
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి డిసెంబరు నెలలో కూడా కొన్ని ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా వచ్చేఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లకార్ల ధరలను పెంచక తప్పదని ఇటీవల ప్రకటించిన తరువాత అందిస్తున్న ఈ తగ్గింపు ధరలకు ప్రాధాన్యత లభిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, వవ్యాగన్ ఆర్, సెలెరియో తోపాటు, న్యూజెన్ ఆల్టో, మారుతి అరేనా మోడళ్లపై కొనుగోలు దారులు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందివచ్చు.
కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లుంటాయి. అలాగే నవంబరు నెలలో మాదిరిగానే ఎర్టిగా ఎమ్‌పివి. బ్రాండ్-న్యూ బ్రెజ్జా ఎస్‌యూవీలపై డిస్కౌంట్‌లు ఉండవు. మారుతి సుజుకి డిసెంబర్ 2022 నెలలో తన అరేనా లైన్ వాహన తగ్గింపును రూ. 52,000 వరకు అందిస్తోంది ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి ఆల్టో కె10 మాన్యువల్ మోడల్స్‌పై రూ.52,000 వరకు డిస్కౌంట్. ఏఎంటీ మోడల్స్ రూ. 22వేలు, ఇటీవల విడుదలైన సీఎన్‌జీ మోడల్ కూడా రూ.45,100 తగ్గింపుతో అందుబాటులో ఉంది.
సెలెరియో సీఎన్‌జీ రూ. 45,100, పెట్రోల్-మాన్యువల్ కార్లపై రూ. 36వేల వరకు తగ్గింపు అందు బాటులో ఉంది. ఏఎంటీ వెర్షన్‌పై రూ. 21,000 తగ్గింపు లభ్యం. హై ఎండ్ వేరియంట్లపై రూ. 42,000 వరకు తగ్గింపు , బేసిక్ మోడల్స్‌పై 17వేలు తగ్గింపు అందిస్తోంది.
మారుతి మాన్యువల్ ఎస్-ప్రెస్సో వేరియంట్‌లపై గరిష్టంగా రూ. 46,000, ఏఎంటీ వేరియంట్‌లు రూ. 20వేలు, సీఎస్‌జీ వేరియంట్‌పై రూ. 45,100 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విప్ట్ ఏఎంటీ, మాన్యువల్ మోడల్స్ రెండింటిలోనూ దాదాపు రూ. 32వేలు తగ్గింపు.
Comments
Please login to add a commentAdd a comment