
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో నివాసముండే బి.సందీప్ ప్రసాద్ అనే వ్యక్తికి గతంలోనే పెళ్లయి ఒక కొడుకున్నాడు. కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(31)తో సన్నిహితంగా ఉంటున్న సందీప్ తన భార్యతో విడాకులు తీసుకున్నానని నమ్మించాడు.
జనవరిలో యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యతో విడాకులు తీసుకోలేదని తెలుసుకుని నిలదీయడంతో ముఖం చాటేశాడు. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు మోసం చేసిన సందీప్ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 420, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్ చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment