December
-
మౌలికం మందగమనం
న్యూఢిల్లీ: కీలక మౌలిక(ఇన్ఫ్రా) రంగ వృద్ధి 2024 డిసెంబర్ నెలలో కాస్త మందగించింది. 4 శాతానికి పరిమితమైంది. 8 మౌలిక రంగాల వృద్ధి అంతక్రితం ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా నమోదైంది. నెలవారీగా చూస్తే అంటే 2024 నవంబర్లోనూ 4.4 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం నేచురల్ గ్యాస్ ఉత్పత్తి క్షీణతను చవిచూసింది. అంతేకాకుండా వివిధ రంగాలలో ఉత్పత్తి నీరసించింది. బొగ్గు 5.3 శాతం, రిఫైనరీ ప్రొడక్టులు 2.8 శాతం, ఎరువులు 1.7 శాతం, స్టీల్ 5.1 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. అయితే అంతక్రితం డిసెంబర్లో వీటి ఉత్పత్తిలో వరుసగా 10.8 శాతం, 4.1 శాతం, 5.9 శాతం, 8.3 శాతం చొప్పున పురోగతి నమోదైంది. కాగా.. సిమెంట్ తయారీ 4 శాతం, విద్యుదుత్పత్తి 5.1 శాతం వృద్ధిని అందుకున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–డిసెంబర్లో కీలక రంగాలు బొగ్గు, చమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి 4.2 శాతం పుంజుకుంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో 8.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ 8 కీలక మౌలిక రంగాలు దేశీ పారిశ్రామిక ప్రగతిని సూచించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 40 శాతానికిపైగా వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
డిసెంబర్లో నియామకాల జోరు
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నియామకాలు డిసెంబర్లో జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 31 శాతం పెరిగినట్టు ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఆరు నెలల్లో నియామకాలు 12 శాతం పెరిగాయి. ఆన్లైన్ జాబ్ పోస్టింగ్‌ల ద్వారా ఈ వివరాలను ఫౌండిట్ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో నియామకాలు 36 శాతం పెరిగాయి. → కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, తయారీ, నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 57 శాతం నుంచి 60 శాతం వరకు ఈ రంగాల్లో నియామకాలు డిసెంబర్లో పెరిగాయి. → ఏఐ ఉద్యోగాలు గడిచిన రెండేళ్లలో 42 శాతం వృద్ధితో 2,53,000కు చేరాయి. పైథాన్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డీప్ లెరి్నంగ్, ఎస్‌క్యూఎల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. టెన్సార్‌ఫ్లో, పైటార్చ్ తదితర ఏఐ ఫ్రేమ్వర్క్ల్లో నైపుణ్యాలున్న వారికి సైతం అధిక డిమాండ్ కనిపించింది. → హెచ్ఆర్ అడ్మిన్ ఉద్యోగ నియామకాలు గత మూడు నెలల్లో 21 శాతం పెరిగాయి. → మెడికల్ ఉద్యోగాలు సైతం 44 శాతం అధికంగా నమోదయ్యాయి. టెలీ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్, నర్సింగ్, హెల్త్‌కేర్ అనలిస్ట్ తదితర హెల్త్‌టెక్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. → డిసెంబర్లో కోయింబత్తూరులో అత్యధికంగా 58 శాతం మేర నియామకాలు పెరిగాయి. బెంగళూరులో 41 శాతం, చెన్నైలో 37 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ముంబైలో 23 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్లో 33 శాతం చొప్పున అధిక నియామకాలు చోటుచేసుకున్నాయి. → టైర్–2, 3 నగరాలు హెల్త్‌కేర్ కేంద్రాలకు నిలయాలుగా మారుతున్నాయి. వీటికి సంబంధించి నియామకాలు 30 శాతం పెరిగాయి. → బెంగళూరులో 26 శాతం, పుణెలో 17 శాతం, ఢిల్లీలో 14 శాతం చొప్పున ఏఐ నియామకాలు వృద్ధి చెందాయి. ఏఐ కీలకం.. ‘‘అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగడం ఉద్యోగ మార్కెట్ చురుకుదనాన్ని, బలాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఏఐ ఉద్యోగాల్లో 42 శాతం పెరగడం గమనార్హం. 2025లోనూ ఏఐ ఉద్యోగ నియామకాల్లో 14 శాతం మేర వృద్ది ఉండొచ్చు. ఏఐ ఇకపై ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరులకు కీలకంగా కొనసాగుతుంది’’అని ఫౌండిట్ సీఈవో వి.సురేష్ అన్నారు. -
స్పల్పంగా తగ్గిన ఎగుమతులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో స్వల్పంగా ఒక్క శాతం తగ్గి 38.01 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా దిగుమతులు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్లో పెట్రోలియం, రత్నాభరణాలు, రసాయనాల ఎగుమతుల వృద్ధి నెమ్మదించింది. అయితే, జౌళి, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా నమోదయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఎగుమతుల గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. వాణిజ్య గణాంకాలను సమగ్రంగా విశ్లేషించే విదంగా కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫాంను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా వాణిజ్యానికి సవాళ్లతోపాటు కమోడిటీలు, లోహాల ధరల్లో హెచ్చుతగ్గులే ఎగుమతుల క్షీణతకు దారి తీసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 1.6 శాతం పెరిగి 321.71 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.15 శాతం పెరిగి 532.48 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 189.74 బిలియన్ డాలర్ల నుంచి 210.77 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర వివరాల్లోకి వెళ్తే.. → డిసెంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 29 శాతం క్షీణించి 4.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ఏకంగా 35.11 శాతం పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. 24 నెలల్లో ఇది గరిష్ట స్థాయి. → బంగారం దిగుమతులు 55 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులు 211 శాతం పెరిగి 421.91 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → సేవల రంగం ఎగుమతులు 31.63 బిలియన్ డాలర్ల నుంచి 32.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి. → సవరించిన గణాంకాల ప్రకారం 2024 నవంబర్‌లో ఎగుమతులు 5 శాతం తగ్గి 32.03 బిలియన్ డాలర్లకు క్షీణించగా, దిగుమతులు 16 శాతం పెరిగి 63.86 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 31.83 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్‌లో పసిడి దిగుమతులను 9.84 బిలియన్ డాలర్లకు సవరించారు. → డిసెంబర్లో అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు భారత్ అత్యధికంగా ఎగుమతులు చేయగా .. చైనా స్విట్జర్లాండ్, థాయ్‌ల్యాండ్, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. -
ఈక్విటీ ఫండ్స్లోకిపెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డిసెంబర్ నెలలో దుమ్మురేపాయి. అక్టోబర్ నెలలో నికరంగా 14 శాతం మేర పెట్టుబడులను కోల్పోయిన ఈక్విటీ ఫండ్స్.. తిరిగి డిసెంబర్ నెలలో రూ.41156 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో నికర ఈక్విటీ పెట్టుబడులు రూ.35,943 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. వరుసగా 46వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీలోని అన్ని విభాగాల పథకాల్లోకి నికర పెట్టుబడులు వచ్చాయి. 2024 మొత్తం మీద ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్లు రూ.3.94 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టారు. 2023తో పోల్చితే 144 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎప్పటి మాదిరే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాలు తమ జోరును కొనసాగించాయి. ఈ రెండు విభాగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌కు సైతం డిమాండ్ కొనసాగింది. డిసెంబర్లో డెట్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.3 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.80,355 కోట్లను ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా పరిశ్రమ నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) నెలవారీగా 1.7 శాతం తగ్గి డిసెంబర్ చివరికి రూ.66.9 లక్షల కోట్లకు పరిమితమైంది. విభాగాల వారీగా.. → స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,667 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,093 కోట్లు వచ్చాయి. నవంబర్ నెలతో పోల్చి చూస్తే స్మాల్క్యాప్లోకి 13 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 4 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. → లార్జ్‌క్యాప్ పథకాలు రూ.2,010 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. నవంబర్‌లో వచి్చన రూ.2,500 కోట్లతో పోల్చితే 20% తగ్గాయి. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,331 కోట్లను ఆకర్షించాయి. నవంబర్‌లో వచి్చన రూ.7,658 కోట్లతో పోల్చితే రెట్టింపయ్యాయి. → డిసెంబర్లో 33 కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.13,643 కోట్లను రాబట్టాయి. నవంబర్‌లో మొత్తం 18 ఎన్ఎఫ్వో ఇష్యూలు రాగా, అవి సమీకరించిన మొత్తం రూ.4,000 కోట్లు కావడం గమనార్హం. ఏకంగా మూడింతలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,770 కోట్లు వచ్చాయి. నవంబర్‌లో వచి్చన రూ.5,084 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. మల్టీక్యాప్ ఫండ్స్ 15 శాతం తక్కువగా రూ.3,075 కోట్లను ఆకర్షించాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో రూ.3,811 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ.640 కోట్లను ఆకర్షించాయి. 2024 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.11,226 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.సిప్ పెట్టుబడుల్లో వృద్ధి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.26,459 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. నవంబర్ నెల సిప్ పెట్టుబడులు రూ.25,320 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం పెరిగాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ పెట్టుబడుల విలువ రూ.13.63 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్లలో నమ్మకానికి నిదర్శనం ‘‘ఎన్‌ఎఫ్‌వోలు, సిప్ పెట్టుబడులు, ఏక మొత్తంలో కొనుగోళ్లు నికర పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పడ్డాయి. పెట్టుబడులు బలంగా రావడం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం’’అని కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. మార్కెట్ అస్థిరతల్లోనూ సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం అన్నది దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టు మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సురంజన బోర్తకుర్ పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది. -
డిసెంబర్లో భారీగా విద్యుత్ వినియోగం
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో విద్యుత్ వినియోగం (power consumption) గణనీయంగా పెరిగింది. 6 శాతం పెరిగి 130.40 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో వినియోగం 123.17 బిలియన్ యూనిట్లుగా ఉంది. రోజువారీ గరిష్ట సరఫరా (గరిష్ట డిమాండ్) 224.16 గిగావాట్లుగా నమోదైంది.2024 మే నెలలో 250 గిగావాట్లు ఇప్పటి వరకు గరిష్ట రోజువారీ రికార్డుగా ఉంది. 2024 వేసవి సీజన్‌కు గరిష్ట రోజువారీ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేయడం గమనార్హం. ఇక 2025 వేసవి సీజన్‌కు గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లకు చేరుకోవచ్చని భావిస్తోంది.రూమ్ హీటర్లు, వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం డిసెంబర్లో విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి చేరుకునే అవకాశాలతో విద్యుత్ వినియోగం జనవరిలోనూ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్‌ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్‌కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్‌పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్‌పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్‌లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
ఢిల్లీలో కొత్త రికార్డు..వందేళ్ల తర్వాత అంతటి వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సరిగ్గా 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షం పడింది.వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.ఇదీ చదవండి: అమ్మో ఇవేం ఎండలు -
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
2024 డిసెంబర్ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయా?.. సెలవు రోజుల్లో ఆన్లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.➤డిసెంబర్ 25న క్రిస్మస్, కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 26, 27వ తేదీలలో మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా అక్కడి బ్యాంకులకు మాత్రమే సెలవు.➤డిసెంబర్ 28, 29వ తేదీలు వరుసగా నాల్గవ శనివారం, ఆదివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 30వ తేదీ మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా.. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
కొనుగోళ్లకే ఎఫ్‌పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్‌లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్‌కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్‌కు క్రాప్ టాప్స్‌ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్‌కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్‌తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్‌్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్‌తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్‌కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్‌పై బాలీవుడ్ హిట్స్‌కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్‌లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్‌కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్‌గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
2024లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే..
2024 ముగుస్తోంది. లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.25,000 లోపు ధర వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4)ప్రస్తుతం మార్కెట్లో రూ. 25వేలలోపు ధర వద్ద లభిస్తున్న అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ4' ఒకటి. ఇది మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. బ్యాటరీ కెపాసిటీ కూడా ఉత్తమగానే ఉంటుంది. 6.74 ఇంచెస్ వైబ్రెంట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ పొందుతుంది. మంచి ఫోటోల కోసం లేదా ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే క్వాలిటీ వంటివి కోరుకునవారికి ఇది బెస్ట్ ఆప్షన్.రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)మంచి డిస్ప్లే, బెస్ట్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి 'రెడ్మీ నోట్ 13 ప్రో' ఉత్తమ ఎంపిక. దీని ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. 6.67 ఇంచెస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5100mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion)అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూసేవారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓ మంచి ఆప్షన్. ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ.. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)మోటరోలా ఎడ్జ్ 50 నియో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌ఫోన్. ఇది డైనమిక్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన.. 6.4 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, గుండ్రంగా ఉండే కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 50 MP ప్రైమరీ లెన్స్ & 32 MP సెల్ఫీ షూటర్ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.వివో టీ3 ప్రో (Vivo T3 Pro)లెదర్ బ్యాక్‌తో సొగసైన.. స్లిమ్ డిజైన్ పొందిన ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే పొందుతుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ పొందుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండటం వల్ల తక్కువ కాంతిలో కూడా ఫోటోలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ (2ఏ) (Nothing Phone (2a))పాలికార్బోనేట్ బ్యాక్‌తో, ప్లాస్టిక్ బిల్డ్ కలిగిన ఈ ప్రీమియం ఫోన్ ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. ఇందులోని గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రోజు వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఇది డ్యూయల్ 50 MP రియర్ కెమెరాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ ఫోటో అనుభవాన్ని పొందవచ్చు. -
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్‌పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్‌ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్‌ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్‌ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్‌లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్‌లు, కప్ కేక్‌లు, చీజ్ కేక్‌లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్‌లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్‌లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్‌లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్‌ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్‌లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్‌ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్‌ఫారమ్‌ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్‌ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్‌ను కేవలం బర్త్‌డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్‌లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్‌ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్‌స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..
Bank Holidays in December 2024: నవంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో డిసెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఏయే రోజుల్లో మూతపడతాయి అన్న వివరాలతో డిసెంబర్ బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం..ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అధిక మొత్తంలో వరుస సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, ప్రాంతీయ, జాతీయ విశేష సందర్భాల నేపథ్యంలో బ్యాంకులు కొన్ని రోజులే పనిచేయనున్నాయి.డిసెంబర్లో బ్యాంకులకు వారాంతపు సెలవులతో సహా కనీసం 17 లిస్టెడ్ సెలవులు ఉన్నాయి. కొన్ని దీర్ఘ వారాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు మీ సందర్శనలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ సెలవులు దేశంలోని రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.డిసెంబర్లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాడిసెంబర్ 1 - ఆదివారండిసెంబర్ 3 - శుక్రవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ (గోవా)డిసెంబర్ 8 - ఆదివారం డిసెంబర్ 12 - మంగళవారం - పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా (మేఘాలయ)డిసెంబర్ 14 - రెండవ శనివారండిసెంబర్ 15 - ఆదివారండిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)డిసెంబర్ 22 - ఆదివారండిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (దేశమంతా)డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 28 - నాల్గవ శనివారండిసెంబర్ 29 - ఆదివారండిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)డిసెంబర్ 31- మంగళవారం - నూతన సంవత్సర వేడుక/లాసాంగ్/నామ్సూంగ్ (మిజోరం, సిక్కిం) -
డిసెంబర్లో భారీగా పెళ్లిళ్లు.. మోగనున్న పెళ్లి బాజా
సాక్షి, అమలాపురం: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోంది. బ్రహ్మచారులు కొత్త బంధంలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కన్నెపిల్లలు సిగ్గుల మొగ్గలవుతూ ముస్తాబులకు రెడీ అవుతున్నారు. పెళ్లి ఏర్పాట్లకు వధూవరుల కుటుంబాలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. నగలు, వస్త్రాలు, కల్యాణ మండపాలు, సన్నాయి, కేటరింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. నగలు, వస్త్ర దుకాణాల్లో అప్పుడే షాపింగ్ కళ పెరిగిపోయింది. పెళ్లి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైంది. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆచితూచి శుభఘడియలను ఎంచుకుని ముడేస్తారు. తద్వారా వారి వివాహ బంధం జీవితకాలం ఎలాంటి ఆటుపోట్లకు లోనవకుండా ఉండాలని కోరుకుంటారు.మార్గశిరం మంచిదని..మార్గశిర (డిసెంబర్) మాసంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మాసంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మార్గశిర మాసంలో బలమైన ముహూర్తాలు ఉండటంతో పాటు జనవరిలో పుష్యమాసం కావడం.. మార్చి రెండో వారం నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) రానుండటంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ఆరాటపడుతున్నారు. ప్రస్తుత కార్తీక మాసంలో ఈ నెల 24న చివరి ముహూర్తం ఉంది. కార్తీకంలో పెళ్లిళ్లు జరిగినా పెద్దగా లేవనే చెప్పాలి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం మొదలు కానుండటంతో వివాహాలు అధిక సంఖ్యలో జరగనున్నాయి. తెలుగునాట మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల తరువాత మార్గశిర మాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. జనవరిలో ముహూర్తాలు లేవుడిసెంబర్ 25 తరువాత నుంచి జనవరి 30వ తేదీ వరకూ పుష్యమాసంలో వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా చేయరు. జనవరి 31 నుంచి మార్చి 7వ తేదీ వరకూ మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. మార్చి 13 నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) మొదలు కానుండటంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు. ఈ కారణాలతో మార్చి 7లోపు పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది ఆరాటపడుతున్నారు.7న అతి పెద్ద ముహూర్తండిసెంబర్ నెల పొడవునా ముహూర్తాలున్నాయి. ఆ నెలలో ఏడో తేదీ అతి పెద్ద ముహూర్తం. ఆ రోజున సుమారు 30 పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం సైతం పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో పుష్యమాసం కావడంతో పెద్దగా ముహూర్తాలు లేవు. ఈ కారణంగా డిసెంబర్లో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. – దైవజ్ఞరత్న ఉపద్రష్ట నాగాదిత్య సిద్ధాంతి, అమలాపురం25 వరకూ శుభముహూర్తాలుమార్గశిర మాసంలో డిసెంబర్ 4వ తేదీ బుధవారం బలమైన ముహూర్తాలున్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 7.54 గంటలకు, తెల్లవారుజామున 4.28 గంటలకు (తెల్లవారితే గురువారం), అలాగే 5, 6 తేదీల్లో ముహూర్తాలున్నాయి. 7వ తేదీన కూడా అతి పెద్ద ముహూర్తాలున్నాయి. ఆ రోజు రాత్రి 7.50, తెల్లవారుజామున 4.24 (8వ తేదీ ఉదయం) రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే, 10వ తేదీన సైతం అధిక సంఖ్యలో వివాహాలు చేయనున్నారు. డిసెంబర్ 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో పెళ్లిళ్లతో పాటు, వివిధ శుభ కార్యక్రమాలకు సైతం మంచి ముహూర్తాలు ఉన్నాయి. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్.. గోవాలో పెళ్లి? (ఫోటోలు)
-
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
కొత్త హంగులతో పునరాగమనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 2017లో నిలిచిపోయిన హెచ్‌ఐఎల్‌ను తిరిగి ఆరంభించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. ఈసారి లీగ్‌కు సరికొత్త హంగులు అద్దగా... పురుషులతో పాటు మహిళల విభాగంలో పోటీలుజరగనున్నాయి. డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు ప్లేయర్ల వేలం జరగనుంది. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. ఇందులో నలుగురు జూనియర్ ఆటగాళ్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టును రెసల్యూట్ స్పోర్ట్స్ కంపెనీ సొంతం చేసుకుంది. మహిళల లీగ్ తుదిపోరు వచ్చే ఏడాది జనగరి 26న, పురుషుల ఫైనల్ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించాడు. ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న లీగ్ విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగం దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఏడేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభం కానుంది. 2013లో ప్రారంభమైన లీగ్ ఐదు సీజన్లు పాటు విజయవంతంగా కొనసాగిన తర్వాత 2017లో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ శుక్రవారం వెల్లడించాడు. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఈ సారి మహిళల విభాగంలోనూ మ్యాచ్‌లు జరగనున్నాయి. హెచ్ఐఎల్ తిరిగి ప్రారంభమవడం ద్వారా ఆటకు మరింత ఆదరణ దక్కడంతో పాటు... మహిళల హాకీలో కోత్త జోష్ రానుంది. భారత మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీ హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఇప్పటికి కార్యరూపం దాలి్చంది. హెచ్ఐఎల్కు టిర్కీనే చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. ‘జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడంలో హాకి ఇండియా లీగ్ కీలక పాత్ర పోషించనుంది. హాకీ క్రీడలో కొత్త అధ్యాయానికి నేడు తెర లేచినట్లు అనిపిస్తోంది. అడగ్గానే హెచ్ఐఎల్ కోసం 35 రోజుల సమయాన్ని కేటాయించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు ధన్యవాదాలు. హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీని కోసం కృషి చేశా. ఇప్పటికి కల సాకారమైంది’ అని టీర్కీ పేర్కొన్నాడు. హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ మాట్లాడుతూ... భారత్‌లో హాకీ కేవలం క్రీడ మాత్రమే కాదని దీనికి భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. 2036 వరకు భారత హాకీకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించనుందని పునరుద్ఘాటించారు. జట్ల వివరాలు పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. వాటిలో చెన్నై జట్టుకు చార్లెస్ గ్రూప్, లక్నో జట్టుకు యదు స్పోర్ట్స్, పంజాబ్ జట్టుకు జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ జట్టుకు ష్రాచీ స్పోర్ట్స్, హైదరాబాద్ జట్టుకు రెసల్యూట్ స్పోర్ట్స్, రాంచీ జట్టుకు నవోయమ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులుగా కొనసాగనున్నారు. టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతికి చెందిన ఎస్జీ స్పోర్ట్స్ కంపెనీ ఢిల్లీ జట్టును సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో హరియాణా జట్టును జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ టీమ్‌ను ష్రాచీ స్పోర్ట్స్, ఢిల్లీ జట్టును ఎస్జీ స్పోర్ట్స్, ఒడిశా జట్టును నవోయమ్ స్పోర్ట్స్ సొంతం చేసుకున్నాయి. మరో రెండు ఫ్రాంచైజీల యజమానులను త్వరలోనే వెల్లడించనున్నారు. » పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో 6 జట్లు లీగ్‌లో పాల్గొననున్నాయి. గతంలో కేవలం పురుషుల విభాగంలోనే పోటీలు జరగగా.. తొలిసారి మహిళా లీగ్‌ను ప్రవేశ పెడుతున్నారు. » పురుషుల విభాగంలో పోటీలను రౌర్కెలాలో, మహిళల మ్యాచ్‌లను రాంచీలో నిర్వహించనున్నారు. » ఒక్కో జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వారిలో 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్ ప్లేయర్లు తప్పనిసరి. » డిసెంబర్ 28న ఈ లీగ్ ప్రారంభం కానుండగా... మహిళల విభాగంలో వచ్చే ఏడాది జనవరి 26న రాంచీలో ఫైనల్ జరగనుంది. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రౌర్కెలాలో తుదిపోరు జరగనుంది. » ఈనెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ప్లేయర్ల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ప్లేయర్ల కనీస ధరను మూడు కేటగిరీలుగా (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) విభజించారు. » ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 4 కోట్లు... మహిళల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు ఖర్చు చేయవచ్చు. » 2013లో తొలిసారి నిర్వహించిన హెచ్ఐఎల్లో రాంచీ రైనోస్ టైటిల్ సాధించగా.. ఆ తర్వాత 2014లో ఢిల్లీ వేవ్‌రైడర్స్, 2015లో రాంచీ రాయ్స్, 2016లో పంజాబ్ వారియర్స్, 2017లో కళింగ లాన్సర్స్ చాంపియన్‌గా నిలిచాయి. » పారిస్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఆటకు గుడ్‌బై చెప్పిన భారత దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఢిల్లీ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. -
డిసెంబరులో పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.2019లో వందేభారత్ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఈ సిరీస్‌లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఇఎంఎల్) ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మీడియాకు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్లో హైస్పీడ్ రైలు ట్రయల్‌ను నిర్వహించనున్నారు.స్లీపర్ వందేభారత్‌లో స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి. -
బన్నీ పుష్ప-2 కు పోటీగా మంచు విష్ణు కన్నప్ప..
-
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్‌లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
ఈపీఎఫ్‌వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్‌వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్‌వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
కొత్త చందాదారుల ఆకర్షణలో జియో టాప్
న్యూఢిల్లీ: కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మరోసారి రిలయన్స్ జియో ముందుంది. 2023 డిసెంబర్ నెలకు గాను 39.94 లక్షల మొబైల్ చందాదారులను జియో సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్టెల్ కిందకు కొత్తగా 18.5 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అదే సమయంలో ఎప్పటి మాదిరే వొడాఫోన్ ఐడియా మరో 13.68 లక్షల కస్టమర్లను డిసెంబర్లో కోల్పోయింది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షల కస్టమర్లు, ఎంటీఎన్ఎల్ 4,420 మంది కస్టమర్ల చొప్పున నష్టపోయాయి. మొత్తం టెలికం చందాదారులు 2023 నవంబర్ నా టికి 1,185.73 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,190.33 మిలియన్లకు (119 కోట్లకు) చేరారు. నెలవారీగా ఇది 0.39 శాతం వృద్ధికి సమానం. బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు సైతం 90.4 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య నవంబర్ చివరికి 3.15 కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ విభాగంలో జియో 2.46 లక్షల కొత్త కస్టమర్లను సాధించింది. ఎయిర్టెల్ 82,317 మంది, వొడాఫోన్ ఐడియా 9,656, క్వాండ్రంట్ 6,926 కస్టమర్ల చొప్పున సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250 మంది, టాటా టెలిసరీ్వసెస్ 22,628 మంది చొప్పున కస్టమర్లను కోల్పోయాయి.