
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ హైకోర్టులో (telangana highcourt) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (brs mla padi kaushik reddy)కి ఊరట దక్కింది. సుబేదారి పీఎస్‌లో నమోదైన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో రూ.50లక్షలు ఇవ్వాలంటూ క్వారీ యజమాని మనోజ్‌ను పాడి కౌశిక్‌రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయంపై మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే,ఈ నేపథ్యంలో తనపై నమోదైనే కేసును కొట్టి వేయాలని కోర్టుతో పాడికౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పాడికౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్..2023 అక్టోబర్25న 25లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని ప్రభుత్వం తరుఫు న్యాయవాది (public prosecutor) హైకోర్టు ప్రశ్నించింది.
అందుకు పాడికౌశిక్ రెడ్డి బెదిరించారు కాబట్టే రూ.25 లక్షలను కౌశిక్‌రెడ్డికి మనోజ్ చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని ప్రశ్నించిన హైకోర్టు..కౌశిక్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది.