polygamy
-
ఇది హిందుస్తాన్
ప్రయాగ్‌రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్‌ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్: రెండో పెళ్లి కుదరదంతే! షరతులు వర్తిస్తాయి
Assam అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత చట్టం ద్వారా పలు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్‌లో పేర్కొంది, ఈ మేరకు అసోం సర్కార్ అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడం విశేషం. (19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి) ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. (2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు) కాగా ఈ ఏడాది ప్రారంభంలో, అసోం బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్లో ప్రవేశపెడతామని శర్మ హింటిచ్చారు. అలాగే ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతోపాటు బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకున్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, దీనికి కమిటీ నివేదిక ఆమోదం లభించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముస్లిం మంత్రికి వ్యతిరేకంగా హిమాంత శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్‌గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
Assam: బహుభార్యత్వంపై సీఎం కీలక ప్రకటన!
బహుభార్యత్వాన్ని నిషేధించాలని ప్లాన్ చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రకటించారు. ఆ అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో అనే విషయాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ భారత రాజ్యగంలోని ఆర్టికల్ 25 ముస్లిం పర్సనల్ లా చట్టానికి సంబంధించిన 1937 లోని నిబంధనను పరిశీలిస్తోందన్నారు. ఈ మేరకు బిస్వా శర్మ తన ప్రభుత్వ రెండో వార్షికోత్సవం పురస్కరించుకుని.. ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాదు ఈ కమిటీ అన్ని న్యాయ నిపుణులతో విస్తృతమైన చర్చలు జరిపి మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక నిర్ణయానికి వస్తుందని చెప్పారు. జాతీయ ఏకాభిప్రాయానికి సంబంధించిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) వైపు తాము వెళ్లమని, దానిపై కేంద్రమే చొరవ తీసుకుంటుందని బిస్వా శర్మ చెప్పారు. యూసీసీలో ఒక భాగంగా అస్సాం రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించాలన్న తమ ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నట్లు బిస్వాశర్మ పేర్కొన్నారు. ఈ సమస్యపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసకుంటామని, బలవంతంగా లేదా దూకుడుగా వ్యవహరించమని చెప్పారు. కాగా, అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల అణిచివేత సమయంలో చాలామంది వృద్ధులు అనేకసార్లు వివాహాం చేసుకున్నారని, వారి భార్యల్లో చాలామంది పేద వర్గానికి చెందని యువతులని ముఖ్యమంత్రి చెప్పారు. బహు భార్యత్వం నిషేధం తోపాటు బాల్య వివాహాలకు పాల్పడేవారిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం సీఎం బిస్వా శర్మ అన్నారు. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
Viral News: తగ్గేదేలే! 60వ సారి తండ్రయిన పాకిస్తానీ.. నాలుగో పెళ్లికి రెడీ!
ఉరుకులు పరుగుల జీవితం. చాలీచాలని జీతం. సొంత పనులతో సతమతం. వెరసి ఒక్క బిడ్డ ముద్దు.. రెండో బిడ్డ వద్దు అనే పరిస్థితి. ఆర్థికంగా స్థితిమంతులైతే మరో ఇద్దరైనా పర్లేదనుకోవడం వింతేం కాదు! కానీ, పాకిస్తాన్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తాజాగా 60వ సారి తండ్రయ్యాడు. వైరల్‌గా మారిన ఈ సంగతి తెలిసినోళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం... బలూచిస్తాన్ రాజధాని ఖ్వెట్టా ప్రాంతానికి చెందిన సర్దార్ జన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ తన 50 వ ఏట మరో వారసునికి తండ్రయ్యాడు. అంతేకాదు ఇప్పటికే ముగ్గురు భార్యలున్న ఈయన మరో భార్య కావాలంటూ ప్రయత్నాలు చేయడం విశేషం. ఫ్యామిలీ డాక్టర్ అయిన సర్దార్ జన్.. తన సొంతింట్లోనే క్లినిక్ నడుపుతున్నాడు. తాజాగా పుట్టిన తన బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే పేరు పెట్టాడు. అంతేకాదు అంత పెద్ద కుటుంబాన్ని ఒకే చోట పెట్టి పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని షంషద్ న్యూస్ అనే వార్తా సంస్థ ట్విటర్లో పేర్కొనగా వైరల్‌గా మారింది. (చదవండి: 6 నెలల తర్వాత తొలిసారి.. ఉక్రెయిన్ సైనికుడిని చూసి భార్య భావోద్వేగం.. వైరలవుతోన్న వీడియో) ఇక మరోసారి తండ్రయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సర్దార్ జన్.. తనకు మగ సంతానం కంటే ఆడ సంతానం అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు. మరో పెళ్లి చేసుకుని మరింత మంది వారసులకు జీవితాన్నిస్తానని అంటున్నాడు. నాలుగో పెళ్లి కోసం స్నేహితుల సాయం కూడా కోరినట్టు వెల్లడించాడు. తన కుటుంబం మరింత పెద్దదైనా వేరు చేయకుండా ఒకేచోట ఉండాలని అతను ఆకాంక్షించాడు. ఇదిలాఉంటే.. ఇప్పటికే పదుల సంఖ్యలో బిడ్డలకు జన్మనిచ్చిన అతని ముగ్గురు భార్యలు మరిన్ని కాన్పులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం మరో విశేషం. (చదవండి: తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం) Sardar Jan, a resident of Quetta, became the father of the “sixtieth” child. Sardarjan Mohammad Khan, a resident of Quetta, the Capital of Balochistan, said his sixtieth child was given birth yesterday. Jan uttered the newborn child is a baby son and he named him Khushal. pic.twitter.com/OHxbYm35kW — ShamshadNews (@Shamshadnetwork) January 3, 2023 Sardar Jan, a resident of Quetta, became the father of the “sixtieth” child. Sardarjan Mohammad Khan, a resident of Quetta, the Capital of Balochistan, said his sixtieth child was given birth yesterday. Jan uttered the newborn child is a baby son and he named him Khushal. pic.twitter.com/OHxbYm35kW — ShamshadNews (@Shamshadnetwork) January 3, 2023 -
ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట
Brazilian Model Arthur O Urso Wants To Marry Two More: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా ఉంది అతగాడి తీరు. ఒకరికి డబ్బు పిచ్చి ఉంటుంది. మరొకొందరికి సినిమాల పిచ్చి.. ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఇతగాడికి మాత్రం భార్యల పిచ్చి ఉంది. ఒక భార్యతోనే వేగలేకపోతున్నామని గగ్గోలు పెడుతుంటారు ఫ్యామిలీ మ్యాన్లు. ఇతగాడు మాత్రం 'నాకు ఒక్కరు సరిపోరు పది మంది కావాలంటూ' కోరుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా మహానుభావుడు అంటే.. బ్రెజిల్‌కు చెందిన యంగ్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతోంది. ఎందుకంటే ఆర్థర్ ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా వారి అంగీకారంతోనే. 9 మంది భార్యలతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆర్థర్. ఆ ఫొటో కాస్తా వైరల్ కావడంతో ఫేమస్ అయ్యాడు మనోడు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఆర్థర్. ఇప్పటివరకు అతడితో అన్యోన్యంగా ఉన్న 9 మంది భార్యల్లో ఒకరు ఆర్థర్‌కు షాక్ ఇచ్చింది. ఆర్థర్ 9 మంది భార్యల్లో ఒకరైన అగాథ.. ఉర్సో నుంచి విడాకులు కోరిందట. ఆమె ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటుందని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేకపోవడంతో విడాకులకు అంగీకరించానని ఉర్సో చెప్పుకొచ్చాడు. 'నేను ఆమెకు మాత్రమే సొంతమట. ఇంకేవరితో నేను ఉండకూడదట. ఇదేమన్నా బాగుందా. మనం పంచుకోవాలి. మేము విడిపోతున్నందుకు బాధగానే ఉంది. కానీ ఆమె చెప్పిన కారణం నాకు షాకింగ్‌గా ఉంది.' అని తెలిపాడు బ్రెజిల్ యంగ్ మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో. అంతేకాకుండా తన జీవితంలో 10 మంది భార్యలు ఉండాలని కోరుకుంటున్నాని తెలిపాడు ఆర్థర్. అయితే ఇప్పుడే తన భార్య స్థానాన్ని భర్తీ చేయనని.. కానీ త్వరలోనే ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకుని తన కోరిక తీర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. అలాగే అతడికి తన ప్రతీ భార్య పట్ల సమానమైన ప్రేమ ఉంటుదన్నాడు. ఈ యంగ్ మోడల్‌కు ఇన్‌స్టా గ్రామ్‌లో 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇదివరకు ఈ 9 మందితో జరిగిన తన వివాహానికి బ్రెజిల్‌లోని సోవో పావోలో చట్టబద్దత లేదు. ఆ దేశంలో బహుభార్యత్వం చట్ట విరుద్ధం. -
16 మంది భార్యలు, 151 మంది సంతానం.. 17వ పెళ్లికి సిద్ధం
హరారే: తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగాలు, అత్తెసరు జీతాలు.. ఆకాశన్నంటే ధరలున్న ఈ కాలంలో ఒక్కరు బతకడమే కష్టంగా ఉంది. తప్పనిసరిగా పెళ్లి చేసుకున్నా.. భార్యాభర్తలిద్దరూ జాబ్ చేస్తే తప్ప గడవదు. ఖర్చులకు భయపడే చాలా మంది ఒక్కరినే కంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇందుకు విరుద్ధం. ఇతగాడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 16 పెళ్లిల్లు చేసుకుని.. 151 మంది బిడ్డలను కన్నాడు. అంతటితో ఆగాడా అంటే లేదు.. తాజాగా 17వ సారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదిలో 17వ పెళ్లి జరగాలంటున్నాడు. ఇంతకు ఎవరా మహానుభావుడు.. ఏమా వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. జింబాబ్వేకు చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ యుద్ధ అనుభవజ్ఞుడైన మిషెక్ న్యాన్డోరో బహుభార్యత్వ విధానంతో హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఇక తన పూర్తి సమయాన్ని భార్యలను సంతృప్తిపర్చడానికే కేటాయిస్తాడట. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘32 ఏళ్ల క్రితం అనగా 1983లో నేను ఈ బహుభార్యత్వ ప్రాజెక్ట్ ప్రారంభించాను. నా లక్ష్యం చనిపోయే లోపు 100 పెళ్లిల్లు చేసుకుని.. 1000 మంది సంతానాన్ని కనాలి. నేను చనిపోయాకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. వివాహానికి ముందే దీని గురించి పెళ్లి చేసుకోబోయే వారికి చెప్తాను. వారి అంగీకారంతోనే ఇంతమందిని వివాహం చేసుకున్నాను. రోజంతా నా భార్యలని సంతృప్తిపరచడానికే కేటాయిస్తాను’’ అని తెలిపాడు. ఇంత మందిని వివాహం చేసుకోవడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తలెత్తలేదా అని ప్రశ్నిస్తే.. ‘‘లేదు.. దీని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. ఇన్ని పెళ్లిల్లు చేసుకోవండ వల్ల నాకు 151 మంది సంతానం కలిగారు. వీరిలో చాలా మంది పెద్దవారయ్యారు. తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. వారే నా కోసం బహుమతులు తీసుకొస్తారు. ఓ రకంగా చెప్పాలంటే నా సంతానమే నన్ను చెడగొట్టింది. నా అవసరాలన్ని వారే తీరుస్తారు. నాకు డబ్బులు కూడా ఇస్తారు. ఇక ప్రతి భార్య నా కోసం వంట చేస్తుంది. ఎవరూ రుచిగా వండితే వారి వంటే తింటాను. బాగా చేయని వాటిని తిప్పి పంపిస్తాను. దీని గురించి కూడా వారికి ముందుగానే చెప్పాను’’ అన్నాడు. A Zimbabwean man from Mbire, Misheck Nyandoro, has fathered 151 children with 16 wives & he is still counting Mr Nyandoro has said POLYGAMY is a project that he undertaken since 1983 & he will stop marrying & fathering children the day death visits, him.@Chekkenyenye @OpenParlyZw pic.twitter.com/12eCPjB4ez — Eddie Gore (@EddieGore10) May 8, 2021 చదవండి: తాళి కట్టించుకున్న వరుడు.. ''చీర కూడా కట్టుకో'' -
కిలాడీ లేడీ పెళ్లిళ్లు.. మూడో ‘సారీ’
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. మ్యాట్రిమోని వెబ్సైట్లలో జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను చూడటం. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం. ఆతరువాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం ఈ నిత్యపెళ్లి కూతురికి వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆమె స్టైల్. అయితే, ఇటీవల ఆమె ఘనకార్యంపై మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న. ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సెట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారికి నమ్మించి బుట్టలో పడేస్తుంది. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని, సెటిల్మెంట్ చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్ని పనులు ఉన్నాయని తెలిపింది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ, స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ యువకుడు అసలు విషమేంటనే కోణంలో కూపీ లాగాడు. (ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో) దాంతో స్పప్న లీలలు వెలుగు చూశాయి. రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చిత్తూరుకు చెందిన పృద్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో ఆమెకు గతంలో వివాహమైనట్టు రామాంజనేయులు గుర్తించాడు. పృధ్వీపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ స్వప్న కేసు కూడా పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె రూ.ఆరు లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. వివరాలన్నీ తెలిశాక రామాంజనేయులు స్వప్నని నిలదీశాడు. దాంతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను బెదిరింపులకు లొంగకపోవడంతో దొనకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న చీటింగ్ బయటపడింది. రామాంజనులు డెన్మార్క్ నుంచి రావాల్సి ఉంది. (రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వం సాయం వివరాలు) -
బహుభార్యత్వం పిటిషన్లపై ఇంప్లీడ్
న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కక్షిదారుగా చేర్చుకోవాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ంది. ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా ఆచారాలపై దాఖలైన పిటిషన్లను 1997లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏఐఎంపీఎల్బీ తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొంది. బహుభార్యత్వ సంప్రదాయం ప్రకారం...ఒక ముస్లిం వ్యక్తికి నలుగురు భార్యలుండవచ్చు. అదేవిధంగా నిఖా హలాలా..భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడిని వివాహం చేసుకోవాలంటే.. మొదటగా ఆమె మరో వ్యక్తి పెళ్లి చేసుకుని, అతడి కి విడాకులివ్వడం తప్పనిసరి. ఈ రెండు ఆచారాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన నఫీసా ఖాన్ అనే మహిళ 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. -
ఒకేసారి ఇద్దరితో పెళ్లి
రియో డీ జనీరో: ఫుట్ బాల్ స్టార్ రోనాల్డిన్హో (38) ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రిసిల్లా కోఎల్హో, బియాట్రిజ్ సౌజా అనే ఇద్దరు యువతులతో రొనాల్డిన్హో డేటింగ్లో ఉన్నాడు. ప్రిసిల్లాతో కొన్నేళ్లుగా ప్రేమలో(2012 నుంచి) ఉన్న ఈ స్టార్ ప్లేయర్, బియాట్రిజ్తో మాత్రం 2016 నుంచి అఫైర్ కొనసాగిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నుంచి వీరు ముగ్గురు ఒకే నివాసంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో ఈ ఫుట్‌బాల్ వీరుడు ఒకేసారి వారిద్దరిని వివాహం చేసుకోబోతున్నాడు. అయితే రోనాల్డిన్హో పద్ధతులు నచ్చని అతని సోదరి, తాను మాత్రం ఆ వివాహానికి హాజరుకాబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ డియా అనే పత్రిక ప్రచురించింది. 1998లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల ఆరంగ్రేటం చేసిన రోనాల్డిన్హో.. సొంత దేశం బ్రెజిల్ తరపున 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్ కప్ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర. తర్వాత బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్ ఫుట్ సాల్ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్ తరపున రోనాల్డిన్హో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్మెంట్ ప్రకటన చేయించాడు. -
బహుభార్యత్వం కన్నా.. అయోధ్యకే ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్లు సుప్రీంకోర్టుకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ముస్లింల బహుభార్యత్వం వివాదం కంటే ఇది చాలా ముఖ్యమైన కేసని ముస్లింల తరఫు న్యాయవాది రాజీవ్ ధవన్ కోర్టుకు నివేదించారు. ఈ వివాదానికి సంబంధించిన అన్ని పిటిషన్లను పరిశీలించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. సున్నీ వక్ఫ్‌బోర్డు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహా కక్షిదారుల వాదనలు విన్న అనంతరం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలా ? వద్దా ? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపింది. అలహాబాదాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మొత్తం 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్ హైకోర్టు బెంచ్ గతంలో 2:1 మెజారిటీతో తీర్పునిస్తూ... సదరు భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లీలా సమానంగా పంచుకోవాలని పేర్కొంది. -
బహుభార్యత్వంపై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలాకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రం, లా కమిషన్లకు నోటీçసులిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం 2017లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. ఈ రెండు అంశాలపై మరో ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఇస్లాం ప్రకారం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. నిఖా హలాలాను అనుసరించి భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడినే వివాహం చేసుకోరాదు. వేరే వ్యక్తిని పెళ్లాడి అతనితో విడాకులు తీసుకున్నాకే మొదటి భర్తను పెళ్లాడేందుకు అనుమతిస్తారు. వీటిని వ్యతిరేకిస్తూ.. స్త్రీ, పురుషులకు సమన్యాయం కోరుతూ కేసువేశారు. -
బహుభార్యత్వాన్ని రద్దు చేయండి?!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంతో.. ముస్లిం మహిళలు మరో డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు. ముస్లిం మహిళలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్‌తో పాటు బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. ట్రిపుల్ తలాక్ కన్నా.. బహుభార్యత్వం వల్ల ముస్లిం మహిళలు అధికంగా బాధలు పడుతున్నారని.. పలువురు ముస్లిం మహాళా న్యాయవాదులు చెబుతున్నారు. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వంపై న్యాయపోరాటం చేస్తున్న ఫరా ఫయాజ్, రిజ్వానా, రజియాలు ఈ విషయం మరోసారి గళం విప్పారు. ట్రిపుల్ తలాక్ తెచ్చిన ఊపుతోనే.. బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావాలని.. వారు కోరారు. -
25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు
కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడాదికి ఇద్దరు ముగ్గురు సంతానాన్ని పొందాడు. అలా ఆయన సంతానం సంఖ్య 25 ఏళ్లలో 146కు చేరింది. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్స్టన్ బ్లాక్‌మోర్. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్ ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్స్టన్ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నారు. వారితో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నారు. వాస్తవానికి 1990 ల్లోనే విన్స్టన్ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి చట్టా ల్లో ఉన్న లొసుగులతో విచారణ, శిక్షల నుంచి తప్పిం చుకుంటూ వచ్చా రు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్స్టన్ వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్ షెరీ ఆన్ డొనెగాన్.. విన్‌స్టన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్స్టన్ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పడం కొసమెరుపు! -
25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు..
కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాదు ఏడాదికి ఇద్దరు ముగ్గురు సంతానాన్ని కూడా పొందాడు. అలా ఆయన సంతానం సంఖ్య 25 ఏళ్లలో 146 అయింది. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్స్టన్ బ్లాక్‌మోర్. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్ అనే ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్స్టన్ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారితో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నాడు. వాస్తవానికి 1990ల్లోనే విన్స్టన్ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి కెనడా చట్టాల్లో ఉన్న లొసుగులతో విన్స్టన్ విచారణ, శిక్షల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్స్టన్ వివాహాలు చేసుకుంటూనే ఉన్నాడు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్ షెరీ ఆన్ డొనెగాన్.. విన్‌స్టన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. విన్స్టన్తో పాటు మరో బహుభార్యత్వం కేసును కూడా కోర్టు విచారించింది. జేమ్స్ ఓలర్(53) అనే వ్యక్తిని కోర్టు దోషిగా తేల్చింది. ఓలర్కు ఐదుగురు భార్యలున్నారు. అయితే, అతనికి ఇంకా శిక్ష ఖరారు కావాల్సివుంది. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్స్టన్ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిలు చేసుకున్నానని చెప్పాడు. -
ముస్లింలకు కొత్త విడాకుల చట్టం!
- ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తే తెస్తామన్న కేంద్రం - సుప్రీంకోర్టుకు నివేదించిన ఏజీ న్యూఢిల్లీ: ముస్లింల వివాహాల క్రమబద్ధీకరణ, విడాకుల కోసం చట్టం తీసుకువచ్చేందుకు కేంద్ర సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాక్ సహా అన్ని విడాకుల విధానాలను సుప్రీంకోర్టు రద్దువేస్తే కొత్త చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ... ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించారు. ముస్లింల విడాకుల విధానాలను తాము కొట్టివేసినట్లయితే కేంద్రం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించడంతో రోహత్గీ ఈ వివరణ ఇచ్చారు. విడాకుల కోసం ముస్లిం సమాజంలో అనుసరిస్తున్న మూడు విధానాలు.. తలాక్–ఏ–బిదత్, తలాక్ హసన్, తలాక్ ఆషాన్లు ఏకపక్షం, చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, లిబియా తదితర ముస్లిం దేశాల్లోనే కాకుండా లౌకిక దేశమైన శ్రీలంకలోనూ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారు. మతపాలిత రాజ్యాలే సంస్కరణలవైపు పయనిస్తోంటే భారత్ వంటి లౌకిక దేశం ఎందుకు వీటిని ఇంకా పాటించాలి?’ అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతానికైతే ఒక్క ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో తప్పనిసరా కాదా అంశంపైనే వాదనలు విని, తీర్పు చెబుతామని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో భాగం కాదని ప్రభుత్వం నిరూపించాల్సి ఉందని పేర్కొంది. -
‘తలాక్’ మతపరమైనదా? కాదా?
ఇస్లాం ప్రాథమికాంశాల్లో దీని ప్రస్తావనపై చర్చిస్తాం : సుప్రీంకోర్టు ► బహుభార్యత్వాన్ని స్పృశించం ► నిఖా హలాలాపైనా విచారణ ► ట్రిపుల్ తలాక్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ► ఇస్లాం దేశాల్లో ట్రిపుల్ తలాక్ లేదు: పిటిషనర్లు ► భార్యాభర్తల రాజీతోనే తలాక్ అన్న సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే అంశంపైనే మొదటగా చర్చ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ట్రిపుల్ తలాక్ సంస్కారబద్ధమైనదేనా? ముస్లింల ప్రాథమిక హక్కుగా దీన్ని అమలుచేయవచ్చా? అనే అంశాలపైనే ప్రాథమికంగా చర్చ జరగనుంది. ఒకవేళ ట్రిపుల్ తలాక్ ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్థారణ అయితే అప్పుడు దీని రాజ్యాంగ బద్ధతను కోర్టు ప్రశ్నించదు. కానీ రాజ్యాంగం ప్రకారం ముస్లింల ప్రాథమిక హక్కుగా ట్రిపుల్ తలాక్‌ను భావించొచ్చా అనే అంశంపైనా చర్చ జరుగుతుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించదలచుకోలేదని వెల్లడించింది. సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) (ఒక్కో మతం నుంచి ఒక్కరు చొప్పున) ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకం పిటిషనర్లలో ఒకరైన సైరా బానో తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సింగ్ చద్దా ట్రిపుల్ తలాక్‌పై వాదనలు ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశం కాదని.. దీన్ని తొలగించవచ్చని తెలిపారు. మన పొరుగు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అనుసరిస్తున్న విధానాలను ఆయన గుర్తుచేస్తూ.. ట్రిపుల్ తలాక్ ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా ఉన్న సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అసలు ట్రిపుల్ తలాక్ వివాదమే కాదని.. భార్య, భర్తల మధ్య రాజీతోనే విడాకులకు మంజూరవుతాయన్నారు. అయితే రాజీ తర్వాత జరిగే ట్రిపుల్ తలాక్లన్నీ వ్యవస్థ ప్రకారమే జరుగుతున్నాయా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఖుర్షీద్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరపున వాదిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ‘సమానత్వం కోసం ముస్లిం మహిళలకు పోరాటం’ అంశంపైనా చర్చించనున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. తలాక్ సందర్భంగా ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. నిఖా హలాలా (భార్యాభర్తల మధ్య తలాక్ అయిన తర్వాత మళ్లీ ఆమెనే భర్త పెళ్లి చేసుకోవాలనుకుంటే.. అంతకుముందు భార్యకు వేరే వ్యక్తితో వివాహం జరిపి తలాక్ తీసుకోవాలి. ఇది షియా సంప్రదాయంలో మాత్రమే అమలవుతోంది) పైనా విచారణ జరపనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. రెండుగా చీలిన ఇస్లాం సమాజం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్‌పై చర్చతో ఇస్లాంలోని సంప్రదాయవాదులు, సంస్కరణలను కోరుకునేవారి మధ్య స్పష్టమైన అంతరం కనిపించింది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని మత సమావేశాల్లోనే చర్చించుకోవాలని ఓ వర్గం.. ముస్లిం మహిళలను న్యాయవ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని మరోవర్గం తమ అభిప్రాయాలను తెలిపాయి. ‘ఇస్లాం ప్రవక్తలు గొప్పవారా? కొందరు ముల్లాల చేతుల్లోని ఇస్లాం గొప్పదా? అనే అంశం తేలిపోయే సమయం ఆసన్నమైంది. చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను ఎప్పుడో పక్కనపెట్టేశాయి. షియా సంప్రదాయంలో ట్రిపుల్ తలాక్‌కు చోటు లేదు’ అని ఆలిండియా షియా పర్సనల్ లాబోర్డు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ముస్లిం మహిళలకు మంచిరోజులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షియాస్తా అంబర్ తెలిపారు. అయితే కొందరు మతపెద్దలు మాత్రం ఈ అంశాన్ని తెరపైకి తేవటంలో రాజకీయ కుట్రకోణం దాగుందని విమర్శించారు. ముస్లిం సమాజం ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు మరింత సమయం ఇవ్వాలని ఆలిండియా ముస్లిం మజ్లిసే ముషావరాత్ అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ ‘ముస్లిం పర్సనల్ లా’లో భాగమని అయితే దీన్ని దుర్వినియోగం చేయటం పాపమని ఏఐఎంపీఎల్బీ తెలిపింది. కేవలం 0.1 శాతం మంది మాత్రమే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించింది. అయితే ట్రిపుల్ తలాక్‌ను మత విశ్వాసం కన్నా సామాజిక రుగ్మతగా చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. -
తలాక్’లో న్యాయ అంశాలనే పరిశీలిస్తాం
తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో న్యాయ సంబంధమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముస్లిం చట్టాల ప్రకారం విడాకులు పొందితే దానిపై కోర్టులు పర్యవేక్షణ ఉండాలనే దానిని తాము పరిశీలించబోమని, అది శాసన సంబంధమైనదని మంగళవారం తెలిపింది. పిటిషనర్లకు సంబంధించిన న్యాయవాదులు భేటీ అయి తాము పరిశీలించాల్సిన అంశాలను ఖరారు చేయాలని, ఆ అంశాలను నిర్ణయించడానికి గురువారం విచారణ జాబితాలో చేర్చుతున్నామని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే ట్రిపుల్ తలాక్ బాధి తులకు సంబంధించిన సంక్షిప్త ఉదాహ రణలు సమర్పించడానికి కోర్టు అనుమతిం చింది. ముస్లిం సంప్రదాయాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. రాజ్యాం గంలోని లింగసమానత్వం హక్కుపై తొలుత చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాలను వ్యతిరేకిస్తూ కేంద్రం వాటిని పరిశీలించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు!
సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ ద్వారా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళలకు కొత్త జీవితాన్ని అందించాలని ఉద్దేశ్యంతో సౌదీ అధికారులు ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. మహిళలకు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం కోసం వాట్సాప్‌ను సాధనంగా ఎంచుకుని ఓ గ్రూపును క్రియేట్ చేశారు. పాలిగమీ పేరుతో ఎనిమిది మంది సౌదీ అధికారులు ఈ గ్రూప్‌ను రూపొందించారు. ఈ గ్రూప్‌లో ఇప్పటికే 900 మంది మహిళలు రిజిస్ట్రర్ చేసుకున్నారు. పాలీగమీ విశేషమేమిటంటే.. దానిలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, పెళ్లికాని వారు పేర్లు నమోదుచేసుకోవచ్చు. మక్కా సిటీలో ఎక్కువగా డైవర్స్ కేసులు పెరిగిపోతుండటాన్ని గమనించిన అధికారులు, వారికో తోడు అందించాలనే ఉద్దేశంతో ఈ ఐడియాతో ముందుకొచ్చారు. సౌది మహిళలతో పాటు యెమెన్, మోరోకో, సిరియా, పాలస్తీనా, ఈజిస్ట్, నైజీరియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్‌లోని మహిళలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్‌లో పేర్లను నమోదుచేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో పేర్లు నమోదుచేసుకున్న మహిళలు రెండో, మూడో, నాలుగో భార్యగైనా వెళ్లడానికి వారికి తాము సిద్దమని పేర్కొన్నట్టు తెలిసింది. నమోదు జాబితా ప్రకారం దీనిలో అతిపెద్ద వయసున్న అమ్మాయికి 55 సంవత్సరాలు కాగ, తక్కువ వయసున్న అమ్మాయికి 18 సంవత్సరాలు. ఎత్తు ప్రకారం చూసుకుంటే, 4'7" నుంచి 5'10" ఎత్తు ఉన్న మహిళలున్నారు. కొంతమంది మహిళలు తమకు కావాల్సిన అబ్బాయిలు ఎలా ఉండాలి, ఎలాంటి వాటిని అంగీకరించాలో కూడా ఆ గ్రూప్‌లో పేర్కొన్నారు. ఉచిత సర్వీసు ఫీజుతో వారికి పెళ్లి కుదుర్చుతామని మ్యారేజ్ అధికారులు చెప్పారు. -
ఆ తలాక్ రద్దుకు మహిళా కమిషన్ మద్దతు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాలను రద్దు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలో కోరింది. ‘ఇవి రాజ్యాంగ విరుద్ధం. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వీటిని తొలగించాలి’ అని పేర్కొంది. గత నెలలో ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేంద్రం తీసుకున్న వైఖరికి కమిషన్ మద్దతు ప్రకటించింది. -
మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు
-
మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు
ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని అత్యున్నత ముస్లిం సంస్థ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భగ్గుమంది. ఇస్లామిక్ చట్టాన్ని రద్దుచేసి.. ఆ స్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి, దేశంలోని విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విరుచుకుపడింది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని లాబోర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలోని బహుళ సంస్కృతిని ప్రభుత్వం గౌరవించాలని సూచించింది. 'మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలదరూ దీనిపై పెద్దసంఖ్యలో స్పందిస్తారు. భారత్‌లో ఒకే భావజాలాన్ని రుద్దలేరు' అని ముస్లిం లా బోర్డు పేర్కొంది. ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగం మౌలిక లక్షణమైన లింగ సమనత్వం విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని సుప్రీంకోర్టుకు గతవారం కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. అంతేకాకుండా ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే, ఈ విధానాలు స్త్రీల పట్ల వివక్ష చూపడమేనని ముస్లిం మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాస్పద అంశాలపై తొలిసారి కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దేశమంతటా ఒకే చట్టబద్ధమైన విధానం ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ ప్రశ్నావళిని రూపొందించిదన్న వార్తలపై ముస్లిం లా బోర్డ్ భగ్గుమంటోంది. త్రిపుల్ తలాక్ ఉండాల్సిందేనని, ఉమ్మడి పౌరస్మృతి ప్రమాదకరమని పేర్కొంటున్నది. -
మహిళల రక్షణ కోసమే బహుభార్యత్వం!!
బహు భార్యత్వం చాలా అవసరమట.. దాని వల్ల మహిళలకు రక్షణ ఉంటుందట! ఒకరికి ముగ్గురు నలుగురు భార్యలు ఉంటే, సమాజంలో అక్రమ సంబంధాలు తగ్గిపోతాయని, దానివల్ల మహిళలకు రక్షణ కూడా లభిస్తుందని అంటున్నారు. తలాక్.. తలాక్.. తలాక్.. అని చెప్పేసి విడాకులు తీసుకునే పద్ధతిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో బహు భార్యత్వాన్ని సమర్థించుకుంటూ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ వాదనలు చేసింది. ముస్లిం మహిళల విడాకుల విషయమై జరుగుతున్న వాదనలకు సంబంధించి ముస్లిం పర్సనల్ లాబోర్డు 68 పేజీల అఫిడవిట్ దాఖలుచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో, ఇక కలిసి ఉండలేమని అనుకున్నప్పుడు జంటలకు సులభంగా విడాకులు ఇప్పించేందుకే తలాక్.. తలాక్.. తలాక్ పద్ధతిని ప్రవేశపెట్టారని బోర్డు వాదించింది. భార్యతో కలిసి ఉండకూడదని భర్త నిర్ణయించుకున్న తర్వాత.. బలవంతంగా ఇద్దరినీ కలిపి ఉంచడం కష్టమని, దానివల్ల అనవసరంగా ఆ మహిళ చిత్రహింసల పాలు కావల్సి వస్తుందని.. అలా ఉండకూడదనే విడాకులు ఇప్పిస్తున్నామని లాబోర్డు తమ వాదనలో తెలిపింది. పైగా దానివల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వీధికి, కోర్టుకు ఎక్కకుండానే విడాకులు సాధ్యమవుతాయని వాదించింది. కోర్టులో వాదనలు దీర్ఘకాలం పాటు సాగడం, దానివల్ల ఇద్దరికీ భారీ మొత్తంలో ఖర్చులు కావడం.. ఇవన్నీ ఎందుకొచ్చిన తిప్పలని అడిగింది. పాశ్చాత్యదేశాల్లో కోర్టుల ద్వారా మాత్రమే విడాకులు ఇస్తారని, అయినా అక్కడ విడాకుల రేటు చాలా ఎక్కువని లాబోర్డు తెలిపింది. -
సర్దార్ టార్గెట్ 'సెంచరీ'!
క్వెట్టా: తన టార్గెట్ సెంచరీ అంటున్నాడు పాకిస్థాన్ కు చెందిన సర్దార్ జాన్ మహ్మద్ ఖిల్జీ. అతడు క్రికెటర్ కాదు కామన్‌మేన్. అయితే సెంచరీ అని చెప్పింది క్రికెట్ పరుగుల గురించి కాదు. 'సంతానం'లో సెంచరీ కొడతానంటున్నాడు. 100 మంది పిల్లల్ని కనడమే అతడి లక్ష్యమట. అత్యధిక సంతానం పొందడం మతపరమైన పవిత్రకార్యంగా భావించే 46 ఏళ్ల సర్దార్ ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకునేందుకు అన్వేషణ ప్రారంభించాడు. ఇప్పటికే అతడికి 35 మంది పిల్లలు ఉన్నారు. గంపెడు సంతానంతో సంతోషంగా గడుపుతున్నానని మెడికల్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న సర్దార్ చెబుతున్నాడు. అంతమంది పిల్లలు ఉన్నా వాళ్ల పేర్లు ఎప్పుడోగాని మర్చిపోడట. అధిక సంతానంతో ఫ్యామిలీ ఫంక్లన్లను వెళ్లలేకపోతున్నానని తెలిపాడు. ముగ్గురు భార్యలు, 35 మంది పిల్లలు అంతా కలిసి మెలిసి ఉంటారని వెల్లడించాడు. అయితే సర్దార్ నాలుగో పెళ్లి ప్రయత్నాలను అతడి ముగ్గురు భార్యలు సమర్థించడం విశేషం. తన భార్యలతో మాట్లాడేందుకు 'ఏఎప్ఫీ' విలేకరిని అనుమతించలేదు. బహుభర్యాత్వం మంచిది కాదని సామాజిక కార్యకర్తలు, బుద్ధిజీవులు వారిస్తున్నా సర్దార్ అవేం పట్టించుకోకుండా 'సెంచరీ' దిశగా ముందుకు సాగుతున్నాడు. -
భర్తను పంచుకుంటేనే మంచిదట!
బహుభార్యత్వం.. అంటే ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లాడటం తప్పని అందరూ అంటుంటారు. కానీ, తాజాగా చేసిన పరిశోధనలో మాత్రం.. కొన్ని పరిస్థితులలో భర్తను పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందట! ప్రపంచంలో చాలా దేశాలు బహుభార్యత్వాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల సంఘాలు కూడా ఇది మహిళల పట్ల వివక్షేనంటాయి. ఈ విషయాన్ని తేల్చేందుకు ఉత్తర టాంజానియాలోని 56 గ్రామాల్లో బహుభార్యత్వం ఉన్న కుటుంబాలు, అలాకాకుండా ఒక భర్త ఒకే భార్యతో ఉంటున్న కుటుంబాలపై పరిశోధన చేశారు. టాంజానియాలోని కొన్ని తెగలలో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారు. ఇక్కడ ఒక భర్తకు ఒకే భార్య ఉన్న కుటుంబాల కంటే ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాల్లోనే తగినతం ఆహారం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉన్నారట. బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో పశుసంపద కూడా బాగుందని, మామూలు వాళ్ల కంటే పెద్ద కమతాలలో వీళ్లు వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. అప్పటివరకు పెళ్లి చేసుకోకుండా, 3 ఆవులు, ఒక ఎకరం భూమి ఉన్నవాళ్ల కంటే.. 180 ఆవులు, బోలెడంత భూమితో పాటు కొందరు భార్యలు కూడా ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం మేలని అక్కడి యువతులు భావిస్తున్నట్లు పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మోనిక్ బోర్గెరాఫ్ మల్డర్ చెప్పారు. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. వాటిని లెక్కలోకి తీసుకోకుండానే బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల మహిళలకు ఉండే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పారు. ఎంతమంది భాగస్వాములు ఉండొచ్చన్నది సమస్య కాదని, తాము కోరుకున్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. టాంజానియా లాంటి దేశాల్లో ఆహారభద్రత చాలా సమస్యగా ఉంది. ఇక్కడ పౌష్టికాహారం అందక చిన్నవయసులోనే పిల్లలు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాసాయ్ లాంటి తెగలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. -
29.3 కోట్ల భార్యలకు.. 28.7 కోట్లమందే భర్తలు!
మన దేశంలో ఇప్పుడు పెళ్లయిన భర్తల కంటే.. పెళ్లయిన భార్యల సంఖ్య 66 లక్షలు ఎక్కువగా ఉందట! ఈ విషయం తాజా లెక్కల్లో అధికారికంగా తేలింది. పెళ్లి చేసుకున్న మగాళ్లు ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిపోతూ భార్యలను ఇక్కడే వదిలిపెట్టడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, బహుభార్యత్వం వల్ల కూడా ఈ సంఖ్య ఎక్కువ అయ్యిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 18 లక్షల మంది బాలికలకు పెళ్లిళ్లు అయినట్లు 2011 నాటి జనాభా లెక్కల్లో తేలింది. మొత్తం దేశ జనాభా 120 కోట్లు కాగా, వారిలో 58 కోట్ల మందికి పెళ్లిళ్లు అయ్యాయి. అయితే వీళ్లలో విడాకులు తీసుకున్నవాళ్లు, భర్తలు మరణించిన వాళ్లు, లేదా విడిగా ఉంటున్నవాళ్ల వివరాలు మాత్రం లేవు. మొత్తం 58 కోట్ల మంది వివాహితులలో.. 29.3 కోట్ల మంది మహిళలు కాగా, 28.7 కోట్ల మందే పురుషులు ఉన్నారు. కేరళలో పెళ్లయిన ప్రతి ఒక్క పురుషుడికి 1.13 మంది వివాహిత మహిళలున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఉన్నాయి. వీటిలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 1.04 నుంచి 1.07 వరకు ఎక్కువగా ఉంది. అయితే.. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి చోట్ల మాత్రం వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. అక్కడ పెళ్లయిన వాళ్లలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంది. -
కానిస్టేబుల్.. మూడు పెళ్లిళ్లు!
-
కానిస్టేబుల్.. మూడు పెళ్లిళ్లు!
అతడో కానిస్టేబుల్. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు.. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అతడిమీద ఉంటుంది. కానీ, అతగాడే నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది చాలదన్నట్లు మూడో మహిళతో సహజీవనం కూడా మొదలుపెట్టాడు. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ అతడి రెండో భార్య మహిళా సంఘాలను ఆశ్రయించింది. దాంతో ఈ విషయం కాస్తా బయటపడింది. -
మా ఆయనకు రెండోపెళ్లి.. ఆదుకోండి!
తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, 5 లక్షల కట్నం తెచ్చిస్తే మళ్లీ ఏలుకుంటానని తనకు చెబుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది. కరుణశ్రీ అనే మహిళ రామచంద్రపురంలో ఎంఎస్సీ చదివారు. అప్పట్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన నక్కా తిరుపతి రాజమండ్రిలో పనిచేస్తూ, ఫీల్డ్ వర్క్ కోసం రామంద్రపురం వెళ్లేవాడు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2007లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కట్నంగా లక్ష నగదు, ఇతర లాంఛనాలు ఇచ్చారు. తర్వాత ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్లే తిరుపతి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడు. దీనిపై తాను నిలదీయగా.. 5 లక్షల అదనపు కట్నం తెస్తే ఏలుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆమెకు 'ఇద్దరు'!
మహాభారతంలో పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని చదువుకున్నాం. ఆధునిక యుగంలోనూ పాండవ సంతతి కొనసాగుతోంది. కెన్యాలో వెలుగు చూసిన ఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఇద్దరు పురుషులు ఓ మహిళలను వంతులువారిగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమేరకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వీరి బాగోతం బట్టబయలయింది. మొంబాసా కౌంటీలోని కిసానిలో ఉన్న కిసిమాని ప్రాంతానికి చెందిన సిల్వెస్టర్ వెన్డ్వా, ఎలిజహ్ కిమాని అనే ఇద్దరు వ్యక్తులు ఒకే వితంతు మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. 25 నుంచి 31 ఏళ్ల వయసున్న ఈ ముగ్గురు నాలుగేళ్లకు పైగా ఈ బంధం సాగిస్తున్నారు. అయితే ఒకరి 'వ్యవహారం'లో మరొకరు తలదూర్చకూడదని వీరు ఒప్పందం చేసుకున్నారు. ఆమెకున్న కవల పిల్లలను తామే పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు సవ్యంగా సాగిన వీరి వ్యవహారం ఒప్పందం ఉల్లంఘనతో వీధిన పడింది. వెన్డ్వా, కిమాని ఇద్దరూ ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమవడంతో తగవు వచ్చింది. ఎదురు కట్నం ఇచ్చి మరీ మనువాడేందుకు ముందుకురావడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. చివరకు రగడ పోలీసు స్టేషన్‌కు చేరడంతో మీడియా ద్వారా ప్రపంచమంతా పాకింది. ఇద్దరు పిల్లల తల్లైన వితంతు మహిళ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం తానెక్కడా చూడలేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి అబ్దుల్రహమాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తున్నా అందుకు ఈ ముగ్గురు అంగీకరించడం లేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి అబ్దుల్రహమాన్ పేర్కొన్నారు. ఆమె లేకుండా బతలేమని వారిద్దరూ అంటున్నారని తెలిపారు. అలాగే ఆమె కూడా వీరిద్దరూ లేకుండా ఉండలేనంటుందన్నారు. బహుభార్యత్వం(పాలిగమి) కెన్యాలో నేరం కాదు. అయితే పాలియాండ్రి(ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను కలిగివుండడం) గురించి వినడం ఇదే మొదటిసారి అని కెన్యా న్యాయనిపుణులు అంటున్నారు. పాలియాండ్రి చట్టవిరుద్ధమని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను కలిగివుండడం అసహజమని పేర్కొన్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.