
సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ఏం కొనాలన్నావినియోగదారులకు కొండెక్కిన ధరలు చుక్కలు చూపుతున్నాయి. ధరల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్ధాయిలో 5.2 శాతానికి ఎగబాకింది. గత మూడు నెలలుగా వరుసగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ఆర్‌బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుండటంతో వడ్డీరేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ధరల భారం సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 2.2 శాతం నుంచి ఏకంగా 8.4 శాతానికి పెరగడం కొంత ఊరట ఇస్తోంది. పారిశ్రామిక ఉత్పాదకత 4 శాతంగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ భారీగా పెరగడం గమనార్హం.
ఇక తయారీ రంగం సైతం 10 శాతం పైగా వృద్ధిని నమోదు చేయడం ఉత్సాహం నింపుతోంది. అయితే ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.