Two wives
-
మూడు పెళ్లిళ్లు.. సవతుల మధ్య పోరు.. చివరికి షాకింగ్ ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): కృష్ణగిరి జిల్లాలో సవతుల మధ్య జరిగిన పోరులో ఓ తల్లీ, కుమారుడు సజీవదహనం అయిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55) వీధి నాటకం కళాకారుడు. ఇతను ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్విని మొదట వివాహం చేసుకున్నాడు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని.. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తరువాత సెందామరై కన్నన్ కీల్‌కుప్పం ప్రాంతానికి చెందిన కమల (47)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అందులో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు గురు (17) ప్లస్ టూ చదివి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను సత్య (30) అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముత్తు అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల, గురు బుధవారం రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోయారు. గురువారం వారు ఎంతకీ ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి చూశారు. అనంతరం కల్లావి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, అక్కడ కాలిపోయిన స్థితిలో కమల, గురు మృతదేహాలు ఉన్నాయి. విచారణలో ఇద్దరూ సజీవ దహనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఊతంకరై డీఎస్పీ అలెగ్జాండర్ విచారణ చేపట్టి, ఇద్దరి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సవతుల గొడవలో ఇద్దరు సజీవదహనం కావడంపై సెందామరై కన్నన్, సత్యను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నా ఇద్దరు భార్యలు గెలిచేశారోచ్..!
చెన్నై: తమిళనాడులో ఓ రైతు డబుల్ ధమాకా కొట్టాడు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తమిళనాడుకు చెందిన ఆ రైతుకు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలు వేర్వేరు చోట్ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం ఒక ఎత్తయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించిడం మరో ఎత్తు. దీంతో ఆ రైతు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. చదవండి: అప్పుడు గనుక రాఫెల్ ఉండి ఉంటే..! తిరువణ్ణామలై జిల్లా వందవాసి పంచాయతీ యూనియన్ పరిధిలోని వళిపూర్ అగరం గ్రామానికి చెందిన ధనశేఖరన్ (49) వ్యవసాయం చేసుకునే సాధారణ రైతు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరేమో సెల్వి (46), మరొకరు కాంచన (37). మొదటి భార్య సెల్వి ఇదివరకే వళివూర్ అగరం పంచాయతీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె మళ్లీ అదే పదవికి పోటీచేశారు. ఇక చిన్న భార్య కాంచన కూడా.. కోలిల్ కుప్పం సాత్తనూర్ పంచాయతీలో ఓటు హక్కు ఉండడంతో అక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆశ్చర్యకరంగా రెండు చోట్ల ధనశేఖరన్ ఇద్దరు భార్యలు గెలవటంతో సదరు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు గ్రామాల పంచాయతీ అధ్యక్షురాలైన తన ఇద్దరు భార్యలతో కలిసి విజయగర్వంతో ఆయన ఫోటోలు దిగుతూ.. ఇద్దరు భార్యల చేతులు పట్టుకుని ఆనందంతో ఈలలు, కేకలు వేయడం గమనార్హం. చదవండి: అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: అమిత్ షా -
ఆమె
పట్టుకోండి చూద్దాం 1 నాగభూషణంకు ఇద్దరు భార్యలు. ఆయన మొదటి భార్య చనిపోయిన నెలకే... ఆస్తి విషయంలో రెండో భార్య పిల్లలకు, నాగభూషణంకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తరువాత రాజీ చర్చలు జరిగాయి.అయితే ఉన్నట్టుండి నాగభూషణం హత్యకు గురయ్యాడు.‘‘ఉదయం నాలుగున్నరకల్లా లేవాలి కాబట్టి రాత్రి పదిన్నర టైంలో పడుకుంటాను. బాబుగారికి రాత్రి పన్నెండు, ఒంటిగంట వరకు చదువుకొని పడుకునే అలవాటు ఉంది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా అప్పుడప్పుడూ ఆయన స్నేహితులు వస్తుంటారు. స్నేహితులతో కలిసి కాఫీ తాగడం ఆయనకు చాలా ఇష్టం. అయితే... నన్ను నిద్ర లేపడం ఇష్టం లేక ఆయనే స్వయంగా కాఫీ తయారుచేస్తుంటారు. నేను నా గదిలో పడుకొని ఉన్నాను. రాత్రి ఆయన కోసం ఎవరు వచ్చారో తెలియదు. తెల్లారిన తరువాత బాబుగారి గదిలోకి వెళితే ఆయన చనిపోయిన విషయం తెలిసింది. కుర్చీలో అటు వైపుకు ఒరిగిపోయారు. ఆయన ముందు టేబుల్‌పై రెండు కాఫీ కప్పులు ఉన్నాయి’’ అని చెప్పాడు పని మనిషి సూరయ్య. పోలీసులు... ఆ కప్పులను జాగ్రత్తగా పరిశీలించారు.ఒక కప్పుపై ‘మై మగ్’ అని ఉంది. ఈ మగ్ను నాగభూషణం మాత్రమే ఉపయోగిస్తాడు. మరో కప్పు...గెస్ట్‌లు ఉపయోగించేది.విషప్రయోగంతో... నాగభూషణాన్ని చంపిన విషయం బయటపడిపోయింది. అయితే... గెస్ట్ కాఫీ కప్పుపై ఎలాంటి వేలి ముద్రలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ కప్పు ఆధారంగా విషప్రయోగం చేసిన నాగభూషణం రెండో భార్య కూతురు రాగిణిని పోలీసులు అరెస్టు చేశారు. ఎలా? 2 విశ్వేశ్వర్రావు రాత్రి హత్యకు గురైన విషయం నగరమంతా పాకిపోయింది. అజాతశత్రువైనా విశ్వేశ్వర్రావుని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసుల విచారణ మొదలైంది... ‘‘కుటుంబసభ్యులంతా టూర్‌కు వెళ్లారు. అయ్యగారికి ఆరోగ్యం బాగ లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయారు. రాత్రి తనకు ఇష్టమైన సినిమా వస్తుంటే చూస్తున్నారు. నేను నా గదిలో పడుకొని ఉన్నాను. పొద్దున కాఫీ ఇవ్వడానికి వెళితే... చనిపోయి ఉన్నారు’’ అని చెప్పాడు పనిమనిషి సాగర్.‘‘రాత్రి ఆయన గురించి ఎవరైనా వచ్చారా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహ.‘‘ఆయనకు చాలామంది స్నేహితులు. కొందరు రెగ్యులర్‌గా వస్తుంటారు. కానీ రాత్రి ఎవరు వచ్చారనేది నాకు తెలియదు’’ అని చెప్పాడు సాగర్.విశ్వేశ్వర్రావును తరచుగా కలుసుకునే వారిలో నలుగురు ఉన్నారు... రమణ, రంగారావు, చంద్రశేఖరం, రాజేశ్వరి. ఈ నలుగురిని ఎంక్వైరీ చేశాడు ఇన్స్పెక్టర్.ఒక్కొక్కరు ఒక్కో టైంలో విశ్వేశ్వర్రావును కలుసుకున్నట్లు విచారణలో తేలింది.నలుగురూ... విశ్వేశ్వర్రావుకు మంచి మిత్రులే.ఎవరిని అనుమానించాలో అర్థం కావడం లేదు.విశ్వేశ్వర్రావు గదిలో ఆక్వేరియం దగ్గర ఒక నోట్ బుక్ కనిపించింది. అందులో ఆక్వేరియంలో ఉన్న చేపల గురించి, వాటి చేష్టల గురించి వాటికి సంబంధించిన ఫీడ్ గురించి రాసి ఉంది. ఆక్వేరియం వైపు ఒకసారి చూశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. మరోసారి మరింత పరిశీలనగా చూశాడు. ఏదో ఆలోచన ఫ్లాష్‌లా మెరిసింది. ఆ తరువాత రాజేశ్వరి ఇంటికి వెళ్లాడు. ‘ఇలా వచ్చారేమిటి?!’ అన్నట్లుగా చూసింది ఆమె. అలా చూస్తూనే ఇన్స్పెక్టర్ను ఇంట్లోకి ఆహ్వానించి కాఫీ ఇచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ... ఆక్వేరియం వైపు చూశాడు ఇన్స్పెక్టర్. ఈసారి మరింత పరిశీలనగా చూశాడు. ఇది గమనించి...‘‘విశ్వేశ్వర్రావుగారికి ఈ ఆక్వేరియం అంటే చాలా ఇష్టం. చాలాసేపు ఇందులోని చేపలను చూస్తూ గడిపేవారు. రకరకాల చేపల గురించి అభిరుచే మమ్మల్ని దగ్గర చేసింది అని గతంలో కూడా మీకు చెప్పాను కదా’’ అంది రాజేశ్వరి‘‘విశ్వేశ్వర్రావుని చంపింది మీరే. అరెస్ట్ చేస్తున్నాను’’ అన్నాడు ఇన్స్పెక్టర్. రాజేశ్వరి తన నేరాన్ని ఒప్పుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. హంతకురాలు రాజేశ్వరి అని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? ఆన్సర్ 1. ఆ రాత్రి ఏదో పుస్తకం చదువుకుంటున్న నాగభూషణం, కూతురు రాగిణి రావడంతో కాసేపు మాట్లాడి, కాఫీ తయారు చేయడానికి కుర్చీలో నుంచి లేచాడు. అతడిని వారించి తానే కాఫీ తయారుచేసింది రాగిణి. నాగభూషణం రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లి వచ్చేలోపు ‘మై మగ్’లో విషం కలిపింది. తాను తాగిన కప్పుపై వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడిందిగానీ... కాఫీకప్పు అంచులకు అంటిన తన ఫేవరెట్ లిపిస్టిక్ ‘పింక్ లవ్’ గుర్తులను మరచిపోయింది. 2. విశ్వేశ్వర్రావు ఆక్వేరియంలో కనిపించాల్సిన అరోవాన చేప... రాజేశ్వరి ఇంట్లోని ఆక్వేరియంలో కనిపించింది. ఈ చేప వల్ల అన్ని కలిసొస్తున్నాయని, నష్టాల్లో ఉన్న వ్యాపారం సైతం లాభాల బాట పట్టిందని రాజేశ్వరికి ఎన్నోసార్లు చెప్పాడు విశ్వేశ్వర్రావు. రాజేశ్వరికి సెంటిమెంట్ల పిచ్చి. వ్యాపారంలో విపరీతమైన నష్టాల్లో ఉన్న రాజేశ్వరి కన్ను అరోవాన చేపపై పండింది. అలా ఆ రాత్రి విశ్వేశ్వర్రావుని హత్య చేసి అరోవాన చేపను దోచుకెళ్లింది. -
ఇద్దరు భార్యలుంటే నో జాబ్!
ఆగ్రా: ఉర్దూ ఉపాధ్యాయుల భర్తీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అనర్హులని నోటిఫికేషన్లో పేర్కొనడంతో ముస్లిం సంఘాలు దీనిని పెద్ద ఎత్తున నిరసిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 3,500 ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో జీవించి ఉన్న ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనర్హులని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇద్దరు భార్యలున్న భర్తకు భార్యగా ఉంటే...ఆ మహిళా అభ్యర్థులను సైతం అనర్హులుగా ప్రకటించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. వితంతువులకు పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా తలెత్తే సమస్యలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కేవలం ఉర్దూ ఉపాద్యాయుల నియామకంలోనే కాకుండా మిగతా పోస్టుల భర్తీలో సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ముస్లిం వర్గాలు మాత్రం.. తమ మత చట్టాల ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని... ఎప్పుడో పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా ఇబ్బందులు తలెత్తుతాయనే నెపంతో ఇప్పుడు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నాయి. అయినా పెన్షన్‌ను ఇద్దరికీ సమానంగా పంచితే సరిపోతుందని, ఈ నిర్ణయం తమ పట్ల వివక్ష చూపించడమే అంటున్నాయి. -
గర్భవతి.. వ్యభిచారానికి పనికిరాదని..
- ఇద్దరు భార్యలతో కలిసి చంపిన భర్త - నిందితుల అరెస్టు - కేసు వివరాలు వెల్లడించిన సీఐ వెంకటగిరి జవహర్‌నగర్: గర్భవతి అయిన భార్య వ్యభిచారానికి పనికిరాదని భావించిన భర్త మరో ఇద్దరు భార్యలతో కలిసి ఆమెను చంపేశాడు. గతనెల జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన మున్నా అలియాస్ మోహన్(40) తన ముగ్గురు భార్యలతో కలిసి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వరంగల్ జిల్లా పస్రా ప్రాంతానికి చెందిన మమత(24)ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె కీసర మండలం దమ్మాయిగూడలోని సాయిరాం కాలనీలో ఉంటోంది. గతనెల 12న అదే ప్రాంతంలో నివసించే అన్న కూతురు వివాహానికి మోహన్ తన నలుగురు భార్యలతో కలిసి హాజరయ్యాడు. ఆరునెలల గర్భవతి అయిన మమతను మోహన్ ప్రేమగా చూసుకుంటున్నాడు. తమను పట్టించుకోకపోవడంతో మిగతా ముగ్గురు భార్యలు కక్షగట్టారు. గర్భవతి కావడంతో వేశ్యవృత్తికి పనికిరాదని, ముగ్గురు భార్యలు భర్త మోహన్‌తో గొడవపడ్డారు. ఈక్రమంలో అదే రోజు మోహన్ పథకం ప్రకారం ఇద్దరు భార్యలతో కలిసి మమతకు బాగా మద్యం తాగించారు. అనంతరం ఆమె చీరకొంగుతో మెడకు బిగించి శివ ఇంట్లో ఉరివేసి చంపేశారు. మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి మమత ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులను నమ్మించారు. మృతదేహాన్ని కిందికి దించి మమత ఆత్మహత్యకు పాల్పడిందని పెళ్లికి వచ్చిన బంధువులకు నమ్మబలికి మల్కాజిగిరిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం సికింద్రాబాద్‌లో ఓ వేశ్యతో మోహన్ ముగ్గురు భార్యల్లో ఒకరు మమతను హత్య చేసిన విషయం చెప్పింది. సదరు వేశ్య జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐ వెంకటగిరి మోహన్‌తో పాటు ఆయన ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకొని విచారించగా మమతను చంపిన నేరం అంగీకరించారు. వారితో పాటు హత్యకు సహకరించిన మోహన్ అన్నపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
మొదటి భార్యపై మరిగే నూనె పోసిన మహిళ!
'ఇరువురు భామల కౌగిలిలో స్వామీ.. ఇరుకున పడి నీవు నలిగితివా' అని ఆచార్య ఆత్రేయ ఎప్పుడో 1990లోనే రాశారు. అయినా అతగాడు పట్టించుకోలేదు. దాంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ చెలరేగింది. చినికి చినికి గాలివానగా మారడంతో.. చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే మరిగే నూనె పోసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. శ్రవణ్ యాదవ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య సోనుతో కొంతకాలం క్రితమే విభేదాలు రావడంతో అతడు ఆర్తి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ నగరంలోని భగీరథ్‌పురా ప్రాంతంలోనే ఉంటారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆర్తి తన తల్లి అనితతో కలిసి సోను ఇంటికి వెళ్లింది. మరిగే మరిగే నూనె తీసుకుని ఆమె మీద పోసింది. ఆ సమయంలో సోను కుమార్తె కూడా తల్లితోపాటే ఉండటంతో ఆమెకు కూడా కాలిన గాయాలయ్యాయి. దాంతో వారిద్దరినీ ఎంవై ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. శ్రవణ్, అతడి రెండోభార్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఐపీసీ 326 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.