second wife
-
మర్మాంగాన్ని కోసేసిన రెండో భార్య
చీమకుర్తి: జీతం డబ్బుల్ని మొదటి భార్యకు పంపుతున్నాడని.. తనను సరిగా పట్టించుకోవడం లేదన్న కారణంతో మద్యం మత్తులో నిద్రపోతున్న భర్త మర్మాంగాన్ని రెండో భార్య కత్తితో కోసేసిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన విజయ్‌యాదవ్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య బిహార్‌లో ఉంటోంది. ఆమెకు నలుగురు పిల్లలు. ఈ క్రమంలో విజయ్‌యాదవ్ బిహార్‌లోనే తన గ్రామానికే చెందిన సీతాకుమారిని మూడేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలల కిందట తొర్రగుడిపాడు వచ్చి స్థానిక డెయిరీ ఫాంలో రెండో భార్యతో కలిసి పనిచేస్తున్నాడు. అయితే జీతం డబ్బులను మాత్రం బిహార్‌లోని మొదటి భార్యకు పంపిస్తుండటం రెండో భార్యకు ఆగ్రహం తెప్పించింది. చెప్పిన మాట వినకపోవడంతో శనివారం రాత్రి మద్యం మత్తులో నిద్రపోతున్న విజయ్ యాదవ్ మర్మాంగాన్ని కూరగాయలు కోసే కత్తితో కోసి సీతాకుమారి పరారైంది. జరిగిన సంఘటన డెయిరీఫాం యజమానికి వివరించింది. తీవ్రంగా గాయపడిన విజయ్యాదవ్ను స్థానికులు ఒంగోలు ఆస్పత్రిలో చేర్ఫించారు. దీంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకొచ్చి0ది. సీతాకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భిణి కావడంతో ఒంగోలులోని సతీసదన్ (మహిళా సంరక్షణ సమితి)లో చేర్ఫించినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'భర్త కోరికలు తీర్చలేకపోయా.. అందుకే మరో అమ్మాయితో'
ఎవరైనా తన భర్త కోసం తమ లైఫ్‌లో కొన్నింటిని త్యాగం చేస్తారు. ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకుంటారు. కట్టుకున్న భర్త కోసం కొంత సమయమైనా కేటాయిస్తారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ సింగర్ తన భర్త కోసం చేసిన పని చూస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఎందుకంటే తన భర్తకు సమయం కేటాయించలేకపోతున్నానంటూ బాధపడింది. అంతే కాకుండా తన భర్త కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. చివరికీ మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేసి ఆ లోటును తీర్చింది. ఇంతలా షాకింగ్ ఇచ్చిన ఆ సింగర్ కథేంటో తెలుసుకుందామా? ప్రముఖ మలేషియన్ సింగర్ అజ్లిన్ అరిఫిన్ తన భర్తకు రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది. తన బిజీ కెరీర్ కారణంగా.. భర్త కోసం తగినంత టైం కేటాయించలేకపోయానని ఆమె తెలిపింది. అందుకే అతనికి కొత్త భాగస్వామిని తీసుకొచ్చానని సింగర్ వెల్లడించింది. ఆమె భర్త వాన్ ముహమ్మద్ హఫీజామ్ వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా.. 26 ఏళ్ల వైద్యురాలితో పెళ్లి చేసింది. మార్చి రెండో వారంలో వివాహం జరిగినట్లు సమాచారం. భర్తకు రెండో పెళ్లిపై అజ్లిన్ అరిఫిన్ మాట్లాడుతూ..'నా బిజీ లైఫ్‌లో భర్తను సరిగా చూసుకోలేకపోయా. అందువల్ల అతని కోరికలు తీర్చలేకపోతున్నా. అందుకే రెండో పెళ్లికి నేనే చొరవ తీసుకున్నా. ఈ వివాహం తర్వాత కూడా నేను అతనితో సంతోషంగా ఉన్నా. మేం ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను అతనితో నా ఖాళీ సమయాన్ని గడుపుతున్నా' అని అన్నారు. కాగా.. 42 ఏళ్ల అజ్లిన్ అరిఫిన్ ప్రతిరోజు తన వృత్తిలో భాగంగా వివిధ నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో తన భర్త ఒంటరిగా ఉంటున్నాడని.. అతను ఒంటరితనం నుంచి బయటపడేందుకే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అజ్లిన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అజ్లిన్ మొదట తన మేనేజర్ ఆడమ్ ఫామి అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరిద్దరూ 2011లో పెళ్లి చేసుకుని ఆరేళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత అస్లిన్ ఆధ్యాత్మికత వైపు మళ్లి నాలుగేళ్లపాటు సింగిల్ జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత వాన్ ముహమ్మద్ హఫీజామ్తో 2021లో రెండో వివాహంజరిగింది. -
ఆశిష్ విద్యార్థితో పెళ్లిపై మొదటిసారి స్పందించిన రుపాలీ
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సుమారు 22 ఏళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు నెలలు దాటినా ఆయనపై ట్రోల్స్ ఆగడం లేదు.. ఇప్పుటికే వాటిని ఆయన సున్నితంగా తిరష్కరించారు కూడా.. తాజాగా మళ్లీ ఆయనతో పాటు రెండో భార్య రుపాలీ బరూవా కూడా స్పందించారు. తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ ఇలా స్పందించారు. 'నన్ను తిట్టే వాళ్లందరూ నాకు తెలియని వ్యక్తులే కాబట్టి నేను దానిని పట్టించుకోను తిరిగి వారిని కూడా తిట్టుకోలేదు. మా జీవితంలో జరిగిన విషయాల గురించి వారికి స్పష్టంగా తెలియదు.. అందరిలాగే వారు కూడా ఈ విషయాన్ని చూశారు. ఎందుకంటే వారికి నా గురించి తెలియదు. వాళ్లందరూ నన్ను తిడుతున్నారని వారి వద్దకు వెళ్లి క్లారిటీ ఇవ్వలేను. నెటిజన్లలో ఒక వర్గం వారు తిడితే మరో వర్గం వారు అర్థం చేసుకుంటారు. అలా ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కామెంట్లను అంతగా చదవనందున ఇది నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. నా సన్నిహితులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు వేరే వారి సపోర్ట్ అవసరం లేదు.' అని ఆమె చెప్పింది. (ఇదీ చదవండి: సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ) ఇంతలో, ఆశిష్ విద్యార్థి కలుగజేసుకుని ఇలా చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఈ రెండు విషయాలపై మరోకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఏ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. మా మధ్య కలత లేదు, కోపం లేదు. మమ్మల్ని తిడితే మీకు సంతోషమా..? అయితే అలాగే చేయండి. నా రెండో పెళ్లిపై ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ? 22 ఏళ్లుగా నా మొదటి భార్యతో జీవితాన్ని పంచుకున్నాను. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో సంసారం చితికిపోయింది. అప్పుడు నేను ఒంటరివాడినయ్యాను. అలాంటి సమయంలో రుపాలీ నా జీవితంలోకి వచ్చింది.' అని ఆయన అన్నారు. జీవితంలో ఇద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో ఒక తోడు దొరకడం , కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం అని రుపాలి ఇలా తెలిపారు. 'విశ్వం ఈ అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయం. దీని ముందు నా జీవితంలో మరేదైనా చిన్నదే. నేను ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఈ వయసులో తోడు దొరకడం ఒక వరం. ఆ ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే.' అని ఆమె చెప్పింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్‌లో రుపాలీకి భాగస్వామ్యం ఉంది. తన తండ్రి నార్త్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఆశిష్ విద్యార్థి కూడా విశాల్ భరద్వాజ్ స్పై-థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
57 ఏళ్ల వయసులో రెండో భార్యతో ఆశిష్ విద్యార్థి హనీమూన్ (ఫోటోలు)
-
ప్రభుదేవా రెండో భార్యను ఎప్పుడైనా చూశారా? తొలిసారి కెమెరా ముందుకు..
ఇండియన్ మైఖేల్ జాన్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి. హీరోగా, డ్యాన్సర్, కొరియోగ్రఫర్‌గా, దర్శకుడిగా..ఇలా మల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ పొందిన ప్రభుదేవా పర్సనల్ లైఫ్ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భార్య ఉండగానే హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపిన ప్రభుదేవాకు ఆ బంధం కూడా చేదు ఙ్ఞాపకాన్నే మిగిల్చింది. చదవండి: 'ఖుషి' మూవీ నుంచి సమంత లుక్ చూశారా? ఫోటో వైరల్ అప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవా నయనతార కోసం కుటుంబాన్ని వదిలేశాడని, పచ్చని సంసారంలో నయనతార నిప్పులు పోసిందంటూ ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ బహిరంగంగానే అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ఇప్పటికీ సంచనలమే. కట్ చేస్తే.. చాన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత తమ దారులు వేరంటూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దీంతో నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకోగా,ప్రభుదేవా 2020లో హిమానీ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. అయితే ఇటీవలె ప్రభుదేవా 50వ పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్ తెలియజేస్తూ తొలిసారి ఓ షోలో కనిపించింది హిమానీ సింగ్. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి 'మీరు చాలా అద్భుతమైన మనిషి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా' అంటూ భర్తను ఆకాశానికెత్తేసింది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Prabhu Deva Fans (@prabhu_deva_fans) -
షమీమ్ స్టేట్ మెంట్ లో కనిపించని వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు
-
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో భార్య షమీమ్ స్టేట్ మెంట్
-
వివేకా రెండో భార్య వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. లైవ్‌లో చదివి వినిపించిన యాంకర్
-
సైకో భర్త.. రెండో భార్యను కొట్టి.. కుమారుడికి కరెంటు పెట్టి..
దర్శి(ప్రకాశం జిల్లా): స్థానిక పొదిలి రోడ్డులో నివాసముంటున్న రమణారెడ్డి తన రెండో భార్య కెజియా, కుమారుడు రేవంత్‌పై ఆదివారం రాత్రి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రెండో భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం పొదిలి మండలం సూదనగుంట రామాపురానికి చెందిన రమణారెడ్డికి పదేళ్ల క్రితం తన అక్క కుమార్తెతో వివాహమైంది. వారికి ఒకరు సంతానం కలిగారు. అయితే దొనకొండ మండలం నారసింహనాయునిపల్లె గ్రామానికి చెందిన దారం కెజియాను ప్రేమ పేరుతో ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్న రమణారెడ్డి దర్శిలోని పొదిలి రోడ్డులో కాపురం పెట్టాడు. చదవండి: యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి.. వీరికి ఆరేళ్ల కుమారుడు రేవంత్ ఉన్నాడు. రమణారెడ్డి దర్శిలో సినిమా హాలు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. భార్యపై అనుమానంతో మద్యం తాగి తరచూ గొడవపడుతుండేవాడు. ఐదు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి పూటుగా మద్యం తాగి భార్యతో గొడవపడటమే కాకుండా ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. కుమారుడు రేవంత్‌ను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించడంతోపాటు బాలుడి శరీరానికి విద్యుత్ తీగలు చుట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుని కేకలతో ఇంటి యజమాని, చుట్టు పక్కల వారు అక్కడికి రావడంతో రమణారెడ్డి పరారయ్యాడు. కెజియా, రేవంత్‌ను చికిత్స నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రకాశ్ రాజ్ రెండో భార్య పోనీ వర్మ ఎవరు?, ఏం చేసేదో తెలుసా!
Prakash Raj Second Wife Pony Verma: ఇంతకాలం మూవీ అర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి అంటూ హాట్‌టాపిక్‌గా మారాడు. అయితే ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఎవరాని తీరా చూస్తే తన రెండవ భార్య పోనీ వర్మను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. మంగళవారం వారి 11వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేగాక ట్వీటర్ ఫొటోలు షేర్ చేస్తూ.. తమ కుమారుడు వేదాంత్ కోరిక మేరకు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నానంటూ పోనీ వర్మకు రింగు తొడిగిన ఫొటోలను ప్రకాశ్ రాజ్ షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకీ ఆయన రెండో భార్య పోనీ వర్మ ఎవరు, ఆమె ఏం చేస్తుందా? అని నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే మీరు కూడా ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఓ లుక్కేయండి. ఇంతకీ ఎవరీ ఈ పోనీ వర్మ.. పోనీ వర్మ... ఆమె హిందీ చిత్రపరిశ్రమకు బాగా సుపరిచితురాలు. తెలుగులో కూడా పని చేసినప్పటికి ఇక్కడి వారికి ఆమె పెద్దగా పరిచయం లేదు. పోనీ వర్మ అసలు పేరు రష్మీ వర్మ. పరిశ్రమలో ఆమె ఓ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దాదాపు 21 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 2000 సంవత్సంరలో పరిశ్రమలో అడుగుపెట్టిన పోనీ వర్మ కలర్స్ ఛానెల్లో ప్రసారమైన ‘చక్ ధూమ్ ధూమ్’ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరించారు. అంతేకాదు పలు డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కొరియోగ్రఫర్‌గా కూడా పని చేశారు. అలా హిందీలో ‘టైగర్ జిందా హై, జంజీర్, జిలా ఘజియాబాద్, డర్టీ పిక్చర్, గుజారిష్, యే తేరా ఘర్ యే మేరా ఘర్, ఎ బర్డ్ ఇన్ డేంజర్, ఫిల్హాల్, ముస్కాన్’తో పాటు తెలుగులో ‘బద్రీనాథ్, అలా మొదలైంది’ వంటి తదితర చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు ఆమె. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో 24 ఆగస్టు 2010న ప్రకాశ్ రాజ్‌ను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ప్రకాశ్ రాజ్‌కు ఇది రెండవ పెళ్లి అని తెలిసిందే. 1994లో నటి లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. కాగా 2009లో లలితకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2010లో పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2016 ఫిబ్రవరిలో వేదాంత్ జన్మించాడు. ఇక మంగళవారం (ఆగస్టు 24) ఈ జంట పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు వేదాంత్ వారి పెళ్లి చూడాలని ఉంది అని అడిగాడట. దీంతో కుమారుడి ముందు పోనీ వర్మకు రింగ్ తొడిగి మళ్లీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ప్రకాశ్ రాజ్. ఇందుకు సంబంధించిన ఫొటోలనే ఆయన తన ట్విటర్లో షేర్ చేశాడు. కాగా ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సారి మా ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Pony Verma (@ponyprakashraj) -
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి.. చివరికి
సాక్షి, బంజారాహిల్స్: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో నివాసముండే బి.సందీప్ ప్రసాద్ అనే వ్యక్తికి గతంలోనే పెళ్లయి ఒక కొడుకున్నాడు. కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(31)తో సన్నిహితంగా ఉంటున్న సందీప్ తన భార్యతో విడాకులు తీసుకున్నానని నమ్మించాడు. జనవరిలో యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోలేదని తెలుసుకుని నిలదీయడంతో ముఖం చాటేశాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు మోసం చేసిన సందీప్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 420, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్ చేస్తే.. -
హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి
బీజింగ్: పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీర భాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులును చూశాం. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం భార్యతో హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ వివరాలు.. చైనా జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసు ఉన్న బాబు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను.. తండ్రికి కొడుకు బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగం చేస్తున్న తండ్రికి చిన్నారి బాధ్యతలు చూడటం ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తిని కోరారు. కానీ రెండో భార్య అందుకు అంగీకరించలేదు. బిడ్డ ఎప్పటికైనా తనకు అడ్డంకే అని భావించిన ఆ వ్యక్తి ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు. బిడ్డను అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కొడుకును తీసుకువచ్చాడు. కన్నతల్లి బాబుని చూడాలని కోరింది.. అందుకే తీసుకెళ్తున్నాను అని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అది నమ్మిన కుటుంబ సభ్యులు బాబును తండ్రికి అప్పగించారు. కానీ ఆ ప్రబుద్ధుడు ఏ మాత్రం జాలీ, దయ లేకుండా రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు అమ్మేశాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్ చేయసాగాడు. ఇక బాబును తల్లి దగ్గరికి తీసుకెళ్లి వారం రోజుల పైనే అవుతుంది. ఇంకా తిరిగి తీసుకురాకపోవడంతో.. బాబు తండ్రికి కాల్ చేశారు అతడి కుటుంబ సభ్యులు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో కన్నతల్లికి కాల్ చేసి బిడ్డ గురించి అడగ్గా ఆమె తన దగ్గరకు తీసుకురాలేదని తెలిపింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయగా.. సదరు వ్యక్తి బాబును అమ్మకానికి పెట్టి.. వచ్చిన డబ్బుతో కొత్త భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లినట్లు తెలిసింది. దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చైనాలో ఇలాంటి సంఘటలను తరచుగా చోటు చేసుకుంటాయి. గతేడాది ఓ వలస కూలీ అప్పుడే పుట్టిన బిడ్డను 17.74 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. మరో 19 ఏళ్ల కుర్రాడు ఐఫోన్ కోసం నవజాత శిశువును అమ్ముకున్నాడు. చదవండి: నవ దంపతులకు హనీమూన్ కష్టాలు! -
రెండో భార్యతో కలిసి భర్త ఆత్మహత్య
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో శనివారం చోటుచేసుకుంది. పెద్దపంజాణి ఎస్ఐ లోకేష్‌రెడ్డి కథనం మేరకు.. పెద్దపంజాణి మండలం పెనుగొలకల గ్రామానికి చెందిన అమరనాథ్‌కు 2014లో మదనపల్లె మండలం నాయునివారిపల్లికి చెందిన సంధ్యారాణితో వివాహమైంది. వారికి స్నేహప్రియ (3) సంతానం ఉంది. బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం అమరనాథ్ (32) భార్య సంధ్యారాణి, కుమార్తె స్నేహప్రియతో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. కోరమంగలలోని ఓ హోటల్లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అదే హోటల్లో పని చేస్తున్న త్రిపుర రాష్ట్రానికి చెందిన అంజలీనాథ్ (23)ను రెండో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టించాడు. గురువారం అమరనాథ్, అతని మొదటి భార్య సంధ్యారాణి పెళ్లి రోజు. ఆరోజు అంజలీనాథ్ మొదటి భార్య సంధ్యారాణి ఇంటికి వచ్చి, కేక్ ఇచ్చేందుకు వచ్చానని చెప్పి కొంతసేపు ఉండి వెళ్లిపోయింది. ఇంటికి చేరుకున్న అమరనాథ్‌ను సంధ్యారాణి నిలదీసింది. ఆ మహిళను తాను రెండో వివాహం చేసుకున్నానని చెప్పడంతో గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన అమరనాథ్ ‘‘మేము చస్తే నీకు ఎటువంటి బాధ ఉండదు’ అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత రెండో భార్య అంజలీనాథ్‌తో కలిసి ద్విచక్రవాహనంలో బెంగళూరు నుంచి స్వగ్రామమైన పెనుగొలకలకు చేరుకున్నాడు. గ్రామ సమీపంలోని తన సొంత పొలంలోని ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం సంధ్యారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీ జీతం నా ఒక్కరోజు ఖర్చుతో సమానం..
సాక్షి, హైదరాబాద్: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని అబద్ధాలు చెప్పి రెండో వివాహం చేసుకున్న తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైజాగ్‌కు చెందిన మహిళ(37) 2018 మార్చి 8న శివరాంరెడ్డి అనే వ్యక్తిని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుంది. అనంతరం వారు విశాఖపట్నం మహారాణిపేట అఫీషియల్ కాలనీలో కాపురం పెట్టారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు శివ చెప్పడంతో ఆమె అతడి మాటలు నమ్మింది. అయితే కొద్ది నెలల్లోనే నిజం వెల్లడి కావడంతో అతడిని నిలదీసింది. దీనికితోడు ఐబీఎంలో మేనేజర్‌గా పని చేస్తున్న తనను ఉద్యోగం మాన్పించి వైజాగ్‌లో కాపురం పెట్టాడని కొద్ది రోజుల్లోనే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తన వద్ద నుంచి విడతల వారీగా రూ. 35 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. మీలాంటి లోక్లాస్ మహిళను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని నీ జీతం నా ఒక్కరోజు ఖర్చుతో సమానమని అవమానించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె గత జూన్ 24న హైదరాబాద్ వచ్చి శివరాం రెడ్డి కుటుంబ వివరాలు ఆరా తీయగా అతను మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. దీనికితోడు కారు రుణం చెల్లించలేకపోవడంతో బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులోకి రాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొదటి భార్యను మర్చిపోలేక దారుణం
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త భార్యను చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ నగర్లో నివాసముంటున్న వెంకటేశ్, స్వప్నకు మూడు నెలల క్రితం పెళ్లైంది. అయితే, 15 ఏళ్ల క్రితమే వెంకటేశ్‌కు మరో మహిళతో వివాహమైంది. దీంతో మొదటి భార్యను మర్చిపోలేక వెంకటేశ్ తరచూ స్వప్నతో గొడవకు దిగేవాడు. మొదటి భార్య కారణంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో కోపం పట్టలేకపోయిన వెంకటేశ్ స్వప్న మెడకు తాడు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దాంతో పాటు రోకలిబండతో తలపై మోదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆందోళనకు గురైన వెంకటేష్ భార్యను చంపిన వెంటనే తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపుమడుగులో పడివున్న మృతదేహాల్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్, స్వప్న మృతితో ఇందిరానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాక్షి వరల్డ్ ఆఫ్ లవ్: మీ లవ్ స్టోరీని మాతో పంచుకోండి -
వివాహేతర సంబంధం..పెట్రోల్ పోసి...
అతనో ఆర్ఎంపీ వైద్యుడు. పెళ్లి కూడా అయింది. క్లినిక్‌కు తరుచుగా వచ్చే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం యువతి బంధువులకు తెలియడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. చేసేది లేక ఆమెను రెండో భార్యగా చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో కుటుంబకలహాలు మొదలయ్యాయి. దీంతో అప్పుడప్పుడు కలుసుకుంటున్న మాదిరిగానే ఆదివారం కూడా రెండో భార్యను కలిశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. యువతి ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగెడుతుండగా కర్రతో తలపై మోది అతికిరాతంగా చంపాడు. ఈ హృదయ విదారక సంఘటన ఆదివారం ఉదయం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో జరిగింది. రామన్నపేట(నకిరేకల్) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ షుకూర్ అనే వ్యక్తి రామన్నపేటకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం కొండమల్లేపల్లిలోనే గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్ఎంపీగా ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో గుంటూరుకు చెందిన షమీనా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. తరచుగా క్లినిక్‌కు వస్తుండంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం షమీన బంధువులకు తెలియడంతో పెళ్లిచేసుకోవాలని షుకూర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో షుకూర్ ఆమెను 2017 ఏప్రిల్‌లో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం మొదటి భార్యకు, ఆమె తల్లిదండ్రులకు తెలవడంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి.మొదటి భార్య తరఫు బంధువుల ఒత్తిడి మేరకు షుకూర్ 5నెలల క్రితం తన మకాంను రామన్నపేటకు మార్చాడు. రామన్నపేట పాతబస్టాండ్ ఆవరణలో ఆయూస్ క్లినిక్‌ను తెరిచి వైద్య సేవలు అందిస్తున్నాడు. షుకూర్ రామన్నపేటకు వచ్చిన తర్వాత కూడా రెండో భార్యతో ఫోన్లో టచ్‌లో ఉన్నాడు. రెండు పర్యాయాలు ఆమె రామన్నపేటకు వచ్చి అతనిని కలిసి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో షమీనా మండలంలోని ఇంద్రపాలనగరం శివారులోకి రాగా, షుకూర్ బైక్‌పై అక్కడికి వెళ్లాడు. రోడ్డుకు కొద్దిదూరంలో వ్యవసాయ బావి భూమిలోని చింతచెట్టుకు కింద కలుసుకున్నారు. ఆ సమయంలో వారి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. షుకూర్ తనవెంట తీసుకువచ్చిన బాటిల్లోని పెట్రోల్‌ను ఆమెపై చల్లి లైటర్‌తో నిప్పంటించాడు. ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా తలపై కర్రతో బలంగా మోదడంతో అక్కడే కుప్పకూలిపోయింది. చుట్టు పక్కల రైతులు గమనించి మంటలను చూసి అరుపులను విని పరుగెత్తుకుంటూ వచ్చి 108కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమచికిత్స అనంతరం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షమీనా మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ ఎన్.శ్రీనివాస్, ఎస్ఐ బి.నాగన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
రెండో పెళ్లాం మోజులో పడి..
హైదరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి: రెండో పెళ్లాం మోజులో పడి ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను రోకలిబండతో మోది దారుణంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హన్మంతు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా, హన్వడా గ్రామానికి చెందిన శిరీష,రమేష్ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చిన వీరు కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పద్మశాలీపురంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా రెండేళ్ల క్రితం రమేష్‌కు మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లెకు చెందిన పద్మ పరిచయం ఏర్పడంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో శిరీష బంధువులు పంచాయతీ పెట్టి పద్మతో కాపురం వద్దని, ఆమెకురూ. 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్మానం చేశారు. మంగళవారం డబ్బుల విషయమై శిరీష, రమేశ్‌ల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రమేశ్ ఆమెపై రోకలిబండతో దాడి చేయడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేశ్ కోసం గాలిస్తున్నారు. -
రెండో భార్యను చంపి ముక్కలు చేసిన భర్త
సూరత్: మొన్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన మరువక ముందే.. కట్టుకున్న భార్యను హత్య చేసి పాశవికంగా ముక్కలుగా చేశాడో భర్త. ఈ పైశాచిక ఘటన సూరత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యను హతమార్చి అనంతరం ఆమె శరీర భాగాలను ఉద్నాలోని కాలువలో పడేస్తుండగా నిందితున్ని పోలీసులు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. షానవాజ్ అలియాస్ షానూ యూసుఫ్‌మియా షైక్ (32) పార్సీ షెరీలోని రాణి తలావ్‌లో సరుకు రవాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడే తన భార్య జొహ్రాబ్ నబీతో పాటు నివాసముంటున్నాడు. రెండేళ్లక్రితం షానవాజ్ అమ్రావతికి చెందిన జులేఖతో ప్రేమాయణం సాగించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే మొదటి భార్య జొహ్రాబ్ నబీకి, జులేఖకి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన షానవాజ్ ఎలాగైనా తన రెండో భార్య జులేఖ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి ఆమెను చంపి, శరీరాన్ని 11 ముక్కలుగా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా భతేనా ఖడీలోని ఉద్నా కాలువలో పడేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని మొదటి భార్య, సోదరి ఈ హత్యలో అతనికి సహాయపడొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి పరారైన ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కాగా, నిందితుని కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సూరత్ ఏసీపీ (రేంజ్-1) హెచ్‌కే పటేల్ మాట్లాడుతూ.. ‘ షానవాజ్ తన రెండో భార్యను ముక్కలుగా కోసి ఆమె శరీర భాగాలను కాలువలో పడేస్తుండగా రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. అతనిపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేశాం’అని తెలిపారు. -
82 ఏళ్ల స్వామీజీకి పుత్రభాగ్యం
సాక్షి, బెంగళూరు (కలబురీ): కర్ణాటకలో ఒక స్వామీజీకి 82 ఏళ్ల వయసులో పుత్రభాగ్యం కలిగింది. హైదరాబాద్– కర్ణాటక ప్రాంతం భక్తుల ఆరాధ్యదైవమైన కలబుర్గీలోని మహాదాసోహి శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణ బసప్ప అప్ప 82 ఏళ్లలో తండ్రయ్యారు. 48 ఏళ్ల రెండో భార్యకు రెండు రోజుల కిందట ముంబైలో మగపిల్లాడు జన్మించాడు. ఇకపై ఈ శిశువునే మఠానికి ఉత్తరాధికారిగా పరిగణిస్తారు. విషయం తెలిసిన వెంటనే మఠానికి చెందిన భక్తులు సంబరాలు చేసుకున్నారు. కాగా, శరణ బసప్ప అప్పకు ఇప్పటికే ఎనిమిది మంది కూతుర్లు ఉన్నారు. -
మృతదేహాలతో ధర్నా
ప్రొద్దుటూరు టౌన్: తన భర్తకు చెందిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం మృతదేహాలతో చంద్రశేఖర్‌రెడ్డి రెండో భార్య కవిత ధర్నా చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి మొదటి భార్య రమాదేవి పేరుతో ఉన్న 32 సెంట్ల స్థలం, డబ్బు, బంగారును ఆమె మేనమామ అయిన శివారెడ్డి ఆధీనంలో ఉంది. భర్త మృతి చెందడంతో జీవనాధారం కోసం తనకు ఆస్తి ఇవ్వాలని కవిత బంధువులు పెద్ద మనుషులతో చెప్పి పంపించగా శివారెడ్డి వినిపించుకోలేదు. దీంతో ఆమె తన బంధువులతో కలసి మృతదేహాలతో వైఎంఆర్కాలనీలోని శివారెడ్డి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ధర్నా చేసింది. విషయం తెలియడంతో అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ మహేష్‌లు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులు, పెద్ద మనుషులు శివారెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. -
చిన్నారిని కడతేర్చిన రెండో భార్య
మొదటి భార్య కొడుకుని భర్త ప్రేమగా చూస్తున్నాడనే అసూయే కారణం వెంకటాచలం: మొదటి భార్య బిడ్డను భర్త తన బిడ్డపై కంటే ప్రేమగా చూస్తున్నాడన్న అసూయతో అభం శుభం తెలియని మూడేళ్ల బాబును కడతేర్చింది ఓ మానవత్వం లేని తల్లి. ఈ సంఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఏడుకొండలుకి నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డుకు చెందిన మల్లి శ్రీనివాసులు కుమార్తె అనితతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. ఏడుకొండలు గూడూరు ఎస్‌బీక్యూ స్టీల్ ఫ్యాక్టరీకి ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం అక్కడే పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన గౌరీ అనే యువతితో పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నాడు. ఈమెను నెల్లూరు ఆటోనగర్ వర్క్‌ర్స్ కాలనీలో కాపురం పెట్టాడు. పెళ్లయిన ఏడాదికి వీరికి శరణ్య అనే పాప పుట్టింది. ఈ పెళ్లి విషయాన్ని ఏడుకొండలు మొదటి భార్య వద్ద దాచాడు. కొద్ది నెలలకు మొదటి భార్యకు సాయితేజ(3) పుట్టాడు. ఈ క్రమంలో బాబుపై ఏడుకొండలు ఎక్కువ ప్రేమ చూపుతున్నాడని గౌరీ అసూయ పడసాగింది. ఈ ఏడాది జూన్‌లో మొదటి భార్య ఆడపిల్లకు జన్మనిచ్చి..కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయించుకునేందుకు నెల్లూరు ఆస్పత్రిలో చేరింది. దీంతో ఏడుకొండలు సాయితేజని తీసుకుని జూన్ 11న రెండో భార్య ఇంటికి వచ్చాడు. అనంతరం పనిపై ఇంటి నుంచి బయటికెళ్లగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గౌరీ.. సాయితేజ (2)ను ముక్కు, నోరు మూసి హతమార్చింది. ఈ విషయాలను పోలీసులు దర్యాప్తుల్లో వెల్లడయ్యాయి. చంటి బిడ్డను హతమార్చినందుకు గౌరీని, రెండో వివాహాన్ని దాచినందుకు ఏడుకొండలును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సీఐ వెంట ఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోమ్ గార్డు సుచరిత ఉన్నారు. -
కానిస్టేబుల్.. మూడు పెళ్లిళ్లు!
-
కానిస్టేబుల్.. మూడు పెళ్లిళ్లు!
అతడో కానిస్టేబుల్. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు.. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అతడిమీద ఉంటుంది. కానీ, అతగాడే నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది చాలదన్నట్లు మూడో మహిళతో సహజీవనం కూడా మొదలుపెట్టాడు. విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ అతడి రెండో భార్య మహిళా సంఘాలను ఆశ్రయించింది. దాంతో ఈ విషయం కాస్తా బయటపడింది. -
మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!
'ఇరువురు భామల కౌగిలిలో స్వామీ.. ఇరుకున పడి నీవు నలిగితివా' అని ఆచార్య ఆత్రేయ ఎప్పుడో 1990లోనే రాశారు. అయినా అతగాడు పట్టించుకోలేదు. దాంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ చెలరేగింది. చినికి చినికి గాలివానగా మారడంతో.. చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే మరిగే నూనె పోసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. శ్రవణ్ యాదవ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సోనుతో కొంతకాలం క్రితమే విభేదాలు రావడంతో అతడు ఆర్తి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ నగరంలోని భగీరథ్‌పురా ప్రాంతంలోనే ఉంటారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆర్తి తన తల్లి అనితతో కలిసి సోను ఇంటికి వెళ్లింది. మరిగే మరిగే నూనె తీసుకుని ఆమె మీద పోసింది. ఆ సమయంలో సోను కుమార్తె కూడా తల్లితోపాటే ఉండటంతో ఆమెకు కూడా కాలిన గాయాలయ్యాయి. దాంతో వారిద్దరినీ ఎంవై ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శ్రవణ్, అతడి రెండోభార్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఐపీసీ 326 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
మా ఆయనకు రెండోపెళ్లి.. ఆదుకోండి!
తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, 5 లక్షల కట్నం తెచ్చిస్తే మళ్లీ ఏలుకుంటానని తనకు చెబుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది. కరుణశ్రీ అనే మహిళ రామచంద్రపురంలో ఎంఎస్సీ చదివారు. అప్పట్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన నక్కా తిరుపతి రాజమండ్రిలో పనిచేస్తూ, ఫీల్డ్ వర్క్ కోసం రామంద్రపురం వెళ్లేవాడు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2007లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కట్నంగా లక్ష నగదు, ఇతర లాంఛనాలు ఇచ్చారు. తర్వాత ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు వెళ్లే తిరుపతి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను రెండోపెళ్లి చేసుకున్నాడు. దీనిపై తాను నిలదీయగా.. 5 లక్షల అదనపు కట్నం తెస్తే ఏలుకుంటానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రెండో భార్యను పీక పిసికి చంపిన భర్త
రెండో భార్య అంటే సాధారణంగా ఎవరికైనా మోజు ఉంటుంది. చాలా అపురూపంగా చూసుకుంటారు. కోరినవన్నీ ఇట్టే కొని ఇచ్చేస్తుంటారు. కానీ, మహారాష్ట్రలో మాత్రం ఓ భర్త తన రెండో భార్యను పీక పిసికి చంపేశాడు. థానె జిల్లాలోని భివాండీ టౌన్షిప్ ప్రాంతంలో గల కల్హెర్ గ్రామానికి చెందిన అతుల్ బర్మన్.. తనకు ముందే పెళ్లయిందన్న విషయాన్ని అతడు దాచిపెట్టి ఉంచి, లత (27)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తర్వాత లతకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచు గొడవలు అవుతుండేవి. ఇంట్లో తరచు జరుగుతున్న గొడవలతో బాగా విసుగు చెందిన అతుల్ బర్మన్, తన రెండో భార్యను ఆదివారం రాత్రి పీక పిసికి చంపేసి, ఇంట్లోంచి పారిపోయాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.