వరుస వర్షాలతో నిండుతున్న చెరువులు
కోదాడఅర్బన్: ఇటీవల కాలంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని పలు చెరువులు నీటితో నిండుతున్నాయి . గత వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా ఎండిపోయిన చెరువులు వర్షాల కారణంగా జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లోని చెరువుల్లో మిషన్‌కాకతీయ పథకం కింద పూడికలు తీయడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. మండలంలోని కాపుగల్లు, కొమరబండలతో పాటు పలు గ్రామాల్లో చెరువులు పూర్తిగా నిండే పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చెరువు కట్టల పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.