
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సరిగ్గా 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షం పడింది.వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.
ఇదీ చదవండి: అమ్మో ఇవేం ఎండలు
Comments
Please login to add a commentAdd a comment