బర్త్‌డే: భర్తపై మరిగే నూనె పోసి..! | Woman pours hot oil on husband after tiff | Sakshi
Sakshi News home page

బర్త్‌డే: భర్తపై మరిగే నూనె పోసి..!

Published Tue, Jul 18 2017 1:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

బర్త్‌డే: భర్తపై మరిగే నూనె పోసి..!

బర్త్‌డే: భర్తపై మరిగే నూనె పోసి..!

జయ షెరియా (35) పుణెలో ఉంటుంది. ఆమె భర్త భరత్‌ ముంబైలో ఉంటాడు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత వారాంతం భార్య జయ పుట్టినరోజు కావడంతో భరత్‌ ముంబై నుంచి వచ్చాడు. ఇద్దరూ రోజంతా కలిసి షాపింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. కానీ రాత్రి వచ్చేసరికి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న జయ భరత్‌పై మరుగుతున్న నూనెను పోసింది. ఈ ఘటన శనివారం రాత్రి 11. 30 సమయంలో జరిగింది.

భరత్‌, జయ 2011లో తొలిసారి పుణె-ముంబై రైలులో కలిశారు. అనంతరం ప్రేమలోపడి కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్నారు. జయ పుణెలో ఉండి సెల్స్‌వుమెన్‌గా పనిచేస్తుండగా, న్యాయవిద్యార్థి అయిన భరత్‌ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతంలో ఇద్దరూ కలుస్తారు. అయితే, గత వారాంతం జయ పుట్టినరోజు సంబంరం గొడవలకు దారితీసింది. తనను కూడా ముంబై తీసుకెళ్లాలని జయ, భరత్‌ను కోరడంతో ఇద్దరూ గొడవపడ్డారు.

దీంతో భరత్‌ వెళ్లి తన బెడ్రూంలో పడుకోగా.. ఆగ్రహించిన జయ వంటగదిలోకి వెళ్లి.. నూనెను మరుగబెట్టి అతనిపై పోసింది. దీంతో భరత్‌కు కాలినగాయాలయ్యాయి. దాదాపు 10శాతం ఒళ్లు కాలిపోయి ఆస్పత్రి పాలయ్యాడు. ఛాతిపై, కడుపుపై, కాలిపై గాయాలయ్యాయి. ఈ మేరకు అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, జయను భరతే రెచ్చగొట్టాడని, డబ్బు కోసమే ఆమెను భరత్‌ వాడుకుంటున్నాడని, జీతం కోసమే పుణెకు వస్తాడని ఆమె బంధువులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement