మా ఆయనకు రెండోపెళ్లి.. ఆదుకోండి!
తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, 5 లక్షల కట్నం తెచ్చిస్తే మళ్లీ ఏలుకుంటానని తనకు చెబుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది. కరుణశ్రీ అనే మహిళ రామచంద్రపురంలో ఎంఎస్సీ చదివారు. అప్పట్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన నక్కా తిరుపతి రాజమండ్రిలో పనిచేస్తూ, ఫీల్డ్ వర్క్ కోసం రామంద్రపురం వెళ్లేవాడు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2007లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కట్నంగా లక్ష నగదు, ఇతర లాంఛనాలు ఇచ్చారు.
తర్వాత ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్లే తిరుపతి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడు. దీనిపై తాను నిలదీయగా.. 5 లక్షల అదనపు కట్నం తెస్తే ఏలుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.