జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కృష్ణాజిల్లా విజయవాడలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా కృష్ణాజిల్లా విజయవాడలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. సిద్ధార్థ మహిళా కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లను లోనికి అనుమతించటం లేదంటూ వారు ఆందోళనకు దిగారు. ఎన్నికల నిబంధన ప్రకారం ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతించాలని వారు పట్టుబడుతున్నారు. దాంతో పోలీసులకు, ఏజెంట్లకు మధ్య వాగ్వివాదం నెలకొంది.
ఈ సందర్భంగా పోలీసులకు, ఏజెంట్లకు మధ్య తోపులాట జరగటంతో ఉద్రికత్త నెలకొంది. పాసులు ఇచ్చి అనుమతించకపోవటం అవమానకరమని ఏజెంట్లకు ఆరోపిస్తున్నారు. అభ్యర్థితో పాటు ఏజెంట్ను కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు సీపీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.