hot oil
-
భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...
జియాగూడ (హైదరాబాద్): వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ భార్య నిద్రిస్తున్న భర్తపై వేడినూనె పోసి హత్య చేసేందుకు యత్నించిన సంఘటన మంగళవారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దరియాబాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిధర్ (50) కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య రేణుక, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయవాడకు చెందిన వీరు పిల్లల చదువుల నిమిత్తం నగరానికి వలస వచ్చి గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఉండేవాడు. 10 రోజుల క్రితం అక్కడి నుంచి దరియాబాగ్ ప్రాంతానికి మకాం మార్చారు. గిరిధర్ ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని రేణుక అతడితో గొడవ పడేది. మంగళవారం పనికి వెళ్లి వచ్చిన గిరిధర్ ఉదయం 11 గంటల ప్రాంతంలో నిద్రిస్తుండగా రేణుక కాగుతున్న మంచినూనెను అతనిపై పోసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చిచ్చు రేపిని బిర్యాని వంట... భార్యపై కత్తితో దాడి) -
ఏం తల్లివమ్మా నువ్వు.. ఇంత దారుణమా!
కాకినాడ(తూర్పుగోదావరి): అడుక్కోవడానికి వెళ్లమంటే వెళ్లనందని 11 ఏళ్ల కుమార్తెపై ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. కాకినాడ దుమ్ములపేటకు చెందిన కారే థెరెస్సాకు సుగుణ అనే 11 ఏళ్ల కుమార్తె ఉంది. బంధువుల సహకారంతో బాలిక వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. కొన్నాళ్ల క్రితం తల్లి థెరెస్సా కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. మద్యానికి బానిసై కుమార్తెను నిత్యం వేధించేది. బిచ్చమెత్తి డబ్బులు తెచ్చివ్వాలని కొడుతూండేది. సుగుణ వెళ్లనని చెప్పింది. ఆదివారం మరోమారు వెళ్లి తీరాలని థెరెస్సా చెప్పింది. కుమార్తె వెళ్లననీ, తాను చదువుకుంటానని హాస్టల్‌కు పంపేయమంటూ ప్రాధేయపడింది. కనికరించని తల్లి బాలికను కొట్టింది. స్టౌపై నూనె మరిగించి బాలిక ఒంటిపై పోసింది. బాలిక చేతులు కాలి గాయాలపాలై బిగ్గరగా ఏడవడంతో బాలికను స్థానికులు తల్లి చెర నుంచి తప్పించి సమీపంలో నివాసం ఉంటున్న మేనమామ కుటుంబానికి అప్పగించారు. వారు బాలికను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!
ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనూ, స్ట్రీట్ ఫుడ్లు తయారు చేసే వాళ్లు తమ పాక కళా శాస్త్ర నైపుణ్యాలతో భోజన ప్రియులను భలే ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు వారు కొంగొత్త రుచులతో భోజన ప్రియులను మైమరిపించడంతో ప్రముఖులుగా పేరు తెచ్చుకంటున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) అంతేకాదు ఇటీవల కాలంలో చెఫ్ ఒక్కొక్కరూ ఒక్కొ రకమైన పద్దతుల్లో వంటకాలను చేసి కస్ట్మర్లను మంత్రముగ్దులను చేస్తున్నారు. ఇదే తరహాలో ఒక స్ట్రీట్‌ఫుడ్ చెఫ్ భయంకరంగానూ, విస్తుపోయే విధంగా ఎలా వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడో చూడండి. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడోక స్ట్రీట్ ఫుడ్ లో వంటలు చేసే వ్యక్తి చికెన్‌ని డీప్ ఫ్రై చేస్తున్నాడు. అంతే ఉన్నటుండి ఒక్కసారిగా మరుగుతూ ఉన్న నూనెలో డైరెక్ట్‌గా చేతులతో చికెన్ ముక్కలు తీసేస్తున్నాడు. పైగా అతని చేతులు ఏ మాత్ర కాలినట్లుగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. దీంతో సదరు కస్టమర్లు ఒక్కసారిగా విస్తూపోతారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు వీడు ఐరన్ మ్యాన్‌లా ఎలా చేస్తున్నాడర్రా బాబు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..) View this post on Instagram A post shared by SHAILESH | JAIPUR (@nonvegfoodie) -
దారుణం: కోపంతో అత్తపై కాగుతున్న నూనె పోసిన కోడలు
సాక్షి, అమరావతి: డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై సల సల కాగుతున్న నూనె పోసింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ పరిధిలోని మందపాడు గ్రామంలో నివసిస్తున్న చుక్కా లక్ష్మికి ఆర్థిక సాయం రూపంలో ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు వచ్చాయి. దీంతో ఆమె కొడుకు శివ ఇంటిలో మరమ్మత్తులు చేయడం కోసం తల్లిని ఆ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు లక్ష్మీ నిరాకరించింది. కాగా ఈ విషయమై శనివారం రాత్రి లక్ష్మీ ఆమె కోడలు స్వరూపకు స్వల్ప వివాదం తలెత్తింది. డబ్బులు ఇవ్వలేదని కోపంతో స్వరూప తన అత్తపై కాగుతున్న నూనె పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఎందుకిలా చేశావు తల్లీ..! -
గుడివాడ : కోపంతో అత్తపై కాగుతున్న నూనె పోసిన కోడలు
-
ఇంట్లో ప్రయత్నించకండి.. కాలిపోద్ది!
వంట చేసేటప్పుడు కొద్దిగా నూనె చిట్లి చేతుల మీద పడితే ఎంత మంట పుడుతుందో కదా. మరోసారి కిచెన్‌లో అడుగుపెట్టకూడదు అనుకుంటాము. నూనె చిట్లుతుందనే భయంతోనే చాలా మంది పిండి వంటలు చేయడం వంటి వాటి జోలికి పోరు. రెండు మూడు చుక్కల నూనె మీద పడితేనే బాధతో విలవిల్లాడతామే.. ఏకంగా సలసల కాగే నూనేలో చేతిని ముంచితే.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అలాంటిది ఈ న్యూస్ చదివి.. వీడియో చూశాక ఇంకేమంటారో మరి. ఓ నడి వయసు మహిళ చేతిని చాలా ఈజీగా.. చిల్లుల గరిటే మాదిరి బాగా మరుగుతున్న నూనెలో ముంచి తీస్తుంది. ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజం. ఫస్ట్ వి ఫీస్ట్ అనే ట్విట్టర్లో అకౌంట్లో షేర్ చేసిన ఈ టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) She said tongs are for losers 😭😭😭 pic.twitter.com/QF4IaFiMd7 — First We Feast (@firstwefeast) October 26, 2020 ‘షి సేడ్ టంగ్స్ ఆర్ ఫర్ లూజర్స్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ నడి వయసు మహిళ పెద్ద బాండీ ముందు నిల్చుని ఉంది. దానిలో నూనె బాగా మరుగుతుంది. బజ్జీలు వంటి స్నాక్ ఐటెం తయారు చేస్తుంది. పిండిలో ముంచిన మిరపకాయల్ని నూనెలో వేస్తుంది. ఫ్రై అయిన వాటిని పక్కకు జరపడానికి చిల్లుల గరిటే, పట్టుకారు లాంటివి వాడకుండా చేతితోనే పక్కకు జరుపుతుంది. బాగా మరిగిని ఆ నూనెని చేతిలోకి తీసుకుని దానిలో పోయడం చూడవచ్చు. రెండు సార్లు మరిగే నూనెలో చేయి పెట్టినా ఆమెకు ఏం కాలేదు. ఆ తర్వాత ఓ ఎడిటెడ్ పటుకారు ఫ్రేమ్‌లోకి వచ్చి.. బహుశా నేను ఇక్కడ లేను.. నేను కేవలం ఓ భ్రమను మాత్రమే అనడం చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 16కే మంది చూశారు. చాలా మంది ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నామని.. ఆమె అవతార్ ఆఫ్ ఆయిల్ బెండర్ అని.. ఇలాంటి వీడియో నెవ్వర్ బీఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆమె చేతికి ఉన్న పిండి కాలకుండా కాపాడుతుంది అంటున్నారు. -
దారుణం : మరిగే నూనెలో చేతులు పెట్టించి!
అహ్మదాబాద్ : భర్త మీద అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. పక్కింటి అమ్మాయితో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ మహిళ మరిగే నూనెలో వారిద్దరి చేతులు పెట్టించింది. ఈ భయానకమైన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాహుల్ పర్మార్, సుమన అనే దంపతులు రాజ్‌కోట్‌లోని భగవతిపారా ప్రాంతంలో నివశిస్తున్నారు. అయితే సుమనకు తమ పక్కిట్లో ఉండే ఓ యువతి(17)తో రాహుల్ వివాహేతర సంబంధం నడుపుతున్నారనే అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదని నిరూపించుకోవడానికి బాగా మరుగుతున్న నూనెలో చేతులు పెట్టాలని కోరింది. దీనికి అంగీకరించని యువతి, తన భర్తతో బలవంతంగా సలసల కాగే నూనెలో చేతులు పెట్టించింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దంపతులిద్దరినీ అరెస్టు చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. రాహుల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సదరు యువతి పోలీసులకు తెలిపింది. -
ఫుడ్ బాగా లేదన్న పాపానికి..!?
ముంబై : రోడ్‌సైడ్ హోటల్లో ఫుడ్ బాగా లేదన్న ఓ కస్టమర్‌పై సలసల కాగే నూనె పోసేందుకు ప్రయత్నించాడో యజమాని. షాకింగ్‌కు గురి చేసే ఈ ఘటన ముంబై శివారులోని ఉల్లాస్ నగర్లో జరిగింది. రోడ్ పక్కగా ఉండే ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. తింటున్న టిఫిన్ రుచిగా లేదని చెప్పాడు. అంతేకాక ఇంత చట్నీలు కూడా సరిగ్గా లేవని యువకుడు హొటల్ యజమానితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాక టిఫిన్ చేసేందుకు వస్తున్న ఇతర కస్టమర్లతో.. ఇక్కడ టిఫిన్ బాగాలేదని యువకుడు చెప్పడంతో హోటల్ యజమానికి ఆగ్రహం తెప్పించింది. గొడవ పెట్టుకున్న కస్టమర్‌పై కోపం తెచ్చుకున్న హోటల్ యజమాని అతనిమీద సలసల మరిగే నూనెను పోసేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన కస్టమర్ అక్కడనుంచి పారిపోయాడు. అయినా అతని మీద నూనె పోసేందుకు హోటల్ యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉండే సీసీటీవీలో రికార్డయింది. కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి.. సదరు హోటల్ యజమానిపై కేసును నమోదు చేశారు పోలీసులు ఫుడ్ బాగా లేదన్న కస్టమర్‌పై హోటల్ యజమాని గొడవ -
ఫుడ్ బాగా లేదన్న పాపానికి..!
-
బర్త్‌డే: భర్తపై మరిగే నూనె పోసి..!
జయ షెరియా (35) పుణెలో ఉంటుంది. ఆమె భర్త భరత్ ముంబైలో ఉంటాడు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత వారాంతం భార్య జయ పుట్టినరోజు కావడంతో భరత్ ముంబై నుంచి వచ్చాడు. ఇద్దరూ రోజంతా కలిసి షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కానీ రాత్రి వచ్చేసరికి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న జయ భరత్‌పై మరుగుతున్న నూనెను పోసింది. ఈ ఘటన శనివారం రాత్రి 11. 30 సమయంలో జరిగింది. భరత్, జయ 2011లో తొలిసారి పుణె-ముంబై రైలులో కలిశారు. అనంతరం ప్రేమలోపడి కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్నారు. జయ పుణెలో ఉండి సెల్స్వుమెన్గా పనిచేస్తుండగా, న్యాయవిద్యార్థి అయిన భరత్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతంలో ఇద్దరూ కలుస్తారు. అయితే, గత వారాంతం జయ పుట్టినరోజు సంబంరం గొడవలకు దారితీసింది. తనను కూడా ముంబై తీసుకెళ్లాలని జయ, భరత్‌ను కోరడంతో ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో భరత్ వెళ్లి తన బెడ్రూంలో పడుకోగా.. ఆగ్రహించిన జయ వంటగదిలోకి వెళ్లి.. నూనెను మరుగబెట్టి అతనిపై పోసింది. దీంతో భరత్‌కు కాలినగాయాలయ్యాయి. దాదాపు 10శాతం ఒళ్లు కాలిపోయి ఆస్పత్రి పాలయ్యాడు. ఛాతిపై, కడుపుపై, కాలిపై గాయాలయ్యాయి. ఈ మేరకు అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, జయను భరతే రెచ్చగొట్టాడని, డబ్బు కోసమే ఆమెను భరత్ వాడుకుంటున్నాడని, జీతం కోసమే పుణెకు వస్తాడని ఆమె బంధువులు అంటున్నారు. -
దొంగతనం ఒప్పుకోలేదని..
♦ కాగే నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయించబోయిన వైనం ♦ అడ్డుకున్న తల్లిదండ్రులు, బంధువులు చేజర్ల: చేయని దొంగతనం ఒప్పుకోలేదని బలవంతంగా ఓ యువకుడి చేత బహిరంగంగా కాగే నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయించబోయిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పుట్టుపల్లి గ్రామంలో నివాసముంటున్న ఎస్కే ఖలీల్‌బాష, బీబీ కుమారుడు నజీర్‌బాష ఆత్మకూరు బీఎస్సార్ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఖాతూన్‌బీ ఇంటిలో రూ.2 వేలు దొంగతనం జరిగింది. ఎదురింట్లో ఉన్న నజీర్‌బాష దొంగలించాడనే అనుమానంతో కాగే నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయాలని ఖాతూన్‌బీ, కుమార్తె బీబీజాన్, కొడుకు మస్తాన్‌షరీఫ్‌లు బెదిరించారు. ఈ క్రమంలో నజీర్‌ను గ్రామంలోని దర్గా వద్దకు తీసుకెళ్లి బాండలిలో సిద్ధంగా ఉంచిన నూనెలో చేతులు పెట్టిస్తుండగా విషయం తెలుసుకున్న నజీర్ బంధువులు వారిని అడ్డుకున్నారు. దీంతో బాధితుడు బంధువులతో కలిసి సోమవారం రాత్రి చేజర్ల పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై సుభాని మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
వేడివేడి నూనెలో చేతులాడిస్తాడు..
తాలింపులో పచ్చిమిర్చీ వేస్తున్నప్పుడో, పిండి వంటలు చేస్తున్నప్పుడో ఒకటీ అరా వేడివేడి నూనె చుక్కలు ఒంటిపై పండితే ప్రాణం పోయినంత పనౌతుంది. అలాంటిది సలసలా కాగే నూనెలో అమాంతం చేయి పెట్టేసి పకోడీలు అవీ వండేస్తుంటాడు రాంబాబు. ఇంతకీ ఎవరీ బాబు? ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ రాంబాబు సొంతూరు. ఆ ఊళ్లోని ఓ వీధి తన ఇంటిముందరే చిన్న పొయ్యి అదీ ఏర్పాటుచేసి పిండి వంటలు అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. 200 డిగ్రీల వేడి నూనెలో చేతులు పెట్టడం, పెట్టినా కాలకపోవడంతో రాంబాబు దగ్గర ఏవో దివ్యశక్తులు ఉన్నట్లు అక్కడి జనం అమ్ముతున్నారు. ఒక విధంగా ఆ నమ్మకం అతడి షాపుకు గిరాకి పెరిగేందుకు కూడా తోడ్పడింది. ఇంతకీ ఏమిటీ మ్యాజిక్? అని రాంబాబునే అడిగితే.. 'మ్యాజిక్కూ లేదూ మాయా లేదు.. అంతా దైవ లీల! ఇరవైఏళ్ల కిందట షాపు ప్రారంభించినప్పటి నుంచీ నా వంటకాలకి మంచి పేరుంది. కొన్ని సార్లు అదుపులేచలేనంత మంది కస్టమర్లు వస్తుంటారు. అలా ఓ బిజీ సాయంత్రాన.. కస్టమర్లకు పదార్థాల్ని త్వరగా అందించాలనే హడావిడిలో పక్కనే జల్లిగంటే ఉన్న సంగతి మర్చిపోయి వేడివేడి నూనెలో చెయ్యిపెట్టి పకోడీని కలిపా! క్షణాల తర్వాత పొరపాటు గుర్తొచ్చి చెయ్యి వెనక్కి తీసుకున్నా. ఆశ్చర్యకరంగా చిత గాయమైనా కాలేదు! ఆ తర్వాత మళ్లీ మళ్లీ వేడివేడి నూనెలో నా చేతిని ముంచా. అయినా ఏమీ కాలేదు. అప్పుడు అర్థమైంది. ఇది దేవుడి లీలని. అప్పటి నుంచి గంటెలు గట్రా పక్కన పారేసి చేత్తోనే పదార్థాలు వండేస్తున్నా. ఇంతకు ముందు కంటే రుచిగా ఉంటున్నాయని పొగుడుతున్నరు కస్టమర్లు' అని వివరిస్తాడు స్ట్రీట్ ఛెఫ్ రాంబాబు. రోజుకు దాదాపు 100 కిలోల పిండి పదార్థాలమ్మే ఆయనకు ఖర్చులన్నీపోనూ 2వేల రూపాయలు మిగులుతాయట! -
'ఈ నల భీముడు కెవ్వు కేక'
అలహాబాద్: వంట చేసే సమయంలో కాస్త దగ్గరగా ఉంటేనే ఆ వేడికి భయపడి దూరంగా జరుగుతుంటాం. అలాంటిది ఏకంగా సలసల కాగే నూనెలో చేతులు ముంచుతూ వంటలు చేస్తే ఎలా ఉంటుంది. మాములుగా అయితే, చర్మం ఊడిపోదూ..! కానీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాంబాబు అనే 60 ఏళ్ల వ్యక్తి ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 40 ఏళ్లుగా ఇలాగే తన బజ్జీల బండిదగ్గర పిండివంటలు తయారు చేస్తున్నాడు. గరిటె సహాయం లేకుండా చకచకా ఘుమఘుమలాడే పిండివంటలు చేస్తున్నాడు. ఇది చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆ చర్య ఒక బ్రాండ్ గా మారి తన బండి వద్ద ఎప్పుడూ ఆహార ప్రియుల సందడితో కళకళలాడేలా చేసింది. 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండే ఈ నూనెలో అతడు చేతి వేళ్లను పిండితో ముంచుతాడు. అవి పూర్తిగా కాలాక తీసి పక్కకు వేస్తుంటాడు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కొందరు అతడిని ప్రశ్నించగా 'నేను సలసల కాగే నూనెలో చేతిని ముంచుతూ పకోడీలు తయారుచేసే విధానం చూసేందుకు చాలా దూరం నుంచి వస్తుంటారు. నేను 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాలిన గాయాలు అవలేదు' అంటూ చెప్పాడు. 20 ఏళ్లనాటికే ఆలు బజ్జీలు వేయడం నేర్చుకున్నానని, తన బడ్డీ కొట్టు ఇంత ఫేమస్ అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పాడు. గరిటెతో పిండివంటలు తయారు చేసి వాటిని తీయడం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుందని, అందుకే తాను నేరుగా చేతిని ఉపయోగించి స్నాక్స్ తయారు చేయడం ప్రారంభించానని చెప్పాడు. దీంతో ఇప్పటి వరకు అతడు గరిటె లేకుండానే పిండివంటలు చేసి అబ్బుర పరుస్తున్నాడు. -
మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!
'ఇరువురు భామల కౌగిలిలో స్వామీ.. ఇరుకున పడి నీవు నలిగితివా' అని ఆచార్య ఆత్రేయ ఎప్పుడో 1990లోనే రాశారు. అయినా అతగాడు పట్టించుకోలేదు. దాంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ చెలరేగింది. చినికి చినికి గాలివానగా మారడంతో.. చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే మరిగే నూనె పోసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. శ్రవణ్ యాదవ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సోనుతో కొంతకాలం క్రితమే విభేదాలు రావడంతో అతడు ఆర్తి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ నగరంలోని భగీరథ్‌పురా ప్రాంతంలోనే ఉంటారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆర్తి తన తల్లి అనితతో కలిసి సోను ఇంటికి వెళ్లింది. మరిగే మరిగే నూనె తీసుకుని ఆమె మీద పోసింది. ఆ సమయంలో సోను కుమార్తె కూడా తల్లితోపాటే ఉండటంతో ఆమెకు కూడా కాలిన గాయాలయ్యాయి. దాంతో వారిద్దరినీ ఎంవై ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శ్రవణ్, అతడి రెండోభార్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఐపీసీ 326 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.