సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషకు వెళ్లారు. ఆ సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఐని అడ్డగించి తమ ఫిర్యాదులో తీసుకోవాలని బలవంతం చేశారు.
ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అయితే కౌశిక్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 25) కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment