నా ఇద్దరు భార్యలు గెలిచేశారోచ్‌..! | Two Wives Wins In Panchayat Elections In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నా ఇద్దరు భార్యలు గెలిచేశారోచ్‌..!

Published Sun, Jan 5 2020 6:11 PM | Last Updated on Sun, Jan 5 2020 6:11 PM

Two Wives Wins In Panchayat Elections In Tamil Nadu - Sakshi

చెన్నై: తమిళనాడులో ఓ రైతు డబుల్ ధమాకా కొట్టాడు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తమిళనాడుకు చెందిన ఆ రైతుకు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలు వేర్వేరు చోట్ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం ఒక ఎత్తయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించిడం మరో ఎత్తు. దీంతో ఆ రైతు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

చదవండి: అప్పుడు గనుక రాఫెల్‌ ఉండి ఉంటే..!

తిరువణ్ణామలై జిల్లా వందవాసి పంచాయతీ యూనియన్‌ పరిధిలోని వళిపూర్‌ అగరం గ్రామానికి చెందిన ధనశేఖరన్‌ (49) వ్యవసాయం చేసుకునే సాధారణ రైతు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరేమో సెల్వి (46), మరొకరు కాంచన (37). మొదటి భార్య సెల్వి ఇదివరకే వళివూర్‌ అగరం పంచాయతీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె మళ్లీ అదే పదవికి  పోటీచేశారు.

ఇక చిన్న భార్య కాంచన కూడా.. కోలిల్ కుప్పం సాత్తనూర్ పంచాయతీలో ఓటు హక్కు ఉండడంతో అక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆశ్చర్యకరంగా రెండు చోట్ల ధనశేఖరన్‌ ఇద్దరు భార్యలు గెలవటంతో సదరు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు గ్రామాల పంచాయతీ అధ్యక్షురాలైన తన ఇద్దరు భార్యలతో కలిసి విజయగర్వంతో ఆయన ఫోటోలు దిగుతూ.. ఇద్దరు భార్యల చేతులు పట్టుకుని ఆనందంతో ఈలలు, కేకలు వేయడం గమనార్హం.

చదవండి: అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: అమిత్‌ షా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement