వానలు రాకపాయే.. చెరువులు ఎండిపోయే
శాయంపేట : గత సంవత్సరం మండలంలో కురిసిన భారీ వర్షాలకు అంతటా జలకళ కనిపించింది. కానీ ఈ ఏడాది నేటికి వర్షం కానరాకపోవడంతో చెరువులు పూర్తిగా ఎండిపోయినవి. ఇప్పటివరకు మండలంలో కేవలం 43.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 6వ తేదిన 2.14 ఎంఎం, 7న 2.6 ఎంఎం, 8న 38.2 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు.
8వ తేదిన కురిసిన వర్షానికి రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసి వర్షం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆనాడు మండలంలోని వసంతాపూర్ గ్రామంలోని మొద్దుల చెరువు మత్తడి పోసింది. ఈ రోజు నీటి చుక్క లేక వెలవెలబోతుంది. ఇక మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న చలివాగు ప్రాజెక్టులో 2015 భారీగా వరద నీరు చేరి కళక ళలాడుతూ కనిపించింది. కానీ ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది.