
కౌంటింగ్ కేంద్రంలో పాము కలకలం
విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నం కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ పాము కలకలం రేపింది. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కసారిగా పాము ప్రత్యక్షంగా కావటంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం పామును బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు.
నర్సీపట్నం డివిజన్కు సంబంధించి నర్సీపట్నం, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు పెద్దబొడ్డేపల్లి వద్ద ఉన్న డాన్బాస్కో కాలేజ్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో గత నెల 6,11 తేదీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.