2024 డిసెంబర్ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయా?.. సెలవు రోజుల్లో ఆన్‌లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
➤డిసెంబర్ 25న క్రిస్మస్, కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
➤డిసెంబర్ 26, 27వ తేదీలలో మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా అక్కడి బ్యాంకులకు మాత్రమే సెలవు.
➤డిసెంబర్ 28, 29వ తేదీలు వరుసగా నాల్గవ శనివారం, ఆదివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
➤డిసెంబర్ 30వ తేదీ మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా.. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.)
Comments
Please login to add a commentAdd a comment