జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08%
4 నెలల గరిష్ట స్థాయి
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ‘యూ’టర్న్ తీసుకుంది. పదకొండు నెలలుగా మెట్లు దిగివస్తూ, 2024 మేలో 4.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్‌లో 28 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 5.08 శాతానికి (2023 జూన్‌తో పోల్చి) చేరింది. అంతక్రితం గడిచిన నాలుగు నెలల్లో ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే తొలిసారి.
ఆహారం ప్రత్యేకించి కూరగాయల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 9.36%గా ఉంది. మేలో ఈ రేటు 8.69%. కూరగాయల ధరలు భారీగా 29.32% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 16.07 శాతంగా నమోదయ్యాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి.
Comments
Please login to add a commentAdd a comment