వానలే వానలు | heavy rains in telangana districts | Sakshi
Sakshi News home page

వానలే వానలు

Published Thu, Sep 22 2016 2:19 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

నల్లగొండ జిల్లా పిలాయిపల్లి వద్ద మూసీలో పడిపోయిన లారీ, డీసీఎం - Sakshi

నల్లగొండ జిల్లా పిలాయిపల్లి వద్ద మూసీలో పడిపోయిన లారీ, డీసీఎం

పలు జిల్లాల్లో భారీ వర్షాలు 
నల్లగొండ జిల్లా మోత్కూరులో21 సెం.మీ. వర్షం

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి! బుధవారం మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలో చెరువులు అలుగులు పారుతున్నారుు. మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంజీరా ప్రాజెక్టులో నీటి మట్టం 19 టీఎంసీలకు చేరుకుంది. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నారుు. కొండాపూర్ మండలం గుంతపల్లిలో విద్యుత్ షాక్‌తో హర్షవర్ధన్  అనే వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. మొరుునాబాద్, పెద్దేముల్ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, ఆకుకూరలు ఇతర పంటలు నీట మునిగారుు. ధారూరు బాలుర ఉన్నత పాఠశాల స్టాఫ్ రూం కూలింది. 

వరంగల్, పాలమూరులో బీభత్సం
వరంగల్ జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నారుు. పలువురు రైతుల కరెంటు మోటార్లు కాలిపోగా.. మరికొన్ని వాగుల్లో కొట్టుకుపోయారుు.రాఘవాపురం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీఆర్వో ఎండీ షబ్బీర్ అలీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోరుు మృతి చెందాడు. స్టేషన్  ఘన్ పూర్‌లో పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ కూలిపోరుుంది. వరంగల్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారుు. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాడూరులో అత్యధికంగా 17 సెం.మీ, తెలకపల్లి 7 సెం.మీ వర్షపాతం నమోదైంది.

 మోత్కూరు జలదిగ్బంధం
నల్లగొండ జిల్లాలో మోత్కూరు, గుండాల, ఆత్మకూర్ (ఎం), చిలుకూరు, నడిగూడెం, నాగార్జునసాగర్, మోత్కూరు, చిలుకూరు మండలాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. మోత్కూరులో ఏకంగా 21 సెం.మీ. వర్షం కురిసింది. జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోచంపల్లి మండలంలోని పిల్లాయపల్లి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి నార్కట్‌పల్లి మండలం తొండల్‌వాయి గ్రామంలో చేపరి బాలమల్లయ్య (70) నీటిలో మునిగి మృతి చెందాడు.  ఖమ్మం జిల్లా చింతకాని మండలం మినహా  జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ముల్కలపల్లి మండలంలో అత్యధికంగా 14.62 సెం.మీల వర్షపాతం నమోదైంది.   407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం ఉన్న కిన్నెరసానిలోకి 406 అడుగుల నీటిమట్టం చేరింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పెద్దవాగులో యువకులు.. వాట్సప్‌లో హరీశ్..
ఢిల్లీ అపెక్స్ కౌన్సిల్  భేటీలో ఉండి కూడా మంత్రి హరీశ్‌రావు పటాన్ చెరులో ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడగలిగారు! ఒకదశలో వారి కోసం ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వేణు, నిరంజన్  అనే వ్యక్తులు పటాన్ చెరులో బస్సు దిగి తమ సొంతూరు పోచారం వెళ్తున్నారు. మధ్యలో పెద్దవాగు దాటుతుండగా  వరద ఉధృతి పెరిగి యువకులు కొట్టుకుపోయారు. చెట్లు కొమ్మలు, బండరాళ్ల సాయంతో ఓ మట్టి దిబ్బపైకి చెరుకున్నారు. ఈ దృశ్యాన్ని స్థానికులు సెల్‌ఫోన్ లో వీడియో తీసి మంత్రి హరీశ్‌కు వాట్స్‌ప్‌లో పంపారు. 5 నిమిషాల్లో స్పందించిన మంత్రి.. వారిని వెంటనే రక్షించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌ను అదేశించారు. దీంతో అధికారులు కదిలారు. తొలుత తాడు వేసి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్య పడలేదు. వాట్సప్‌లోనే వివరాలను ఎప్పటికప్పడు తెలుసున్న హరీశ్.. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా వారిని రక్షించాలని ఆదేశించారు. చివరకు అధికారులు తెప్పల్లో గజ ఈతగాళ్లను పంపించి యువకులను కాపాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement