
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: ఓ మహిళకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకున్నాడు యజమాని. తీరా గట్టిగా అడిగేసరికి విచక్షణ మరచి ఆమెను చితకబాదాడు. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూణెలో అకుర్దిలోని వాణిజ్య సముదాయంలోని ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ఆఫీసులో ఓ మహిళ కొంత కాలంగా పని చేస్తోంది.
అయితే కొన్ని రోజులుగా, అర్షద్ కమల్ ఖాన్ తన సోదరుడికి బదులుగా ఆ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలలుగా ఆ మహిళకు జీతాన్ని చెల్లించడం లేదు. చివరికి ఈ విషయమై ఖాన్‌ని గట్టిగా ప్రశ్నించగా విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె రక్తస్రావం అయింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసుల కేసు అతడి మీద కేసు నమోదు చేశారు. పూణెలోని నిగ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా అర్షద్ కమల్ ఖాన్‌ని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment