river manjira
-
మం‘జీరబోయింది’..
రేగోడ్(మెదక్): భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు బోరుమంటున్నాయి. నీటిగండం తరుముకొస్తోంది. మంజీర ఎడారిని తలపిస్తోంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి 16 టీఎంసీల నీటిని తరలించడంతో ఇటు తాగడానికి.. అటు వ్యవసాయానికి నీళ్లు కరువయ్యాయి. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని మంజీరా పరీవాహకం వద్ద నీళ్లు అడుగంటిపోయి బురద తేలుతోంది. సింగూరు ప్రాజెక్ట్ సైతం డెడ్ స్టోరేజీకి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఏప్రిల్ చివరి వరకు మాత్రమే నీటి సరఫరా అయ్యే అవకాశం ఉంది. సింగూరు, మంజీరా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న వేలాది బోరుబావులు, బావులు ఎండుముఖం పట్టాయి. లక్షలాది ఎకరాలు పడావుగా మారాయి. బీడు భూములను చూస్తూ రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా ప్రాంతాలకు కొన్ని రోజులుగా రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చిన నీళ్లు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో తాగునీళ్లు వస్తాయా..? రావా..? అన్న ఆందోళన నెలకొంది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలి బోర్లు ఎండిపోయాయి. రెండు రోజులకోసారి నీళ్లొస్తున్నాయి. నీళ్లు సరిపోక అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి నీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. –పాపయ్య, రేగోడ్ బోర్లు లీజుకు తీసుకుంటున్నం గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఇబ్బందులు ఎక్కడా రానీయకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – లచ్చాలు, ఎంపీడీఓ రేగోడ్ -
వానలే వానలు
♦ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ♦ నల్లగొండ జిల్లా మోత్కూరులో21 సెం.మీ. వర్షం సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి! బుధవారం మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలో చెరువులు అలుగులు పారుతున్నారుు. మంజీరా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంజీరా ప్రాజెక్టులో నీటి మట్టం 19 టీఎంసీలకు చేరుకుంది. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నారుు. కొండాపూర్ మండలం గుంతపల్లిలో విద్యుత్ షాక్‌తో హర్షవర్ధన్ అనే వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. మొరుునాబాద్, పెద్దేముల్ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, ఆకుకూరలు ఇతర పంటలు నీట మునిగారుు. ధారూరు బాలుర ఉన్నత పాఠశాల స్టాఫ్ రూం కూలింది. వరంగల్, పాలమూరులో బీభత్సం వరంగల్ జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నారుు. పలువురు రైతుల కరెంటు మోటార్లు కాలిపోగా.. మరికొన్ని వాగుల్లో కొట్టుకుపోయారుు.రాఘవాపురం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీఆర్వో ఎండీ షబ్బీర్ అలీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోరుు మృతి చెందాడు. స్టేషన్ ఘన్ పూర్లో పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ కూలిపోరుుంది. వరంగల్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారుు. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాడూరులో అత్యధికంగా 17 సెం.మీ, తెలకపల్లి 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. మోత్కూరు జలదిగ్బంధం నల్లగొండ జిల్లాలో మోత్కూరు, గుండాల, ఆత్మకూర్ (ఎం), చిలుకూరు, నడిగూడెం, నాగార్జునసాగర్, మోత్కూరు, చిలుకూరు మండలాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. పంటలు నీటమునిగాయి. మోత్కూరులో ఏకంగా 21 సెం.మీ. వర్షం కురిసింది. జలదిగ్బంధంలో చిక్కుకుంది. పోచంపల్లి మండలంలోని పిల్లాయపల్లి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి నార్కట్‌పల్లి మండలం తొండల్వాయి గ్రామంలో చేపరి బాలమల్లయ్య (70) నీటిలో మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మినహా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. ముల్కలపల్లి మండలంలో అత్యధికంగా 14.62 సెం.మీల వర్షపాతం నమోదైంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం ఉన్న కిన్నెరసానిలోకి 406 అడుగుల నీటిమట్టం చేరింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దవాగులో యువకులు.. వాట్సప్‌లో హరీశ్.. ఢిల్లీ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఉండి కూడా మంత్రి హరీశ్‌రావు పటాన్ చెరులో ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడగలిగారు! ఒకదశలో వారి కోసం ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వేణు, నిరంజన్ అనే వ్యక్తులు పటాన్ చెరులో బస్సు దిగి తమ సొంతూరు పోచారం వెళ్తున్నారు. మధ్యలో పెద్దవాగు దాటుతుండగా వరద ఉధృతి పెరిగి యువకులు కొట్టుకుపోయారు. చెట్లు కొమ్మలు, బండరాళ్ల సాయంతో ఓ మట్టి దిబ్బపైకి చెరుకున్నారు. ఈ దృశ్యాన్ని స్థానికులు సెల్‌ఫోన్ లో వీడియో తీసి మంత్రి హరీశ్‌కు వాట్స్‌ప్‌లో పంపారు. 5 నిమిషాల్లో స్పందించిన మంత్రి.. వారిని వెంటనే రక్షించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌ను అదేశించారు. దీంతో అధికారులు కదిలారు. తొలుత తాడు వేసి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్య పడలేదు. వాట్సప్‌లోనే వివరాలను ఎప్పటికప్పడు తెలుసున్న హరీశ్.. ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా వారిని రక్షించాలని ఆదేశించారు. చివరకు అధికారులు తెప్పల్లో గజ ఈతగాళ్లను పంపించి యువకులను కాపాడారు. -
నీటిని తరలిస్తే కేసులు ‘ఇసుక’తో కాసులు
♦ ఇసుకను తరలిస్తే కేసుల్లేవట.. ♦ అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలు పుల్కల్ : ప్రజల దాహం తీర్చేందుకు మంజీరా నది నుంచి నీటిని తరలిస్తే అధికారులపై సైతం క్రిమినల్ కేసులు పెడతామంటున్న అటవీశాఖ అధికారులు అదే నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడంలేదు. అటవీశాఖ అధికారులు ఒక సందర్భంలో నీటిని తరలిస్తే కలెక్టర్‌పైనా కేసులు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. మండల పరిధిలోని పోచారం, చక్రియాల్, హోన్నపూర్ సత్యసాయి నీటి పథకం ద్వారా జిల్లాలోని 275 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మంజీరలో నీరు అడుగంటి పోవడంతో వన్య ప్రాణాలు సంరక్షణకై ఉన్న నీటిని పంపింగ్ చేయవద్దని ఆర్డబ్ల్యూఎస్ అధికారుకుల నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ తాగునీటి అవసరాల కోసం పంపింగ్ చేస్తున్నారు. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు వెంటనే పంపింగ్‌ను నిలిపివేయాలని లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో అవసరమైతే కలెక్టర్‌పై కూడా కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంత వరకు బాగానే ఉన్నా ఇదే మంజీరా నదిలో అక్రమంగా ఇసుకను రవాణ చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే రెవెన్యూ, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజల అవసరాల కోసం తాగు నీటిని సరఫరా చేస్తున్న సత్యసాయి వాటర్ సప్లయి కార్మికులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. సింగూర్‌లో రాత్రి వేళ్లలో నది నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకవచ్చి గ్రామంలోని పొలాల వద్ద నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై తహశీల్దార్ శివరాంను వివరణ కోరగా ఆర్ఐతో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.