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇక పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదన్నారు. ‘‘తట్టుకోలేని అధిక ద్రవ్యోల్బణం సమస్య ముగుస్తోంది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో మనం ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలను చూస్తాము. ద్రవ్యోల్బణం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుంది’’ అని ఆయన అన్నారు. దీర్ఘకాలం వడ్డీరేటు అధికస్థాయిలో ఉండడం ఆర్ధికవృద్ధికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలోనూ ఇదే మాట... ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. కాగా, వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు ఆషిమా గోయల్‌తో పాటు జయంత్ వర్మ కూడా వీరిలో ఉండడం గమనార్హం. రెపో రేటును తగ్గించి వృద్ధి ఊతానికి తగిన నిర్ణయం తీసుకోవాలని జయంత్ వర్మ పాలసీ సమీక్షాలో ఓటువేశారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిస్కులను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం, అహ్మదాబాద్) ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ ఒక ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → 2023–24లో భారత్ వృద్ధి 8.2 శాతం. 2024–25లో అంతకన్నా 0.75 శాతం నుంచి 1 శాతం వరకూ వృద్ధి స్పీడ్ తగ్గవచ్చు. భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన సామర్థ్యం ఉంది. అధిక వడ్డీరేటు వ్యవస్థ వృద్ధి స్పీడ్‌కు అడ్డంకు కాకూడదు. → ఆర్థిక వృద్ధి రేటును 8 శాతానికి పెంచేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం డిజిటలైజేషన్, పన్ను సంస్కరణలు, అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడులతో సహా అనేక విధానపరమైన చర్యలను చేపట్టింది.ద్రవ్యోల్బణ లక్ష్యం ఇదీ.. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. సగటుకన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. -
ఆహార ధరలు దారుణం.. పరిశ్రమ పేలవం..
న్యూఢిల్లీ: భారత తాజా కీలక ఆర్థిక గణాంకాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య, పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.75 శాతంగా నమోదయ్యింది. ఇది ఏడాది కనిష్టం అయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. 2024 ఏప్రిల్‌లో ఈ రేటు 4.83 శాతంకాగా, 2023 మేనెల్లో ఈ రేటు 4.31 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రకారం 6 శాతం వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అయితే తమ లక్ష్యం ఎప్పుడూ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి అని ఆర్బీఐ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యా లయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. రిటైల్ ద్ర వ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల్లో పట్టణ ప్రాంతాల్లో 4.15% ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. పరిశ్రమ పేలవంమరోవైపు పరిశ్రమల పురోగతికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల ఏప్రిల్‌లో 5 శాతంగా నమోదయ్యింది. గత 3 నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4%. పారిశ్రామిక రంగం వాటా 28.3 %. సేవల రంగం వాటా 53.3%. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70%.ఇంధన డిమాండ్‌కు భారత్ దన్ను న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌కు భారత్ చోదకంగా ఉండగలదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)నివేదిక తెలిపింది. 2023–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉందని ఆయిల్ 2024 రిపోర్టులో పేర్కొంది. 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఐఈఏ వివరించింది. 2025–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదని ఐఈఏ తెలిపింది. -
5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2తో 4 శాతంగా ఉండాలి. -
Wholesale price inflation: 3 నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. కూరగాయలు, బంగాళదుంప, ఉల్లి, ముడి చమురు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మార్చిలో 0.53 శాతంగా (ప్రొవిజనల్) నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 0.20 శాతంగా ఉంది. గతేడాది మార్చిలో ఇది 1.41 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మైనస్‌లోనే ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ నవంబర్‌లో ప్లస్ 0.26 శాతానికి వచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గిన నేపథ్యంలో తాజా టోకు గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బేస్ ఎఫెక్ట్ తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.42 శాతం నుంచి 6.88 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల మైనస్ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి ఎగిసింది. -
ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: దేశీయ మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 4.85 శాతంతో ఐదు నెలల కనిష్ట స్థాయిలో క్షీణించింది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.09 శాతం, మార్చిలో 5.66 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 8.52 శాతంగా ఉంది, ఫిబ్రవరిలో 8.66 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌కు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. -
పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని 4 శాతం దిగువకు తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్లు, అయితే ఇందుకు ఆహార ధరలే అడ్డంకిగా మారుతున్నట్లు మార్చి బులెటిన్ ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’లో ఆర్బీఐ ఇటీవల తెలిపింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబరు నుంచి తగ్గుతూ వస్తూ, గత నెలలో 5.09 శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా, రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరేందుకు ఆహార ధరల ఒత్తిళ్లే అడ్డంకిగా మారుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబత్ర పాత్రా నేతృత్వంలోని బృందం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి మందగించడం, రాబోయే కాలంలో పరిస్థితుల్ని సూచిస్తున్నాయని వివరించింది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని బులెటిన్ వివరించింది. పరోక్ష పన్నులు పటిష్ఠంగా వసూలు కావడం, తక్కువ సబ్సిడీలు వృద్ధి ఊపందుకునేందుకు దోహదం చేశాయని బృందం వెల్లడించింది. నిర్మాణాత్మక గిరాకీ, ఆరోగ్యకర కార్పొరేట్ గణాంకాలు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు వృద్ధి ముందుకు సాగడానికి సాయపడతాయని వ్యాసం పేర్కొంది. ఇదీ చదవండి: 1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద దేశం ఏటా 8%, అంతకంటే ఎక్కువ వృద్ధిని స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2021-24 మధ్య దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సగటున 8% పైనే నమోదైందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపులోనే ఉందని, విదేశీ మారకపు నిల్వలు బాగున్నాయని, వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక ఏకీకరణ కొనసాగుతోందని తెలిపింది. వచ్చే కొన్ని దశాబ్దాలకు ఈ అనుకూల అంశాలను అవకాశాలు, బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
ద్రవ్యోల్బణం దారికి...పరిశ్రమ పక్కకు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్‌లో 2.4 శాతం. -
నాలుగు నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టింది. కూరగాయాలు, పప్పులు, వంట దినుసుల ధరల మంటతో డిసెంబర్ మాసానికి 5.69%కి పెరిగింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి కావడం గమనించాలి. వినియోగ ధరల సూచీ (సీపీఐ/రిటైల్) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 నవంబర్ నెలలో 5.55%గా ఉంటే, 2022 డిసెంబర్ నెలకు 5.72%గా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వాటా కలిగిన ఆహారోత్పత్తుల ధరలు (కూరగాయలతో కూడిన).. గతేడాది నవంబర్ నెలలో 8.7%గా ఉంటే, డిసెంబర్ నెలలో 9.53%కి పెరిగిపోయాయి. 2022 డిసెంబర్లో వీటి ధరలు సూచీలో 4.19% వద్దే ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 6.83% గరిష్ట స్థాయిని తాకిన తర్వాత నుంచి కొంత తగ్గుతూ వచ్చింది. కూరగాయల విభాగం ద్రవ్యోల్బణం 27.64%గా ఉంది. పప్పులకు సంబంధించి 20.73%, వంట దినుసుల ద్రవ్యోల్బణం 19.69% చొప్పున నమోదైంది. ఆహార విభాగంలోనే... సీపీఐ ద్రవ్యోల్బణం త్రైమాసికం వారీగా పెరిగిపోవడం అన్నది ఆహారం, పానీయాల విభాగం వల్లేనని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గడం లేదంటే అదే స్థాయిలో కొసాగినట్టు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో 4% స్థాయిలో (2 శాతం అటూ ఇటూ దాటకుండా) పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. -
ద్రవ్యోల్బణం.. తీవ్ర అనిశ్చితే
ముంబై: అస్థిరత, అనిశ్చిత ఆహార ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం– అవుట్‌లుక్ తీవ్ర అస్పష్టంగా ఉందని ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో డిసెంబర్ 6 నుండి 8 వరకూ జరిగిన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యింది. ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉటంకిస్తూ కీలక వడ్డీ రేటు (బ్యాంకులు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో) 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా ఈ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూరగాయల ధరల తీవ్రత వల్ల ఆహార ద్రవ్యోల్బణం పుంజుకునే వీలుందని ఈ సమావేశంలో గవర్నర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య పరపతి విధాన వైఖరిలో ఏదైనా మార్పు ఉంటే అది ప్రమాదకరమని దాస్ ఉద్ఘాటించారు. -
పరిశ్రమలు రయ్.. ధరలు షాక్!
న్యూఢిల్లీ: భారత స్థూల ఆర్థిక గణాంకాల విషయంలో రెండు కీలక విభాగాలకు సంబంధించి మంగళవారం వెలువడిన గణాంకాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 11.7 శాతం వృద్ధిని (2022 అక్టోబర్ గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 16 నెలల్లో ఇంత అధిక స్థాయిలో (2022 జూన్‌లో 12.6 శాతం తర్వాత) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి. కాగా, గత ఏడాది ఇదే నెల్లో (2022 అక్టోబర్) ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.1 శాతం క్షీణించడంతో తాజా సమీక్షానెల భారీ వృద్ధి గణాంకాలు కనబడ్డానికి ‘బేస్ ఎఫెక్ట్’ కారణమన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇక రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (పీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.55 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో మొదటిసారి ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. నిజానికి ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రాతిపదికన ఎగువ దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం వరకూ ఉండవచ్చు. అయితే ద్రవ్యోల్బణం పట్ల చాలా అప్రమత్తత అవసరమని, 4 శాతం కట్టడే తమ లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన ఐఐపీ కీలక విభాగాల గణాంకాల్లో పరిశీలిస్తే.. ‘బేస్ ఎఫెక్ట్’తో జూమ్! ∙భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 28.3% వాటా కలిగిన పారిశ్రామిక రంగం ఉత్పత్తి 11.7% పెరిగితే, అందులో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం పురోగతి సమీక్షా నెల్లో 10.4%. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా 5.8 శాతం క్షీణత నమోదయ్యింది.ఏప్రిల్–అక్టోబర్ మధ్య 6.9 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 6.9%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 5.3%. ఆహార ధరల తీవ్రత దిగువబాటలో కొనసాగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) నవంబర్‌లో ‘యూ–టర్న్’ (సెపె్టంబర్లో 5.02 శాతం, అక్టోబర్‌లో 4.87 శాతం) తీసుకుని, 5.55 శాతంగా నమోదయ్యింది. ఆహార ధరల పెరుగుదల దీనికి కారణం. ఉత్పత్తుల బాస్కెట్లో ఒక్క ఫుడ్ బాస్కెట్‌ను చూస్తే, 2022 నవంబర్‌లో ద్రవ్యోల్బణం 4.67 శాతం, 2023 అక్టోబర్‌లో 6.61 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఇది 8.7 శాతానికి ఎగసింది. మొత్తం సీపీఐలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 50 శాతం. ఇందులో రెండంకెల్లో ధరలు పెరిగిన జాబితాలో సుగంధ ద్రవ్యాలు (21.55 శాతం) పప్పు దినుసులు (20.23 శాతం) కూరగాయలు (17.70 శాతం), పండ్లు (10.95 శాతం), తృణ ధాన్యాలు (10.25 శాతం) ఉన్నాయి. ధరలు పెరిగిన మిగిలిన ఉత్పత్తుల్లో చక్కెర, తీపి ఉత్పత్తులు (6.55 శాతం) గుడ్లు (5.90 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5.75 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (4.22 శాతం), నాన్ ఆల్కాహాలిక్ బేవరేజెస్ (3.58 శాతం) ఉన్నాయి. ఆయిల్, ఫ్యాట్స్ ధరలు మాత్రం 15.03 శాతం తగ్గాయి. ఇక ఫుడ్ అండ్ బేవరేజెస్ ధరల పెరుగుదల 8.02 శాతంగా ఉంది. -
ధరలు అదుపు.. పరిశ్రమల పరుగు!
న్యూఢిల్లీ: భారత్ తాజా ఆర్థిక గణాంకాలు పూర్తి ఊరటనిచ్చాయి. అధికారికంగా విడుదలైన సమాచారం ప్రకారం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పాలసీ సమీక్షా నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.02 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం మైనస్ 2 లేదా ప్లస్ 2తో 6 శాతం వద్ద ఉండాలి. అయితే తమ లక్ష్యం 4 శాతమేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవలి తన పాలసీ సమీక్ష సందర్భంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక పారిశ్రామిక రంగ వృద్ధికి సంబంధించిన సూచీ (ఐఐపీ) ఆగస్టులో 10.3 శాతం వృద్ధిని చూసింది. గడచిన 14 నెలల్లో ఈ స్థాయి వృద్ధి రేటు ఎన్నడూ నమోదుకాలేదు. 2023–24లో సగటును 5.4 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. రిటైల్ ధరల తీరు చూస్తే... ఒక్క ఆహార ధరల విషయానికి వస్తే, రెండంకెల్లో (గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చి) ధరలు పెరిగిన వస్తువుల్లో తృణధాన్యాలు (10.95 శాతం), పప్పులు (16.38 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.06 శాతం) ఉన్నాయి. మాంసం, చేపలు (4.11 శాతం), గుడ్లు (6.42 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.89 శాతం), పండ్లు (7.30 శాతం), కూరగాయలు (3.39 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (4.52 శాతం), నాన్–ఆల్కాహాలిక్ బేవరేజెస్ (3.54 శాతం), ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ (4.96 శాతం), ఫుడ్ అండ్ బేవరేజెస్ (6.30 శాతం) ఉత్పత్తులో పెరుగుదల రేటు ఒకంకెకు పరిమితమైంది. కాగా, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు పెరక్కపోగా 14.04% తగ్గడం గమనార్హం. రంగాల వారీగా పారిశ్రామిక ఉత్పత్తి పురోగతి ఆగస్టు నెలల్లో తయారీ రంగం 9.3 శాతం పురోగతి (2022 ఆగస్టు నెలతో పోల్చి) సాధించింది. విద్యుత్ రంగం 15.3 శాతం, మైనింగ్ 12.3%, భారీ పెట్టుబడులకు, యంత్ర సామాగ్రి కొనుగోళ్లకు ప్రతిబింబంగా ఉండే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో 12.6 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే రిఫ్రిజరేటర్లు, ఎయిర్కండీషర్లకు సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధిలేకపోగా 5.7 శాతం క్షీణత నెలకొంది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్– డ్యూరబుల్స్ రంగంలో మాత్రం వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
ఆర్బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు మించి నమోదవుతుందని యూబీఎస్ అంచనాలు వేస్తోంది. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. అయితే క్యూ2లో అంచనాలకు మించి 6.8 శాతం వినియోగ ద్రవ్యోల్బణం నమోదవుతందన్నది యూబీఎస్ తాజా అంచనా. సెపె్టంబర్లో 6 శాతం పైబడి సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం నమోదవుతుందని భావిస్తున్నట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి తగ్గినప్పటికీ ఈ స్థాయి సైతం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయికన్నా 83 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా ఉండడం గమనార్హం. పలు నిత్యావసర వస్తువులు సామాన్యునికి అందని తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 9.94 శాతంగా ఉంది. ఒక్క కూరగాయల ధరల పెరుగుదల చూస్తే, 2023 ఆగస్టులో 26.14 శాతంగా ఉంది. ఆగస్టులో ఆయిల్, ఫ్యాట్స్ విభాగం (మైనస్ 15.28 శాతం) మినహా అన్ని విభాగాల్లో ధరలూ పెరుగుదనే సూచించాయి. వీటిలో తృణధాన్యాలు (11.85 శాతం), మాంసం–చేపలు (3.68 శాతం), గుడ్లు (4.31 శాతం), పాలు–పాల ఉత్పత్తులు (7.73 శాతం), పండ్లు (4.05 శాతం), కూరగాయలు (26.14 శాతం), పుప్పు దినుసులు (13.04 శాతం), చక్కెర, సంబంధిత ఉత్పత్తులు (3.80 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.19 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (3.67 శాతం), ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ విభాగం (5.31 శాతం), ఫుడ్ అండ్ బేవరేజెస్ (9.19 శాతం), పాన్, పొగాకు, మత్తు ప్రేరిత ఉత్పత్తులు (4.10 శాతం) ఉన్నాయి. దుస్తులు, పాదరక్షల విభాగంలో ఆగస్టు వినియోగ ద్రవ్యోల్బణం 5.15 శాతంగా ఉంది. హౌసింగ్ విభాగంలో ధరల పెరుగుదల 4.38 శాతం. ఫ్యూయెల్ అండ్ లైట్లో 4.31 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. -
వృద్ధి వేగవంతం.. ధరలే దారుణం
ముంబై: భారత ఆరి్థక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఊపందుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయికి మించి (6 శాతం) సగటున కొనసాగుతుండడమే ఆందోళన కరమైన అంశమని ఆర్బీఐ నెలవారీ బులెటిన్‌లో వెలువడిన ఒక కథనం పేర్కొంది. జూన్‌లో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బనం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగసిన నేపథ్యంలో తాజా కథనం వెలువడ్డం గమనార్హం. సమీక్షా నెల్లో టమాటా, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ధరల తీవ్రత విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోసైతం ప్రస్తావిస్తూ, సమస్యను తగ్గించడానికి తగిన మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ అభిప్రాయాలు కావు... రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. అయితే, ఆరి్టకల్‌లో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయితలవి మాత్రమేనని, వీటిని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా పరిగణించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వెలువడిన ఆరి్టకల్లోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. మొదటి త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో వినియోగ డిమాండ్ బాగుంది. పెట్టుబడుల పరిస్థితి ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఆయా అంశాలు భారత్‌కు లాభిస్తున్నాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో కుంటుపడిన ఎగుమతుల క్షీణబాట ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నాం. -
టమాట భగ్గు:15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం
Retail inflation at 15 month high in July వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా టమాట ధరలు భగ్గుమనడంతోపాటు పాటు ఇతర కూరగాయల ధర సెగతో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎగబాకిందని , ఈ ఒత్తిడిమరి కొంతకాలం కొనసాగ వచ్చని భావిస్తున్నారు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 4.87 శాతం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం జూలైలో 11.51శాతానికి పెరిగింది, అయితే ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్రవ్యోల్బణం 10.57శాతానికి పెరిగింది. కూరగాయల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ప్రతి ద్రవ్యోల్బణం -0.93శాతం నుండి గత నెలలో 37.34శాతాకి పెరిగింది. (SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!) వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. జులైలో ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమేనని డేటా పేర్కొంది. 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది. -
ఆర్థిక వ్యవస్థ శుభ సంకేతాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో తాజా గణాంకాలు ఉత్సాహాన్ని నింపాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.25 శాతంగా నమోదయ్యింది. అంటే 2022 మేతో పోల్చితే 2023 మేలో రిటైల్ ధరల బాస్కెట్ 4.25 శాతమే పెరిగిందన్నమాట. గడచిన రెండేళ్ల కాలంలో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడ్డం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.7 శాతం కాగా, గత ఏడాది మే నెల్లో 7.04 శాతంగా ఉంది. కీలకాంశాలు ఇవీ... ఒక్క ఆహార విభాగాన్ని పరిశీలిస్తే, మే నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 3.84 శాతం. మొత్తం సూచీలో దీని వెయిటేజ్ దాదాపు 50 శాతం. ఆయిల్, ఫ్యాట్స్ ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల్లో 16 శాతం తగ్గింది. కూరగాయల ధరలు 8.18 శాతం దిగివచ్చాయి. అయితే తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు వరుసగా 12.65 శాతం, 6.56 శాతంగా ఉన్నాయి. ► ఫ్యూయెల్ లైట్ విభాగంలో ధరల స్పీడ్ ఏప్రిల్ లో 5.52% ఉంటే, మేలో 4.64 శాతం. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా. జూన్ త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌లో తయారీ, మైనింగ్ చక్కని పనితీరు ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మంచి ఫలితాన్ని నమోదుచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (సీపీఐ) వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి వృద్ధిరేటును నమోదుచేసుకున్నట్లు అధికా రిక గణాంకాలు తెలిపాయి. 2023 మార్చితో పోల్చితే (1.7 శాతం వృద్ధి) గణాంకాల తీరు బాగున్నప్పటికీ, 2022 ఏప్రిల్‌తో పోల్చితే (6.7 శాతం) వృద్ధి రేటు తక్కువగా ఉండడం గమనార్హం. అయితే అప్పటి గణాంకాల్లో బేస్ తక్కువగా ఉండడం మరోఅంశం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా అంకెలను పరిశీలిస్తే... -
భారీగా పడిపోయిన రీటైల్ ద్రవ్యోల్బణం
వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. దేశంలో వరుసగా మే నెలలో నాలుగో సారి రీటైల్ ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఏప్రిల్‌లో రీటైల్ ద్రవ్యోల్బణం 4.70 ఉండగా మే నెల సమయానికి 4.25 కి పడిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (National Statistics Office (NSO) తెలిపింది. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం..మే నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదై 25 నెలల కనిష్ఠానికి చేరింది.ఈ ఏడాది జనవరి నుంచి 227 పాయింట్లు పడిపోవడం గమనార్హం. అయినప్పటికీ సీపీఐ ద్రవ్యోల్బణం వరుసగా 44వ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. -
రిటైల్ ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్‌లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్‌లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్‌లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో 4.79 శాతంగా, గత ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది. నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది. సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్బీఐ గవర్నర్ ఏప్రిల్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. -
భారత్ ఎకానమీపై భరోసా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది. ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం, దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్‌లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్ కట్టడిలో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్‌పై తీవ్ర ప్రభావం చూపబోవు. ► భారత్ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది. ► తైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల. ► భారతదేశ కార్పొరేట్ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది. ఇది కార్పొరేట్ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్ కీలక పాత్ర పోషిస్తుంది. -
ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 6.44 శాతంగా (2022 ఇదే నెల ధరల బాస్కెట్‌తో పోల్చి) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది ఎగువన కొనసాగుతుండడం గమనార్హం. అయితే 2023 జనవరి 6.52% కన్నా ద్రవ్యోల్బణం కొంత తగ్గింది. ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది. ► ఫుడ్ బాస్కెట్ రిటైల్ ద్రవ్యోల్బణం 5.95%గా నమోదైంది. కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన చూస్తే, 11.61% తగ్గాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 20%, తృణ ధాన్యా లు, ఉత్పత్తుల ధరలు 17% పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ లైట్ సెగ్మెంట్లో ద్రవ్యోల్బణం 9.90 శాతంగా ఉంది. రెపో మరింత పెరుగుదల: డీబీఎస్ రిసెర్చ్ ఇదిలాఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే కొనసాగుతున్న నేపథ్యంలో, వచ్చే నెల జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని డీబీఎస్ రిసెర్చ్ తన తాజా నివేదికలో అంచనావేసింది. -
టోకు ధరల ఊరట!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గినా, ఫుడ్ ఆర్టికల్స్ బాస్కెట్ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూనే వస్తుండడం సానుకూల అంశమైనా, ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు. 10 నెలల అప్‌ట్రెండ్ తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 5.94 శాతంగా ఉంది. రెపోపై ఆర్బీఐ నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో మరో పావు శాతం పెరిగి, 6.50 శాతానికి చేరింది. తయారీ: తయారీ ఉత్పత్తులకు సంబంధించి ధరల స్పీడ్ జనవరిలో 2.99 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్ 2022లో ఈ రేటు 3.37 శాతం. ఇంధనం, విద్యుత్ నెలల వారీగా ఈ రేటు 18.09 శాతం నుంచి 15.15 శాతానికి తగ్గింది. ఫుడ్ బాస్కెట్: ఈ విభాగంలో రేటు జనవరిలో 2.38 శాతంగా ఉంది. 2022 డిసెంబర్లో ఈ రేటు 1.25 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. పప్పు దినుసుల ధర స్పీడ్ 2.41 శాతంగా ఉంటే, కూరగాయల ధరలు మాత్రం 26.48 శాతం తగ్గాయి. -
మళ్లీ రిటైల్ ధర‘దడ..’
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసిరింది. ధరల స్పీడ్ జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా (2022 ఇదే నెలతో పోల్చి ధరల తీరు) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్నదానిప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టడిలోకి (ఆరు శాతం దిగువకు) వచ్చింది. ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం తాజా లెక్కల ప్రకారం ఫడ్ బాస్కెట్ ధర జనవరిలో 5.94 శాతం ఎగసింది. డిసెంబర్లో ఈ పెరుగుదల రేటు 4.19 శాతం. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.85 శాతం అయితే, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 6 శాతంగా ఉంది. 2022–23లో రిలైట్ ద్రవ్యోల్బణం సగటును 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో అంచనావేయగా, జనవరి–డిసెంబర్ మధ్య 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. -
ధరల ఎఫెక్ట్.. దేశంలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో నిత్యవసరాల ధరల మంట మండుతోంది. పెట్రోల్,డీజిల్‌తో పోటీగా కూరగాయలు, వంటనూనెల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరా భారం నిరుపేదలనే కాకుండా మధ్యతరగతి, ఆపై వర్గాల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దూసుకెళ్తుంది. డిసెంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 4.19 శాతం ఉండగా..జనవరిలో 5.94 శాతానికి చేరింది. ప్రైస్ ఇండెక్స్ బాక్స్ ప్రకారం..రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం వాటా దాదాపు 40 శాతంగా ఉంది. ఆర్బీఐ తొలిసారి మూడు నెలల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేసింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది. దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరిగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల సాధారణ ధరలు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో క్రమంగా పెరిగే స్థాయినే ద్రవ్యోల్బణం అంటారు. మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాది ఇలా ఒక పర్టిక్యులర్ కాలాన్ని లెక్కలోకి తీసుకొని ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు. -
దిగొచ్చిన ద్రవ్యోల్బణం, పుంజుకున్న ఐఐపీ వృద్ధి
సాక్షి,ముంబై: దేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. మంత్రిత్వ శాఖ గణాంకాలు , ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.72శాతానికి దిగి వచ్చింది. ఇది నవంబర్‌లో 5.88శాతంగా, అక్టోబర్ 2022లో 6.77శాతంగాఉంది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి చేరింది. కాగా ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం వరుసగా రెండో నెల. మార్చి 2026తో ముగిసే ఐదేళ్ల కాలానికి ఇరువైపులా 2శాతం మార్జిన్‌తో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వం ఆర్బీఐని ఆదేశించింది. నవంబర్ ఐఐపీ వృద్ధి మరోవైపు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) పరంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి అక్టోబర్‌లో 4శాతం నుండి నవంబర్‌లో 7.1శాతానికి పెరిగింది. ఐఐపీ పనితీరు పుంజుకుంటుదనీ ఊహించినప్పటికీ, అక్టోబర్ 2022లో 4.2శాతంతో పోలిస్తే బాగా పుంజుకుంది. 2022 డిసెంబరులో సింగిల్ డిజిట్‌కు వృద్ధి చెందుతుందని అని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ చెప్పారు. -
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్‌లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 8.33% ఉంటే, నవంబర్‌లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: సామాన్యుడికి ధరల మంట కాస్తంత తగ్గింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే ఏడాది తర్వాత మళ్లీ తక్కువ ధరలు చూస్తున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగ ధరల ఆధారిత సూచీ/రిటైల్ ద్రవ్యోల్బణం) గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో మాసం. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా ఉంది. 2021 నవంబర్ నెలలో ఇది 4.91 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 1శాతం మేర అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. ఈ నెల మొ దటి వారంలో ముగిసిన తాజా ఎంపీసీ సమీక్షలోనూ కీలక రెపో రేటు 0.35శాతం మేర పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే రెపో రేటు మొత్తం మీద 2.25 శాతం ఎగిసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతం లోపునకు దిగొస్తుందని, రానున్న రోజుల్లో ధరల మంట కాస్తంత చల్లారుతుందని ఇటీవలి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) ధరల తీరు...: ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉంటే అది నవంబర్ నెలకు 4.67 శాతానికి క్షీణించింది. సీపీఐలో ఆహారోత్పత్తుల వాటా 40 శాతం. కూరగాయల ధరలు 8 శాతం మేర తగ్గాయి. ఇక వంట నూనెల ధరలు 0.63 శాతం, చక్కెర ధరలు 0.25 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలో 12.96శాతం వద్ద ఉంటే, వంట దినుసులకు సంబంధించి 19.52 శాతం, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతం, పప్పులకు సంబంధించి 3.15శాతంగా నమోదైంది. చమురు, పొగాకు, మత్తు కారకాల రేట్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువలోనే ఉన్నాయి. వస్త్రాలు, పాదరక్షల ధరలు 9.83శాతం, ఇళ్ల ధరలు 4.57శాతం పెరిగాయి. ‘డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వచ్చే ఫిబ్రవరి సమీక్షలో పాలసీ రేట్ల సమీక్షలో కీలక అంశంగా మారుతుందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. ఊహించని విధంగా ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివచ్చినట్టు చెప్పారు. నవంబర్ నెలకు 5.88 శాతం చర్యల ఫలితమే ఇది..: ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా, ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత గరిష్ట పరిధి అయిన 6 శాతం లోపునకు దిగొచ్చింది. ధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల ఫలితాలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ఇంకా ప్రతిఫలిస్తాయి. – కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ -
ద్రవ్యోల్బణం కట్టడిలో వైఫల్యంపై ఆర్బీఐ చర్చ
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు కట్టడిచేయడంలో వైఫల్యం ఎందుకు చోటుచేసుకుందన్న అంశంపై గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి సమర్పించాల్సిన నివేదికాంశాలపై చర్చించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంలోపు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆపైనే ధరల స్పీడ్ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న విషయం ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష సందర్బంగా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అయితే ఈ వివరాలను తెలపడానికి మాత్రం నిరాకరించారు. సెంట్రల్ బ్యాంక్ తన లక్ష్యాన్ని విఫలం కావడానికి సంబంధించిన ఆర్బీఐ చట్టం 45జెడ్ ఎన్ సెక్షన్ కింద ఈ సమావేశం జరిగిందని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. -
ద్రవ్యోల్బణంపై కేంద్రానికి ఆర్బీఐ నివేదిక!
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో 2022 జనవరి నుంచి విఫలం అవడానికి కారణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన కసరత్తు జరపనుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ యాక్ట్ 45జెఎన్ సెక్షన్ కింద కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటు తర్వాత ఈ తరహా వివరణను కేంద్రానికి ఆర్బీఐ సమర్పించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే గడచిన మూడు త్రైమాసికాల్లో ఇది ఆ స్థాయి పైనే కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల గరిష్టానికి ఎగబాకడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో తీవ్ర పతన స్థాయికి చేరుకోవడం సైతం నిరాశపరిచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ అనూహ్య రికవరీ, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. అలాగే ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(గురువారం)కి ముందు అప్రమత్తత వహించారు. ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల మరో దఫా వడ్డీరేట్ల పెంపు అంచనాలు దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఫైనాన్స్, ఆటో, రియల్టీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 391 పాయింట్లు పతనమై 57,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014 వద్ద నిలిచింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా క్షీణించాయి. మెటల్, ఫార్మా, మీడియా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.753 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు గరిష్టంగా 3% వరకు క్షీణించాయి. యూఎస్ ద్రవ్యోల్బణ వెల్లడి తర్వాత అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ అరశాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీలకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.269.88 లక్షల కోట్ల దిగువకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం క్షీణించడంతో ఐటీ కంపెనీ విప్రో షేరు 7% నష్టపోయి రూ 379 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా పతనమై రూ.381 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ► ఇదే క్యూ2 క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన హెచ్‌సీఎల్ షేరు మూడు శాతం బలపడి రూ.982 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.986 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. -
RBI Monetary Policy: రుణాలు మరింత భారం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. జీడీపీ అంచనాలు కట్... వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశ్యం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ కుదించింది. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ► డాలర్ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. ► ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డాలర్ బలోపేతం అమెరికన్ బాండ్ ఈల్డ్ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం. ► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ► 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది. నేటి నుంచి టోకెనైజేషన్ దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్ వ్యవస్థ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
ఎకానమీ.. శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ, దేశీయ సవాళ్ల నేపథ్యంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. పలు రంగాలకు సంబంధించి శుక్రవారం వెలువడిన అధికారిక రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తగ్గిన ఆహార ధరలు ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. ఈ స్పీడ్ తాజా సమీక్షా నెల్లో మరింత దిగిరావడం హర్షణీయం. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 6.75 శాతానికి దిగివచ్చింది. జూన్‌లో కూరగాయల ధరల స్పీడ్ 17.37 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల్లో 10.90 శాతానికి దిగివచ్చాయి. ఇక ఆయిల్ అండ్స్ ఫ్యాట్స్ ధరల స్పీడ్ ఇదే కాలంలో 9.36 శాతం నుంచి 7.52 శాతానికి తగ్గింది. గుడ్ల ధరలు 3.84 శాతం తగ్గాయి. పండ్ల ధరలు మాత్రం 3.10 శాతం నుంచి 6.41 శాతానికి ఎగశాయి. ఇంధనం, విద్యుత్ ధరలు తీవ్రంగానే (11.67 శాతం) కొనసాగుతున్నాయి. తయారీ, మైనింగ్ సానుకూలం జూన్‌లో వరుసగా రెండవనెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ రెండంకెలపైన వృద్ధిని సాధించింది. తయారీ (12.5 శాతం), విద్యుత్ 16.5 శాతం), మైనింగ్ (7.5 శాతం) రంగాల దన్నుతో పారిశ్రామిక ఉత్పత్తి జూన్‌లో 12.3 శాతంగా నమోదయ్యింది. అయితే మే నెలతో పోల్చితే (19.6 శాతం) సూచీ స్పీడ్ తగ్గింది. పెట్టుబడులు, డిమాండ్‌కు సూచికయిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి విభాగం 26.1 శాతం పురోగతి సాధించింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 23.8 శాతం వృద్ధి నమోదుకాగా, ఎఫ్ఎంసీజీ రంగానికి సంబంధించి కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగం 2.9 శాతం పురోగమించింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 12.7 శాతంగా నమోదయ్యింది. వృద్ధి బాటనే ఎగుమతులు... ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు ఆగస్టు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే తాజా లెక్కల ప్రకారం, సవరిత గణాంకాలు వెల్లడించాయి. ఇక దిగుమతులు 43.61 శాతం పెరిగి 66.72 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు మూడు రెట్లు పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (జూలై వరకూ) భారత్ ఎగుమతులు 20 శాతం పెరిగి 157.44 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతులు 48 శాతం పెరిగి 256.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు దాదాపు 99 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సామాన్యుడికి 'ధరా' ఘాతం, కట్టడి చేయాలని నిర్మలా సీతారామన్ పిలుపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్ నెలతో పోల్చితే ఈ వస్తువుల బాస్కెట్ 7.01 శాతం పెరిగిందన్నమాట. అయితే మే నెలతో (7.04 శాతం) పోల్చితే స్వల్పంగా తగ్గింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 నుంచి 6 శాతం మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలి. అయితే ఈ స్థాయికి మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది వరుసగా ఆరవనెల. తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో మే, జూన్ నెలల్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా 0.90 బేసిస్ పాయింట్లు (0.4 శాతం, 0.5 శాతం) పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా, ద్రవ్యోల్బణం స్పీడ్‌ను నియంత్రించాల్సిన తక్షణ అవసరం ఉందని ఒక ప్రకటనలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వస్తువుల వారీగా ఈ కట్టడి జరగాలని ఆమె అన్నారు. ధరల తీరిది... ఇక మేతో పోల్చితే ఫుడ్ బాస్కెట్లో ధరల స్పీడ్ 7.97 శాతం నుంచి జూన్‌లో 7.75 శాతానికి స్వల్పంగా తగ్గింది. మేలో 18.26 శాతం ఉన్న కూరగాయల ధరాఘాతం జూన్‌లో 17.37 శాతానికి దిగివచ్చింది. పప్పులు సంబంధిత ప్రొడక్టుల ధర మరింతగా 1.02 శాతం తగ్గింది. మేతో తగ్గుదల 0.42 శాతం. పండ్ల ధరలు 2.33 శాతం నుంచి 3.10 శాతానికి చేరాయి. ఇంధనం, విద్యుత్ కేటగిరీలో మాత్రం ధరల స్పీడ్ 9.54 శాతం నుంచి 10.39 శాతానికి చేరింది. -
మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.04%
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మే నెల్లో 7.04 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ సూచీలోని వస్తువుల బాస్కెట్ ధర 2021 మే నెలతో పోల్చితే 7.04 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం నెల ఏప్రిల్ (7.79 శాతం) కన్నా ద్రవ్యోల్బణం కొంచెం తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణిపైన ద్రవ్యోల్బణం కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆరుశాతం పైన రేటు నమోదుకావడం ఇది వరుసగా ఐదవనెల. ఏప్రిల్ కన్నా మేలో ధరల స్పీడ్ తగ్గడానికి ఆహార, ఇంధన ధరల్లో కొంత తగ్గుదల నమోదుకావడం కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, సరఫరాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. మరోవైపు గత నెల ప్రారంభంలో ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారంలో ఈ రేటు మరో అరశాతం పెరిగింది. ఇదే ధోరణిని ఆగస్టు ద్వైమాసిక సమావేశాల్లోనూ సెంట్రల్ బ్యాంక్ కొనసాగిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు.. ► 2022 మేలో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.97 శాతం. ఏప్రిల్‌లో ఈ రేటు 8.31 శాతంగా ఉంది. మొత్తం వినియోగ ధరల సూచీలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 39.06 శాతం. ఏప్రిల్‌లో 5.96 శాతం ఉన్న తృణ ధాన్యాల ద్రవ్యోల్బణం మేలో 5.33 శాతానికి తగ్గింది. ఇక ఆయిల్, ఫ్యాట్ ధరల స్పీడ్ కూడా ఇదే కాలంలో 17.28 శాతం నుంచి 13.26 శాతానికి తగ్గింది. పండ్ల ధరలు 4.99 శాతం నుంచి 2.33 శాతానికి తగ్గాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగాయి. కాగా, గుడ్ల ధరలు 4.65 శాతం క్షీణిస్తే, పప్పు దినుసుల ధరలు 0.42% తగ్గాయి. ► ఇక ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 10.80% ఉంటే మేలో 9.54%కి తగ్గింది. ఆర్బీఐ అంచనాలు ఇలా... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనాలతో ఇటీవలి పాలసీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022లో తగిన వర్షపాతం, దీనితో తగిన ఖరీఫ్ పంట దిగుబడి అంచనాతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 6.7% ఉంటుందని (తొలి అంచనా 5.5%) ఆర్బీఐ అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 7.5%, రెండవ త్రైమాసికంలో 7.4%, మూడవ త్రైమాసికంలో 6.2% నమోద య్యే రిటైల్ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8%గా నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. జనవరి (6.01%), ఫిబ్రవరి (6.07%), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95%) నెలల్లో హద్దులు మీరి రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగించింది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. -
దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
న్యూఢిల్లీ: దేశ ప్రధాన ఆర్థిక రంగం ఇంకా సవాళ్లలోనే కొనసాగుతోందని తాజాగా విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడించాయి. కరోనా మూడవ వేవ్ (ఒమిక్రాన్) సవాళ్ల నేపథ్యంలో మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. ఇక సామాన్యునికి ఆందోళన కలిగించే స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగసింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 7.79 శాతం పెరిగిందన్నమాట. 2021 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే వరుసగా నాలుగు నెలల నుంచి ఆపై స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. కరోనా సవాళ్లతో నెలకొన్న సరఫరాల సమస్యలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మరింత పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి కనిష్ట స్థాయి పతనం ధరా భారాన్ని మరింత పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతానికి చేరింది. అటు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రేటును చూడ్డం ఇదే తొలిసారి. ► ఆహార, ఇంధన ధరల భారీ పెరుగుదల తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ► 2021 ఏప్రిల్‌లో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.96% అయితే, 2022 మార్చితో 7.68%గా ఉంది. ఏప్రిల్‌లో ఈ రేటు ఏకంగా 8.38%కి పెరిగింది. ఫుడ్ బాస్కెట్లో ఒక్క కూరగాయల ధరలు ఏకంగా 15.41% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 11.64 %. ► ఇంధనం, లైట్ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉంటే, ఏప్రిల్‌లో 10.80 శాతానికి ఎగసింది. ► వంట నూనెలు, ఫ్యాట్స్ విభాగంలో ధరల భారం మార్చితో పోల్చితే (18.79 శాతం) స్వల్పంగా 17.28 శాతానికి తగ్గినా సామాన్యునికి ఈ స్థాయి ధరల పెరుగుదలే చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. ఎరువులతోపాటు భారత్ వంట నూనెల అవసరాలకు ఉక్రెయిన్ ప్రధాన వనరుగా ఉంది. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం నేపథ్యంలో సరఫరాల సమస్యలు తీవ్రమయ్యాయి. జూన్‌లో మరో దఫా రేటు పెంపు! ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమీక్షా నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.5%కి చేర్చింది. మేలోనూ పైపైనే... గతవారం అనూహ్యంగా జరిగిన ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం సమర్థనీయమేనని వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తాజా స్పీడ్ (7.79 శాతం) స్పష్టం చేస్తోంది. అలాగే జూన్ 2022లో మరో దఫా రేటు పెంపు ఖాయమన్న అంచనాలను ఈ గణాంకాలు పెంచుతున్నాయి. 2021 మేలో అధిక బేస్ వల్ల (6.3 శాతం) 2022 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గవచ్చని భావిస్తున్నాం. హై బేస్ ప్రాతిపదిక కొంత తగ్గినా, ఆర్బీఐకి నిర్దేశిస్తున్న లక్ష్యానికి ఎగవనే 6.5 శాతంగా మేలో ద్రవ్యోల్బణం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్. పారిశ్రామికోత్పత్తికి హైబేస్, ఒమిక్రాన్ తలనొప్పులు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2022 మార్చిలో కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ సవాళ్లతో పాటు 2021 మార్చి నెల హై బేస్ (అప్పట్లో వృద్ధి రేటు ఏకంగా 24.2 శాతం) దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఐఐపీపై (వృద్ధి రేటు కేవలం 1.5 శాతం) ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు అన్ని కీలక రంగాలపై హై బేస్ ప్రభావం కనిపించింది. ► తయారీ: మార్చిలో కేవలం 0.9 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రేటు ఏకంగా 28.4 శాతం. ► మైనింగ్: వృద్ధి రేటు 6.1% నుంచి 4 శాతానికి తగ్గింది. ► విద్యుత్: 22.5 శాతం వృద్ధి రేటు 6.1 శాతానికి దిగివచ్చింది ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన ఈ విభాగంలో వృద్ధి రేటు 50.4 శాతం నుంచి ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. ►కన్జూమర్ డ్యూరబుల్స్: 2021 మార్చిలో 59.9 శాతం వృద్ధి నమోదయితే, తాజా సమీక్షా నెల్లో అసలు వృద్ధి లేకపోగా 3.2 శాతం క్షీణించింది. 2021–22లో 8.4 శాతం పురోగతి కాగా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ది నమోదుకాకపోగా 8.4 శాతం క్షీణతలో ఉంది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. -
17 నెలల గరిష్టం...ధరల షాక్...!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ ఇంకా సవాళ్ల దశ నుంచి తేరుకోలేదని తాజా ఆర్థిక గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో 6.95 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే ఈ స్థాయి దాటి ఈ గణాంకాలు నమోదుకావడం ఇది వరుసగా మూడవనెల. ఇక ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలో ఉన్నా... గణాంకాలు నామమాత్రంగానే నమోదుకావడం గమనార్హం. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... సామాన్యునిపై ధరల భారం తీవ్రత సామాన్యునిపై ధరల భారం కొనసాగుతోందని తాజా గణాంకాలు సూచించాయి. జనవరి (6.01), ఫిబ్రవరితో (6.07) పాటు మార్చి నెల్లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లక్ష్యం దాటి భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. రిటైల్ ద్రవ్యోల్బణం 2020 అక్టోబర్‌లో 7.61 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత ఈ స్థాయిలో (6.95 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. కాగా, జనవరి నుంచి మార్చి వరకూ త్రైమాసికం పరంగా చూసినా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించి 6.34 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) కొన్ని కీలక విభాగాలు పరిశీలిస్తే.. 2022 మార్చిలో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 7.68 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ బాస్కెట్ ధరల పెరుగుదల స్పీడ్ 5.85 శాతం. ఆయిల్ అండ్ ఫ్యాట్స్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 18.79 శాతం పెరిగింది. రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధ ప్రభావాలు దీనికి ప్రధాన కారణం. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలతో పాటు వంట నూనెల ధరలు కూడా తీవ్రంగా పెరిగాయి. దేశానికి సన్ ఫ్లవర్ ఎగుమతుల్లో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. కూరగాయల ధరలు 11.64% పెరిగాయి. మాంసం, చేపలు ధరల స్పీడ్ 9.63 శాతంగా ఉంది ఫ్యూయెల్ అండ్ లైట్ క్యాటగిరీలో ద్రవ్యోల్బణం 7.52 శాతం. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచుతూ వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగించాలని ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కట్టడి అంచనాలు, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర ఆర్బీఐ పెంచింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అమెరికాలోనూ ధరదడ వాషింగ్టన్: ద్రవ్యోల్బణం సమస్య ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు ఈజీ మనీ వ్యవస్థలోకి రావడం దీనికి ప్రధాన కారణం. అమెరికాకు సంబంధించి మంగళవారం ఆ దేశ కార్మిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం ఏకంగా 40 సంవత్సరాల గరిష్ట స్థాయి 8.5 శాతంగా నమోదయ్యింది. 1981 తర్వాత ఈ స్థాయిలో దేశంలో ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఫుడ్, పెట్రోల్, హౌసింగ్, ఇతర నిత్యావసరాల ధరలు అమెరికా వినియోగదారులకు భారంగా మారాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు ఇటీవలే పావుశాతం (0.25 శాతం నుంచి 0.50 శాతానికి) పెరిగిన సంగతి తెలిసిందే. పారిశ్రామిక ఉత్పత్తి విషయానికి వస్తే, 2022 ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 1.7 శాతం పురోగమించింది. ఈ స్థాయి వృద్ధి రేటుకూ కేవలం లో బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం కావడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2021 ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే.. పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. రంగాల వారీగా ఇలా... మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఫిబ్రవరిలో కేవలం 0.8 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. మైనింగ్ రంగం 4.5 శాతం, విద్యుత్ ఉత్పత్తి 4.5 శాతం పురోగమించాయి. భారీ యంత్ర సామగ్రి, డిమాండ్‌కు సంకేతమైన క్యాపిటల్ గూడ్స్‌లో ఉత్పత్తి కేవలం 1.1 శాతంగా ఉంది. మౌలిక, నిర్మాణ రంగం ఉత్పత్తి 9.4 శాతం పెరిగింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 8.2 శాతం క్షీణించింది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించి కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా ఉత్పత్తి 5.5 శాతం పడిపోయింది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ 12.5% వృద్ధి కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి 11 నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదయ్యింది. తయారీ రంగం 12.9 శాతం పురోగమించింది. -
6 నుంచి ఆర్బీఐ సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి మూడు రోజులు జరగనుంది. ఏప్రిల్‌నుంచి ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) మొత్తం ఆరు ద్వైమాసిక సమావేశాలు జరుగుతుండగా, వచ్చే వారం తొలి సమావేశం జరుగుతుంది. సమావేశాల అనంతరం 8వ తేదీన ఎంపీసీ కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. గవర్నర్ నేతృత్వంలోని ఎంపీసీ కమిటీలోని మిగిలిన ఐదుగురిలో ఇద్దరు సెంట్రల్ బ్యాంక్ నుంచి నేతృత్వం వహిస్తారు. మరో ముగ్గురు స్వతంత్య్రంగా వ్యవహరించే ఇండిపెండెంట్ సభ్యులు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి, ఫిబ్రవరిల్లో 6 శాతంపైగా ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆర్బీఐ వృద్ధే లక్ష్యంగా గడచిన పది ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో)ను కొనసాగిస్తోంది. ఈ దఫా కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే యథాతథ వడ్డీరేటు కొనసాగింపు 11వ సారి అవుతుంది. -
సామాన్యుడికి కన్నీళ్లు ? దిగులు పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ధరల బాస్కెట్ 6.07 శాతం పెరిగిందన్నమాట. 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తోంది. వరుసగా రెండవ నెలలోనూ (జనవరిలో 6.01 శాతం) ఈ స్థాయి దాటి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక టోకు ద్రవ్యోల్బణం ఏకంగా రెండంకెలపైన 13.11 శాతంగా ఉంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... రిటైల్ ద్రవ్యోల్బణం... ఎనిమిది నెలల గరిష్టం 2021 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి చేరడానికి ఆహార ధరలు ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడించాయి. ఆహార ధరల బాస్కెట్ సమీక్షా నెల్లో 5.89 శాతంగా నమోదయ్యింది. జనవరిలో ఈ రేటు 5.43 శాతం. ఈ బాస్కెట్లో తృణధాన్యాల ధరలు 3.95 శాతం పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.45 శాతం ఎగశాయి. కాగా, గుడ్ల ధరల స్పీడ్ 4.15 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 6.13 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 6.09 శాతం ఎగశాయి. పండ్ల ధరలు మాత్రం జనవరితో పోల్చితే స్థిరంగా 2.26 శాతంగా ఉన్నాయి. ఇక ‘ఫ్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ధరా భారం తీవ్రంగా 8.73 శాతంగా ఉంది. అయితే జనవరి 9.32 శాతంతో పోల్చితే ఇది కొంచెం తగ్గడం ఊరట. క్రూడ్ ధరల తీవ్రత నేపథ్యంలో రానున్న నెలల్లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుతుందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఆర్బీఐపై దృష్టి... ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం 6 శాతం పైబడిందంటే.. అది పాలసీ రేటు నిర్ణయం ప్రభావం చూపుతోంది. వరుసగా రెండవ నెలా రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పడంతో రానున్న ఏప్రిల్ ఆర్బీఐ పాలసీ సమావేశాల నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున 5.7 శాతంగా ఉంటుందని, ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్బీఐ ఫిబ్రవరి మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది. అయితే రెపో రేటు ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించడానికి మాత్రం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధే లక్ష్యంగా వరుసగా పది ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా కొనసాగుతోంది. టోకు ద్రవ్యోల్బణానికి క్రూడ్ సెగ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.11 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణంకాగా, నాన్–ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా తీవ్రంగా ఎగశాయి. టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఆందోళనకరమైన అంశం. గడచిన పదకొండు నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరిలో ఈ రేటు 4.83 శాతం. అప్పటిలో అతి తక్కువ బేస్, తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► ఫ్యూయెల్ అండ్ పవర్ బాస్కెట్ రెండూ కలిపి ధరాభారం 31.50 శాతంగా ఉంది. అయితే ఒక్క క్రూడ్ పెట్రోలియం ధరల స్పీడ్ ఫిబ్రవరిలో ఏకంగా 55.17 శాతంగా ఉంది. జనవరిలో ఈ పెరుగుదల 39.41 శాతం. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతంగా ఉంది. కూరగాయల ధరల స్పీడ్ 26.93 శాతం. గుడ్లు, మాంసం, చేపల ధరలు 8.14 శాతం పెరిగాయి. ఉల్లి ధర 26.37 శాతం తగ్గింది. అయితే ఆలూ ధరలు మాత్రం 14.78 శాతం పెరిగాయి. జనవరిలో ధర పెరక్కపోగా 14.45 శాతం తగ్గింది. ► సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 9.84 శాతంగా ఉంది. జనవరిలో ఈ రేటు 9.42 శాతం. -
పరిశ్రమలు పడక.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ తాజా స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు నవంబర్‌లో కేవలం 1.4 శాతంగా ఉంది. ఇక డిసెంబర్లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 5.59 శాతానికి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న శ్రేణి కన్నా (2–6 శాతం) ఇది తక్కువగానే ఉన్నప్పటికీ ఎగువముఖ పయనం ఆందోళన కలిగిస్తోంది. సూచీ కదలికలు ఇలా... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం 2020 నవంబర్‌లో ఐఐపీ సూచీ 126.7 వద్ద ఉంది. 2021 నవంబర్‌లో ఈ సూచీ 128.5కు ఎగసింది. అంటే వృద్ధి రేటు 1.4 శాతమన్నమాట. 2019 నవంబర్‌లో సూచీ 128.8 పాయింట్ల వద్ద ఉంటే. అంటే కోవిడ్–19 దేశంలోకి ప్రవేశించిక ముందు నవంబర్ నెలతో పోల్చితే ఇంకా పారిశ్రామిక వృద్ధి దిగువలోనే ఉందని గ ణాంకాలు సూచిస్తున్నాయి. 2020 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి (–1.6%) క్షీణతలో ఉన్నా, తాజా సమీక్షా నెల (నవంబర్ 2021) ఈ విభాగం పేలవ పనితీరునే కనబరచడం గమనార్హం. కీలక రంగాలు చూస్తే.. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో వృద్ధి (2020 నవంబర్‌తో పోల్చి) కేవలం 0.9 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో మాత్రం కొంచెం సానుకూల వృద్ధి రేటు 5 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాలు, డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 3.7 శాతం క్షీణత నెలకొంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం 5.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎంఎఫ్‌సీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) విభాగంలో వృద్ధి 0.8 శాతం. నవంబర్–డిసెంబర్ మధ్య ‘బేస్ ఎఫెక్ట్’ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 17.4%గా నమోదైంది. దీనికి ‘లో బేస్’ ఎఫెక్ట్ ప్రధాన కారణం. ‘పోల్చు తున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదవడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కు వగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. ధరల తీవ్రత మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం అప్పర్ బాండ్ 6 శాతం దిశగా కదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌లో 4.91 శాతంగా ఉన్న రిటైల్ ఉత్పత్తుల ధరల బాస్కెట్, డిసెంబర్లో ఏకంగా 5.59 శాతానికి (2020 ఇదే నెలతో పోల్చి) చేరింది. తాజా సమీక్షా నెల్లో ఒక్క వస్తు, సేవల ధరలు (ఆహార, ఇంధన రంగాలు కాకుండా) ఏకంగా 6.2 శాతానికి చేరడం గమనార్హం. 2021 డిసెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 4.05 శాతంగా ఉంది. నవంబర్‌లో రేటు 1.87 శాతం. తృణ ధాన్యాలు, ఉత్పత్తులు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ప్రెపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు నవంబర్‌తో పోల్చితే పెరిగాయి. అయితే కూరగాయలు, పండ్లు, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ధరలు మాత్రం కొంత తక్కువగా ఉన్నాయి. ఇంధనం, లైట్ క్యాటగిరీలో ద్రవ్యోల్బణం 10.95 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఈ రేటు 13.35 శాతంగా ఉంది. 2021 జూలైలో 5.59 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అటు తర్వాత తగ్గుతూ వచ్చినా, తిరిగి 2021 అక్టోబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. -
రిటైల్ ద్రవ్యోల్బణం.. మూడు నెలల గరిష్టం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.91 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శ్రేణిలోనే నవంబర్ ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, గడచిన మూడు నెలల్లో ఈ స్థాయిలో ఈ అంకెలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలే దీనికి కారణమని సోమవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో 5.3 శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 4.35 శాతానికి తగ్గింది. అయితే అక్టోబర్‌లో స్వల్పంగా 4.48 శాతానికి ఎగసింది. రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న భరోసాతో వృద్ధే లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా తొమ్మిది ద్వైమాసిక సమావేశంలోనూ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా ప్రకటనలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్‌లో ఫుడ్ బాస్కెట్ ధర 1.87 శాతం పెరిగితే, అక్టోబర్‌లో ఈ పెరుగుదల రేటు 0.85 శాతంగా ఉంది. 2020 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 9.5 శాతం. ► గత ఏడాది నవంబర్‌తో పోల్చితే తాజా సమీక్షా నెల్లో కూరగాయల ధరలు తగ్గాయి. అయితే నెలవారీగా (2021 అక్టోబర్‌తో పోల్చి) ధరలు పెరిగాయి. ► ఆయిల్, ఫ్యాట్ విభాగంలో వార్షికంగా ధర 29.67 శాతం పెరిగింది. అయితే ఈ పెరుగుదల రేటు అక్టోబర్‌తో పోల్చితే తక్కువ. ► అక్టోబర్‌తో పోల్చితే పండ్ల ధరలు పెరిగాయి. ఆర్బీఐ అంచనాలు ఇలా... ఆర్థిక సంవత్సరంలో సగటును రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా కొనసాగుతుందని, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 5.1%, 5.7%గా ఉంటుం దని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 క్యూ1, క్యూ2లలో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. -
సామాన్యుల నెత్తి మీద మరో పిడుగు..!
Paint Companies To Hike Prices In December Again: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, అధిక రిటైల్ ద్రవ్యోల్భణంలో సతమతమవుతున్న సామాన్యుల నెత్తి మీద మరో భారం పడనుంది. దేశవ్యాప్తంగా పెయింట్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలు, ఇంధన వ్యయాలతో పోరాడుతున్న పెయింట్ కంపెనీలు మార్జిన్లను కాపాడుకునేందుకు గాను వరుసగా మరోసారి పెయింట్ధరలను పెంచనున్నాయి. పెయింట్ ఇండస్ట్రీలో సుమారు 50 శాతం మేర వాటాలను కల్గిన ఏషియన్ పెయింట్స్, బెర్జర్ కంపెనీలు వచ్చే నెల 5 నుంచి సుమారు 4-6 శాతం మేర పెయింట్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఈ కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది మొత్తంగా పెయింట్ ధరలు రికార్డుస్థాయిలో 19-20 శాతం మేర పెరిగాయి. దిగ్గజ పెయింట్ కంపెనీలు ధరల పెంపును ప్రకటించడంతో అక్జో నోబెల్ ఇండియా , ఇండిగో పెయింట్స్ వంటి పెయింట్ కంపెనీలు కూడా ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ద్రవ్యల్భోణం...! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సప్లై చైన్ రంగాల్లోని అంతరాయాలు నియంత్రణలోకి వచ్చిన ముడిసరుకు ఖర్చులు తగ్గుముఖం పడతాయనే అంచనాలు తలకిందులైనాయి. పెయింట్ కంపెనీలు కనీస మార్జిన్ లాభాలను పొందేందుకుగాను కచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అమిత్ సింగల్ క్యూ2 ఫలితాల్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. గత 40 ఏళ్లలో కనీస వస్తు ధరల్లో ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని చూడలేదని అమిత్ సింగల్ అన్నారు. ఒక వేళ ధరలను పెంచకపోతే కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్ రేట్స్ భారీగా పడిపోయే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆపరేటింగ్ మార్జిన్లను 18-20 శాతం స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏషియన్ పెయింట్స్ మేనేజ్మెంట్ సూచించింది పెంపుదల అనివార్యం... పెయింట్ ధరల పెంపు అనివార్యమని బెర్జర్ పెయింట్స్ ఎమ్డీ, సీఈవో అభిజీత్ రాయ్ అన్నారు. FY22 క్యూ2లో దాదాపు అన్ని పెయింట్ కంపెనీలు రెండంకెల వాల్యూమ్ వృద్ధిని సాధించాయి. FY22 క్యూ4లో కనీసం నుండి 18 శాతం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా? -
Stock Market: ప్రపంచ పరిణామాలే దిక్సూచి
ముంబై: ప్రపంచ పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ తదితర అంశాల నుంచీ సంకేతాలను మార్కెట్ అందిపుచ్చుకోవచ్చని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అనూహ్యరీతిలో పెరగడంతో ధరల కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చు. బాండ్లపై రాబడులు పెరగవచ్చు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపై ప్రభావం చూపవ చ్చు. ఈ నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టాక్ సూచీలు నేడు (సోమవారం) ముందుగా గత వారాంతంలో విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంది. ఈ రోజు విడుదల కానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం డేటాపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం ఎక్స్చెంజీలకు సెలవు. కనుక ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గత వారంలో సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. ‘‘పండుగలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాల సీజన్ దాదాపు ముగిసింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగితే సూచీలు నష్టాన్ని చవిచూడవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకరింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కొనసాగుతున్న అమ్మకాలు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నవంబర్ ప్రథమార్థంలో రూ.4,694 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో డెట్ మార్కెట్ నుంచి రూ.3,745 కోట్లను, ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.949 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈక్విటీలు అధిక విలువ ట్రేడ్ అవుతున్నాయనే కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని మార్నింగ్‌స్టార్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. -
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడమే లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. తద్వారా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 4 శాతం)ను యథాతథంగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు అక్టోబర్ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన సెంట్రల్ బ్యాంక్ ద్వైమాసిక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శా తం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుం దని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. -
దిగివచ్చిన ఆహార ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో మరింత తగ్గింది. 5.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోలి్చతే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.3 శాతం పెరిగిందన్నమాట. 2020 ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతం ఉంటే, 2021 జూలైలో 5.59 శాతంగా ఉంది. సంబంధిత రెండు నెలలతో పోల్చితే ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల 2021 ఆగస్టులో కొంత తగ్గిందన్నమాట. ఆహార ఉత్పత్తుల ధరలు కొంత తగ్గడం దీనికి ప్రధాన కారణమని సోమవారం వెలువడిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) లెక్కలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కీలక విభాగాలు ఇలా ► ఆహార బాస్కెట్ ద్రవ్యోల్బణం 2021 ఆగస్టులో 3.11 శాతంగా ఉంది. ఇది జూలైలో 3.96 శాతం. ► కూరగాయల ధరలు 11.7 శాతం తగ్గాయి. ► పప్పు దినుసులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 1.42 శాతం దిగివచ్చాయి. ► అయితే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ విషయంలో ధరలు ఏకంగా 33 శాతం ఎగశాయి. ► ఇంధనం, విద్యుత్ విషయంలో ద్రవ్యోల్బణం 13 శాతంగా ఉంది. ► సేవల ద్రవ్యోల్బణం 6.4 శాతం. 2–6 శ్రేణి లక్ష్యం... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2 నుంచి 6 శాతం మధ్య ఈ రేటు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 2020 హైబేస్ నేపథ్యంలో 2021 ఏప్రిల్‌లో 4.29 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ సరఫరాల సమస్య తీవ్రత నేపథ్యంలో మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలకు పెరిగింది. జూలైలో కొంత తగ్గి 5.59 శాతంగా ఉంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. సగటున రెండవ త్రైమాసికంలో 5.9 శాతం, మూడవ త్రైమాసికంలో 5.3 శాతం, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించిన గవర్నర్ నేతృత్వంలోని ఆర్బీఐ పాలసీ సమీక్షా కమిటీ, గడచిన ఏడు ద్వైమాసిక సమీక్షా సమావేశాల నుంచి రెపో రేటును యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడి జరుగుతుందన్న అంచనాలు, వృద్ధికి ఊపును అందించాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో సరళతర రేట్ల విధానానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. -
2022 జూన్ నుంచి రేట్ల పెంపు!
న్యూఢిల్లీ: వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత పెరుగుదల ధోరణి వ్యవస్థీకృతం (తీవ్రతను అడ్డుకోలేని వాస్తవ స్థితి) కాదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత సరఫరాల పరమైనదని, తాత్కాలికమైన ఈ సమస్య అదుపులోనికి (2–6 శ్రేణిలోకి) దిగివస్తుందని ఈ నివేదిక సూచించింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది మేనెల వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని, 2022 జూన్ నుంచీ రేట్లు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్ష వివరాలు శుక్రవారం వెల్లడవనున్న నేపథ్యంలో యూబీఎస్ ఈ విశ్లేషణ చేయడం గమనార్హం. నివేదికలో తన్వీ గుప్తా జైన్ పేర్కొన్న మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.5 శాతంగా కొనసాగుతుంది. 2022–23లో 4.5 శాతంగా కొనసాగవచ్చు. దిగువస్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించడం లేదు. వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, గృహ పొదుపులు పెరిగాయి. మహమ్మారి ప్రేరిత అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వృద్ధికి, ఆదాయానికి, ఉపాధి కల్పనకు దోహపపడుతుంది. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2021–22 ఆర్థిక సంవత్సరానికి 1.5 శాతం తగ్గించి 10 శాతంగా యూబీఎస్ గత నెలలో ప్రకటించడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్యం తగ్గడం, పట్టణ నిరుద్యోగిత 12 నెలల గరిష్టం 17.4 శాతానికి పెరగడం ప్రతికూల అంశాలుగా యూబీఎస్ పేర్కొంది. అయితే క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది. -
సామాన్యులకు కాస్త ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు పెట్రోల్ ధరలతో, మరో వైపు ఆహర ఉత్పత్తుల ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై పెరుగుతున్న ధరలతో సామాన్య జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న వేళ సామాన్యుడికి కాస్త ఊరట లభించనుంది. భారత్‌లో జూన్ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో సుమారు 6.3 శాతంగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం రోజున రిటైల్ ద్రవ్యోల్భణ గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది రెండోసారి. జూన్ నెలలో ప్రధానంగా ఆహరోత్పత్తుల ధరలు, ఇంధన ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.15 శాతానికి పెరిగిందని, మేలో ఇది 5.01 శాతంగా ఉందని ఎన్ఎస్ఓ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల్లో ఆహార, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.58 శాతంగా ఉంది. 'ఇంధన, లైట్' విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలతో పోల్చుకుంటే జూన్ నెలలో 12.68 శాతం గణనీయంగా పెరిగింది మే నెలలో 11.58 శాతంగా నమోదైంది. -
రాబడి మీకోసమేనా..?
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అన్ని రకాల పరిశ్రమలకూ ఈ సెగ గట్టిగానే తగులుతోంది. ముడి చమురు ధరలు, లోహాలు, రసాయనాలు, వంటనూనెలు ఇలా దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వినియోగ డిమాండ్ పెరగడం, ఉత్పత్తి, సరఫరా తగినంత లేకపోవడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. కారణాలేవైనా కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం గరిష్టాల్లోనే ఉంటోంది. కనుక ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు అధిక ద్రవ్యోల్బణానికి మార్గమే అవుతుంది. గడిచిన 12 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంది. అంటే 6 శాతం రాబడినిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినా.. నికరంగా మీ చేతికి వచ్చేది సున్నాయే. 2009 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం సగటున 10.4 శాతంగా మన దేశంలో కొనసాగింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడుల కోసం ఇన్వెస్టర్లు మెరుగైన సాధనాలకు పెట్టుబడుల్లో చోటివ్వాలి.. బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకులు అనుసరించే మార్గం వడ్డీ రేట్లను పెంచడం. కనుక రేట్లను పెంచే క్రమంలో బాండ్లలో పెట్టుబడులు అనుకూలం కాదు. దీనివల్ల బాండ్ల ధరలు తగ్గుతాయి. కరోనా రెండు విడతల ప్రభావంతో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక కొంత ఆలస్యంగా వడ్డీ రేట్లను పెంచే మార్గంలోకి వెళ్లొచ్చు. కానీ, కీలక రేట్లు పెరగకపోయినా.. ద్రవ్యోల్బణం రెక్కలు తొడుగుకుంటే మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లు (పదేళ్ల జీ–సెక్‌లు) పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లు 2009–2014 మధ్య భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉన్నట్టయితే వారికి లభించిన రాబడి రేటు వార్షికంగా 3.2 శాతమే. వాస్తవ రాబడి మైనస్ అవుతుంది. అందుకని అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందనుకుంటే అటువంటప్పుడు దీర్ఘకాల ప్రభుత్వ సెక్యూరిటీలు, దీర్ఘకాలంతో కూడిన కార్పొరేట్ బాండ్లకు దూరంగా ఉండడమే మంచిది. బ్యాంకుల ఎఫ్డీ రేట్లు సార్వభౌమ బాండ్ల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇవి చాలవు. ఈ విడత కీలక రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉన్నందున.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వడ్డీ రేట్లు కూడా సమీప కాలంలో పెరగకపోవచ్చు. ఆర్బీఐ గణాంకాలను పరిశీలిస్తే 2009–2014 మధ్య బ్యాంకు ఎఫ్డీ రేట్లు 8.6 శాతంగా ఉన్నాయి. మంచి రేటు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. నేడు బ్యాంకు ఎఫ్‌డీల రేట్లు 5–6 శాతం మధ్యే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటోంది. కనుక వాస్తవంగా ఇన్వెస్టర్‌కు వచ్చే రాబడి ఏమీ ఉండదు. చిన్న మొత్తాల పొదు పథకాల్లో టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్పత్ర, ఎన్ఎస్సీ రేట్లు కూడా 6–7 శాతం మధ్యే ఉన్నాయి. కనుక వాస్తవంగా వచ్చే రాబడి ఒక్క శాతం కూడా మించదు. ఈక్విటీలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొని మెరుగైన వాస్తవ రాబడులకు ఈక్విటీలు మార్గం చూపిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు బాండ్ల కంటే అధిక రాబడులనే ఇస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలోనే ఈ రిస్క్‌ను అధిగమించే రాబడులకు అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీల్లో మెరుగైన రాబడులను ఆశించొచ్చు. స్వల్పకాలానికి మాత్రం స్టాక్స్‌లో రాబడులు బాండ్లను మించి, ద్రవ్యోల్బణాన్ని మించి ఉంటాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా స్టాక్స్ ధరలు ఆయా కంపెనీల వృద్ధినే ప్రతిఫలిస్తుంటాయి. పారిశ్రామిక ముడి పదార్థాలైన పెట్రోకెమికల్స్, కెమికల్స్, పారిశ్రామిక లోహాల ధరలు పెరుగుతుంటే అవి కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే పెరుగుతున్న ధరలను కంపెనీలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొం టాయి. కరోనా రెండో విడత నేపథ్యంలో డిమాండ్ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయి. పెరిగిపోయిన ముడి సరుకుల ధరల వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడనుంది. కానీ, ఇదే సమయంలో కమోడిటీలను ఉత్పత్తి చేసే కంపెనీలు పెరుగుతున్న ధరల సైకిల్‌తో మంచి లాభాలను నమోదు చేసుకుంటాయి. ఇలా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కమోడిటీలను వినియోగించేవి కాకుండా.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుంటారు. కానీ, మన దగ్గర ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా బంగారానికి అంత ప్రాధాన్యం లేదు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చిన తరుణంలో బంగారం ప్రాధాన్య సాధనంగా ఉంటోంది. భారత ఇన్వెస్టర్లకు.. అంతర్జాతీయ సంక్షోభ సమయాలు లేదా కమోడిటీల ధరల పెరుగుదల సమయంలోనే రూపాయి క్షీణత కూడా చోటు చేసుకుంటోంది. 2009–2014 కాలంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో మన దేశ ఇన్వెస్టర్లకు బంగారం మంచి రాబడులను కురిపించింది. వార్షికంగా 13.2 శాతం చొప్పున బంగారం ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందనుకుంటే ఆ సమయంలో బంగారానికి కొంత కేటాయింపులు సహేతుకమే అవుతాయి. వివేకంతో వ్యవహరించాలి ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ విడుదల చేసిన నివేదికను పరిశీలించినట్టయితే.. నిఫ్టీ ఇండెక్స్‌లోని 11 కంపెనీలు పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందుతాయని అర్థమవుతోంది. 13 కంపెనీలపై చాలా ప్రతికూల ప్రభావం పడనుంది. మిగిలిన కంపెనీలపై ప్రభావం తటస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక కమోడిటీల ధరలు ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలే ఉంటే.. ఇన్వెస్టర్లు ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలకు దూరంగా ఉండడమే మంచిదవుతుంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే.. మధ్య తరహా, చిన్న కంపెనీలకు ఉత్పత్తుల ధరలను నిర్ణయించే శక్తి తక్కువగానే ఉంటుంది. కనుక పెరుగుతున్న తయారీ వ్యయాల ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. నిఫ్టీ లాభాల్లో కమోడిటీ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్న 2009–14 కాలంలో నిఫ్టీ–50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ వార్షికంగా 17 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆ కాలంలో ఉన్న సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతం కంటే ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాకపోతే నాటికి, నేటికీ మధ్య స్టాక్స్ వ్యాల్యూషన్లలో వ్యత్యాసం ఉంది. బేర్ మార్కెట్ తర్వాత 2009లో స్టాక్స్ వ్యాల్యూషన్లు చౌకగా ఉన్నాయి. నిఫ్టీ 50పీఈ 2009 జనవరిలో 13.3 పీఈ వద్ద ఉంది. కానీ నేడు నిఫ్టీ 50 పీఈ 29వద్ద ఉంది. కనుక ఈ దశలో పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ధరలను శాసించగల కంపెనీలను, పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీలు ఏ ఇతర సాధనంతో పోల్చినా దీర్ఘకాలంలోనే మెరుగైన రాబడులను ఇచ్చాయి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులేవనే చెప్పాలి. -
రిలయన్స్ అండతో కొనసాగిన రికార్డు ర్యాలీ
ముంబై: అదానీ గ్రూప్ వ్యవహారంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు.., చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే 539 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 77 పాయింట్ల లాభంతో 52,552 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 194 పాయింట్లను కోల్పోయినా.., 13 పాయింట్ల లాభంతో 15,800 పైన 15,812 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. మిడ్‌సెషన్‌లో సెన్సెక్స్ 52,591 వద్ద, నిఫ్టీ 15,823 గరిష్టాలను అందుకున్నాయి. రెండు సూచీలకు ముగింపు, ఇంట్రాడే స్థాయిలు జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. దీంతో సూచీల ర్యాలీ కొనసాగినట్లైంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, దేశంలో కోవిడ్ కేసులు తగ్గడం తదితర అంశాలు కలిసిరావడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించగా, తక్కిన రంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. మెటల్ షేర్లు అధికంగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.504 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీయ ఫండ్స్(డీఐఐలు) రూ.244 కోట్ల షేర్లను కొన్నారు. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ వరుసగా ఐదోరోజూ నష్టపోయింది. డాలర్ మారకంలో 22 పైసలు పతనమై 73.29 వద్ద స్థిరపడింది. మూడ్‌ను దెబ్బతీసిన అదానీ వ్యవహారం ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ ఫండ్ల అకౌంట్లను ఎస్‌సీడీఎల్ నిలిపివేసిందనే వార్తలతో ట్రేడింగ్ ఆరంభమైన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్ 539 పాయింట్లను కోల్పోయి 51,936 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు నష్టపోయి 15,605 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సూచీల రికవరీకి తోడ్పాటును అందించింది. ఒక దశలో 2% ర్యాలీ చేసి రూ.2,258 గరిష్టాన్ని అందుకుంది. చివరికి 1.5% లాభంతో రూ.2,245 వద్ద ముగిసింది. రిటైల్ ద్రవ్యోల్బణం... ఆరు నెలల గరిష్టం మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం గడచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో మేనెల్లో 6.3 శాతంగా నమోదయ్యింది. 2020 నవంబర్‌లో నమోదయిన 6.93 శాతం తర్వాత ఈ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు 4.23 శాతం. ఇదే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 1.96 శాతం నుంచి 5.01 శాతానికి ఎగసింది. రిటైల్ ద్రవ్యోల్బణం దీర్ఘకాలికంగా ఆరు శాతం దిగువనే ఉంటుందని అంచనావేస్తున్న ఆర్బీఐ, ‘వృద్ధే లక్ష్యంగా’ వరుసగా ఆరు త్రైమాసికాలుగా రెపో రేటును యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం మే నెల్లో మాసం చేపల ధరలు 9.03 శాతం, గుడ్ల ధరలు 15.16 శాతం, పండ్ల ధరలు 11.98 శాతం, పప్పు దినుసుల ధరలు 9.39 శాతం పెరిగాయి. ఫ్యూయెల్ లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 11.58 శాతంగా నమోదయ్యింది. -
మళ్లీ పరిశ్రమలు మైనస్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం వెలువడిన గణాంకాలు నిరాశపరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2021 జనవరిలో 1.6 శాతం క్షీణించింది. 2020 జనవరిలో ఐఐపీ 2.2 శాతం వృద్ధిలో ఉంది. ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 5.03 శాతానికి చేరింది. గడచిన మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయి 2–6 శాతం శ్రేణిలోనే ఉన్నప్పటికీ, మూడు నెలల గరిష్టానికి చేరడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణంమే ప్రాతిపదిక కావడం గమనార్హం. తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవస్థలో డిమాండ్ పెంపునకు మరో విడత రెపో తగ్గింపునకు రిటైల్ ద్రవ్యోల్బణం ‘అడ్డంకిగా కొనసాగే’ అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ‘ద్రవ్యోల్బణం భయాలతో’ యథాతథ రేటును కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతకు ఆహార ధరల పెరుగుదల కారణం కావడం మరో కీలకాంశం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... కీలక రంగాలు పేలవం ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77.6 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో ఉత్పత్తి 2020 జనవరితో పోల్చితే, 2021 జనవరిలో 2 శాతం క్షీణించింది. 2020 ఇదే నెలలో ఈ విభాగంలో 1.8 శాతం వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ విభాగంలో క్షీణత భారీగా 9.6 శాతంగా నమోదయ్యింది. 2020 జనవరిలో ఈ క్షీణత 4.4 శాతంగానే ఉంది. ► కన్జూమర్, నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ రెండు విభాగాలూ జనవరిలో క్షీణతను నమోదుచేసుకున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 0.2 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక సబ్బులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ (నాన్ డ్యూరబుల్స్) విభాగం ఏకంగా 6.8 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం. 2020 జనవరిలోనూ ఈ రెండు విభాగాలు క్షీణతలోనే ఉన్నాయి. ► మైనింగ్: 3.7 శాతం మైనస్‌లో ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో మాత్రం 5.5 శాతం ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. కరోనా నేపథ్యంలో... కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే క్షీణ పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో కూడా 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. డిసెంబర్లో తిరిగి 1.56 శాతం వృద్ధి నమోదుచేసుకున్నా (తొలి అంచనా 1 శాతం నుంచి ఎగువ దిశలో తాజా సవరణ), తిరిగి జనవరిలో క్షీణతలోకి జారిపోయింది. ఏప్రిల్–జనవరి మధ్య 12.2 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జనవరి వరకూ చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి 12.2 శాతంగా ఉంది. 2019–20 ఇదే కాలంలో కనీసం స్వల్పంగానైనా 0.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఆహార ధరలు పైపైకి... రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2021 ఫిబ్రవరిలో ఫుడ్ బాస్కెట్‌కి సంబంధించి ధరల స్పీడ్ 3.87 శాతంగా ఉంది (2020 ఇదే నెలతో పోల్చి). జనవరిలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 1.87 శాతంగా ఉంది. ఇందులో వేర్వేరుగా చూస్తే ఆయిల్, ఫ్యాట్స్ విభాగంలో ధరలు ఏకంగా 20.78 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 6.28 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 6.27 శాతం తగ్గాయి. జనవరిలో ఈ తగ్గుదల ఏకంగా 15.84 శాతం ఉండడం గమనార్హం. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.59 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 12.54 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 11.13 శాతం పెరిగాయి. ఇక ‘ప్యూయెల్ అండ్ లైట్’ విభాగంలో ద్రవ్యోల్బణం 3.53 శాతంగా నమోదయ్యింది. హెల్త్ కేటగిరీ ద్రవ్యోల్బణం 6.33 శాతంగా ఉంటే, రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ధరల స్పీడ్ 11.36 శాతంగా ఉంది. -
రేటు కోతకు గణాంకాలు ‘సై’!
న్యూఢిల్లీ: సరళతర ద్రవ్య పరపతి విధానం దిశలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో కీలక చర్య తీసుకునేందుకు వీలు కల్పించే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 డిసెంబర్లో 4.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే ఉత్పత్తుల బాస్కెట్ ధర 4.59 శాతం పెరిగిందన్నమాట. 15 నెలల కనిష్ట స్థాయి ఇది. ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2020 నవంబర్‌లో 1.9 శాతం క్షీణించింది. అంతక్రితం రెండు నెలలు వృద్ధి బాటలో నడిచిన సూచీ మళ్లీ క్షీణతను చూడ్డం గమనార్హం. కేంద్రం ఆర్బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం శ్రేణిలో (ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద) ఉండాలి. ఈ లెక్కన తాజా సమీక్షా నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం గాడిన పడినట్లే భావించాల్సి ఉంటుంది. 2021 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన ద్వైమాసిక సమావేశం జరగనుంది. పారిశ్రామిక ‘పేలవం’ కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణించింది. అటు తర్వాత ఆగస్టు 2020 వరకూ మైనస్‌గానే కొనసాగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా 0.48 శాతం, 4.2 (అక్టోబర్‌లో గత 3.6 శాతం అంచనాల నుంచి మరింత మెరుగుపరచడం జరిగింది) శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే నవంబర్లోనే తిరిగి క్షీణతను నమోదుచేసుకున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయ తాజా ప్రకటన వివరించింది. 2019 నవంబర్‌లో ఐఐపీ 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. తాజా సమీక్షా నెల 2020 నవంబర్‌లో వేర్వేరుగా వివిధ రంగాల తీరును చూస్తే.... తయారీ: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన ఈ విభాగం 1.7 శాతం క్షీణించింది. మైనింగ్: క్షీణత 7.3 శాతం. విద్యుత్: ఈ విభాగంలో 3.5 శాతం వృద్ధి నెలకొంది. భారీ యంత్ర పరికరాలు, డిమాండ్‌కు సంకేతంగా పరిగణించే క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 7.1 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 0.7 శాతం పడిపోయింది. నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఇక దుస్తులు, సబ్బులు, టూత్ పేస్టుల ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగానికి సంబంధించిన ఈ విభాగంలో సైతం 0.7 శాతం క్షీణరేటే నమోదుకావడం ఆందోళనకరమైన అంశం. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో స్వల్పంగానైనా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. తగ్గిన ఆహార ధరా భారం... రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో లక్ష్యాల మేరకు 4.59%కి దిగిరావడానికి శాంతించిన ఆహార ఉత్పత్తుల ధరలు కొంత కారణం. ఆర్బీఐ నిర్దేశిత స్థాయిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే తొలిసారి. కూరగాయల ధరలు నవంబర్‌లో 10.41% తగ్గాయి (నవంబర్‌లో 15.63% పెరుగుదల). ఆహార ద్రవ్యోల్బణం మొత్తంగా చూస్తే, 3.41% తగ్గింది (16 నెలల కనిష్టం). నవంబర్‌లో ఈ రేటు 9.5%. తృణ ధాన్యాల ధరల్లో కేవలం 0.98% పెరుగుదల నమోదయ్యింది. నవంబర్‌లో 2.32% పెరుగుదల రేటు ఉంది. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ రేటు కోత లేదా ప్రస్తుత సరళ విధానం కొనసాగించడానికి మార్గం సగమం అయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. -
రికార్డుల హోరు
ముంబై: ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో వెలువడిన అక్టోబర్ నెల టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లను మెప్పించగలిగాయి. అలాగే రూపాయి బలపడడం, కొనసాగిన విదేశీ పెట్టుబడుల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు సూచీలకు కొత్త జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,373 వద్ద గరిష్టాన్ని, 45,951 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఫండ్స్ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై బ్రిటన్–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బర్గర్ కింగ్ బంపర్ లిస్టింగ్ ఫాస్ట్‌ఫుడ్ చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో బంపర్ హిట్‌ను సాధించాయి. ఇష్యూ ధర రూ. 60తో పోలిస్తే బీఎస్ఈలో 92% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయ్యాయి. చివరకు 130% లాభంతో రూ.138 వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5,282.10 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 191.55 లక్షలు, ఎన్ఎస్ఈలో 18.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బర్గర్ కింగ్ కంపెనీ 2020 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 268 దుకాణాలను కలిగి ఉంది. -
ఆర్బీఐ కీలక సమావేశాలు ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ సమావేశం విధాన నిర్ణయాలు వెల్లడవుతాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ‡ ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు అంచనాలను ఎంపీసీ తగ్గించే అవకాశం ఉంది. అలాగే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలనూ ప్రకటించవచ్చని అంచనా. -
సామాన్యునిపై ధరల భారం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని దాటి ధరలు తీవ్రమవుతున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.34 శాతంగా (2019 సెప్టెంబర్‌తో పోల్చి) నమోదయ్యింది. గత ఎనిమిది నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్య విభాగాలు చూస్తే... ► వినియోగ ధరల సూచీలో ఒక్క కన్జూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్‌ను చూస్తే, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం భారీగా 10.68%కి ఎగసింది. కూరగాయల ధరలు 20.73% పెరిగాయి. ప్రొటీన్ రిచ్ గుడ్ల ధరలు 15.47% పెరిగాయి. ► ఫ్యూయెల్ అండ్ లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 2.87 శాతంగానే ఉంది. తగ్గుతుందంటున్న ఆర్బీఐ...: నిజానికి ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4% వద్ద ధరల స్పీడ్ ఉండాలి. దీని ప్రాతిపదికనే తన ద్రవ్య పరపతి విధానంలో కీలకమైన రెపో రేటుపై (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 4%) ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటోంది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బం దులతో ఆగస్టులో యథాతథ విధానాన్ని ప్రకటించింది. తాజా అక్టోబర్ విధాన సమీక్షలోనూ ఇదే విధానాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికా ల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నా యనేది ఆర్బీఐ అంచనా. సెప్టెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.8%గా ఉంటుందని, అయితే వచ్చే త్రైమాసికాల్లో ఈ సమస్య తగ్గుతుందని ఆర్బీఐ పేర్కొంది. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4%కి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5%కి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. -
టోకు ధరలు.. మైనస్ నుంచి ప్లస్
న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే... టోకు డిమాండ్ మెరుగుపడుతుందనుకోలేం! టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్‌లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్ (– 1.57%), మే (–3.37%), జూన్ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి. వ్యవస్థలో డిమాండ్ లేమి పరిస్థితులను ప్రతి ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అయితే తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మళ్లీ డిమాండ్ కనిపిస్తోందనడానికి సూచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరగడానికి బేస్ ఎఫెక్టే కారణమన్నది వారి అంచనా. అంటే 2019 ఆగస్టులో నమోదయిన టోకు ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండడం (కేవలం 1.17%), ఆర్థిక మందగమనం వల్ల అటు తర్వాత నెలల్లోనూ వ్యవస్థలో పూర్తి ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులే నెలకొనడం వంటి అంశాలతో తాజా సమీక్షా నెల 2020 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం కొంచెం పెరిగినట్లు ‘గణాంకాల్లో’ కనిపిస్తోందన్నది వారి అభిప్రాయం. దీనినే బేస్ ఎఫెక్ట్ మాయగా నిపుణులు పేర్కొంటారు. కాగా మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.42%. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ విభాగాలతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.60 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.51 శాతం. ఇక ఈ విభాగంలో కేవలం ఫుడ్ ఆర్టికల్స్‌ను తీసుకుంటే, ద్రవ్యోల్బణం 7.80 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం (–1.46 శాతం) కొనసాగుతోంది. 2019 ఇదే నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.68 శాతం. ► ఇంధనం, విద్యుత్: ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 3.53 శాతం నుంచి మరింతగా మైనస్ 9.68 శాతానికి పెరిగింది. ► తయారీ: తయారీ రంగంలో 1.27 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. 2019 ఆగస్టులో ఇది స్థిరంగా ఉంది. టోకున ‘నిత్యావసరాల’ మంట డబ్ల్యూపీఐ... ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా చూస్తే 7.80% నుంచి 3.84%కి తగ్గినా, నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా సామాన్యునికి భారంగానే ఉండడం గమనార్హం. కూరగాయల ధరలు 7.03% పెరిగాయి (2019 ఆగస్టుతో పోల్చి). పప్పు దినుసుల ధరలు 9.86% ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 6.23% పెరిగాయి. ఆలూ ధరలు భారీగా 82.93 శాతం ఎగశాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం 34.48% తగ్గాయి. -
మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.91 శాతం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 మార్చిలో 5.91 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 మార్చి ధరలతో పోల్చితే 2020 మార్చిలో 5.91 శాతం పెరిగిందన్నమాట. నిజానికి ఫిబ్రవరిలో నమోదయిన 6.58 శాతంకన్నా ఇది తక్కువే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నిజానికి 2 శాతం ఉండాలి. అయితే ఈ స్థాయికి మైనస్ రెండు, లేదా ప్లస్ రెండు కూడా తగిన స్థాయిగానే పరిగణించడం జరుగుతుంది. దీనిప్రకారం 5.91 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంటే కొంత ఆందోళనకర అంశమే. తక్కువ స్థాయి వడ్డీరేట్ల సరళతర ద్రవ్య పరపతి విధానం అనుసరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయి భారీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు భారంగానే ఉంటుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాలను విభాగాల వారీగా చూస్తే... ► ఆహారం, పానీయాలు: ఈ విభాగం మొత్తంగా ద్రవ్యోల్బణం రేటు 7.82 శాతంగా ఉంది. ఈ విభాగంలో కూరగాయలు (18.63 శాతం), పప్పులు, పప్పు దినుసులు (15.85 శాతం), తృణ ధాన్యాలు (5.30 శాతం), మాంసం, చేపలు (9.15 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (6.47 శాతం), నూనె, కొవ్వు పదార్థాలు (7.54 శాతం), గుడ్లు (5.56 శాతం), సుగంధ ద్రవ్యాల (9.82 శాతం) ధరలు ఐదు శాతంపైగా పెరిగాయి. కాగా నాలుగు శాతంలోపు ధరలు పెరిగిన ఉత్పత్తుల్లో పండ్లు (3.56 శాతం), చక్కెర, తీపి పదార్థాల ఉత్పత్తులు (3.85 శాతం), ఆల్కహాలేతర పానీయాలు (2.24 శాతం), ప్రిపేర్డ్ మీల్స్ , స్నాక్స్ (2.84 శాతం) వంటివి ఉన్నాయి. ► పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత పదార్థాలు: ద్రవ్యోల్బణం 4.71 శాతం ► దుస్తులు, పాదరక్షల విభాగం: ధరల స్పీడ్ 2.11 శాతంగా ఉంది. ► హౌసింగ్: 4.23 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ► ఫ్యూయెల్ అండ్ లైట్: ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.59 శాతంగా ఉంది. -
చల్లబడిన రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల ధరల సూచిక ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 ఫిబ్రవరిలో 6.58 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, ఇతర వంట వస్తువుల ధరలు చల్లబడటంతో ఫిబ్రవరిలో ఆరు నెలల తర్వాత తొలిసారి రిటైల్ ద్రవ్యోల్బణం 6.58 శాతానికి తగ్గిందని ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 7.59 శాతం, గత ఏడాది ఫిబ్రవరిలో 2.57 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో మాంసం, చేపల విభాగ ద్రవ్యోల్బణం 10.2 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 10.5 శాతంగా ఉంది. 2019 ఆగస్టు నుండి పెరుగుతూ వస్తున్న సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం తొలిసారని తనదిశను మార్చుకుంది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 50.19 శాతం గరిష్ట స్థాయి నుండి 31.61 శాతానికి చల్లబడింది. ప్రోటీన్ అధికంగా ఉండే పప్పుధాన్యాలు గుడ్ల విషయంలో ధరల పెరుగుదల రేటు కూడా నెమ్మదిగా ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన సీపీఐ గణాంకాల ప్రకారం 2020 ఫిబ్రవరిలో ఆహారద్రవ్యోల్బణం 10.81 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో ఇది 13.63 శాతం. అయితే, 'ఇంధన కాంతి' విభాగంలో ద్రవ్యోల్బణం అంతకుముందు నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దాదాపు 6.36 శాతానికి పెరిగింది. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనాకి కరోనా వైరస్ ఆందోళనలు తోడు కావడంతో ఆర్బీఐ ఈసారి భారీగా వడ్డీ రేట్ల కోత పెట్టనుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2020 ఏప్రిల్ 3 నుంచిప్రారంభంకానున్న ఏంపీసీ సమావేశాల్లో ఈసారి 50 బీపీఎస్‌పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. గత సమీక్షలో రెపో రేటును 5.15 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఇప్పటికే పలుదేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేటు కోతను ప్రకటించాయి. -
ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆర్థికమందగమనంపై భయాలు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన,. కొనసాగుతుండగానే జనవరి నెలలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంచనాలకుమించి ఆరేళ్ల గరిష్టానికి చేరింది. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది.సీపీఐ డేటా గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) బుధవారం వెల్లడించింది. 2019 జనవరిలో ద్రవ్యోల్బణ రేటు 2.05 శాతంగా ఉంది. ఎన్ఎస్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్లో 14.12 శాతం నుండి 13.63 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణ రేటు 2019 జనవరిలో (-) 2.17 శాతంగా ఉంది. ఈ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 50.19 శాతానికి పెరిగింది, 2019 డిసెంబర్లో 60.50 శాతంగా ఉంది. అదేవిధంగా, తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు 5.25 శాతం వేగంతో పెరిగాయి. పప్పుధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు ఈ నెలలో 16.71 శాతం పెరిగాయి. ముఖ్యంగా మార్చి 2019 నుంచి క్రమంగా పెరుగుతూ నింగిని తాకిన ఉల్లిపాయల ధరలు ద్రవ్యోల్బణం పెరగడానికి దోహదం చేసింది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల ధరల మంట దీనికి కారణంగా భావిస్తున్నారు. కాగా ఫిబ్రవరి నాటి పరపతి విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా వుంచింది. ద్రవ్యోల్బణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతానికి (2 శాతం మార్జిన్‌తో) అటూ ఇటూగా వుండాలే చూడాలని కేంద్రానికి ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు మందగమన పరిస్థితులకు అద్దం పడుతూ దేశంలోని పారిశ్రామిక ప్రగతి మరింత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఇప్పటికే నెగటీవ్ జోన్లోకి చేరిన పారిశ్రామికోత్పత్తి డిసెంబరులో 0.3 శాతానికి పతమైంది. ఉత్పాదక రంగం క్షీణించి, ఏడాది క్రితం ఇదే నెలలో 2.5 శాతం వృద్ధిని సాధించింది. చదవండి : దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
రెండో రోజూ రికార్డులే..
కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల ఆల్‌టైమ్ హై రికార్డులు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లో కూడా ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. స్టాక్ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులమయంగా పరిమిత శ్రేణిలో సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 41,953 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 12,362 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన 42,000 పాయింట్ల మైలురాయికి సెన్సెక్స్ 47 పాయింట్ల దూరంలో ఉండగా, నిఫ్టీ కీలకమైన 12,350 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ట్రేడైంది. లోహ, ఐటీ, కన్సూమర్, వాహన షేర్లు పెరిగాయి. బ్యాంక్, ఇంధన, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా... రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసినా మార్కెట్ ముందుకే దూసుకుపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. బడ్జెట్లో మరిన్ని తాయిలాలను కేంద్రం ప్రకటించగలదన్న ఆశలున్నాయని, కంపెనీల క్యూ3 ఫలితాలపై ఆశావహ అంచనాలూ లాభాలకు కారణమన్నారు. - హీరో మోటొకార్ప్ షేర్ 2.1 శాతం లాభంతో రూ.2,408 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. - రుణ నాణ్యత ఒకింత తగ్గడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ 3.8 శాతం నష్టంతో రూ.1,470 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. - పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకాయి. హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, బెర్జర్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇప్కా ల్యాబ్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎన్ఐఐటీ టెక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ధరల మంట : చుక్కల్లో ద్రవ్యోల్బణం !
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనానికి తోడు ధరల మంట సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బంగారం నుంచి ఉల్లిగడ్డ వరకూ ఏ వస్తువును కదిలించినా ధరలు ఆకాశం అంటుతున్నాయి. ధరల మంటతో డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాలను మించి ఏకంగా 6.2 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని రాయటర్స్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఈనెల 13న వెల్లడికానున్న డిసెంబర్ ద్రవ్యోల్బణ గణాంకాల్లో రిటైల్ ద్రవ్బోల్బణంపై ఆర్బీఐ అంచనా రెండు నుంచి 6 శాతాన్ని అధిగమించి ఏడు శాతం వరకూ ఇది ఎగబాకుతుందని రాయ్‌టర్స్ పోల్‌లో పాల్గొన్న వారిలో 60 శాతం మందికిపైగా అభిప్రాయపడ్డారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరగుతుండటంతోనే రిటైల్ ద్రవ్యోల్బణం చుక్కలు చూడటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర ఆహారోత్పత్తుల ధరలు పెరిగినా ప్రధానంగా ఉల్లి ధరలు ఇటీవల నాలుగింతలకు పైగా పెరగడమే ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆస్ధా గిద్వాణీ పేర్కొన్నారు. -
రిటైల్ ధరల మంట
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్‌లో అదుపు తప్పింది. 4.62 శాతంగా నమోదయ్యింది. అంటే వినియోగ వస్తువుల బాస్కెట్ ధర 2018 అక్టోబర్‌తో పోల్చిచూస్తే, 2019 అక్టోబర్‌లో 4.62 శాతం పెరిగిందన్నమాట. గడిచిన 16 నెలల కాలంలో (జూన్ 2018లో 4.92 శాతం) ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతాన్ని మించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (ఆర్బీఐ) కేంద్రం నుంచి నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువదిశలో 4% దాటకూడదన్నమాట. సెప్టెంబర్‌లో 5.11 శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధరల స్పీడ్ అక్టోబర్‌లో 7.89%కి పెరిగింది. ఒక్క కూరగాయల ధరలు ఇదే కాలంలో 5.40%నుంచి 26.10%కి ఎగిశాయి. పండ్ల ధరలు 0.83% నుంచి 4.08%కి పెరిగాయి. తృణధాన్యాల ధరలు 2.16%, మాంసం, చేపల ధరలు 9.75%, గుడ్ల ధరలు 6.26% పెరిగాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 11.72 శాతం ఎగిశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 3.10 శాతం పెరిగాయి. రెపోరేటు కోత ఇక లేనట్లే! అక్టోబర్‌లో ఈ రేటు అదుపు తప్పిన నేపథ్యంలో మరో దఫా ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.15%) తగ్గింపునకు అవకాశాలు తక్కువేనన్నది నిపుణుల అభిప్రాయం. అలా చేస్తే, వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత పెరుగుతుందని, దీనితో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనీ, ఇది నిరుపేదల కొనుగోళ్లపై పెను భారం చూపుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. గడిచిన ఐదు ఆర్బీఐ ద్వైమాసిక సమావేశాల్లో 135 బేసిస్ పాయింట్లు (1.35%) రెపో రేటు తగ్గి 5.15 శాతానికి దిగివచ్చింది. -
నాలుగు నెలల గరిష్టానికి రీటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ నాలుగు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. జనవరి మాసంలో 2.05 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 2.57 శాతానికి చేరింది. అటు ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి 1. 7 శాతానికి పడిపోయింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.05 శాతం నుంచి 2.57 శాతానికి పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి జనవరి నెలలో 2.4 శాతం నుంచి 1.7 శాతానికి క్షీణించింది. -
గణాంకాలే దిక్సూచి..!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్ త్రైమాసికానికి పలు కార్పొరేట్ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యకాలంలో 2,000 కంపెనీలు క్యూ3 ఫలితాలను ప్రకటించనుండగా.. ఈవారంలోనే పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంశాలపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి అంతర్జాతీయ అంశాల పరంగా.. డిసెంబర్‌కు సంబంధించిన అమెరికా రిటైల్ అమ్మకాల డేటా ఫిబ్రవరి 14న (గురువారం) వెలువడనుంది. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, జపాన్ డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈనెల 15న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. ఇక దేశీ ప్రధాన అంశాల విషయానికి వస్తే.. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ 13న (బుధవారం) ముగియనుంది. డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సీపీఐ డేటా ఈనెల 12న (మంగళవారం) వెలువడనుండగా.. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14న వెలువడనుంది. భౌగోళిక రాజకీయ అంశాల ప్రభావం.. అమెరికా–ఉత్తర కొరియా చర్చలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌తో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈనెల 27, 28 తేదీల్లో భేటీ ఉంటుందని, ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన ముందస్తు చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. అటువైపు ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అణు నిరాయుధీకరణ పరమైన ప్రకటనలు వెలువడకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను కొనసాగించే అంశగా మారింది. యూరోజోన్ వృద్ధి మందగిస్తుందంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనేది మార్కెట్ వర్గాల మాట. కంపెనీల ఫలితాలు.. సోమవారం అమరరాజా బ్యాటరీస్, ఆంధ్రా బ్యాంక్, ఐషర్ మోటార్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఇండియా సిమెంట్స్, స్పైస్‌జెట్ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. మంగళవారం బాటా, కోల్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, హెచ్ఈజీ, హిందాల్కో, కరూర్ వైశ్యా బ్యాంక్, మన్‌పసంద్ బెవరేజెస్, ఎన్సీసీ, సన్ ఫార్మా గణాంకాలను వెల్లడించనున్నాయి. అదానీ గ్యాస్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా, జీవీకే పవర్, ఇన్ఫీబీమ్, ఎంటీఎన్ఎల్, నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, యునైటెడ్ బ్రూవరీస్, వోల్టాస్ ఫలితాలు ఈవారమే ఉన్నాయి. రూ.5,300 కోట్ల ఎఫ్ఐఐల పెట్టుబడి... ఫిబ్రవరి 1–8 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,273 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. మరోవైపు డెట్ మార్కెట్ నుంచి రూ.2,795 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్లో కూడా నికర అమ్మకందారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఈసారి కొనుగోలుకు మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణం అధిక ఆర్ధిక వృద్ధి అంచనాలేనని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాంషు శ్రీవాత్సవ వివరించారు. ‘సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున వీరు వేచిచూసే వైఖరిని అవలంభించేందుకు అవకాశం ఉంది. ముడిచమురు, డాలరుతో రూపాయి కదలికలు సైతం ఎఫ్‌పీఐల ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రేట్ల కోతకు ‘ధర’ల ఊతం!!
న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50) తగ్గింపునకు ఇది అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడాలని కోరుతున్నాయి. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ఏడు నెలల కనిష్ట స్థాయి అరశాతంగా నమోదయిన విషయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తూ, ఈ రంగానికి చేయూత నివ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. జనవరి–మార్చికి సంబంధించి డీఅండ్‌బీ వ్యాపార ఆశావహ పరిస్థితి కూడా ఇక్కడ గమనార్హం. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలను చూస్తే... వరుసగా రెండవ నెల తగ్గిన టోకు ధరలు ► వరుసగా రెండు నెలల నుంచీ తగ్గిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేటు కోత అవకాశాలపై పారిశ్రామిక వర్గాల్లో ఆశావహ స్థితిని సృష్టిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 5.54 శాతం ఉంటే, నవంబర్‌లో 4.64 శాతంగా నమోదయ్యింది. ► మొత్తంగా...: 2018 డిసెంబర్లో (2017 ఇదే నెల ధరలతో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్ ధర కేవలం 3.80 శాతమే పెరిగింది. అంతక్రితం ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల నమోదు ఇదే తొలిసారి. ఇంధనం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు టోకున తగ్గడం దీనికి ప్రధాన కారణం. ► ప్రైమరీ ఆర్టికల్స్: సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.28 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.86 శాతం. ఇక ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూసుకుంటే పెరుగుదల అసలు లేకపోగా –0.07 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో ధరల పెరుగుదల రేటు 4.72 శాతం. కూరగాయల ధరలు వరుసగా ఆరు నెలల నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో పెరుగుదల రేటు 26.98 శాతం ఉంటే, డిసెంబర్లో ఈ రేటు 17.55 శాతంగా ఉంది. టమోటా ధరలు నవంబర్‌లో పెరుగుదల రేటు 88 శాతంగా ఉంటే, డిసెంబర్లో 49 శాతానికి తగ్గాయి. ఇక పప్పు దినుసుల పెరుగుదల రేటు 2.1 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 4.55 శాతం. ఉల్లిపాయల ధరలు మాత్రం 64 శాతం తగ్గాయి. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం 4.45 శాతం పెరిగింది. 2017 డిసెంబర్లో ఇది క్షీణతలో –0.17శాతంగా నమోదయ్యింది. ► ఇంధనం, విద్యుత్: ఈ విభాగంలో రేటు 8.03 శాతం నుంచి 8.38 శాతానికి ఎగిసింది. 2018 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 16.28 శాతం ఉండటం గమనార్హం. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల వార్షికంగా 2.79% నుంచి 3.59%కి పెరిగింది. అయితే నెలవారీగా చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 4.21%. రిటైల్‌గా చూసినా తగ్గిన ధరల స్పీడ్.. ఇక వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 2018 డిసెంబర్లో 2.19%. అంటే 2017 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌గా ధరల బాస్కెట్ 2.19% పెరిగిందన్నమాట. గడచిన 18 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరల స్పీడ్ తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2018 నవంబర్‌లో రిటైల్ ధరల స్పీడ్ 2.33 శాతం ఉండగా, డిసెంబర్లో 5.21 శాతంగా నమోదయ్యింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆహార ఉత్పత్తుల ధరలు పెరక్కపోగా –2.51 శాతం తగ్గాయి. ఇంధనం, లైట్ ద్రవ్యోల్బణం స్పీడ్ 7.39%(నవంబర్‌లో) నుంచి 4.54%కి (డిసెంబర్) తగ్గింది. -
సగం తగ్గిన లాభాలు
స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ లాభాలు కొనసాగాయి. రిటైల్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడయ్యాయి. బ్యాంక్‌ల అధినేతలతో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ కానుండటం కూడా కలసివచ్చింది. రూపాయి బలపడగా, ముడి చమురు ధరలు నిలకడగా ఉండటంతో స్టాక్‌సూచీలు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 35,930 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 10,792 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే మూడు రోజుల వరుస లాభాల కారణంగా మధ్యాహ్నం తర్వాత మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో స్టాక్ సూచీల లాభాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. గణాంకాలతో కళకళ.... ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ఆరంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి 8.1 శాతానికి పుంజుకోవడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. రిటైల్ ద్రవ్యల్బోణం తగ్గడంతో కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు పెరిగాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్ అధినేతలతో ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ గురువార భేటీ కానుండటంతో బ్యాంకింగ్ రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు కళకళలాడాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 317 పాయింట్లు, నిఫ్టీ 101 పాయింట్ల వరకూ పెరిగాయి. అయితే వరుస మూడు రోజుల ర్యాలీ కారణంగా మధ్యాహ్నం తర్వాత కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ లాభాలు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. ఆల్‌టైమ్ హైకి హెచ్‌యూఎల్.. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల రానున్నందున గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారిస్తుందని, గ్రామీణ మార్కెట్లో డిమాండ్‌ను పెంచే పథకాలు, నిర్ణయాలు రానున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వినియోగ కంపెనీల షేర్లు మంచి లాభాలు సాధించాయి. హిందుస్తాన్ యూనిలివర్, కాల్గేట్ పామోలివ్ (ఇండియా) షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ► సన్‌ఫార్మాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సెబీ వెల్లడించడంతో సన్ ఫార్మా షేర్ 2 శాతం నష్టంతో రూ.422 వద్ద ముగిసింది. ► టార్గెట్ ధరను రూ.350 నుంచి రూ.375కు మోర్గాన్ స్టాన్లీ పెంచడంతో ఎస్బీఐ షేర్ 1 శాతం లాభంతో రూ. 288 వద్దకు చేరింది. ► ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో క్యాపిటల్ ఫస్ట్ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలపడంతో ఈ రెండు షేర్లు ఇంట్రాడేలో చెరో 7 శాతం వరకూ ఎగిశాయి. రూపాయి వరుస నష్టాలకు బ్రేక్ ముంబై: వరుసగా మూడు రోజుల పాటు నష్టపోయిన రూపాయి.. గురువారం కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 33 పైసలు బలపడి 71.68 వద్ద క్లోజయ్యింది. డాలర్ బలహీనపడటం, ముడిచమురు ధరలు కాస్త తగ్గుముఖం పడుతుండటం ఇందుకు కారణం. కీలక అంశాల్లో సంబంధిత వర్గాలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటానంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కొత్తగా నియమితులైన శక్తికాంత దాస్ భరోసానివ్వడం కూడా రూపాయికి కొంత ఊతమిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఏడాది కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి,ముంబై: నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. బుధవారం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతంగా నమోదైంది. అక్టోబర్ నెలలో ఇది 3.31 శాతంగా ఉంది. వరుసగా గత నాలుగు నెలలుగా దిగి వస్తున్న రీటైల్ ద్రవ్యోల్బణం తాజాగా దీంతో 2017 జులై నాటి స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పారిశ్రామికవృద్ధి రేటు రెండింతలైంది. ఇది ఆర్థికవ్యవస్థకు డబుల్ బొనాంజా అని విశ్లేషకులు పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్ నెలలో 8.1 శాతం పెరిగింది.ఇది ఏడాది గరిష్టం. సిఎస్ఓ డేటా ప్రకారం కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2.61 శాతంతో పోలిస్తే.. తాజాగా 0.86 శాతంగా ఉంది. గత నెలలో 7.39 శాతంతో పోలిస్తే ఇంధనం ద్రవ్యోల్బణం 8.55 శాతంగా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణం అక్టోబరు 3.55 శాతంతో పోలిస్తే 3.53 శాతం వద్ద ఉంది. హౌసింగ్ ద్రవ్యోల్బణం నవంబరు 5.99గా నమోదుకాగా అంతకుముందు నెలలో ఇది 6.55 శాతంగా ఉంది. -
పారిశ్రామిక ఉత్పత్తి ఉసూరు!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌లో అంతంతమాత్రంగానే నమోదయ్యింది. వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.5 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం, అలాగే భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు సెప్టెంబర్‌లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2017 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 4.1 శాతం. ఆగస్టులో ఈ రేటు 4.6 శాతం. జూన్‌లో ఈ రేటు 6.9 శాతంకాగా, జూలైలో 6.5 శాతం. ఈ ఏడాది మేలో వృద్ధి రేటు 3.8 శాతం. ♦ సెప్టెంబర్‌లో మైనింగ్ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రంగం 7.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ♦ అలాగే క్యాపిటల్స్ గూడ్స్ విషయంలోనూ ఇదే జరిగింది. సమీక్షా నెలలో 8.7 శాతం వృద్ధి రేటు–5.8 శాతం క్షీణ బాటకు మళ్లింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు మాత్రం 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 సానుకూలంగా ముగిశాయి. ప్రత్యేకించి ‘ఫర్నిచర్’ విభాగంలో వృద్ధి భారీగా 32.8 శాతం నమోదయ్యింది. 20.9 శాతంతో తదుపరి స్థానంలో దుస్తుల విభాగం ఉంది. అయితే ప్రింటింగ్ అండ్ రీప్రొడక్షన్ ఆప్ రికార్డెడ్ మీడియా విభాగంలో వృద్ధి భారీగా –12.9 శాతం క్షీణించింది. పొగాకు ఉత్పత్తుల విభాగంలో క్షీణత –7.3 శాతంగా ఉంది. ♦ విద్యుత్ ఉత్పత్తి సైతం 3.4 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. ♦ కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ వృద్ధిరేట్లు వరుసగా 5.2 శాతం, 6.1 శాతంగా నమోదయ్యాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఫర్వాలేదు... కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) ఐఐపీ వృద్ధి రేటు 2.6 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. మౌలికరంగం నెమ్మది! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) దాదాపు 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోవడం మొత్తం గ్రూప్‌పై ప్రభావం చూపింది. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఈ గణాంకాల అనంతరం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే తాజా సెప్టెంబర్ ఐఐపీ ఫలితాలు వచ్చాయి. మొత్తం ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల్లో ఎరువులు (2.5 శాతం), సిమెంట్ (11.8 శాతం), విద్యుత్ (8.2 శాతం), బొగ్గు (6.4 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.5 శాతం), స్టీల్ (3.2 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.2 శాతం), సహజవాయువు (–1.8 శాతం) ఉన్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఈ రంగాల వృద్ధి రేటు 3.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరగడం గమనార్హం. అక్టోబర్‌లో రిటైల్ ధరలు... కూల్! 3.31 శాతంగా నమోదు ఏడాది కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.31 శాతం పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం గడచిన ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కొన్ని నిత్యావసరాలు, పండ్లు, ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగాచూస్తే... ♦ 2018 సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.7 శాతం. 2017 అక్టోబర్‌లో ఈ రేటు 3.58%. ♦ తాజా సమీక్షా నెలలో ఫుడ్ బాస్కెట్ ధర పెరక్కపోగా 0.86% క్షీణించింది. సెప్టెంబర్‌లో 0.51% పెరుగుదల నమోదయ్యింది. ♦ కూరగాయల ధరలు సెప్టెంబర్‌లో 4.15% పెరిగితే, అక్టోబర్‌లో – 8.06% తగ్గాయి. ♦ ఫ్రూట్ బాస్కెట్ ధర సెప్టెంబర్‌లో 1.12 శాతం పెరిగితే, అక్టోబర్‌లో –0.35 శాతానికి తగ్గింది. ♦ గుడ్లు, పాలు సంబంధిత ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలూ తగ్గాయి. ♦ ఇక ఫ్యూయల్, లైట్ విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో ఈ ద్రవ్యోల్బణం 8.47 శాతం ఉంటే, అక్టోబర్‌లో 8.55 శాతానికి పెరిగాయి. -
ఫలితాలు, గణాంకాలు.. కీలకం
ఈ వారం నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్టాక్‌మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం, తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. ఈ వారంలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. రేపు (ఈ నెల 10–మంగళవారం) టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల క్యూ1 ఫలితాలు వస్తాయి. ఈ నెల 13న(శుక్రవారం) ఇన్ఫోసిస్ తన జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడిస్తుంది. సైయంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు కూడా ఈ వారంలోనే తమ ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక ఆర్థిక గణాంకాల విషయానికొస్తే, ఈ నెల 12న(గురువారం)మే నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడవుతాయి. ఈ ఏడాది మార్చిలో 4.6 శాతంగా ఉన్న ఐఐపీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.9 శాతానికి పెరిగింది. మేలో 5.9 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే రోజు జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వస్తాయి. ఈ ఏడాది మేలో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ జూన్‌లో 5.2 శాతానికి పెరుగుతుందన్న అంచనాలున్నాయి. రుతు పవనాలపై ఇన్వెస్టర్ల దృష్టి... ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై, రుతు పవనాల విస్తరణపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే చెప్పారు. ప్రస్తుతం వాణిజ్య యుద్ధాల కథ నడుస్తోందని, ఈ విషయమై తుది అంచనాలకు రావడానికి కొంత సమయం పడుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ వ్యూహకర్త వి.కె. శర్మ వివరించారు. తీరు మారిన విదేశీ పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.2,235 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.892 కోట్లు చొప్పున నికరంగా పెట్టుబడులు పెట్టారు. గత మూడు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిల్ మార్కెట్‌నుంచి రూ.61,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇటీవల పతనం కారణంగా పలు షేర్లు క్షీణించి ఆకర్షణీయంగా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరుగా సాగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రిటైల్ బ్రోకింగ్ హెడ్ రాజీవ్ శ్రీవాత్సవ చెప్పారు. -
మద్దతు ధరల పెంపుతో ద్రవ్యోల్బణానికి రెక్కలు!
న్యూఢిల్లీ: సాగు ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల పెంపు (ఎంఎస్పీ)తో రిటైల్ ద్రవ్యోల్బణం 73 బేసిస్ పాయింట్లు (0.73 శాతం) పెరుగుతుందని, ప్రభుత్వ కొనుగోళ్లపైనే ఇది ఆధారపడి ఉంటుందని ఎస్బీఐ నివేదిక ‘ఈకోరాప్’ తెలియజేసింది. 14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం రైతుల ఒత్తిళ్లను పరిష్కరించే దిశగా ఆహ్వానించతగినది అని పేర్కొంది. మద్దతు ధరల పెంపుతో రిటైల్ ద్రవ్యోల్బణంపై పడే ప్రభావం 50–100 బేసిస్ పాయింట్ల వరకు ఉండొచ్చని వివిధ అంచనాలు వెలువడుతుండటం గమనార్హం. జీడీపీపై 0.2–0.4 శాతం స్థాయిలోనూ ప్రభావం చూపించొచ్చన్న అంచనాలున్నాయి.