pouring
-
హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు పోటెత్తుతున్న ఫిర్యాదులు
-
ఏం తల్లివమ్మా నువ్వు.. ఇంత దారుణమా!
కాకినాడ(తూర్పుగోదావరి): అడుక్కోవడానికి వెళ్లమంటే వెళ్లనందని 11 ఏళ్ల కుమార్తెపై ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది. కాకినాడ దుమ్ములపేటకు చెందిన కారే థెరెస్సాకు సుగుణ అనే 11 ఏళ్ల కుమార్తె ఉంది. బంధువుల సహకారంతో బాలిక వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. కొన్నాళ్ల క్రితం తల్లి థెరెస్సా కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది. మద్యానికి బానిసై కుమార్తెను నిత్యం వేధించేది. బిచ్చమెత్తి డబ్బులు తెచ్చివ్వాలని కొడుతూండేది. సుగుణ వెళ్లనని చెప్పింది. ఆదివారం మరోమారు వెళ్లి తీరాలని థెరెస్సా చెప్పింది. కుమార్తె వెళ్లననీ, తాను చదువుకుంటానని హాస్టల్‌కు పంపేయమంటూ ప్రాధేయపడింది. కనికరించని తల్లి బాలికను కొట్టింది. స్టౌపై నూనె మరిగించి బాలిక ఒంటిపై పోసింది. బాలిక చేతులు కాలి గాయాలపాలై బిగ్గరగా ఏడవడంతో బాలికను స్థానికులు తల్లి చెర నుంచి తప్పించి సమీపంలో నివాసం ఉంటున్న మేనమామ కుటుంబానికి అప్పగించారు. వారు బాలికను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దారుణం: కోపంతో అత్తపై కాగుతున్న నూనె పోసిన కోడలు
సాక్షి, అమరావతి: డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై సల సల కాగుతున్న నూనె పోసింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడ పరిధిలోని మందపాడు గ్రామంలో నివసిస్తున్న చుక్కా లక్ష్మికి ఆర్థిక సాయం రూపంలో ప్రభుత్వం అందిస్తున్న డబ్బులు వచ్చాయి. దీంతో ఆమె కొడుకు శివ ఇంటిలో మరమ్మత్తులు చేయడం కోసం తల్లిని ఆ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు లక్ష్మీ నిరాకరించింది. కాగా ఈ విషయమై శనివారం రాత్రి లక్ష్మీ ఆమె కోడలు స్వరూపకు స్వల్ప వివాదం తలెత్తింది. డబ్బులు ఇవ్వలేదని కోపంతో స్వరూప తన అత్తపై కాగుతున్న నూనె పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: రెండు రోజులుగా వెతుకుతున్నా.. ఎందుకిలా చేశావు తల్లీ..! -
వరుస వర్షాలతో నిండుతున్న చెరువులు
కోదాడఅర్బన్: ఇటీవల కాలంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని పలు చెరువులు నీటితో నిండుతున్నాయి . గత వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా ఎండిపోయిన చెరువులు వర్షాల కారణంగా జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లోని చెరువుల్లో మిషన్‌కాకతీయ పథకం కింద పూడికలు తీయడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. మండలంలోని కాపుగల్లు, కొమరబండలతో పాటు పలు గ్రామాల్లో చెరువులు పూర్తిగా నిండే పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చెరువు కట్టల పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
చిలుకూరులో కురిసిన వాన
చిలుకూరు: మండలంలోని బేతవోలు గ్రామంలో గురువారం తెల్లవారుజామన కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.