గౌహతి: డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్‌సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు.
లీగల్ కమిటీ..
శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్‌గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు.
ప్రజాభిప్రాయం కూడా..
ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు.
ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు.
సాయుధ దళాల ప్రత్యేక చట్టం..
1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది.
#WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ
— ANI (@ANI) September 3, 2023
ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
Comments
Please login to add a commentAdd a comment