మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ! | Woman pours hot oil on husband's first wife | Sakshi
Sakshi News home page

మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!

Published Thu, Sep 18 2014 11:55 AM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM

మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ! - Sakshi

మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!

'ఇరువురు భామల కౌగిలిలో స్వామీ.. ఇరుకున పడి నీవు నలిగితివా' అని ఆచార్య ఆత్రేయ ఎప్పుడో 1990లోనే రాశారు. అయినా అతగాడు పట్టించుకోలేదు. దాంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ చెలరేగింది. చినికి చినికి గాలివానగా మారడంతో.. చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే మరిగే నూనె పోసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. శ్రవణ్ యాదవ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సోనుతో కొంతకాలం క్రితమే విభేదాలు రావడంతో అతడు ఆర్తి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ నగరంలోని భగీరథ్పురా ప్రాంతంలోనే ఉంటారు.

ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆర్తి తన తల్లి అనితతో కలిసి సోను ఇంటికి వెళ్లింది. మరిగే మరిగే నూనె తీసుకుని ఆమె మీద పోసింది. ఆ సమయంలో సోను కుమార్తె కూడా తల్లితోపాటే ఉండటంతో ఆమెకు కూడా కాలిన గాయాలయ్యాయి. దాంతో వారిద్దరినీ ఎంవై ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శ్రవణ్, అతడి రెండోభార్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఐపీసీ 326 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement