అ‍మ్మ బాబోయ్‌ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు! | The man puts his bare hands into piping hot oil and pulls out fried chicken | Sakshi
Sakshi News home page

అ‍మ్మ బాబోయ్‌ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!

Published Sun, Nov 7 2021 8:54 PM | Last Updated on Sun, Nov 7 2021 9:20 PM

The man puts his bare hands into piping hot oil and pulls out  fried chicken - Sakshi

ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనూ, స్ట్రీట్‌ ఫుడ్‌లు తయారు చేసే వాళ్లు తమ పాక కళా శాస్త్ర నైపుణ్యాలతో భోజన ప్రియులను భలే ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు వారు కొంగొత్త రుచులతో భోజన ప్రియులను మైమరిపించడంతో ప్రముఖులుగా పేరు తెచ్చుకంటున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

(చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!)

అంతేకాదు ఇటీవల కాలంలో చెఫ్‌ ఒక్కొక్కరూ ఒక్కొ రకమైన పద్దతుల్లో వంటకాలను చేసి కస్ట్‌మర్‌లను మంత్రముగ్దులను చేస్తున్నారు. ఇదే తరహాలో ఒక స్ట్రీట్‌ఫుడ్‌ చెఫ్‌ భయంకరంగానూ, విస్తుపోయే విధంగా ఎలా వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడో చూడండి. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడోక స్ట్రీట్‌ ఫుడ్‌ లో వంటలు చేసే వ్యక్తి చికెన్‌ని డీప్‌ ఫ్రై చేస్తున్నాడు.

అంతే ఉన్నటుండి ఒక్కసారిగా మరుగుతూ ఉన్న నూనెలో డైరెక్ట్‌గా చేతులతో చికెన్‌ ముక్కలు తీసేస్తున్నాడు. పైగా అతని చేతులు ఏ మాత్ర కాలినట్లుగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. దీంతో సదరు కస్టమర్లు ఒక్కసారిగా విస్తూపోతారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు వీడు ఐరన్‌ మ్యాన్‌లా ఎలా చేస్తున్నాడర్రా బాబు అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement