
సాక్షి, అమరావతి: డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై సల సల కాగుతున్న నూనె పోసింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ పరిధిలోని మందపాడు గ్రామంలో నివసిస్తున్న చుక్కా లక్ష్మికి ఆర్థిక సాయం రూపంలో ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు వచ్చాయి. దీంతో ఆమె కొడుకు శివ ఇంటిలో మరమ్మత్తులు చేయడం కోసం తల్లిని ఆ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు లక్ష్మీ నిరాకరించింది.
కాగా ఈ విషయమై శనివారం రాత్రి లక్ష్మీ ఆమె కోడలు స్వరూపకు స్వల్ప వివాదం తలెత్తింది. డబ్బులు ఇవ్వలేదని కోపంతో స్వరూప తన అత్తపై కాగుతున్న నూనె పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఎందుకిలా చేశావు తల్లీ..!
Comments
Please login to add a commentAdd a comment