localbody elections
-
వేడెక్కుతున్న ‘పుర’ రాజకీయం
అమరావతి బ్యూరో: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటంతో జిల్లాలోని రెండు నగరాలు, ఐదు పట్టణాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. రాజకీయంగా ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అన్ని పార్టీలు తమ ప్రాతినిధ్యం కోసం ఆరాటపడుతున్నాయి. 2014 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో పదవులపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు నూజివీడు, పెడన మున్సిపాలిటీలకు, నందిగామ, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. గతేడాది నామినేషన్ల ఉపసంహరణ దశలో ప్రక్రియ వాయిదా పడింది. ఏడాది తర్వాత మళ్లీ ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభమైంది. దీంతో నిన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టి ఉన్న నాయకులు, ఇప్పుడు పట్టణాల్లో డివిజన్లు/వార్డు స్థానాలపై ఫోకస్ పెట్టారు. చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. 1,719 నామినేషన్లు.. జిల్లాలో నగరపాలిక, పురపాలక సంఘాల్లో మొత్తం 1,719 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. పరిశీలనలో 88 తిరస్కరించారు. ఎన్నికల సంఘం తాజా ప్రకటనను అనుసరించి మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు అవకాశం కలి్పంచారు. జిల్లాలోని 229 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అన్నింటిలో రెండు, అంతకు మించి నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుతం అన్ని డివిజన్లు/వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపసంహరణ రోజుకు ఏకగ్రీవాలకు ప్రయతి్నంచాలని అధికారపార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది. అధికారపార్టీ వారివే ఎక్కువ నామినేషన్లు.. ప్రస్తుతం దాఖలైన నామినేషన్లలో అధికారపారీ్టకి చెందిన వారివే ఎక్కువగా ఉన్నాయి. ఉపసంహరణ రోజు వీటిపై స్పష్టత రానుంది. జిల్లాలో 229 స్థానాలకు దాఖలైన నామినేషన్లలో వైఎస్సార్ సీపీ 622 నామినేషన్లు, టీడీపీ 516, మూడో స్థానంలో ఇతరులు 285 మంది నామినేషన్లు దాఖలు చేశారు. తర్వాతి స్థానాల్లో జనసేన 142, బీజేపీ 91, కాంగ్రెస్ పార్టీ 63 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణపై ఉత్కంఠ.. కార్పొరేటర్/కౌన్సిలర్ స్థానాలకు అధికార పక్షం నుంచి ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసినా.. ఉపసంహరణ నాటికి విజయావకాశాలున్న అభ్యర్థులనే బరిలో నిలిపే దిశగా చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతోపాటు ఇతర మున్సిపాలిటీల్లోనూ ఈ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నాయకులు కూడా అధికార పక్షానికి దీటుగా ఎన్నికలు ఎదుర్కోవడం ఎలా అనే విషయంలో వ్యూహాలు రచిస్తున్నారు. పారీ్టలోని ముఖ్యనాయకుల ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి పుర ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు జనసేన, బీజేపీ నాయకులు యత్నిస్తూ.. కొన్ని డివిజన్/వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. -
నిమ్మగడ్డ ఇబ్బంది పెట్టినా.. భయపడలేదు : సజ్జల
అందరు ఊహించినట్లే ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టంకట్టారని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తొలిదశ పంచాయతి ఎన్నికల్లో 2,637 వైఎస్సార్సీపీ మద్దతు దారులు విజయం సాధించారన్నారు. పచ్చ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాస్తున్నా, ప్రజలు అధికారపార్టీ వైపే నిలిచారన్నారు. అందుకు 80 శాతానికి పైగా స్థానాలను వైఎస్సార్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ప్రతి పక్ష టీడీపీ పార్టీ వెంటిలెటర్‌పై ఉందని, రాజ్యంగ బద్ధ పదవిలో ఉండికూడా నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని సజ్జల విమర్శించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎంత ఇబ్బందిపెట్టిన ఎవరు భయపడలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, కొవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు కల్పించిన భరోసానే ఎక్కువ స్థానాలు గెలవడానికి కారణమన్నారు. కొన్ని పచ్చమీడియాలు బ్యానర్లో టీడీపీకి అనుకూలంగా రాసినప్పటికి, లోపల మాత్రం 80 శాతం వైఎస్సార్సీపీ , 20 శాతం టీడీపీ గెలిచాయని రాశాయన్నారు. వీరి తీరు మేకపోతు గాంభీర్యంలా ఉందన్నారు. దేవినేని ఉమా నియోజక వర్గంలో టీడీపీని ప్రజలునమ్మే స్థితిలో లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ద్వారానే ప్రజలకు చేరువైందని అన్నారు. రానున్న40 రోజులు ఏంచేయాలో తమవద్ద ప్రణాళిక ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజ్యంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేయోద్దని టీడీపీకి హితవు పలికారు. వెన్నుపోటుకు పెటెంట్ ఉన్న బాబు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. -
పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు..
పంచాయతీ ఎన్నికలను కుట్రలకు వేదికగా చేసుకునేందుకు యత్నిస్తున్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఏకగ్రీవాలను అడ్డుకోవాలని పథకాలు రచిస్తున్నారు. అనామకులతో నామినేషన్లు వేయించి పోటీ ఖరారు చేయాలని ఎత్తులు వేస్తున్నారు. పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాలను దక్కకుండా చేసేందుకు ఏకగ్రీవాలను అడ్డుకునే మంత్రాంగం నడిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లు గ్రామీణాభివృద్ధికి ఆటంకాలు సృష్టించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, తిరుపతి : జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. అయితే పల్లెలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు భారీ నజరానాను ప్రకటించింది. ఆ నిధులతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కుట్రలకు తెరతీస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఎవరో ఒకరితో నామినేషన్లు వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పోటీ చేయాలనుకునేవారు స్థానిక పెద్దలు సమావేశమవుతున్నారు. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఏకగ్రీవాలు చేసుకునేందుకు చర్చిస్తున్నారు. ఇవి ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో అధిక శాతం పంచాయతీలు ఏకగ్రీవ బాటలో నడిచేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. చదవండి: చంద్రబాబును చూసి జనం ఛీత్కరించుకుంటున్నారు ఈ సమయంలో టీడీపీ నాయకులు గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అనేక చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి ఉండడంతో వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పాత పరిచయాలను అడ్డంపెట్టుకుని టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన నాయకులను ప్రలోభపెడుతున్నారు. కనీసం నామినేషన్ వేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల ఖర్చును సైతం మేమే పూర్తిగా పెట్టుకుంటామని ఆశపెడుతున్నారు. ఈ క్రమంలో పలువురు పాత కాపులకు నగదు, మద్యం చేరవేసినట్లు సమాచారం. అలాగే వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసే అ భ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలతో కూడా రాజకీయం చే యాలని పథకాలు రచిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకర్గాల్లో టీడీపీ నేతలు పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ దాదాపు ఖాళీ అయిన విషయం తెలిసిందే. చదవండి: ఎలక్షన్ ఎక్సర్సైజ్ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు! -
‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరపవద్దని తాము ఎప్పుడూ అనలేదని.. కరోనా వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయనే చెబుతున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలకు సహకరిస్తామన్నారు. సీఎస్‌ను కలిసి తమ సమస్యలను చెప్తామని. మహిళా ఉద్యోగులను ఎన్నికల నుంచి మినహాయించాలని ఆయన కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. చదవండి: ‘దేశంలో కోరుకుంటున్న మార్పును ప్రభుత్వం చేసింది’ గతంలో ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?. పోలవరం, నవనిర్మాణ దీక్షలకు బస్సులు పెట్టి ఉద్యోగులను తరలించలేదా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్షం తమ గురించి ఏ వ్యాఖ్యలు చేయలేదు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమపై రాజకీయాలు చేయొద్ధని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై తాము ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్ -
ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఎన్నిలకు వెళ్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకుని నిధులు రాబట్టుకోవాలని సూచించారు. ధన ప్రవాహం, ఇతర సమస్యలు రాకుండా చట్టాన్ని మార్పు చేశామని చెప్పారు. ఇప్పటికే తమ శాఖ అధికారులను ఎస్ఈసీ బదిలీ చేశారని.. ఇంకా ఎంత మందిని బదిలీ చేసుకుంటారో చేసుకోండంటూ ఆయన మండిపడ్డారు. టీడీపీకి నామినేషన్ వేసే వారు కూడా లేరని, చంద్రబాబును హైదరాబాద్ నుంచి వచ్చి నామినేషన్లు వేయించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల -
నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని
సాక్షి, కృష్ణా జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకపక్ష ధోరణి సరికాదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన దుయ్యబట్టారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కరోనా ప్రారంభ దశలో ఎన్నికలు నిలిపివేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థన పరిగణనలోకి తీసుకుని ఎన్నికలపై పునరాలోచించాలని సామినేని ఉదయభాను కోరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్) -
‘2018లో చంద్రబాబే పారిపోయారు’
సాక్షి, తిరుమల: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం సబబు కాదని.. ఎస్ఈసీ నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు జరపాల్సిన అసవరం ఏమిటని ప్రశ్నించారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్ ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏనాడు ఎన్నికలకు భయపడ లేదు. అది ప్రజలకి తెలుసు. 2018లో చంద్రబాబే ఎన్నికలకు భయపడి పారిపోయారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు ఎటువంటి సహకారం, సాయం అందించలేదని’’ రోజా మండిపడ్డారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని.. ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే.. ధర్మాసనాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతామన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలకు వైఎస్సార్సీపీ ఎప్పుడైనా సిద్ధమేనని.. తమ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షా అని తెలిపారు. చదవండి: నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు -
ఎన్నికల షెడ్యూల్‌ను వెనక్కు తీసుకోవాలి: ఏపీ ఎన్జీవో
సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనాతో చాలా మంది ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎన్నికలు వద్దని ఇప్పటికే ఎస్ఈసీకి అనేక సార్లు విన్నవించాం. అయినా మొండిగా షెడ్యూల్ విడుదల చేయడం దారుణం. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు' అని అన్నారు. చదవండి: (సంక్షేమ కార్యక్రమాల అమలు ఆపండి) ఈ సందర్భంగా టీడీపీ నేత అశోక్‌బాబుకు చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఉద్యోగ సంఘాల్లో పనిచేసి రాజకీయాల్లోకి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు. మీ రాజకీయ పార్టీల సంగతి మీరు చూసుకోండి. మీలాగా రాజకీయ పార్టీలకు మస్కాలు కొట్టడం మాకు చేతకాదు. ఉద్యోగ సంఘాలపై అశోక్ బాబు ఆరోపణలు సిగ్గుచేటు' అంటూ మండిపడ్డారు. చదవండి: (నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత) -
నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం..
సాక్షి, చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి నారాయణ స్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 'చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ తొత్తులా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం ఏకపక్ష నిర్ణయం. చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ దశలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గం. ఇప్పట్లో ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వ ఉపాధ్యాయులే అంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలకు సిద్ధపడటం దారుణం. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మంత్రులు తెలిపారు. గుంటూరు: కొంత మంది దుర్బుద్ధితో ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం చేయాలని చూస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ఎవరూ ఇళ్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు ఆయన తాబేదార్లు కుతంత్రంతో కోర్టులకు వెళ్ళారు. మరికొంతమంది దుర్బుద్ధితో పట్టాల పంపిణీ ఆలయస్యం చేయాలని ఎన్నికల కోడ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: ('పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు') ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందకుండా అడ్డుకోవాలని టీడీపీ, ఇతర వ్యక్తులు చేస్తున్న కార్యక్యమాలపై ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్నికలు అందరికీ అవసరమే. కాదనడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆలోచన చేయాలి. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఇచ్చిన మాటను నెరవేర్చడమే ముఖ్యమంత్రి ధ్యేయం. విగ్రహాలను ధ్వంసం చేస్తూ ముఖ్యమంత్రిపై ఏలెత్తి చూపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు. నీచమైన ఆలోచనలతో రాజకీయాలు చేస్తున్నారు. దేవుడు అన్నీ చూసుకుంటాడనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) -
'పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడు'
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పింది. అయితే ఆ రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదు. అది కోర్టు ధిక్కారం కాదా..? అని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ఒక కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా స్ట్రైయిన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత. ఎన్నికలు నిర్వహిస్తే... నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏంటి?. ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్‌కి సంబంధముందా..?) వ్యక్తిగత ఆసక్తి మీ స్థాయికి మంచిది కాదు: ఎంపీ మాధవ్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్న ఏకపక్షతీరుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. 'ప్రపంచమంతా ఒకవైపు అంటే నేను మాత్రం మరోవైపు అనేవిధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఆయన వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తి అనేది మీ స్థాయికి మంచిది కాదు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా టీకాను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిపితే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉన్నందున కరోనా టీకా పంపిణీకి అంతరాయం కలుగుతుంది. నిమ్మగడ్డ వ్యవహరిస్తోన్నతీరుతో ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముంది' అని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. చదవండి: (ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో) టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు: అమరనాథ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అనుబంధ సభ్యునిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. ఎన్నికల కమిషనర్లా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహిస్తూ.. చంద్రబాబు, సుజనా చౌదరితో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల భయాందోళనలను నిమ్మగడ్డ పట్టించుకోవడంలేదు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' అని గుడివాడ అమరనాథ్ సూచించారు. -
ఎస్ఈసీతో ముగిసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్‌తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అధికారుల భేటీ ముగిసింది. ఎస్ఈసీతో గంటన్నరపాటు సీఎస్ బృందం సమావేశం కొనసాగింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ బృందం తెలిపింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. (చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: విజయసాయిరెడ్డి) కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించామని సీఎస్ బృందం పేర్కొంది. కేంద్రం సూచనలతో ఇవాళ కూడా డ్రైరన్ నిర్వహించామన్నారు. తొలి విడతగా కోటిమందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉందని, 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున వ్యాక్సినేషన్‌కు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని సీఎస్ బృందం తెలిపింది. రాష్ట్రంలోని యంత్రాంగమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉందని.. వాలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉందని సీఎస్ తెలిపారు.(చదవండి: మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు) -
హరియాణా స్థానిక ఎన్నికల్లో బీజేపీకి షాక్!
చండీగఢ్: ఢిల్లీ సరిహద్దుల్లో నెలకుపైగా రైతులు సాగిస్తున్న ఆందోళన ప్రభావం సరిహద్దు రాష్ట్రమైన హరియాణా స్థానిక ఎన్నికల్లో బీజేపీపై పడింది. హరియాణా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార బీజేపీ–జేజేపీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కీలకమైన సోనిపట్, అంబాలా, ఉక్లనా, ధరుహిరా స్థానాల్లో బీజేపీ, జేజేపీ వెనుకంజ వేశాయి. ఆదివారం అంబాలా, పంచకుల, సోనిపట్, రేవారి, ధరుహిరా, సంప్లా, ఉక్లనా నగరాల్లో స్థానిక ఎన్నికలు జరిగాయి. సోనిపట్‌ను కాంగ్రెస్ గెలుచుకుంది, అంబాలాలో హెచ్‌జేపీ పార్టీ గెలుపొందగా పంచకుల, రెవారిలో మాత్రం బీజేపీకి గెలుపు దక్కింది. ఉక్లానా, ధరుహిరాల్లో జేజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. -
'బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే'
సాక్షి, తిరుమల: చంద్రబాబు నాయుడి జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. వెయ్యికాళ్ల మండపం త్వరలో ప్రారంభించేందుకు టీటీడీ చైర్మన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా రాజకీయాలు నడుపుతున్నారు. తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే, హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతన్న సమయంలో కూడా 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు కనీసం భరోసా కూడా కల్పించలేని పరిస్థితి చంద్రబాబుది. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కున్నారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి మరణం సంభవించిన కుటుంబంలో పోటీపెట్టకుండా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టేందుకు లోకల్ బాడీ ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందిని ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకు చూపించి ఎన్నికలు వాయిదా పడేలా చేశారు. ఇప్పుడేమో రాష్ట్రంలో కరోనా లేదని పెద్దమనుషులు ఆరాట పడుతూ ఎన్నికలు పెట్టాలని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మార్చి లోపల ఎన్నికలు పెడితే టీడీపీ అన్ని స్థానాలు గెలుచుకుంటామనే భ్రమలో ఉంది. రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మూడున్నర కోట్ల అప్పులో ముంచేసారు. రాష్ట్రంలో పదహారు నెలల కాలంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా సమయంలోనూ ప్రజలను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ మాత్రమే' అని కొనియాడారు. (అనంతపురంలో భారీ డ్రోన్ సిటీ) -
‘నీతి నిజాయితీ ఉంటే డీజీపీకి ఫిర్యాదు చేయాలి’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులు సమయం ఉంటే ఎన్నికలు పూర్తయ్యేవి అని ఆయన తెలిపారు. కోర్టు చెప్పిన తీర్పును చంద్రబాబు వక్రీకరిస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఎన్నికలు వాయిదా వేసి, ఎన్నికల కోడ్‌ను ఎలా కొనసాగిస్తారని ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నిందన్నారు. గ్లోబల్ ప్రచారం చేసి స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారని అవంతి మండిపడ్డారు. నకిలీ లేఖను సృష్టించి, ఎన్నికల కమిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి రాశారని ఆయన ధ్వజమెత్తారు. (పచ్చ మీడియాకు లెటర్ ఎందుకు పంపారు!) నిమ్మగడ్డ రమేష్ తనకు ఆ లేఖతో సంబంధం లేదని చెబుతున్నారు, కానీ ఆయనకు నీతి నిజాయితీ ఉంటే దీనిపైన డీజీపీకి ఫిర్యాదు చేసి లేఖ రాసిన వారిమీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాలన్నారు. ఆ లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని అవంతి శ్రీనివాస్ ఆగ్రహించారు. గ్రూప్ మీటింగ్ పెట్టొద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందని చంద్రబాబు అంటున్నారు. కానీ అమరావతిలో మీరు ఎలా ధర్నాలు చేస్తున్నారని ఆవంతి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మనస్తత్వం మార్చుకుని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని అవంతి హితవు పలికారు. చంద్రబాబు రాష్ట్రం పరువు ప్రతిష్టలు, బ్రాండ్ ఇమేజ్ పోయే విధంగా చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ దుయ్యబాట్టారు. (ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ?) -
‘టీడీపీకి మరోసారి చెంపదెబ్బ తప్పదు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. టీడీపీకి మరోమారు చెంపదెబ్బ తప్పదని విమర్శించారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు కనుమరుగవడం ఖాయమన్నారు. 58 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని చెప్పారు. (అభ్యర్థులు లేకే చంద్రబాబు డ్రామాలు) బాబుకు బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలకు అన్యాయం చేయడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విమర్శించే అర్హత మాజీ మంత్రి దేవినేని ఉమాకు లేదని దుయ్యబట్టారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలు గుండాయిజం మానుకోవాలని సోమినాయుడు హితవు పలికారు. (టీడీపీకి హైకోర్టులో చుక్కెదురు) -
‘ఆ పేరు మొత్తం పవన్ చెడగొట్టుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పవన్ ఏ సృహతో రాజకీయాల్లోకి వచ్చారో అర్ధం కావడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపడేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే పవన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేదే పవన్ కల్యాణ్ చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి వల్ల తెచ్చుకున్న పేరు మొత్తం పవన్ చెడగొట్టుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయ్యంలో సుధాకర్‌బాబు గురువారం మాట్లాడారు. అప్పుడేం చేశారు.. ‘ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదు. మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ఎందుకు నోరు మెదపలేదు. టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. బొండా ఉమా అక్రమాలన్నీ మాతో వస్తే చూపిస్తాం. బొండా ఉమా, బుద్ధా వెంకన్న పలనాడు ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. పలనాడులో టీడీపీ నేతలు లేరా? ఆ ఇద్దరినే అక్కడికెందుకు పంపారు. కులాల పేరుతో చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర. ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన చరిత్ర బోండా ఉమది. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి చేస్తాం’అని సుధాకర్‌బాబు హెచ్చరించారు. ఎన్ని పదవులిచ్చారు.. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితులకు పదవులిచ్చావు చంద్రబాబూ? సీఎం వైఎస్ జగన్ ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రెల్లి, మాల, మాదిగ కార్పొరేషన్ల పదవులు ఇచ్చారు. వీటి గురించి టీడీపీ దళిత నేతలు నోరు విప్పరు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు అధికంగా పొందేవారు దళితులే. ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఓడిపోతామని తెలిసే వర్ల రామయ్యకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు. -
ఉమా నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత బోండా ఉమా సవాల్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీటుగా స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పల్నాడు ప్రజలను బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు కాదని బోండా ఉమా తెలుసుకోవాలి. విజయవాడ గల్లీలో రౌడీయిజం చేసినట్లు పల్నాడులో చేస్తామంటే కుదరదు. మాచర్ల మళ్లీ వస్తానని సవాల్ చేయడం కాదు, దమ్ముంటే రావాలి. లేదా నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదు. ఈ విషయంలో ఎక్కడదాకా వెళ్లడానికి అయినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు. (కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి) గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. (బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?) కాగా బోదిలవీడులో రెండు వర్గాల కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్ధేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చూడగా మార్గమధ్యలో మాచర్ల వద్దే స్థానికంగా జరిగిన ప్రమాదంతో ఘర్షణ జరిగింది. (స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !) -
'నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు'
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్తులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఆటంకాలు కలుగచేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించినా ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉందన్నారు. ఇప్పటిదాకా.. ఎక్కడా కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల సమయంలో ఇబ్బందులకు కలుగాచెయ్యడాన్ని కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. -
బీజేపీ చెవిలో పసుపు పువ్వు
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కొన్నేళ్లు టీడీపీతో కలసి సాగిన జనసేన పార్టీ తెలుగుదేశాధీశుడి వెన్నుపోటు రాజకీయం ఒంట బట్టించుకున్నట్టుంది. అందుకే బీజేపీతో ఉన్న పొత్తును ఒకపక్క కొనసాగిస్తూనే నిస్సిగ్గుగా టీడీపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటోంది. పొత్తు ధర్మాన్నివిస్మరించిన జనసేన స్థానిక ఎన్నికల్లో ఎలాగోలా పరువు దక్కించుకోవాలని పడుతున్న తాపత్రయాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నవ్వుకుంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: అంతా అనుకున్నట్టే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రహస్య ఒప్పందం ఉందనే మాట సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రతి నోటా వినిపిస్తున్నదే. ఇంతలో చంద్రబాబు టీడీపీ కీలక నేతలను ఒకరి తరువాత మరొకరిని బీజేపీలోకి పంపించారు. అనంతరం బీజేపీ, జనసేన మధ్య జరిగిన పొత్తు కూడా దీనిలో భాగమనే ప్రచారం కూడా నడిచింది. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బీజేపీ, జనసేన సంయుక్త ప్రకటన చేశాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నాదెండ్ల మనోహర్ కూడా ప్రకటించారు. పొత్తు కుదిరి రెండు నెలలు కూడా గడవకుండానే దాన్ని చిత్తుచేస్తూ జిల్లాలో చాలాచోట్ల జనసేనతో తెలుగుదేశం పార్టీ రహస్య ఒప్పందాలు చేసుకున్న పరిణామాలు చూస్తూ రాజకీయ విశ్లేషకులే విస్తుపోతున్నారు. ఇంతకాలం టీడీపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందనే ప్రచారాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీల రహస్య పొత్తు బట్టబయలైంది. తెలుగుదేశం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే సాహసం ఆ పార్టీ నాయకులు చేయలేకపోతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని ఆ పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. టీడీపీ నుంచి పోటీకి కేడర్ వెనకడుగు వేస్తున్న క్రమంలో ఆ పార్టీ నేతలు జనసేనతో ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నారు. రహస్య మంతనాలు..ఒప్పందాలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి టీడీపీలో కేడర్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. త్రిసభ్య కమిటీలో ఉన్న చినరాజప్ప ఆదేశాల మేరకు కోనసీమలోని పలు మండలాల్లో జనసేన నాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. సామర్లకోట మండలం గొంచాల, నవర ఎంపీటీసీ స్థానాలలో జనసేనకు టీడీపీ, జెడ్పీటీసీ స్థానంలో టీడీపీకి జనసేన మద్ధతు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. అదే అంబాజీపేట మండలానికి వచ్చేసరికి 18 ఎంపీటీసీలకు గాను 12 టీడీపీకీ, ఆరు జనసేనకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొర్లపాటివారిపాలెం, మాచవరం, కోటివారి అగ్రహారం, ఇరుసు మండ, వాకలగరువు గ్రామాల్లో జనసేన పోటీచేసేలా పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! ఆ మండలంలోని కొర్లపాటివారిపాలెం–1 ఎంపీటీసీ స్థానానికి సుంకర సత్యవేణిబాలాజీ(టీడీపీ, జనసేన) ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంగళవారం స్థానిక గ్రామ సచివాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు అరిగెల బలరామ్మూర్తి, గణపతి వీరరాఘవులు, జనసేన నాయకులు సుంకర బాలాజీ, పేరాబత్తుల పెద సుబ్బరాజు కలిసి రావడం ద్వారా రెండు పార్టీల మధ్య రహస్య పొత్తు ఎలా నడుస్తోందో స్పష్టమవుతోంది. పి.గన్నవరం మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలుంటే 9 స్థానాల్లో జనసేన, 13 స్థానాల్లో టీడీపీ పోటీచేసే లోపాయికారీ ఒప్పందం జరుగుతోంది. సంఖ్యపై స్పష్టత వచ్చినా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది బుధవారంలోపు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: బాబూ.. సైకిల్ తొక్కలేం! చినరాజప్ప కనుసన్నల్లో.. ‘ఆలూ లేదు చూలూ లేదు...అన్నట్టుగా ఉంది ఈ రెండు పార్టీల పరిస్థితి. ఇక్కడ మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు వస్తే రెండున్నర సంవత్సరాలు టీడీపీ, రెండున్నర సంవత్సరాలు జనసేన అధ్యక్ష స్థానాన్ని పంచుకోవాలని కలలుగంటున్నారు. మామిడికుదురు జెడ్పీటీసీ స్థానం విషయంలో ఈ రెండు పార్టీల మధ్య తాటిపాక సెంటర్లోని ఒక లాడ్జిలో నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఎంపీపీ జనసేనకు వదులుకుంటాం, జెడ్పీటీసీకి వచ్చేసరికి తమకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదనకు జనసేన అంగీకరించడం లేదు. ఈ చర్చల సారాంశాన్ని ఇరుపార్టీల నేతలు టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడైన చినరాజప్పకు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారని సమాచారం. ప్రత్తిపాడు మండలం లింగంపర్తిలో ఒక మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడి మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. కొత్తపేట జనసేన సార్వత్రిక ఎన్నికల అభ్యర్థి బండారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ నాయకులు వాడపాలెంలో సమావేశమయ్యారు. కాజులూరు మండలంలో జనసేన జెడ్పీటీసీ అభ్యర్థికి టీడీపీ మద్దతు తెలపడానికి, ఎంపీటీసీలకు జనసేన టీడీపీకి మద్దతు తెలిపే విధంగా ఒప్పందం జరిగిందంటున్నారు. మల్కిపురం మండలం గూడపల్లి, కేసనపల్లి, రామరాజులంక, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి లంకలో అప్పనరామునిలంక, మోరిపోడు, అంతర్వేదికర, రాజోలు మండలం కాట్రేనిపాడు, కూనవరం, ములుకుపల్లి, చింతలపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు మంతనాలు జరుపుతున్నారు. సామర్లకోట మండలం గొంచాల, నవరలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థులకు టీడీపీ మద్దతు తెలుపుతున్నారు. అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం–1 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు చెట్టాపట్టాలు వేసుకుని వెళుతోన్న టీడీపీ, జనసేన నేతలు ఇచ్చిపుచ్చుకోవడానికి చర్చోప చర్చలు అమలాపురం మున్సిపాలిటీలో 2,4,5,10 వార్డులలో టీడీపీ–జనసేన మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉంది. ఉప్పలగుప్తం మండలంలో ఎంపీటీసీ పదవులు ఇచ్చిపుచ్చుకునే విషయంపై మంగళవారం చర్చలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ అభ్యర్ధిగా తన పేరు ప్రకటిస్తానంటే ఉప్పలగుప్తం మండలం నుంచి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ముందుకు వచ్చారని సమాచారం. బిక్కవోలు మండలం తొస్సిపూడిలో జనసేన కార్యకర్త కర్రి శ్రీనివాసరావు సోమవారం రాత్రి టీడీపీలో చేరిన 24 గంటలు కూడా గడవకుండానే శ్రీనివాసరావు భార్య సత్యగౌరి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అయిపోయారు. కడియం మండలంలో జనసేన–టీడీపీ నాయకులు మద్దతుపై సమావేశమయ్యారు. మండలంలో ఉన్న 22 ఎంపీటీసీ స్థానాలకు 11ఎంపీటీసీలు జనసేన, 11 ఎంపీటీసీలు టీడీపీ ఇచ్చిపుచ్చుకునేందుకు మాటలు జరుగుతున్నాయి. ఇటీవల పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మనకు మద్ధతు ఇస్తోందని కార్యకర్తలు అధైర్యపడవద్దంటూ భరోసా కూడా ఇచ్చారు. టీడీపీ, జనసేన మధ్య రహస్య ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతుందనే విషయం చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు చాలవా అంటున్నారు. -
బాబూ.. సైకిల్ తొక్కలేం!
పల్లెలు.. పట్టణాల్లో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌తో దూసుకెళ్తోంది. టీడీపీ శిబిరంలో నామమాత్రంగా కూడా ఉత్సాహం కనిపించడం లేదు. ఆ పార్టీ నాయకుల వద్ద పోటీ విషయం ప్రస్తావిస్తుండగానే.. తమకేమీ సంబంధం లేనట్లు ‘అన్నో.. మీకో దణ్ణం’ అంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారని జిల్లా పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. తన సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని తిరగాలని పార్టీ అధినేత చంద్రబాబు, కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లోలోన మదనపడుతున్నట్టు తెలిసింది. అందుకే స్వయంగా రంగంలోకి దిగి మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. సాక్షి, తిరుపతి: స్థానిక, పురపాలక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసేందుకు జిల్లాలో ఆ పార్టీ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఒకరు తరువాత ఒకరు నేరుగా ఫోన్లలో మాట్లాడినట్లు సమాచారం. అయినా ముఖ్య నాయకులు తప్ప ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులెవరూ స్పందించలేదని తెలిసింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సొంత జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీచేసి తీరాల్సిందేనని రాష్ట్ర పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. పోటీ చెయ్యకుండా చేతులెత్తేస్తే రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు పరువుపోతుందని ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది. ‘ఇన్నాళ్లు పార్టీకి చేసిన సేవలు చాలు.. మా మానాన మమ్మల్ని వదిలెయ్యండి’ అంటూ చేతులెత్తేస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వార్డుకే దిక్కులేదు.. జెడ్పీ చైర్మనా? తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్సీపీ ముందు వరుసలో ఉంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. నామినేషన్లు కూడా వేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీలో వార్డు మెంబర్‌గా పోటీ చెయ్యించేందుకు ఆ పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ సమయంలో టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరు? అని పార్టీ అధిష్టానం జిల్లా స్థాయి నాయకులను అడిగినట్లు తెలిసింది. ‘వార్డుకే దిక్కులేదు.. జెడ్పీ చైర్మనా?’ అంటూ వారు నిట్టూర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటించాలనే విషయంపైనా టీడీపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! తిరుపతి నుంచి జ్యోత్స్న? తిరుపతి మేయర్ అభ్యర్థిగా టీడీపీ తరఫున తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ సతీమణి జోత్స్న పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్ తమ కుటుంబం నుంచి ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించమని అడినట్లు తెలిసింది. శ్రీధర్‌వర్మ, ఆయన తండ్రి ఎన్టీఆర్ రాజు పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్నారని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలికి ఇప్పించాలని, మరోవైపు మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి ఆశించారు. అంతకు ముందు డాక్టర్ సుధారాణిని పార్టీ నాయకులు అడిగినట్లు తెలిసింది. ఆమె సుముఖంగా లేరని సమాచారం. చిత్తూరు విషయానికి వస్తే మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని తెలుసుకున్న టీడీపీ అధి ష్టానం తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, పీలేరు, మదనపల్లె, నగరి, కుప్పం ప్రాంతాలకు చెందిన టీడీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో టీడీపీలోని ముఖ్యమైన నాయకులు వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమచారం. చదవండి: దళిత నేతకు గెలవని సీటు -
నా ఇద్దరు భార్యలు గెలిచేశారోచ్..!
చెన్నై: తమిళనాడులో ఓ రైతు డబుల్ ధమాకా కొట్టాడు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తమిళనాడుకు చెందిన ఆ రైతుకు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలు వేర్వేరు చోట్ల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం ఒక ఎత్తయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించిడం మరో ఎత్తు. దీంతో ఆ రైతు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. చదవండి: అప్పుడు గనుక రాఫెల్ ఉండి ఉంటే..! తిరువణ్ణామలై జిల్లా వందవాసి పంచాయతీ యూనియన్ పరిధిలోని వళిపూర్ అగరం గ్రామానికి చెందిన ధనశేఖరన్ (49) వ్యవసాయం చేసుకునే సాధారణ రైతు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరేమో సెల్వి (46), మరొకరు కాంచన (37). మొదటి భార్య సెల్వి ఇదివరకే వళివూర్ అగరం పంచాయతీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె మళ్లీ అదే పదవికి పోటీచేశారు. ఇక చిన్న భార్య కాంచన కూడా.. కోలిల్ కుప్పం సాత్తనూర్ పంచాయతీలో ఓటు హక్కు ఉండడంతో అక్కడ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆశ్చర్యకరంగా రెండు చోట్ల ధనశేఖరన్ ఇద్దరు భార్యలు గెలవటంతో సదరు రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు గ్రామాల పంచాయతీ అధ్యక్షురాలైన తన ఇద్దరు భార్యలతో కలిసి విజయగర్వంతో ఆయన ఫోటోలు దిగుతూ.. ఇద్దరు భార్యల చేతులు పట్టుకుని ఆనందంతో ఈలలు, కేకలు వేయడం గమనార్హం. చదవండి: అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: అమిత్ షా -
ముంబై, థానె మినహా.. అన్నీ బీజేపీకే!
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ హవా చూపించింది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ ముంబైతో పాటు థానెను కూడా పోగొట్టుకున్న కమలం పార్టీ, మిగిలిన ఎనిమిది చోట్లా స్పష్టమైన ఆధిక్యం పొందింది. పుణె, ఉల్లాస్‌నగర్, పింప్రి-ఛించ్వాడ్, నాగ్‌పూర్, నాసిక్, షోలాపూర్, అకోలా, అమరావతి కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. పుణెలో బీజేపీ 74 డివిజన్లలో గెలవగా, శివసేన కేవలం 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి 34 స్థానాలు వచ్చాయి. ఉల్లాస్‌నగర్‌లో బీజేపీకి 34, శివసేనకు 25 స్థానాలు దక్కాయి. పింప్రి-ఛించ్వాడ్లో బీజేపీకి 30, శివసేన 5 స్థానాల్లో గెలిచాయి. ప్రతిష్ఠాత్మకమైన ముంబై కార్పొరేషన్లో ఇద్దరూ హోరాహోరీగా నిలిచారు. శివసేనకు 84, బీజేపీకి 81 డివిజన్లు దక్కాయి. కాంగ్రెస్ 31 చోట్ల గెలిచింది. థానెలో శివసేనకు 42, బీజేపీకి 14, ఎన్సీపీకి 16, కాంగ్రెస్‌కు 1 చొప్పున డివిజన్లలో విజయం లభించింది. నాగ్‌పూర్‌లో బీజేపీకి 70 స్థానాలు దక్కితే కాంగ్రెస్ పార్టీ 30 చోట్ల గెలిచింది. నాసిక్‌లో బీజేపీ 33, శివసేన 20 చోట్ల విజయం సాధించాయి. షోలాపూర్‌లో బీజేపీకి 39, శివసేనకు 14, కాంగ్రెస్‌కు 11 స్థానాలొచ్చాయి. అకోలాలో బీజేపీకి 31, కాంగ్రెస్‌కు 12 వచ్చాయి. అమరావతిలో బీజేపీ 24 స్థానాలు గెలవగా, కాంగ్రెస్ 8 చోట్ల గెలిచింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా పరిషత్తులలో మాత్రం కాంగ్రెస్-శివసేన ఆధిక్యం కనిపించింది. మొత్తం 343 జడ్పీ స్థానాలను గెలుచుకోగా, శివసేనకు 237 వచ్చాయి. కాంగ్రెస్ 253 చోట్ల, ఎన్సీపీ 314 చోట్ల గెలిచాయి. దాంతో ఎక్కువ జిల్లా పరిషత్తులను కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. -
చంద్రబాబు నాయుడు కూడా అంతే: వైఎస్ జగన్
కడప : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకునేవారు కాలగర్భంలో కలిసి పోయారని, చంద్రబాబు నాయుడు కూడా అంతేనని, అటువంటి నియంతలు ఎక్కువ కాలం నిలబడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జమ్మలమడుగు కౌన్సిలర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎర్రగుంట్లలో 20 కౌన్సిలర్ స్థానాలకు 18 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, అయితే ప్రజాస్వామ్యం కుంటుపడి కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు క్యాంప్‌లను నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు ఒత్తిడితో భయపెట్టి ఎనిమిదిమంది కౌన్సిలర్లను టీడీపీ తనవైపు తిప్పుకుందని, అయినా దేవుడు చంద్రబాబుకు మొట్టికాయ వేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించాడన్నారు. నాలుగు జిల్లా పరిషత్‌లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి టీడీపీ గెలిచేందుకు యత్నించిందని వైఎస్ జగన్ అన్నారు. కడప తప్ప కర్నూలు, ప్రకాశం, నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. చంద్రబాబు ఏకంగా జెడ్పీటీసీలతో ఫోన్లో మాట్లాడే స్థాయికి దిగజారారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అయితే నిజమైన ప్రతిపక్షం చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, ప్రజలేనని వైఎస్ జగన్ అన్నారు. రాబోయే కాలంలో వారే బాబును నిలదీస్తారన్నారు. త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుస్తామన్నారు. మీతోపాటు ఏ పోరాటం చేయడానికైనా తాను ముందుంటానని, అందరం కలిసికట్టుగా కలుద్దామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కౌన్సిలర్లకు సూచించారు. -
సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక కూడా దిగజారుడు రాజకీయం సమంజసమేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబూ.. నీకు ఎందుకంత అధికారదాహం అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే దురుద్దేశంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బలవంతంగా ఎత్తుకెళ్లారని అంబటి మీడియాకు తెలిపారు. ఎంపీటీసీలను ఎత్తుకుపోయిన విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీచేసే అధికారం ఉందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసిన విషయాన్ని అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. -
'ఇప్పటికీ ఓట్ల శాతం కాంగ్రెస్‌కే అనుకూలం'
హైదరాబాద్ : పరిషత్ ఎన్నికల్లో ఇప్పటికీ ఓట్ల శాతం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగానే ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఫలితాలపై ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. అయిదు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును గౌరవించే సాంప్రదాయం తమదన్నారు. హంగ్ ఉన్నచోట్ల మిత్రపక్షాలు తమకు సహకరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఐఎం కూడా తమకు మిత్రపక్షమేనని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు వేల చట్టాలను ఆమోదించుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ చట్టాలను తెలంగాణకు అనుకూలంగా ఆమోదించుకోవాలనేదే కాంగ్రెస్ నిర్ణయమన్నారు. అందుకోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని పార్టీ పరంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.