ఓ పోలీసు కానిస్టేబుల్ రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో మహిళతో సహజీవనం మొదలుపెట్టాడు
అతడో కానిస్టేబుల్. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు.. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అతడిమీద ఉంటుంది. కానీ, అతగాడే నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది చాలదన్నట్లు మూడో మహిళతో సహజీవనం కూడా మొదలుపెట్టాడు.
విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ అతడి రెండో భార్య మహిళా సంఘాలను ఆశ్రయించింది. దాంతో ఈ విషయం కాస్తా బయటపడింది.