agents
-
‘మిర్చి’పై ఎటూ తేల్చని సీఎం
సాక్షి, అమరావతి: ధర పతనమై ఇబ్బంది పడుతున్న మిరప రైతులను ఆదుకొనే విషయంలో సీఎం చంద్రబాబు ఎటూ తేల్చలేదు. ఆయన శనివారం సచివాలయంలో మిర్చి రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ, మిర్చి ధర, కొనుగోళ్లపై రైతులకు స్పష్టత ఇవ్వలేదు. ఎగుమతిదారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సహకరిస్తే రైతులను ఆదుకుంటామని చెప్పారు. వారం, పది రోజుల్లో మరోసారి సమావేశమై, అప్పటికీ మిర్చి ధర పెరగకపోతే, ప్రభుత్వం నిర్దేశించిన క్వింటా ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే కేంద్రం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామంటూ దాటవేశారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమీక్షలో కొనుగోళ్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో సీఎం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అసహనం వ్యక్తంచేశారు.సాగు ఖర్చులు ఏటా పెరిగిపోతున్నాయన్న రైతులుమిరప సాగుకు ఏటా పెట్టుబడి పెరుగుతోందని, ఎకరాకు రూ. 3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ ఖర్చవుతోందని రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యార్డుకు తెచ్చిన పంటకు ఉదయం నిర్ణయించిన ధర, మధ్యాహ్నానికి క్వింటాకు రూ.500 చొప్పున వ్యాపారులు తగ్గిస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే క్వాలిటీ సరిగా లేదంటున్నారని వాపోయారు. ఉదయం ఉన్న క్వాలిటీ మధ్యాహ్నానికే ఎలా తగ్గుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. యార్డుకు టిక్కీలు తేవాలంటే లారీల కిరాయి ఖర్చూ ఎక్కువవుతోందని చెప్పారు. యూనియన్‌లో లేని లారీలను బాడిగకు తీసుకొస్తే, వాటి యజమానులను మిగతా లారీ యజమానులు బెదిరించి, కేసులు పెడుతున్నారని చెప్పారు. క్వింటాకు బోనస్ ప్రకటిస్తే రైతులకు మేలు జరుగుతుందని సూచించారు.క్వాలిటీ, ఎగుమతులు తగ్గాయన్న వ్యాపారులుప్రకృతి వైపరీత్యాల వల్ల మిర్చి పంట క్వాలిటీ తగ్గిందని వ్యాపారులు చెప్పారు. కోల్డ్ స్టోరేజీల్లో గతేడాది పంట నిల్వ ఉండడంతో ఈ ఏడాది వచ్చిన పంటను నేరుగా యార్డుకు తెస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ఎగుమతులు తగ్గడంవల్ల రాష్ట్రంలో మిర్చికి కొంత ధర తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో పండే మిర్చిలో 60 శాతం విదేశాలకు ఎగుమతి అవుతుందని, 410 మంది ప్రధాన ఎగుమతిదారుల్లో ప్రస్తుతం 250 మందే యాక్టివ్‌గా ఉన్నారని తెలిపారు. కృష్ణపట్నం కంటెయినర్ టెర్మినల్ ద్వారా మిర్చి కంటెయినర్లను అనుమతించాలని కోరారు.కిరాయి ఎక్కువ వసూలు చేసేలారీ యజమానులపై కఠిన చర్యలుమిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేయాలని, రైతుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాలని అన్నారు. కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలిచ్చేలా కృషి చేస్తానన్నారు. క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ఈ–క్రాప్‌లో నమోదైన రైతుల వివరాలు, యార్డులో పంటను అమ్ముకున్న రైతుల వివరాల ఆధారంగా సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మైనారిటీలపై హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న దరిమిలా పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతోంది.బంగ్లాదేశీయుల చొరబాట్లపై పోలీసులు దృష్టిమహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల(Bangladeshi)పై పోలీసులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రేట్ కార్డును కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్‌లోకి మూడు రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉందని పోలీసులు గుర్తించారు.15 ఏళ్లుగా అక్రమ నివాసంముంబైలో మైనారిటీలు అధికంగా ఉన్న గోవండి, శివాజీ నగర్, మన్ఖుర్డ్ డియోనార్, చునాభట్టి, ఘట్కోపర్లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల(Bangladeshi infiltrators)ను పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ నవనాథ్ ధావలే తెలిపారు. ఈ చొరబాటుదారులలో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నకిలీ పత్రాలలో ఆధార్కార్డుఅయితే ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు ఐదువేల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేసి, వారికి నకిలీ పత్రాలు రూపొందించి, వాటి ఆధారంగా ఆధార్ కార్డు తయారు చేయిస్తున్నారని తేలింది. కాగా వీరంతా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారా లేక వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను 1994 నుండి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిని అరెస్టు చేసి విచారిస్తున్న సందర్భంలో అతను భారతదేశంలో చొరబడేందుకు ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలియజేసే రేటు కార్డు బయటపడింది.మూడు రూట్లు.. వివిధ రేట్లుమాల్దా, 24 పరగణాలు, ముర్షిదాబాద్, దినేష్పూర్, చప్లీ నవాబాద్గంజ్ తదితర ప్రాంతాల నుంచి పలువులు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు(Mumbai Crime Branch sources) తెలిపాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7 వేల నుంచి 8 వేలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాల్లో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఏజెంట్లలో ఉంది. బంగ్లాదేశీయులు నీటి మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలంటే, ఇందుకోసం రెండు నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి. ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేటు తక్కువ విధించారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్‌లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12 వేల నుంచి 15 వేలు ఏజెంట్లకు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలుసుకున్నారు.బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం -
బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు: కెనడా ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న కెనడా.. తన బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెరపైకి తీసుకొచ్చి భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని కెనడా పోలీసులు సంచలన ఆరోపలు చేశారు. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. కమ్యూనిటీ ముఖ్యంగా ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సోమవారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగిట్టె గౌవిన్ మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కెనడాలోని దక్షిణాసియా కమ్యూనిటీని ముఖ్యంగా ప్రో-ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. వీరు కొన్ని గ్రూప్‌ల సాయంతో మా భూభాగంపై వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి బిష్ణోయ్ గ్రూప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని మేం నమ్ముతున్నాం’’ అని గౌవిన్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు ఒట్టావా ఎలాంటి ఆధారాలను పంచుకోలేదు.#WATCH | Ottawa, Ontario (Canada): "It (India) is targeting South Asian community but they are specifically targeting pro-Khalistani elements in Canada...What we have seen is, from an RCMP perspective, they use organised crime elements. It has been publically attributed and… pic.twitter.com/KYKQVSx7Ju— ANI (@ANI) October 14, 2024అయితే, కెనడా ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఆ దేశ అధికారులు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్యతో ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్తల్లో నిలిచింది. ఈ పరిణామాల వేళ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం గమనార్హం. -
క్రెడిట్ కార్డ్ వసూళ్లకూ ఓ పద్ధతుంది
ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల రీత్యా ఒకే వ్యక్తి సగటున నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఒకటే జీతం మీద పరిమితి కలిగిన ఒక కార్డు వరకు అయితే ఇబ్బంది లేకుండా చెల్లించగలరు. కానీ అదే వ్యక్తికి నాలుగయిదు కార్డులు ఉంటే తన జీతానికి – స్థోమతకి మించి ఎన్నో రెట్లు పరిమితి కలిగిన కార్డులు ఉన్నట్టే! అయితే ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు దెబ్బ తినడం వలన క్రెడిట్ కార్డు వాడిన బకాయిలు తిరిగి చెల్లించలేని పరిస్థితులలోకి వెళ్లిపోతుంటారు చాలామంది. దాంతో ఆ బకాయిల వసూలు కోసం బ్యాంకులు చాలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాయి.మరీ ముఖ్యంగా ప్రైవేట్ రికవరీ ఏజెంట్లను నియమించి వారి ద్వారా వినియోగదారులను తీవ్రంగా వేధించడం, పీడించడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గరికి వెళ్లి పరువు తీయడం వంటివి. ఈ మధ్య అయితే మొబైల్ ఫోన్ లో ఓ యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి మరీ తెలిసిన వారందరికీ వీడియోలు ఫోటోలు మెసేజ్‌లు పంపడం వంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు వారికి అలా వేధించే హక్కు లేదు. ఎటువంటి లోను బకాయి అయినప్పటికీ నోటీసుల ద్వారా, కోర్టు కేసు ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ పైన చెప్పిన విధమైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అలా చేసిన బ్యాంకు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా సివిల్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో ఇంజక్షన్ సూట్ వేయడం ద్వారా ఆ బ్యాంకు వారు వినియోగదారుని వేధించడానికి వీల్లేదు అని కోర్టు నుండి రక్షణ పోందవచ్చు . వివిధ బ్యాంకులు వినియోగదారులను వేధిస్తుంటే డైనమిక్ ఇంజక్షన్ ద్వారా కూడా సివిల్ కోర్టు నుండి రక్షణ పోందవచ్చు. క్రెడిట్ కార్డు వసూళ్లకు కానీ, మరి ఏ విధమైన లోన్ రికవరీ కోసం కానీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని ఆర్.బి.ఐ నిబంధనలు సైతం సూచిస్తున్నాయి. ఎవరైనా బ్యాంకు వారు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే, వెంటనే పోలీసు వారిని ఆశ్రయించటం మంచిది. కొత్త చట్టం ద్వారా ఆన్లైన్లో కూడా ఎఫ్.ఐ.ఆర్. చేయవచ్చు. అయితే అలా చేసిన మూడు రోజులలోగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ ఫిర్యాదును ధ్రువీకరించవలసి ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
ఓటర్లపైనా రౌడీషీట్లు!
దర్శి: నిన్నటి వరకూ వారిపై ఎలాంటి కేసులూ లేవు.. అయితే ఒక్కసారిగా వారిపై రౌడీఓటర్లపైనా రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఎనిమిది మందిపై. అందులో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు. మరో ముగ్గురు ఓట్లు వేసేందుకు వచ్చిన వారు. వారికి ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదు. పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేసిన వారిపై నామమాత్రం కేసులు పెట్టి చేతులు దులుపుకున్న దర్శి పోలీసులు.. వీరిపై ఎందుకు రౌడీషీట్ పెట్టారో అర్థంకాని విషయం. వాస్తవానికి ఎవరిపైనైనా రౌడీషీట్ తెరవాలంటే మూడు క్రిమినల్ కేసులు తప్పనిసరిగా ఉండాలి. కనీసం 307 కేసైనా అయి ఉండాలి. లేదా తరచూ నేరాలు చేసేవారి పైరౌడీషీట్ వేస్తారు. కానీ ఎలాంటి కేసులు లేని సామాన్యులపై వైఎస్సార్సీపీ మద్దతుదారులు అనే నెపంతో రౌడీషీట్లు తెరిచిన దర్శి పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి దర్శి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెళ్లారు. ఆయన వెళ్లాక పోలీసులు రౌడీషీట్లు ఓపెన్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలింగ్ రోజు ఏం జరిగిందంటే.. టీడీపీ అరాచకం సృష్టిస్తున్నా.. అడ్డుకోని పోలీసులు ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని 117, 118 బూత్‌లలోకి సాయంత్రం ఆరు గంటలు దాటాక టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్ సాగర్లతో పాటు అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు, తమ్ముడు గొట్టిపాటి భరత్‌లతో పాటు మరో 50 మంది నరసరావుపేటకు చెందిన వారు బూత్‌లోకి ఎగబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసు సిబ్బంది తోపాటు ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు కూడా అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 6 గంటలు దాటాక బూత్‌లోకి రావడంపై ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా పోలీసులు నోరు మెదపలేదు. దీంతో అక్కడ ఓటర్లుగా ఉన్నవారు, ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా వారిని అడ్డుకున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ ఊరుకున్నారే గానీ వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. అంతే కాకుండా అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు.. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి నానా రభస చేసినా వారిని బయటకు పంపలేదు. ఏ పోలీసు ఆయన్ను అడ్డుకుని బయటకు పంపేందుకు సాహసం చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో ఓటు వేసేందుకు లైన్లో నిలబడిన వారు సమయం దాటినా ఎందుకు లోపలకు వెళ్తున్నారని వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో గొడవ కాస్త పెద్దదైంది. చోద్యం చూస్తున్న పోలీసులను ఓటర్లు నిలదీయడంతో అప్పుడు పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ అభ్యర్థి పోలీసుల కళ్లెదుటే తన అనుచరులను(నరసరావుపేటకు చెందిన వారిని) రెచ్చగొట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు పోలీసులపై, పోలింగ్ బూత్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తమిళనాడుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌కు ఓ రాయి కడుపులో తగిలింది. దీంతో కిందపడిపోయిన పోలీసుపై కూడా విచక్షణ రహితంగా రాళ్లు రువ్వారు. అల్లరి మూకలు డీఎస్పీపై కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులు తమ గార్డులు అడ్డుపెట్టి డీఎస్పీని బూత్ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఇంత రభస చేసినా నరసరావుపేటకు చెందిన వారిని వదిలేసి స్థానికులపై కేసులు పెట్టి మమ అనిపించారు. అలాగే పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎంను టీడీపీ నాయకుడు వీసీరెడ్డి ధ్వంసం చేశాడు. పోలీసులు పట్టుకుని వచ్చి 41 నోటీసులు ఇచ్చి సరిపెట్టారేగానీ, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయంటూ వీసీ రెడ్డి డ్రామా ఆడి ఆస్పత్రి నుంచి పోలీసుల కన్ను కప్పి పారిపోయాడు. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగుల గొట్టారన్న ఆరోపణ వీడియో బయటకు వచ్చాక హడావుడిగా పోలీసులు వీసీరెడ్డిని పిలిపించి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఇంత చేసిన వీసీరెడ్డి పై మాత్రం ఎలాంటి రౌడీïÙట్ పెట్టక పోవడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. అలాగే పోలింగ్ బూత్‌లో చొరబడి గందరగోళం సృష్టించిన, పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై మొక్కుబడిగా కేసులు పెట్టిన పోలీసులు.. వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు, సామాన్యులపై రౌడీషీట్లు తెరవడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్‌కు 48 గంటల ముందే బయట ప్రాంతానికి చెందిన వారు నియోజకవర్గాల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. అయితే అంత మంది నరసరావుపేటకు చెందిన వారు పట్టణంలో ఎలా ఉన్నారో దర్శి పోలీసులే చెప్పాలి. -
ఏజెంట్లే కీలకం
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ముహూర్తం సమీపించడంతో కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర కీలకం కానుంది. ఈ ప్రక్రియపై పూర్తి అవగాహనతో పాటు నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. కౌంటింగ్ హాళ్లలో టీడీపీ ఘర్షణలకు దిగి ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళికలు రూపొందించినట్లు స్పష్టమవుతున్నందున వైఎస్సార్సీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని పేర్కొంటున్నారు. టీడీపీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్వైజర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లదే కాబట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లు పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే కౌంటింగ్ ఏజెంట్లు కచ్చితంగా లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందజేసి అక్నాలెడ్జ్మెంట్ (ధ్రువీకరణ) పత్రం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నోటిమాటగా అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదు కాబట్టి ప్రతీది లిఖితపూర్వకంగా తెలియచేయడం తప్పనిసరి. వీవీ ప్యాట్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈవీఎంలలో పడిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు తేడా ఉంటే ఫైనల్‌గా వీవీ ప్యాట్లలోని ఓట్లనే పరిగణించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.రీ కౌంటింగ్ హక్కు లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రతి రౌండ్లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలి. లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు కౌంటింగ్ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.కౌంటింగ్‌లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్ కోరే హక్కు ఏజెంట్లకు ఉంటుంది. మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానున్నందున ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఏజెంట్‌గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రంలోకి ఫారం–17 సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, ఇతర వస్తువులను అనుమతించరు. -
కౌంటింగ్ లో రెప్పవాల్చొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో డ్రామాలాడటం, తప్పుడు లెక్కలు చూపించడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, సంయమనం కోల్పోకుండా అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన తీరుపై ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఏజెంట్లకు ఆయన వర్చువల్‌గా దిశానిర్దేశం చేశారు. 175 నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు దీనికి హాజరయ్యారు. విశ్రాంత ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల ఏమన్నారంటే.. రెచ్చగొట్టి ఏమార్చే యత్నాలు.. ప్రతీ ఓటు చాలా విలువైందనే విషయాన్ని ఏజెంట్లు మరచిపోవద్దు. ఎన్నికల నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు పార్టీకి దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి. పోస్టల్ బ్యాలెట్‌పై అధికారి సంతకం విషయంలో అనుమానం వస్తే వెంటనే స్పందించాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ దృష్టి మళ్లించేందుకు చేసే ప్రయత్నాలపై జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనమే గెలుస్తున్నాం. జాతీయ మీడియా సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో ఓ పార్టీ 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పుకొచ్చాయి. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు. ఇలాంటి విద్యలు ప్రదర్శించటంలో చంద్రబాబును మించిన వారులేరు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈవీఎంలపైనా జాగ్రత్త.. ఈవీఎంల కౌంటింగ్‌లో కూడా ధ్యాస పెట్టి జాగ్రత్తగా పరిశీలించాలి. మనకు వచ్చినవి, ప్రత్యర్థులకు వచ్చినవి, స్వతంత్ర అభ్యర్థులకు లభించిన ఓట్లను సరిగ్గా నమోదు చేసుకుని సంఖ్య సరిచూడాలి. వివరాలు నమోదు చేసుకోకుండా ప్రత్యర్థులు మన దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్లపై న్యాయ పోరాటం..కౌంటింగ్ రోజు కుట్రలకు కూటమి పథకం వేస్తోంది. మన ప్రత్యర్థులు వ్యవస్థల్లోకి చొరబడి అధికారులను వారికి అనుగుణంగా మలుచుకుంటున్న నేపథ్యంలో ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ వేళ మనసు లగ్నం చేసి పని చేస్తూ బ్యాలెన్స్ దెబ్బ తినకుండా చూసుకోవాలి. ఒకవేళ అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే రికార్డు అయి తీరాలి. పోస్టల్ బ్యాలెట్ వద్ద సంక్లిష్ట ప్రక్రియ ఉంది. ఇన్ వ్యాలిడ్ ఓటు (చెల్లనివి) పొరపాటున కూడా వ్యాలిడ్ కాకూడదు. వ్యాలిడ్ ఓటు ఇన్ వ్యాలిడ్ అవ్వకూడదు.కౌంటింగ్ విధానంపై అనుమానాలున్నా, కూడికలో తేడా వచ్చినా మళ్లీ చూపించమని అడగవచ్చు. దీన్ని పట్టించుకోకపోతే అబ్జర్వర్ దృష్టికి తేవాలి. పోస్టల్ బ్యాలెట్ కవర్లపై గెజిటెడ్ అధికారి సంతకం చేసి స్టాంప్ వేయాలి. స్టాంప్ వేయకపోతే ఆయన ఎక్కడ పని చేస్తున్నారో స్వయంగా చేతిరాతతో రాసి సంతకం చేస్తే అనుమతించాలని ఈసీ సూచించింది. కానీ ఏపీ సీఈవో మాత్రం చేతితో డిజిగ్నేషన్ (హోదా) రాయకపోతే స్పెసిమన్ సంతకాలు కలెక్ట్ చేసి కౌంటింగ్ అధికారులకు ఇవ్వాలని, ఆ విధంగా చెక్ చేసుకోవాలని తాజాగా ఆదేశాలిచ్చారు. మరి ఈ సంతకం ఎవరిదని తెలుస్తుంది? దీనిపై పార్టీ తరపున అభ్యంతరం చెబుతున్నాం. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఇక్కడ తెచ్చారు. దీనిపై మన పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నాం. ఏ తీర్పు వస్తుందనేది సోమవారం నాటికి తెలుస్తుంది. ఒకవేళ రిలీఫ్ వస్తే సంతకంతోపాటు డిటెయిల్స్ కానీ, సీల్ కానీ ఉండాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత రాగానే మళ్లీ తెలియజేస్తాం. బీజేపీ టార్గెట్‌కు అనుగుణంగా ఫిగర్స్ సర్వేల అడ్డగోలు లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. సర్వే సంస్థలు జాతీయ స్థాయిలో బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా ఉంది. అందుకు అనుగుణంగా సర్వే లెక్కలు ఇచ్చుకుంటూ వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇండియా టుడే సర్వే చూస్తే మరింత ఆశ్చర్యమేస్తుంది. పొత్తులో ఉంటే చాలు.. పోటీ చేసిన స్థానాల కన్నా ఎక్కువగా ఫలితాల్లో చూపారు. బిహార్‌లో అలాగే చేశారు. మనకు సంబంధించి రెండు ఇచ్చారు. ఒడిశాలో సున్నా ఇచ్చారు. బీజేపీ 400 సీట్ల టార్గెట్‌కు అనుగుణంగా ఫిగర్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇలా చేసి ఈ రెండు రోజుల్లో వీళ్లు ఏం సాధిస్తారో అర్థం కావట్లేదు. ఈవీఎంలో నమోదైన వాటిని వీళ్లు ఏం చేయగలుగుతారు? అధికారంలో వాళ్ల చేతిలో ఉంది కాబట్టి కౌంటింగ్‌లో ఏమైనా మిస్యూజ్ చేయటానికి అవకాశం ఉందా? అనే డౌట్ వస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబుకి వాళ్ల జోడీ దొరికిన తర్వాత ఏమైనా చేసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ద్వారా ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఎదుటివారికి ఇబ్బందులు కలిగించడంలో చంద్రబాబు పీహెచ్డీ పొందారు కాబట్టి మనం చాలా చాలా అలర్ట్‌గా ఉండాలి. మన పార్టీ నేతలు కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారు. -
కవ్వించి.. కలబడాలి!
సాక్షి, అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా సృష్టించిన విధ్వంస కుట్రలకు చంద్రబాబు మరింత పదును పెడుతున్నారు! అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైజాక్ చేసేందుకు పక్కా పన్నాగం పన్నుతున్నారు. ఓట్లు లెక్కించే జూన్ 4వతేదీన దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండకు తెగబడేందుకు టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు.ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లో కవ్వింపులకు దిగి ఘర్షణలతో ఉద్రిక్తత రేకెత్తించేందుకు పథకం రూపొందించారు. వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను కవ్వించి కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లగొట్టడమే టీడీపీ దుష్ట పన్నాగం. అందరినీ ఏమార్చి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నదే చంద్రబాబు కుతంత్రం. పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ పచ్చ ముఠాలు బరితెగించడం ఆందోళనకరంగా మారింది. ఈసీని ప్రభావితం చేసి తమ చెప్పుచేతల్లో నడుచుకునేలా నియమించుకున్న పోలీసు అధికారుల ద్వారా ఈ కుట్రలను అమలు చేసేందుకు చంద్రబాబు ఉద్యుక్తమైనట్లు స్పష్టమవుతోంది.ఎంతకైనా తెగించేందుకు వెనుకాడొద్దు..కౌంటింగ్ సందర్భంగా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి అధికారులతో వాగ్వాదంతోపాటు వైఎస్సార్సీపీ ఏజెంట్లతో ఘర్షణకు దిగాలని టీడీపీ ఏజెంట్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మొదట లెక్కించే పోస్టల్ బ్యాలెట్ల నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించడం ద్వారా ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారో స్పష్టమవుతోంది.మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు చంద్రబాబు ఉపదేశించారు. ఇక సాధారణ కౌంటింగ్ ఏజంట్లతో శనివారం నిర్వహించే సమావేశంలోనూ ఇవే అంశాలు పునరుద్ఘాటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎంత తీవ్రస్థాయిలో ఘర్షణకు అయినా సిద్ధం కావాలని అందుకోసం ఎంతకైనా తెగించాలని కౌంటింగ్ ఏజెంట్లను పురిగొల్పడం ద్వారా చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారు.పోలింగ్ రోజు మోడల్ అమలుపోలింగ్ సందర్భంగా పాల్పడిన కుట్రలనే కౌంటింగ్ రోజు కూడా పునరావృతం చేయాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) ద్వారా తాము నియమించుకున్న పోలీసు యంత్రాంగం ఇందుకు పూర్తిగా సహకరిస్తుందనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించిన ఈ నెల 13వతేదీన టీడీపీ రౌడీమూకలు దాడులతో భయానక వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధానంగా పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అల్లరి మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండకు పాల్పడ్డాయి. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాలతోపాటు నడి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది. అదే అదనుగా మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలను ఓటింగ్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పచ్చ ముఠాలు కత్తులు, కర్రలు, రాడ్లు చేతబట్టుకుని బీభత్సం సృష్టించాయి.బాంబు దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధ్వంసకాండ మోడల్‌ను ఓట్ల లెక్కింపు రోజు కూడా అమలు చేయాలని చంద్రబాబు పథకం వేశారు. కౌంటింగ్ కేంద్రాల బయట దాడులతో దృష్టి మళ్లించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తమ ఏజెంట్లతో కవ్వింపు చర్యలకు దిగాలని కుట్ర పన్నారు.వైఎస్సార్సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టండి...!వైఎస్సార్ సీపీ ఏజెంట్లే లక్ష్యంగా కౌంటింగ్ కేంద్రాల్లో కవ్వింపు చర్యలతో ఘర్షణలకు దిగాలని, దాడులకూ వెనకాడొద్దని చంద్రబాబు ఆదేశించారు. అదే అదనుగా తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులను రంగ ప్రవేశం చేయించి వైఎస్సార్సీపీ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపేలా చంద్రబాబు ఇప్పటికే కీలక అధికారులతో మంతనాలు జరిపారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నది ఆయన లక్ష్యం. ఈమేరకు పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ కౌంటింగ్ కేంద్రాల్లో వాగ్వాదం, ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ, కొందరు పోలీసు అధికారులు కౌంటింగ్ ప్రక్రియలోనూ అదే రీతిలో వ్యవహరించే అవకాశాలున్నాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన ఈసీ, అధికార యంత్రాంగం ఉదాశీనంగా, నిస్తేజంగా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. -
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్‌కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్‌తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్‌లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్‌ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్‌కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్‌రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్‌గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్‌లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్‌లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్‌లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్‌లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్‌ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్‌లను మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్‌ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్‌లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్‌లు, ఫండ్స్‌లో పూర్తిగా భిన్నం. యులిప్‌లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్‌లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్‌లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్‌ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్‌లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్‌లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్‌లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్‌డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్‌లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్‌తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్‌లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్‌లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్‌లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్‌లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్‌లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
‘బి’ గ్యాంగ్ బేరాల జోరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో దశలో కన్వీనర్ కోటాలో చేరే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ 70,627 కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు ఉన్నాయి. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిపోయే సీట్లను ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లుగా భర్తీ చేయడం సర్వసాధారణం. వాస్తవానికి వీటిని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులతోనే భర్తీ చేయాలి. కానీ కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులకు ఎక్కువ మొత్తం తీసుకుంటూ సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు యాజమాన్య కోటా సీట్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 వేల వరకూ ఉంటాయి. ఇందులో సగం బి కేటగిరీ కింద, మిగతా సగం ఎన్ఆర్ఐ కోటా కింద ఉంటాయి. వీటితో కాసుల పంట పండించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. రంగంలోకి ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ప్రధాన ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయి. అయితే టాప్ టెన్ కాలేజీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. వీటిని ఈ నెలాఖరు వరకూ భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలు ఏజెంట్లను, కన్సల్టెన్సీలను భారీగా కమీషన్లు ఆశచూపి రంగంలోకి దించుతున్నాయి. ఏజెంట్లు, కన్సల్టెన్సీల ప్రతినిధులు ఎంసెట్ అర్హుల జాబితా ఆధారంగా వారి ఫోన్ నంబర్లు సంపాదించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో రకంగా నమ్మబలుకుతూ తమకు అనుకూలమైన కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సీట్లు అయిపోతున్నాయని, త్వరగా అప్రమత్తం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వద్దకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నారు. కంప్యూటర్ కోర్సుకు గిరాకీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 56,811 కంప్యూటర్ సైన్స్ సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో 19 వేల వరకు సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 53,034 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 3,777 సీట్లు మిగిలిపో యాయి. ఇవన్నీ టాప్‌టెన్ కాని కాలేజీల్లోనే ఉన్నా యి. ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు, కోరు కున్న కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీట్లు రాని వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్ని స్తున్నారు. సీఎస్సీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందంటూ కాలేజీల యాజమాన్యాలు, ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ఒక్కో సీటు రూ.12 నుంచి రూ.16 లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల వరకూ కన్సల్టెన్సీలకు కమీషన్లుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బి కేటగిరీ సీట్లను ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుకు, మెరిట్ ప్రకారమే ఇవ్వాలి. ఈ నిబంధన ఎక్కడా పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉండటంతో అవి మిగిలిపోతున్నాయి. వీటిని కూడా భారీగా డబ్బులు తీసుకుని ఎన్ఆర్ఐ కోటా మాదిరి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారని, యాజమాన్య కోటా సీట్ల దందా అపాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
కొత్త రకం మోసం.. బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని లావాదేవీలు..
సాక్షి, సిటీబ్యూరో: ‘రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగి పార్ట్ టైం జాబ్ వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులు బాధితుడు లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఖాతాదారుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో తానెవరినీ మోసం చేయలేదని, ఒక ఏజెంట్ సూచన మేరకు తన పేరు మీద కరెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చానని చెప్పాడు. ఇందుకుగాను ఆ ఏజెంట్ ప్రతి రోజు రూ.1,000 తన ఖాతాలో జమ చేస్తున్నాడని చెప్పాడు. అంతేతప్ప ఆ ఖాతాతో వారేం చేస్తున్నారో తనకేమీ తెలియదని పోలీసులకు బదులిచ్చాడు.’ ... ఇప్పటివరకు పేదలు, అనాథలు, బిచ్చగాళ్ల పేర్ల మీద ఆధార్, పాన్ కార్డులు సృష్టించి, వాటితో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సైబర్ నేరస్తులు.. ఈ తరహా ఖాతాల లభ్యత తక్కువయ్యే సరికి నేరస్తులు రూటు మార్చారు. నిరుద్యోగులు, యువకులను ఆకర్షించి, వారి పేర్ల మీద అకౌంట్ల తీసి, వాటిని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన నిరుద్యోగులను కలిసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిస్తున్నారు. ఇందుకోసం వారికి రోజుకు రూ.500–1,000 చెల్లిస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. భౌతికంగా మీ బ్యాంకు కిట్, సిమ్ కార్డు ఏజెంట్ దగ్గర ఉంటుంది. కానీ, మీ ఆన్లైన్ లావాదేవీలు మాత్రం విదేశాల నుంచి జరుగుతుంటాయి. ఎలాగంటే.. సైబర్ కేటుగాళ్లు సూచించినట్లుగా ఏజెంట్ మీ సిమ్‌ను కొత్త ఫోన్లో వేసి మైటీటెక్ట్స్, టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ అసిస్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటాడు. తొలుత సైబర్ నేరస్తులు మోసం చేసిన సొమ్మును మీ ఖాతాలో వేయించుకుంటారు. సొమ్మును ఇతర అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు అవసరమైన ఓటీపీని రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా ఒకే సమయంలో ఇటు ఏజెంట్, అటు విదేశాల్లో ఉండే నేరస్తుడు చూడగలరు. దీంతో కొట్టేసిన సొమ్మును విడతల వారీగా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, చివరగా నేరస్తుడి అసలు ఖాతాకు బదిలీ అవుతుంది. కొట్టేసిన మొత్తంలో ఏజెంట్లకు 10–20 శాతం కమీషన్ అందిస్తున్నారు. ఎక్కువగా ఈ దేశాల నుంచే.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్, లోన్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా అద్దె బ్యాంకు ఖాతాల నుంచే జరుగుతున్నాయని రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసు అధికారి తెలిపారు. చైనా, ఫిలిప్పిన్స్, నేపాల్ దేశాల ఎక్కువ నేరస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. ఆర్బీఐ ఏం చేయాలంటే.. ♦ ఇండియాలోని బ్యాంకు ఖాతాల నుంచి విదేశీ ఖాతాలకు నిరంతరం లావాదేవీలు జరిపే అకౌంట్లపై నిఘా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెట్టాలి. ♦ విదేశీ అకౌంట్లకు నగదు లావాదేవీలు జరిపే సమయంలో వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా కాకుండా ఐపీ ఆధారిత లావాదేవీలను అనుమతించాలి. దీంతో విదేశీ అకౌంట్లు, సైబర్ నేరస్తుల అక్రమ లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది. ♦ ఎక్కువ సొమ్ము బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలను పరిశీలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ♦ అనుమానాస్పద విదేశీ బ్యాంకు లావాదేవీలపై సంబంధిత బ్యాంకు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఆయా లావాదేవీలపై వెంటనే నిలిపివేయాలి. ♦ విదేశీ లావాదేవీలు జరిపే ఖాతాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఆయా ఖాతాదారులు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామా ఇతరత్రా వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలి. -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
Hyderabad: మార్కట్లో తక్కువ ధరకే కార్లు.. తొందరపడితే మోసపోతారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. తక్కువ ధరలకు లభిస్తున్నాయనే ఆశతో కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఊరూ పేరూ లేని వాహనాలను కొనుగోలు చేసి ఏజెంట్ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. మరోవైపు ఇలాంటి అక్రమ వాహనాలపై కొందరు దళారులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి కొందరు ఆర్టీఏ అధికారుల సహకారంతో అధికారికంగా నమోదు చేయిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా అక్రమ వాహనాల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తరచూ ఇలాంటి వాహనాలను పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఇదో మచ్చుతునక.. కొద్ది రోజుల క్రితం నగరంలోని మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకండ్ హ్యాండ్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన బండి కావడంతో అన్ని విధాలా బాగుందని భావించాడు. పైగా తక్కువ ధరకే లభించడంతో వెనుకడుగు వేయలేదు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా నష్టపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) నకిలీదని తేలింది. నగరంలో లభించే సెకండ్ హ్యాండ్ వాహనాల కంటే ఢిల్లీకి చెందిన వాహనాలు తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలామంది ఎలాంటి పత్రాలు పరీక్షించుకోకుండానే కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఎన్ఓసీ ఎంతో కీలకం.. ► ఎలాంటి వాహనమైనా సరే ఒకరి నుంచి మరొకరికి యాజమాన్య బదిలీ అయ్యే సమయంలో నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఎంతో కీలకం. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినా తప్పనిసరిగా ఎన్ఓసీ ఉండాల్సిందే. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన వాహనాన్ని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కొనుగోలు చేసినప్పుడు వాహనం మొదటి యజమానికి పేరిట నమోదైన రిజి్రస్టేషన్ పత్రాలను అక్కడి ఆర్టీఏ అధికారులకు సమరి్పంచి ఎన్ఓసీ పొందాలి. దాని ఆధారంగా హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారులు తిరిగి నమోదు చేస్తారు. చట్టబద్ధంగా ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినట్లు నిరూపించుకోవాలి. కానీ.. ఢిల్లీ, హరియాణా నుంచి తరలిస్తున్న వాహనాలకు ఇలాంటి కీలకమైన డాక్యుమెంట్లు లేకపోవడం గమనార్హం. ► గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3వేలకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలే. ఢిల్లీ, హరియాణాలతో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై తదితర నగరాల నుంచి కూడా సెకండ్ హ్యాండ్ వాహనాలు నగరంలో నమోదువుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు ఢిల్లీకి చెందిన కార్లే ఉన్నట్లు అంచనా. వీటిపైన ఎక్కువ ఆదాయం లభిస్తూండడంతో ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. -
ఏజెంట్ చేతిలో మోసపోయిన వలసకార్మికులు.. ఏపీ ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి రాక!
ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 08 మంది వలసకార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సహకారంతో స్వదేశానికి రప్పించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా సక్రమ పద్ధతిలో వెళ్లాలని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు ఏపీఎన్ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించడంతో ఈ నెల 27న వాళ్లు విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరం పనిచేస్తోందన్నారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 08 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, APNRTS ను సంప్రదించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి డా. సీదిరి అప్పలరాజు వలసకార్మికుల క్షేమసమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరించారు. సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవడంతో పాటు వారిని భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు ఈ విషయమై.. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు. -
గల్ఫ్ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న మహిళలు
సాక్షి, కోనసీమ(అమలాపురం): గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి, అమాయక మహిళలపై కొందరు ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ వీసాలతో విమానాలు ఎక్కిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఆ అమాయక మహిళలు నకిలీ వీసాలతో పోలీసులకు పట్టుబడి జైళ్లపాలవుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో జిల్లాకు చెందిన మహిళలు ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మరింత మంది జిల్లా మహిళలు అక్కడి జైలులో చిక్కుకున్నారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మోసపోయారిలా.. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రాంబాబు అనే ఏజెంటు గల్ఫ్‌లో ఉపాధి కల్పించే పేరుతో అమాయకులపై వల విసిరాడు. గల్ఫ్‌లో ఉపాధి పొందడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో పలువురు అతడికి రూ.లక్షలు సమర్పించుకున్నారు. అతడి ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు గత మే నెలలో గల్ఫ్‌కు బయలుదేరారు. వీరిలో మన జిల్లా మహిళలూ ఉన్నారు. వారికి ఏజెంటు రాంబాబు వీసాలు ఇచ్చి, గల్ఫ్కని చెప్పి, తొలుత హైదరాబాద్ పంపించాడు. అక్కడ రాజు అనే వ్యక్తి వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించాడు. ఆ విమానం కేరళ రాష్ట్రం కొచ్చి ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ చేసిన తనిఖీల్లో ఈ 30 మంది మహిళల వీసాలూ నకిలీవని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. గత మే 8వ తేదీన వారిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆ మహిళలు అక్కడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏజెంట్ తమను మోసగించినట్టు గుర్తించిన బాధితులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగాన్ని ఆశ్రయించారు. అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించింది. మిగిలిన 25 మంది మహిళలనూ విడిపించేందుకు చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ ఎన్.భవాని సారథ్యంలోని ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విజ్ఞాపన అందించారు. దీనిపై కలెక్టర్ శుక్లా, జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సంబంధిత ఏజెంటుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేరళ జైలులో ఉన్న మహిళలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరి జిల్లాల వారే ఎక్కువ కేరళలో జైలు పాలైన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దడాల వెంకటలక్ష్మి (బందనపూడి, కాజులూరు మండలం), గీతారాణి (చల్లపల్లి, ఉప్పలగుప్తం మండలం), శాంతి (తాడికోన, అల్లవరం మండలం), లక్ష్మణరావు (ఆదుర్రు, మామిడికుదురు మండలం), రేలంగి జానకి (రామచంద్రపురం), గెల్లా మంగాదేవి (సుంకరపాలెం, తాళ్లరేవు మండలం), యలమంచిలి పార్వతి (దేవగుప్తం, అల్లవరం మండలం), గుబ్బల శ్రీలక్ష్మి (రావులపాలెం), ఇనగల శిరీష (కోరుకొండ), కోడి బేబీ (నిడదవోలు శివారు సుబ్బరాజుపేట) తదితరులున్నారు. కేరళకు అధికారుల బృందం ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, మహిళల అరెస్టు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని, కేరళలో అరెస్టయిన మహిళలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా ఎస్పీతో కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఫోనులో మాట్లాడారు. నకిలీ వీసాల విషయమై కొన్ని కేసులు నమోదైనట్టు ఎర్నాకుళం ఎస్పీ బదులిచ్చారు. అక్కడి జైళ్లలో చిక్కుకున్న జిల్లా మహిళలను విడిపించేందుకు కోనసీమ నుంచి ఒక పోలీసు అధికారి, ఒక ఐసీడీఎస్ అధికారితో కూడిన బృందాన్ని కేరళకు ఎస్పీ పంపించారు. నిలువునా మోసపోయాం నకిలీ వీసాలతో ఏజెంటు రాంబాబు, హైదరాబాద్‌లో రాజు అనే వ్యక్తుల చేతిలో తాము నిలువునా మోసపోయామని రావులపాలేనికి చెందిన బాధిత మహిళ శ్రీలక్ష్మి వాపోయింది. కలెక్టరేట్ వద్ద ఆమె విలేకర్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 30 మంది మహిళల్లో శ్రీలక్ష్మి ఒకరు. అక్కడ జైలులో ఉండగా శ్రీలక్ష్మి భర్త చనిపోయాడు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించి, విడిపించడంతో ఆమె స్వగ్రామం రావులపాలెం చేరుకుంది. కొచ్చి జైలులో తాను రెండు వారాలు ఉన్నానని.. డబ్బులు లేక.. సరైన తిండి, నిద్ర లేక నరకం చూశామని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ పడిన అవçస్థలను హ్యూమన్ రైట్స్ మహిళా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌కు శ్రీలక్ష్మి వివరించింది. ఐదుగురికి బెయిల్ ఇప్పించాం కొచ్చి విమానాశ్రయంలో నకిలీ వీసాలతో పట్టుబడి అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి బెయిల్ మంజూరయ్యేలా మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మహిళా విభాగం కృషి చేసింది. బెయిలో పొందిన వారిలో శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) ఉన్నారు. ఇంకా కొంత మంది మహిళలు కేరళ రాష్ట్ర జైలులో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. – నల్లబోతుల భవాని, ఏపీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వుమెన్ సెల్, రాజమహేంద్రవరం ఏజెంట్లపై చర్యలు గల్ఫ్‌లో ఉపాధి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళలో నకిలీ వీసాలతో అరెస్టయిన జిల్లా మహిళలున్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జిల్లా మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిసింది. వీరిలో ఒకరు బెయిల్‌పై వచ్చారు. మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాం. – సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్పీ -
నిరుద్యోగులకు ఏజెంట్ల వల!
మోర్తాడ్: విదేశాలకు వెళ్లి ఉపాధి పొందాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు దందా సాగిస్తున్నారు. నకిలీ వీసాలతో అమాయకులను దోచుకుంటున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు వెల్లడిస్తున్నాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మలేషియా ముందు వరుసలో ఉంటుంది. ఆ దేశంలో పనిచేయడానికి కంపెనీలు వర్క్ వీసాలను జారీ చేసే అవకాశం ఉన్నా ఏజెంట్లు డబ్బులపై ఆశతో వర్క్ వీసాల జోలికి వెళ్లకుండా విజిట్ వీసాలే ఇస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు నకిలీ వీసాలను అంటగడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారు. అయితే విజిట్ వీసాలపై వస్తు న్న వలసదారులు వీసా గడువు ముగిసినా మలేషియాలోనే ఉండిపోతున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా ఉండేవారిని అడ్డుకోవడానికి ఇటీవల పకడ్బందీ చర్యలు చేపట్టింది. విజిట్ వీసాపై వచ్చినవారిలో ఎవరు టూరిస్టులో, ఎవరు ఉండటానికి వస్తున్నారో గుర్తించి మలేషియా ఎయిర్‌పోర్టులోనే నిలువరిస్తోంది. విజిట్ వీసాపై టూరిజం సంస్థల ద్వారా వచ్చినవారినే ఆ దేశంలో అడుగుపెట్టడానికి అనుమతి ఇస్తోంది. ఏదో పనిచేసుకుందామని విజిట్ వీసాలపై వస్తున్నవారిని ఎయిర్‌పోర్టులోనే ఉంచుతున్న పోలీసులు ఒకటి రెండు రోజుల్లో తిప్పి పంపిస్తున్నారు. ఇలా నెలన్నరగా రోజుకు వంద నుంచి రెండు వందల మంది మలేషియా నుంచి తిరిగి వస్తున్నారు. లక్షల రూపాయలు ఏజెంట్ల పాలు.. మలేషియాలోనే పలు కంపెనీలు వర్క్ వీసాలను జారీ చేస్తున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలపైనే అక్కడికి పంపిస్తున్నారు. నిరుద్యోగులు వీసా కోసం ఏజెంట్లకు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఇటీవల మెట్పల్లి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 25 మందికి నకిలీ వీసాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వారికి సందేహం వచ్చి ఆన్లైన్లో పరిశీలించగా నకిలీవని తేలింది. ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో విషయం బయటికి వచ్చింది. అయి తే, మలేషియాలో మునుపటి పరి స్థితి లేదని, అక్కడ ఉపాధి పొందుతున్న ఏర్గట్లకు చెందిన మచ్చ లక్ష్మణ్ ‘సాక్షి’కి తెలిపారు. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకుని వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. -
మంత్రి కాకాణి PAకు రికవరీ ఏజెంట్ల బెదిరింపులు
-
హైదరాబాద్‌లో 50మందికి పైగా ఏజంట్స్తో డ్రగ్స్ దందా
-
ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్ ఆవిష్కరణ
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ ఏంజెట్లు, మధ్యవర్తుల కోసం ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ (ఆనంద) పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కంపెనీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా ద్వారా డిజిటల్‌గా కేవైసీ పక్రియను పూర్తి చేయవచ్చు. కాగితం అవసరం లేకుండా పాలసీలను డిజిటల్ రూపంలో మంజూరు చేయవచ్చు. ఏజెంట్ ఇంటికి రావల్సిన పనిలేకుండానే కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవచ్చని ఎంఆర్ కుమార్ తెలిపారు. -
60 వేలకు పైగా రియల్టీ ఏజెంట్లు
సాక్షి, హైదరాబాద్: క్లౌడ్ ఆధారిత రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సేవలను అందించే కంపెనీ ఈఎక్స్‌పీ రియాల్టీ ఏజెంట్ల నమోదులో గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. గతేడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా 32,403 మంది ఏజెంట్లు ఉండగా.. ఇప్పుడది 60 వేల మార్క్‌ను అధిగమించింది. ఏటా 85 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. గతేడాది నవంబర్‌లో ఇండియాలో సేవలను ప్రారంభించిన ఈఎక్స్‌పీ రియల్టీలో ప్రస్తుతం 750కి పైగా ఏజెంట్లు, వెయ్యికిపైగా ప్రాపర్టీలున్నాయి. -
ఏం తెలివి.. 'స్మార్ట్'గా దోచేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో ‘స్మార్ట్’ దోపిడీ యధేచ్చగా కొనసాగుతోంది. వాహనదారులకు స్మార్టు కార్డులను అందజేసేందుకు గ్రేటర్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా పంపించవలసిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ తదితర స్మార్ట్‌కార్డులను ఏజెంట్లకు కట్టబెడుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఇందుకోసం ఒకరిద్దరిని ప్రత్యేకంగా నియమించడం గమనార్హం. ఒక్కో కార్డుపైన రూ.100 నుంచి రూ.150 చొప్పున కొన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు వందకు పైగా స్మార్ట్ కార్డులను విక్రయిస్తున్నారు. కొంతమంది సిబ్బంది ఇలా చేతివాటాన్ని ప్రదర్శించడం ఆర్టీఏ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవల్లో పారదర్శకతను పెంపొందించేందుకు ఆన్లైన్ సేవలను విస్తృతం చేశారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రం వినియోగదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌కార్డులనే నేరుగా అందజేసేందుకు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. చిరునామా నిర్ధారణకే స్పీడ్ పోస్టు... డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, తదితర డాక్యుమెంట్లను గతంలో వాహనదారులకే నేరుగా అందజేసే వారు. దీంతో చాలామంది నకిలీ అడ్రస్లపైన ఆర్టీఏ పౌరసేవలను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కీలకమైన డ్రైవింగ్ లైసెన్సు వంటి డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లవచ్చుననే ఆందోళన వివిధ స్థాయిల్లో వ్యక్తమైంది. పైగా ఒకే వ్యక్తి రకరకాల చిరునామాలపైన ఒక టి కంటే ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొనేవా రు. వాహనాల అమ్మకాలు, యాజమాన్య బదిలీల్లో నూ అక్రమాలు జరిగాయి. దీంతో వాహనదారుల చిరునామా నిర్ధారణను తప్పనిసరి చేశారు. ఇందుకోసం డాక్యుమెంట్లను వాహనదారులకు నేరుగా ఇవ్వకుండా స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికే పంపించేందుకు చర్యలు చేపట్టారు. సర్వీసు చార్జీల్లో భాగంగా స్పీడ్ పోస్టు కోసం రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్‌పోస్టు చార్జీలు చెల్లించినప్పటికీ ఏజెంట్ల ద్వారా డాక్యుమెంట్లనే నేరుగా తీసుకొనేందుకు మరో రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. కొరవడిన నియంత్రణ.. గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి వివిధ రకాల పౌరసేవలపైన ప్రతి రోజు సుమారు 2500 నుంచి 3000 స్మార్ట్ కార్డులు పంపిణీ అవుతాయి. కొన్ని ఆఫీసుల్లో కచ్చితంగా పోస్టు ద్వారానే వినియోగదారులకు చేరవేస్తున్నప్పటికీ మరి కొన్ని ఆఫీసుల్లో మాత్రం 50 శాతం నుంచి 60 శాతం కార్డులను నేరుగా అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గుడ్ న్యూస్.. భారీగా ఏజెంట్ల నియామకం చేపట్టిన మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్
ఇన్స్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు చేరాలని అనుకునే వారికి శుభవార్త. ఇటీవల ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. ఏజెంట్ల స్థాయి నుంచి ఆఫీసర్ల స్థాయి వరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. తాజాగా మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారీ స్థాయిలో ఉద్యోగాల ఏజెంట్ల నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్ లైఫ్ ప్రకటించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఎఫ్ వై 21లో 23,000 మందికి పైగా ఏజెంట్ సలహాదారులను నియమించుకోనుంది. మాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి. విశ్వనాథ్ ఒక ప్రకటనలో ఇలా.. "మా ఏజెన్సీ శ్రామిక శక్తి డిజిటల్ నియామక ప్రయాణం మా ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి మాత్రమే కాదు, మొత్తం ఆన్ బోర్డింగ్ ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా, వేగంగా సమర్థవంతంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి ఉపయోగపడుతుందని నిర్ధారించింది" అని అన్నారు. డిజిటల్ నియామక ప్రక్రియ కింద మాక్స్ లైఫ్ నాణ్యమైన ఏజెంట్ నియామకాన్ని ప్రారంభించడానికి సమగ్రమైన 'వెబ్-టు-రిక్రూట్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది. దీంతో పాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 'మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్' ప్రారంభించింది. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. ఇవి ఇతర ఏజెంట్లకు స్ఫూర్తినిస్తాయి. -
టికెట్ల బుకింగ్‌కు ఇక ఏజెంట్లతో పనిలేదు: గోయల్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు టికెట్ల కోసం ప్రైవేట్ విక్రేతలు, ఏజెంట్లపై ఆధారపడే అవసరం ఇకపై ఉండదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో రైల్వే శాఖ గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన కొద్ది నిమిషాల్లోనే అక్రమమార్గాల్లో బుక్ చేసుకునే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్మార్ట్ఫోన్ల సాయంతో ప్రయాణికులే స్వయంగా టికెట్లను బుక్ చేసుకుంటున్నందున ఇకపై ఏజెంట్ల అవసరం లేకుండా చేస్తామన్నారు. సొంతంగా బుక్ చేసుకోలేని వారు ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లవచ్చని తెలిపారు. రైల్వేల్లోకి ప్రైవేట్ భాగస్వామ్యంతో వచ్చే 12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. -
ఏజెంట్లకు మావోయిస్టు బెదిరింపు లేఖ!
సాక్షి, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన అమాయకులైన ఆదివాసీ వలస కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భద్రాచలానికి చెందిన కొందరు.. ఏజెంట్లుగా అవతారమెత్తి వారి శ్రమను డబ్బు రూపంలో దోచుకుంటున్నారని సీపీఐ (మావోయిస్టు) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ జోనల్ సెక్రటరీ గణేశ్ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. సదరు ఏజెంట్లు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం భద్రాచలంలోని పత్రిక కార్యాలయాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖలను కవర్లో పెట్టి విడిచి వెళ్లారు. లేఖలోని సారాంశం.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు పని కల్పిస్తామని వలస కార్మికులుగా మార్చి భద్రాచలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏజెంట్లుగా మారారని, ఈ ఆదివాసీలను పనులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. వారి శ్రమను పెట్టుబడిగా మార్చుకొని ఈ ఐదుగురు వ్యక్తులు భద్రాచలంలో తమ ఆస్తులను విపరీతంగా పెంచుకుంటున్నారని, వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని తెలిపారు. అమాయక ఆదివాసీలకు కూలీ పనులు చూపెడతామంటూ ఇక్కడకి రప్పించి, వారిని పలు పనులకు గుండుగుత్తగా అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆదివాసీలకు భాష రాకపోవడం, కూలీ పనులకు ఎంత సొమ్ము చెల్లిస్తారో తెలియకపోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు పనికల్పించే వారితో కుమ్మక్కై వారికి చెల్లించే కూలీ సొమ్మును కూడా ఏజెంట్లే తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్ని సమయాల్లో కూలీ డబ్బులు అడిగితే ఈ ఆదివాసీ కూలీలను పశువుల కన్నా హీనంగా కొట్టి హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఐదుగురు ఏజెంట్ల ఇంటి ఆవరణలో ఉన్న షెడ్లలో బంధించి సగం డబ్బులే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు రూ.కోట్లతో భవంతులు నిర్మించుకుంటున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు
వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల: ‘కంపెనీలో పనిలేదు.. మిమ్మల్నిభరించే శక్తి కంపెనీకి లేదు.. ఇప్పటికే ఆరు నెలలుగా పనిలేకున్నా జీతాలు ఇస్తున్నాం.. ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు. ఎవరి దేశానికి వారు వెళ్లిపోండి.. అని ఖతార్‌లోని కంపెనీ యాజమాన్యం చెప్పినప్పుడు 2200 మంది కార్మికుల గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉన్న పళంగా ఇంటికి పొమ్మంటే ఎలా అని అందరం బాధపడ్డాం. ఒక్క ఇండియా వాళ్లే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, పిలిప్పీన్ దేశాలకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. అందరిదీ అదే పరిస్థితి. ఖతార్‌లోని చట్టాలపై అవగాహన ఉన్న వారిని ఆశ్రయించాం. ఆ దేశంలో ఉపాధి అవకాశాలను అధ్యయనం చేశాం. ఓ పరిష్కారం దొరికింది. మా వద్ద పని లేదని.. మా కార్మికులు ఎక్కడ పనిచేసినా మాకు అభ్యంతరం లేదని మేం పనిచేస్తున్న కంపెనీ ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇస్తే చాలు. బయట పని దొరుకుతుందనే విషయం తెలిసింది. ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల్లో ఎన్ఓసీ లభించింది. అందరికీ ఆ దేశంలోనే మరో కంపెనీలో ఉద్యోగాలు దొరికాయి’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన తోట ధర్మేందర్ చెప్పారు. ధర్మేందర్ ప్రస్తుతం ఖతార్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓఎఫ్‌డబ్ల్యూఏ)కు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే క్రమంలో కార్మికులు మోసాలకు, కష్టాలకు గురికాకుండా వలస జీవుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఖతార్‌లో ఉండే ధర్మేందర్ అక్కడి పరిస్థితులు.. ఓఎఫ్‌డబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... గల్ఫ్‌కు వెళ్తే చాలు.. బతికేయవచ్చనే భావన వీడాలి. ఆ దేశాల్లో సంపాదన అంత సులువుకాదు. ఇండియాలో ఉండగానే ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధించాలి. అది ఏ పని అయినా సరే. ఆ పనిలో పూర్తి పట్టు సాధించాలి. పనిలో నైపుణ్యం లేకుండా ఏదో ఒక పని చేస్తాంలే అనుకుని గల్ఫ్‌కు వెళ్తే చేతులారా కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. సులువైన పనికావాలని ఏజెంట్లతో చెప్తారు. దీనిని అలుసుగా తీసుకుని ఏజెంట్లు సులువైన పనే దొరుకుతుందని పంపిస్తారు. ఆ దేశాల్లో కష్టమైన పని ఎదురైతే తట్టుకోలేక ఇబ్బందులు పడతారు. ఏ దేశం వెళ్తున్నామో.. ఆ దేశ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి భాష, చట్టాలు తెలిసి ఉండాలి. ఆ దేశాల్లోని పరిస్థితులపై పట్టు సాధిస్తే నైపుణ్యంతో రాణిస్తారు. నేనూ కష్టాలు అనుభవించా.. నేను పదో తరగతి వరకే చదువుకున్నా. 2007లో తొలిసారి మస్కట్ వెళ్లాను. రూ.1.20 లక్షలు వీసాకు వెచ్చించి డీజిల్ పంప్ ఆపరేటర్‌గా పనిలో కుదిరాను. ఏజెంట్ 120 రియాళ్లు జీతం అన్నాడు. ఆయన మాటలు నమ్మి పోతే.. అక్కడికి వెళ్లాక రూ.60 రియాళ్లు ఇచ్చారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలేవి. వీసాకు చేసిన అప్పులు తీర్చడానికే ఏడాదిన్నర పట్టింది. ఖాళీ సమయంలో అక్కడే టవర్ క్రేన్ ఆపరేటింగ్ నేర్చుకున్నా. అక్కడే లైసెన్స్ పొందాను. మళ్లీ ఖతార్ వెళ్లాక మంచి వేతనంతో స్థిరపడ్డా. హక్కులు, చట్టాలగురించి తెలుసుకున్నా.. ఢిల్లీకి చెందిన రాజీవ్‌శర్మ ఖతార్లోకలిశాడు. ఆయన కలిసిన తరువాత అక్కడ పనిచేసే వలస కార్మికుల హక్కులు.. కనీస వేతన చట్టాల గురించి తెలిసింది. బిల్డింగ్అండ్ వుడ్ వర్కర్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యూఐ)లో చేరాం. వలస కార్మికుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఆయన భారత రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడి మన వారికి న్యాయ సహాయం అందిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇండియాలోని అన్ని రాష్ట్రాల వారితో కలిసి ఓవర్సీస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓఎఫ్‌డబ్ల్యూఏ)ను ఏర్పాటు చేశాం. తెలంగాణలోని పలు జిల్లాల వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఖతార్‌లోని ఎంబసీ అధికారులతో కలిసి పనిచేస్తాం. ఎవరికైనా కంపెనీ జీతాలు సక్రమంగా ఇవ్వకుంటే మాట్లాడి ఇప్పిస్తాం. వలస కార్మికులకు హెల్త్‌కార్డులు ఇప్పించాం. కార్పొరేట్ వైద్యసేవలు, అదనపు పని గంటలకు అదనపు వేతనం, కంపనీలో లాండ్రి వసతులు కల్పించాం. ఇలా వలస కార్మికుల సంక్షేమం కోసం మా సంస్థ పనిచేస్తుంది. వివిధ కంపనీల్లో మా సంస్థ చొరవతో పది వేల మందికి జీతాలు పెరిగాయి. రెండేళ్లకోసారి స్వస్థలాలకు వచ్చే వారికి జీతంతో కూడిన సెలవులు ఇప్పించడం, విమాన టిక్కెట్లు ఇప్పించడం వంటి సదుపాయాలు కల్పించాం. ఎవరైనా కార్మికులు చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేశాం. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లతో కలిసి వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. గల్ఫ్‌కు కొత్తగా వెళ్లే వారికి.. వెళ్లాలని ఆలోచనలో ఉన్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. ఏ నైపుణ్యమూ లేకుండా ఇక్కడైనా.. ఎక్కడైనా రాణించలేరు. పని నేర్చుకోండి.. పైసలు సంపాదించుకోండి. సబ్ ఏజెంట్లను ఆశ్రయించవద్దు గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు సబ్ ఏజెంట్లను ఆశ్రయించవద్దు. వారు కమీషన్ కోసం పనిచేసే బ్రోకర్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా లైసెన్స్డ్ ఏజెన్సీలు, బ్రాంచీలు ఉన్నాయి. తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉన్న రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారానే వెళ్లాలి. గల్ఫ్‌లోని ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాకు మన కరెన్సీలో రూ.30వేలు గానీ, 45 రోజుల వేతనంగానీ మాత్రమే చెల్లించాలి. వీసా డబ్బులను విధిగా ఏజెంట్ బ్యాంకు ఖాతాలోనే వేయాలి. నేరుగా నగదు చేతికి ఇవ్వవద్దు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక రిక్రూటింగ్ ఏజన్సీ ‘టాంకాం’ కూడా ఉంది. దాని ద్వారా కూడా గల్ఫ్ దేశాలకు వెళ్లవచ్చు. ఏ దేశానికి వెళ్లినా.. వీసా కాపీ, కంపెనీ వివరాలు, ఫోన్ నంబరు తప్పని సరిగా ఇంటి వద్ద ఉంచాలి. -
లైసెన్స్డ్ ఏజెన్సీల ద్వారానే వీసా పొందాలి
సిరిసిల్ల: విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందేందుకు వెళ్లే వారు ఎవరైనా భారత ప్రభుత్వం ద్వారా లైసెన్స్ కలిగిన ఏజెన్సీల ద్వారానే వీసా పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఏఆర్ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెంట్ మేనేజర్ మహ్మద్ రఫీ చెప్పారు. దేశ వ్యాప్తంగా 1419, తెలంగాణ రాష్ట్రంలో 64 లైసెన్స్డ్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరుగుతున్న మోసాల నేపథ్యంలో.. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విజిట్ వీసాలపై వెళ్లవద్దు. ఈ మధ్య కాలంలో విజిటింగ్ కం, ఎంప్లాయ్మెంట్ అంటూ కొందరు మోసం చేస్తున్నారు. విజిట్ వీసా ఖరీదు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు, విమాన టిక్కెట్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. కానీ గ్రామీణుల వద్ద రూ.50వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లాక అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం. దీని మూలంగా గల్ఫ్‌కు వెళ్లే వ్యక్తికి భారత ప్రభుత్వం కల్పించే ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) వర్తించకుండా పోతుంది. అక్కడ జరిగే ఇంటర్వ్యూల మూలంగా కొందరికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుండగా.. చాలా మందికి కంపెనీ వీసాలు లభించక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. తెలంగాణ నుంచి నెలకు 200 నుంచి 300 మంది విజిటింగ్ కం ఎంప్లాయ్మెంట్ వీసాలపై వెళ్తున్నట్లు సమాచారం. కంపెనీ వీసా పొందితే.. పని గంటలు, జీతం, ఇతర సదుపాయాలు ముందే చెబుతారు. నచ్చితేనే వెళ్లవచ్చు. వీసాకు ఇంత చెల్లించాలని నిర్ధిష్టంగా ఉంటుంది. ఇమిగ్రేషన్ ద్వారా రక్షణ లభిస్తుంది. బీమా సదుపాయాలు ఉంటాయి. వీసాలు వెబ్సైట్లో ఉండవు.. ఎయిర్‌పోర్టులో క్లీనింగ్, పెట్రోల్ బంక్‌లో పని, హాస్పిటల్లో, హోటల్లో పని అని.. జీతం రూ.30వేలు రూ.50 వేలు అంటూ.. ఊరు పేరు లేని వారు వాట్సప్‌లో, ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు. దీన్ని నమ్మవద్దు. వీసాలు ఎప్పుడూ వెబ్సైట్లో ఉండవు. గ్రామీణులను నమ్మించేందుకు ఇలాంటి మోసాలు చేస్తారు. లైసెన్స్ ఉన్న ఏజన్సీల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. లైసెన్స్ కలిగిన ఏజన్సీలు చాలా ఉన్నాయి. వారి ద్వారానే వీసా పొందితే రక్షణ ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు. వీసాల సమాచారం హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీవోఈ) ఆఫీస్‌లో లభిస్తుంది. వీసా నకిలీదా.. అసలైనదా.. అక్కడ తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక్క పనిలో నైపుణ్యం సంపాదించి గల్ఫ్ దేశాలకు వెళ్తే మెరుగైన ఉపాధి ఉంటుంది. ఏ దేశం వెళ్తున్నామో.. ఆ దేశంలోని చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. గల్ఫ్ ఏజంట్లను నిలదీయాలి కోరుట్ల: అధిక లాభాల కోసం అడ్డదారిలో కార్మికులను దేశం దాటిస్తున్న గల్ఫ్ ఏజంట్లను నిలదీయాలి. విజిట్ కం ఎంప్లాయ్మెంట్ పద్ధతిలో కార్మికులను అక్రమంగా తరలిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే కార్మికులకు ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీని ఈ–మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు చేసుకుని క్లియరెన్స్ పొందాలి. ఈ బీమా పాలసీతో రూ.10లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కార్మికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజంట్లు అక్రమ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి గల్ఫ్‌కు పంపుతున్నారు. ముంబాయి ఏజంట్ల ద్వారా స్కైప్ పద్ధతిన రహస్య ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను పోలీసులు అడ్డుకోవాలి. ఎమిగ్రేషన్ చట్టంపై పోలీసులకు సరైన అవగాహన లేకపోవడంతో గల్ఫ్ ఏజంట్ల మోసాలు కొనసాగుతున్నాయి. కార్మికులు వలస వెళ్లే సమయంలో సాయం, సలహాలు కావాలన్నా 9866853116 నంబర్‌కు, ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబరు 1800113090కు కాల్ చేయవచ్చు. ఏజెంట్లపై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా వారి పరిధిలోని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి కేసులు నమోదు చేస్తారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ముందుగా వీసాలపై అవగాహన పెంచుకోవాలి. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే వీసా పొందాలి. సబ్ ఏజెంట్లు, గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మవద్దు. ముందుగా అన్నీ నిర్ధారించుకోకుండా.. ఎవరికీ డబ్బులు కట్టవద్దు. పాస్‌పోర్టు ఇవ్వద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంతో పోలిస్తే గల్ఫ్ మోసాలు తగ్గాయి. గల్ఫ్ బాధితుల కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. -
రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : రేల్వేవినియోగదారుల కోసం ఇటీవల అనేక సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్న ఇండియన్ రైల్వే తాజాగా మరో తీపి కబురు అందించింది. తన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ)అధీకృత టికెటింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే విషయంలో సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. అంటే ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఓటీపీ ఆధారంగా వెంటనే,సంబంధిత నగదును ఖాతాదారుని అకౌంట్లో జమ చేయనుంది. ఐఆర్సీటీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇ-టిక్కెట్ల విషయంలో పారదర్శకత , యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకురావడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా ఈ విధానంలో ప్రయాణికుల రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో ఈ ఓటీపీ వస్తుంది. దీంతో పాటు రిఫండ్ అమౌంట్ వివరాలు కూడా వస్తాయి. అది ఏజెంట్లకు చూపిస్తే వెంటనే డబ్బు వాపస్ ఇచ్చేస్తారు. అయితే ఈ సిస్టమ్ ఐఆర్సీటీసీ అధికారిక ఏజెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరి ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. టికెట్ డబ్బులు రిటన్ పొందాలంటే.. ఇ-టికెట్లకు మాత్రమే ఓటీపీ రిఫండ్ రూల్స్ వర్తిస్తాయనే విషయాన్ని గమనార్హం. సరైన మొబైల్ నంబర్‌ను ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్‌కు వినియోగదారుడు అందించాలి. బుకింగ్ సమయంలో ఏజెంట్లు సంబంధిత నంబరును సరిగ్గా రికార్డ్ చేశారో లేదు చెక్ చేసుకోవాలి. ఈ కొత్త ఓటీపీ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఎంత రిఫండ్ వస్తుందో వెంటనే తెలిసి పోతుందని రైల్వే శాఖ వెల్లడించింది. -
వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌కు పంపిస్తామని నమ్మించిన ఏజెంట్లు అమాయకులను నిండా ముంచారు. రూ.3 కోట్లకు పైగా టోకరా వేశారు. వీసాల పేరిట ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది నిరుద్యోగులను వంచించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాధితుడు రాజు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఇజ్రాయెల్ వీసాల మోసం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌లోని గాయత్రీనగర్, డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు ఇజ్రాయెల్ వెళ్లడానికి వీసాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించారు. ఆరు నెలల కింద ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు. నిరుద్యోగులను ఇంటర్వ్యూల పేరిట ఢిల్లీ, బెంగళూరుకు తీసుకెళ్లి వీసాల ప్రక్రియ ప్రారంభించినట్లు నమ్మించారు. అయితే, ఆర్నెల్లు అవుతున్నా వీసాలు ఇవ్వక పోవడంతో తాము చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని కోరితే భౌతిక దాడులకు పాల్పడినట్లు బాధితులు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వీసాల పేరిట నమ్మించి మోసగించిన ఏజెంట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని వారు కోరారు. -
ఉద్యోగం పేరుతో మహిళను దుబాయ్‌కి పంపి..
సాక్షి, కర్నూలు : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దూరపు బంధువుల ద్వారా కర్నూలు నగరానికి చెందిన ఓ మహిళను ఉద్యోగం పేరుతో దుబాయికి పంపించాడు. అంతే అక్కడ చిత్రహింసలకు గురైన బాధిత మహిళ తన దీనస్థితిని వాట్సాప్‌లో పెట్టడంతో స్పందించిన పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రప్పించారు. వివరాలు.. నగరంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చిత్తారివీధికి చెందిన మున్నీ అనే మహిళ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో కడపలో ఉన్న బంధువులు అక్కడే ఉన్న మొహినుద్దీన్ అనే పాస్‌పోర్టు ఏజెంటును సంప్రదించి మున్నీకి దుబాయిలో ఉద్యోగం చూపించాలని విన్నవించారు. వివరాలు సేకరించిన ఆ ఏజెంట్ కర్నూలులోని మహిళ ఇంటికి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇటీవల దుబాయి పంపించాడు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి యజమాని మానసికంగా వేధించడంతో బాధితురాలు మున్నీతో పాటు ఇదే సమస్యను ఎదుర్కొంటున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో ముగ్గురితో కలిసి వాట్సాప్ ద్వారా వారి బాధలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఒకటో పట్టణ పోలీసులను ఆదేశించారు. పోలీసులు విషయాన్ని దుబాయిలోని భారత కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితురాలిని ఇండియాకు రప్పించారు. ఇదే సమయంలో కడపలోని బాధితురాలి బంధువులు ఏజెంట్ మోసంపై పాల్పడి తమ కూతురును అమ్మేశారని పోలీసులకు గత నెల 26న ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మోసగాడిని కడపలో అరెస్టు చేసి ఇక్కడికి తీసుకు వచ్చినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. -
మనవాళ్లే మోసం చేస్తున్నరు..
సాక్షి, సిరిసిల్ల: ఉపాధి కోసం నిరీక్షిస్తున్న యువకులకు నకిలీ గల్ఫ్ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. నకిలీ వీసాలను అంటగడుతూ నిలువునా మోసం చేస్తున్నారు. లైసెన్స్ పొందిన గల్ఫ్ ఏజెంట్లు కొద్ది మందే ఉంటే.. లైసెన్స్‌లేని వాళ్లు ఊరుకొక్క రు ఉన్నారు. కొందరు లైసెన్స్ ఏజెంట్లు సైతం సబ్ ఏజెంట్లను నియమించుకుని అక్కరకు రాని వీసాలు అంటగడుతున్నారు. గల్ఫ్ దేశాలకు చెందిన వివిధ కంపెనీలు సైతం సులభతరంగా వీ సాలు ఇస్తూ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది నకిలీ ఏజెంట్లకు కాసులు కురిపిస్తోంది. వేతనం అధికమని, పనితక్కువగానే ఉం టుందని నకిలీ ఏజెంట్లు అబద్ధపు ప్రచారంతో నిరుద్యోగ యువతను రొంపిలోకి దింపుతున్నారు. ఖతర్‌లో వీసాల మోసాలు.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోయపల్లికి చెందిన ముత్తన్న కోట ఖతర్‌లో కాంట్రాక్టర్. పనులు చేయించుకునే అతడు.. వలస జీవులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడనే అపవాదు ఉంది. తాజాగా మూడు నెలలుగా పని చేయించుకుంటూ చిల్లిగవ్వకూడా ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జీతం ఇవ్వకున్నా.. కనీసం బయటపని చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా వేధింపులు తప్ప మరో మార్గం కనిపించడంలేదు. ఇళ్లకు చేరిన వలస జీవులు ఏజెంట్ల మాటలతో మోసపోయిన వేములవాడకు చెందిన గొర్ల మురళి(42), కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య, కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మొకెనపల్లి రాజయ్య ఎంబసీ అధికారులు, ఖతర్‌లోని తెలంగాణ ప్రతినిధుల సాయంతో శుక్రవారం స్వగ్రామాలకు చేరారు. అంతకుముందు పది మంది యువకులు సైతం ఇండియా చేరారు. ఇంకాచాలా మంది ఏం చేయాలో తెలియక అక్కడే మగ్గిపోతున్నారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపారు. నకిలీ ఏజెంట్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గల్ఫ్ ఏజెంట్లు వీసాల దందా మానేసిన నకిలీలు.. ఇతర పనుల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు పోలీసుల నిఘా తగ్గింది. నకిలీ ఏజెంట్లు వీసాల దందా ప్రారంభించారు. అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెంట్‌కు ఎనభై వేలు ఇచ్చిన బావుసాయిపేటకు చెందిన ఏజంట్ అంజయ్యకు ఎనభైవేల రూపాయలు ఇచ్చి ఖతర్ పోయిన. జూలై 7వ తేదీకి నాలుగు నెలలు. అక్కడికి పోయిన కాడినుంచి పని చేయించుకున్న ఏజెంట్ జీతం ఇవ్వలేదు. నాకు భార్య సావిత్రి, ఇద్దరు కొడుకులు ఉన్నరు. అప్పు చేసి ఖతర్ పోతే.. జీతం రాక అప్పులో కూరుకపోయిన. రజని మేడమ్, సంతోష్ సార్లు సాయం చేసి ఎంబసీ అధికారుల సాయంతో మా ఇంటికి పంపించిండ్రు. – మొకెనపల్లి రాజయ్య, పల్లిమక్త జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు మనవాళ్లను మనవాళ్లే మోసం చేస్తున్నారు. ఖతర్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనవాళ్లే పనిచేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫోరం(ఐసీడీఎఫ్)గా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సాయం చేయిస్తుంటాం. ఇప్పటికే చాలామందికి సాయం చేసి ఇండియా పంపించాం. ఎవరూ ఏజెంట్ల మాటలు నమ్మి మోస పోవద్దు. కంపెనీ వీసాలు, లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. – రజని, ఐసీడీఎఫ్, ప్రతినిధి -
కౌంటింగ్ రోజు తీసుకోవ్ల్సిన జాగ్రత్తలపై వైఎస్ఆర్సీపీ ఏజెంట్లుకు శిక్షణ
-
అసంతృప్తి రెరా
సాక్షి, హైదరాబాద్: రెరా లక్ష్యం తప్పుతోంది! నాణ్యత, గడువు, పారదర్శకత, ధర, క్రయ విక్రయాల్లో స్పష్టత, డెవలపర్లు, ఏజెంట్ల వివరాలు.. ఇలా ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంచాల్సిన రెరా.. అసలు లక్ష్యం దారి తప్పుతోంది. దీంతో కొనుగోలుదారులకు భరోసా కలిగించాల్సిన రెరా అసంతృప్తిని మిగులుస్తోందని కొనుగోలుదారుల సం ఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2017లో నోటిఫై చేసింది. తొలుత నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. కానీ, ఆశించిన స్థాయిలో డెవలపర్ల నుంచి స్పందన లేకపోవటంతో ప్రతి 15 రోజుల కొకసారి గడువు తేదీని పొడిగిస్తుంది. సరైన సమయంలో నమోదు చేసుకోని డెవలపర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోకుండా ఇలా పలుమార్లు గడువును పొడిగించడం సరైంది కాదని.. ఇలా అయితే తెలంగాణలో రెరా అమలు సంతృప్తికరంగా ఉండదని సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెరా ముందు.. తర్వాత! 2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 30 మధ్య అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో నమోదు చేసుకోవాలి. నమోదు చేశాకే ప్రకటనలు, అమ్మకాలు చేయాలి. మరి, 2017 జనవరి 1 కంటే ముందు అనుమతి పొందిన ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఏంటి? ఆయా ప్రాజెక్ట్‌లను అడ్వర్టయిజింగ్ చేస్తే వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు, నంబర్లు, తేదీలు ప్రకటనలో తప్పకుండా ప్రకటించాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్) డిమాండ్ చేసింది. అప్పుడే కొనుగోలుదారులకు ఆ ప్రాజెక్ట్ రెరాకు ముందా? లేక తర్వాతి ప్రాజెక్టా అనేది స్పష్టత వస్తుందని పేర్కొంది. వసూళ్లకే రెరా.. ప్రస్తుతం టీ– రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, ప్రమోటర్లు, ఏజెంట్ల ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, ప్రాజెక్ట్ నిర్మాణ స్థితి గతులు, క్రయ విక్రయాల సంఖ్య, ప్రాజెక్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు, ప్రమోటర్ల ఆదాయ వివరాలు వంటి కీలక సమాచారం ఏదీ కూడా అందుబాటులో లేదని యూ–ఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్ జనరల్ సెక్రటరీ బీటీ శ్రీనివాసన్ తెలిపారు. టీ–రెరాను జస్ట్ ప్రాజెక్ట్‌ల నమోదుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్టుందని పేర్కొన్నారు. నమోదు రుసుములు, జరిమానాలను వసూలు చేసే విభాగంగా రెరా మిగిలిందని ఆరోపించారు. వివరాలూ అసంపూర్తిగానే.. టీ– రెరాలో ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు, ఏజెంట్లు నమోదు చేసుకున్నారు? ఎస్క్రో బ్యాంక్ ఖాతా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వివరాలు ఏవీ కూడా కొనుగోలుదారులకు అందుబాటులో లేవు. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు ప్రతి మూడు నెలలకొకసారి అప్డేట్ చేయాలి. ఎన్ని అమ్ముడుపోయాయి? ఇంకా ఎన్ని ఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయి? వంటి వివరాలేవీ అప్డేట్ చేయట్లేదు. గృహ కొనుగోలుదారులకు ఈ వివరాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టేటస్, ప్రాంతం అభివృద్ధిని అంచనా వేసుకొని కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకుంటారు.్డ జరిమానా వివరాల్లేవ్! గడువులోగా ప్రాజెక్ట్‌లను నమోదు చేయని డెవలపర్లకు రూ.2 లక్షలు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంత మంది డెవలపర్లు జరిమానా కట్టారు? ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలేంటి? వంటి సమాచారమేదీ కూడా టీ–రెరాలో అందుబాటులో లేదు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఫిర్యాదులు, వాటి పత్రాలు, జడ్జిమెంట్ కాపీలు వంటివేవీ వెబ్సైట్లలో లేవు. ఈ వివరాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటే ఆయా ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు అర్హత ఉండి మరీ చేసుకోలేదని.. అయినా అమ్మకాలు చేస్తున్నారని కొనుగోలుదారులకే తెలిసిపోతుందని.. దీంతో ఆయా ప్రాజెక్ట్లల్లో కొనుగోలు చేయాలా? వద్దా? అనేది వాళ్లే నిర్ణయించుకునే వీలుంటుంది. -
గల్ఫ్‌పేరుతో ఘరానా మోసం
సాక్షి, జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిరుద్యోగ యువతను ఉపాధినిమిత్తం విదేశాలకు పంపిస్తామంటూ నమ్మించి అందినకాడికి దండుకుంటున్నారు. పొంతనలేని పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. మరికొంతమంది గల్ఫ్‌పేరుతో ఉద్యోగమిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ఏజెంట్ మోసం చేశాడని రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ఏజెంట్ ఇంటిముందే బాధితులు ధర్నా నిర్వహించారు. కుమ్మరిపల్లిలో ఏజెంట్ మోసం చేశాడని ఓ బాధితుడు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది బాధితులు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సుమారు 320మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా నిర్వహిస్తున్నారు. ట్రావెల్స్ పెట్టుకుని గల్ఫ్‌దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొంతమంది ఇంటర్వ్యూలకు హాజరై పాస్పోర్టుతో పాటు కొంత మేరకు డబ్బు చేతుల్లో పెట్టి మోసాలకు గురవుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు ట్రావెల్స్‌లపై మూకుమ్మడి దాడులు చేసి పాస్‌పోర్టులు, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసి కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు నిఘా పెట్టినా ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు స్పీడ్ పెంచారు. గ్రహించిన గల్ఫ్ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో పోలీసుల కళ్లుగప్పి గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిబంధనల సడలింపుతో 8 మందికే లైసెన్స్‌లు ట్రావెల్స్‌ల కోసం కేంద్ర విదేశీ వ్యవహారల శాఖ సడలింపు ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు 8 ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. రూ.50 లక్షలు డిపాజిట్ చేసిన ట్రావెల్స్ వారికి ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండగా రూ.8 లక్షలు చెల్లించిన వారికి సంవత్సరానికోసారి రెన్యువల్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి ఎవరికీ అనుమతులు లేకుండా ముంబాయ్, చెన్నై, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి గల్ఫ్ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ పనిచేస్తున్న ఏజెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్ పాస్పోర్టుతో పాటు కొంత మేరకు వీసా అడ్వాన్స్ తీసుకుంటున్నారు. పోలీసుల నజర్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై నజర్ పెట్టారు. దాదాపు ఆరునెలల కాలంలో సుమారు 72కి పైగా గల్ఫ్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మాత్రం మార్పు రావడం లేదు. నిరుద్యోగుల నుంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. పాస్‌పోర్టులు స్వాధీనం.. వివిధ దేశాల్లో ఉద్యోగాలున్నాయని, సబ్ ఏజెంట్ల వాట్సప్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్న ట్రావెల్స్ ఏజెంట్లు ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల నుండి మీరు ఎంపికయ్యారని, పాస్‌పోర్టులు తీసుకుని నకిలీ వీసాలు అప్పగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుకున్న సమయానికి వీసా రాకపోవడంతో తమకు పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచితే వారి వద్ద నుండి సుమారు రూ.10వేల నుండి రూ.20వేలవరకు ట్రావెల్స్ యజమానులు వసూలు చేస్తున్నారు. మోసపోవద్దు జగిత్యాల ప్రాంతంలో చాలా మంది యువకులు గల్ఫ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లేవారు ప్రభుత్వం గుర్తించిన సంస్తల ద్వారానే విదేశాలకు వెళ్లాలి. ఇతర ప్రయివేటు వ్యక్తులను, గల్ఫ్ ఏజెంట్లను నమ్మి యువకులు మోసపోవద్దు. చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. అనుమతి లేని గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం . – ప్రకాశ్, జగిత్యాల పట్టణ సీఐ -
ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ క్రియేట్ చేస్తున్నారా?
సాక్షి న్యూఢిల్లీ: ఆన్లైన్లో రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో వినియోగదారులకు ఊరట. రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐర్సీటిసి) త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కస్టమర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను మరింత కఠినం చేయనుంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఏజెంట్‌గా పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లతో నకిలీ ఐడీలనుసృష్టించి, తద్వారా తత్కాల్ సహా, ఆన్లైన్లో టికెట్ విక్రయాల్లో అక్రమ దందాకు చెక్ చేపట్టేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఆర్సీటీసీలో యూజర్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన నిబంధలను పటిష్టం చేయనుంది. వెబ్సైట్లో యూజర్ల నమోదుకు మరిన్ని గుర్తింపులను కోరనుంది. ఐఆర్సీటీసీ వినియోగదారుని ఐడి,పాస్వర్డ్, మొబైల్ నంబర్‌తోపాటు ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి ఇతర ముఖ్యమైన ఐడీలను కూడా వినియోగదారుని కోరనుంది. బినామీ పేర్లతో నకిలీ ఐడీలతో ఏజెంట్లు పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్న వైనం తెలిసిందే. వేలాది నకిలీ యూజర్ ఐడిల ద్వారా ఇ-టికెట్లను బ్లాక్ చేసి, వాటిని అధిక ధరకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు అధికారులు దృష్టి సారించారు. -
నవంబర్ 31 వరకు రేరా గడువు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రేరా)లో నిర్మాణంలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. గడువు తర్వాత రిజిస్ట్రేషన్ చేయని ప్రాజెక్టులపై నిర్మాణ వ్యయంలో 10 శాతాన్ని రేరా అథారిటీ జరిమానాగా విధించనుంది. స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రేరా చట్టం 2017 జనవరి 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. 500 చదరపు మీటర్లకు మించి లేదా 8 యూనిట్లకు మించిన గృహ/వాణిజ్య ప్రాజెక్టులు/ లే అవుట్లను తప్పనిసరిగా రేరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. 2017 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 31 మధ్య కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కోసం ప్రభు త్వం నవంబర్ 30 వరకు మూడు నెలల ప్రత్యేక గడువు ఇచ్చింది. గత నెల 31న రేరా అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 269 మంది స్థిరాస్తి వ్యాపారులు, 153 మంది ఏజెంట్లు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. అదే విధంగా నాలుగు స్థిరాస్తి ప్రాజెక్టులకు అనుమతి కోరుతూ దరఖాస్తులు రాగా, వాటిలో రెండు ప్రాజెక్టులను రేరా అథారిటీ ఆమోదించింది. రేరా అథారిటీ వెబ్సైట్ (www.rera. telangana.gov.in)లో ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి నిర్ణీత రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సభ్య కార్యదర్శి, డీటీసీపీ విద్యాధర్ సూచించారు. -
అమ్మకోసం ఇంకెన్నాళ్లు..!
సాక్షి, కడప : అమ్మకోసం నిరీక్షణ తప్పడం లేదు...చిన్నారులకు కొంచెం ఊహ తెలిసే సమయానికి చూడాలనుకున్నా.. తల్లి కనుచూపు మేరలో కనిపించలేదు. ఎక్కడో దేశం కాని దేశంలో.. కుటుంబ భారం మోయడానికి వెళ్లిన తల్లి సేఠ్ కబంధ హస్తాల్లో చిక్కుకుని బయట పడలేకపోతోంది. ఇక్కడ చూస్తే దయనీయ స్థితి... ఒక వైపు తండ్రి దూరం .. మరోవైపు నానమ్మ లేక.. అమ్మ వస్తుందో రాదో తెలియక చిన్నారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక్కడ చిన్నారులను చూసుకోవడం తాతయ్య (అబ్బ)కు తలకుమించిన భారంగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు చిన్నారులతోపాటు కుటుంబానికి అన్నీ తానై చేసి పెడుతున్న నానమ్మ రామసుబ్బమ్మ జూన్ 13న పాముకాటుతో తనువు చాలించింది. ఇక పిల్లలతోపాటు సరిగా నడవలేక కట్టె సాయంతో నడుస్తున్న పెద్దాయన వెంకట రమణయ్య పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇదంతా గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నారుల వ్యధాభరిత గాధ. అమ్మ కోసం నిరీక్షణ అమ్మకోసం దాదాపు మూడేళ్లుగా చిన్నారులు నిరీక్షిస్తూనే ఉన్నారు. తల్లి పార్వతమ్మను చూడాలని.. కలుసుకోవాలని వనజ, రెడ్డి నాగేంద్ర, శైలజ, సునీల్‌లు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వారు ఇప్పుడు కొంచెం ఊహ తెలిసిన పిల్లలు కావడంతో అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కుటుంబం కోసం కష్టాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని చిన్నారుల తల్లి పార్వతమ్మ కువైట్‌కు వెళ్లింది. దాదాపు మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె కొద్దిరోజుల వరకు ఎలా ఉందో కూడా సమాచారం లేని పరిస్థి. ఈ నేపథ్యంలో పార్వతమ్మ అత్త రామ సుబ్బమ్మ 2017 సంవత్సరం మే నెలలో చిన్నారులతో కలిసి వచ్చి అప్పటి కలెక్టర్ బాబూరావునాయుడును కలిసి పార్వతమ్మ ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంది. అంతేకాకుండా స్వదేశానికి పిలిపించాలని మొర పెట్టుకుంది. దీంతో ఏజెంటు ద్వారా అక్కడి సేఠ్‌తో మాట్లాడి పార్వతమ్మతో కుటుంబ సభ్యులను మాట్లాడించారు. అయితే పార్వతమ్మ కూడా అక్కడ సంతోషంగా లేకపోగా కష్టాలను అనుభవిస్తున్నానని.. సొంతూరికి పిలిపించుకోవాలని ఫోన్ చేసిన ప్రతి సందర్భంలోనూ రోదిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అమ్మకోసం ఏజెంటు ద్వారా ప్రయత్నం గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మను స్వదేశానికి రప్పించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వెంకట రమణయ్య నాయుడు పిల్లలతో కలిసి జూన్ రెండవ వారంలో కలెక్టరేట్ మీకోసంలో అప్పుడు ఇన్‌ఛార్జి జేసీగా ఉన్న రామచంద్రారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో బంధం యాప్ ద్వారా డీఆర్డీఏలో నమోదు చేశారు. అలాగే జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడను కూడా కలిసి పార్వతమ్మ కువైట్‌లో కష్టాలు పడుతోందని, స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. ఈ పరిస్థితిలో ఎస్పీ కూడా కిందిస్థాయి సిబ్బందితో మాట్లాడి పార్వతమ్మను స్వదేశానికి పిలిపించేలా ఏజెంటు ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒక వైపు డీఆర్డీఏ బంధం యాప్ అధికారులతోపాటు మరో వైపు గాలివీడు ఎస్ఐ మంజునాథ్ కూడా సంబంధిత ఏజెంటుతో చర్చించారు. పది పదిహేను రోజుల్లోపు తల్లి పార్వతమ్మ స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని ఎస్ఐ వెల్లడించారు. అప్పటికైనా తల్లిని చూడాలనే కన్నబిడ్డల ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం. -
విదేశీ మోజులో మరో మోసం
విదేశీ మోజులో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన బుధవారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఎయిర్పోర్ట్ సీఐ మళ్ల శేషు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ) : తెలంగాణ రాష్ట్రం కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన 9 మంది యువకులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరంతా సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ కనస్ట్రక్షన్ పీటీఈ లిమిటెడ్‌లో ఉద్యోగాలొచ్చాయంటూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. విజిటింగ్‌పై విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఆసియా విమానంలో కౌలలాంపూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరారు. అయితే బోర్డింగ్ పూర్తయిన తరువాత వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. వర్క్ ఆర్డర్‌పై తొమ్మిది మందికి ఒకే నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. ఒక్కో వ్యక్తికి వేర్వేరు వర్క్ ఆర్డర్ నంబర్ ఉండాలి. అందరికి ఒకే నంబర్ ఉండడంతో 9 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటనతో నిరుద్యోగులు ఖంగుతిన్నారు. తామంతా మోసపోయామని లబోదిబోమన్నా రు. బాధితులను 6 గురు సబ్ ఏజెంట్లు మోసగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తు తం ఏజెంట్ల ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. సీహెచ్ శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు నరేష్, ప్రసాద్‌లు రూ.80 వేల చొప్పున ముట్టజెప్పారు. శంకర్ అనే ఏజెంట్‌కు తెడ్డు గంగాధర్ రూ.70 వేలు, రాజేష్‌కు కాశీమని శ్రీనివాస్, అలువల మల్లేష్లు రూ.70 వేల చొప్పున ఇచ్చారు. ఏజెంట్ మురళీకి యర్ల శ్రీను 65 వేలు, ఏజెంట్ పోతన్నకు దేవల గంగాధర్ రెడ్డి, షేక్ సైదుళ్ల రూ.65 వేలు, ఏజెంట్ ఝాన్సీకి దత్తరావు రూ.65 వేలు సమర్పించుకుని మోసపోయారు. కాగా.. సింగపూర్‌లో ఆల్ఫిన్ బిల్డర్స్ సంస్థ లేదని ప్రాథమికంగా తేలింది. దీనిపై ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగులకు కౌనెల్సింగ్ బాధితులకు సీఐ మళ్ల శేషు కౌన్సెలింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగాల మోజులో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. సరైన అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వేర్వేరు ఏజెంట్ల ద్వారా వచ్చినా.. వర్క్ ఆర్డర్ మాత్రం ఒకే వ్యక్తి వద్ద నుంచి వచ్చినట్టు గుర్తించామన్నారు. ఈ మోసానికి మూలమైన ఏజెంట్‌ను పట్టుకుంటామని విలేకరులకు తెలిపారు. -
కీలుబొమ్మగా మారిన మెహబూబా ముఫ్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందీ మాతో చేయి చేయి కలుపుతారని. కశ్మీర్లో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది. ఎక్కడో మిలిటెంట్లకు, ప్రభుత్వ సైనికులకు మధ్య కాల్పులు జరుగుతాయి. అంతే, టీవీ ఛానళ్లలో కశ్మీర్ మొత్తం తగులబడి పోతున్నట్లు చూపిస్తారు. మనమున్న పరిస్థితిని దాచేందుకు ప్రయత్నించడం లేదు. ఒక్కసారి ప్రపంచం వైపు చూడండి! ప్రతి చోటా ఏదో సమస్య ఉంటోంది. ఇక్కడ మన సమస్య ఏమిటంటే మన దేశమే మనల్ని ఒంటరి వాళ్లను చేసింది. నేను పిలవగానే మీరు రావడం ముందుగానే వసంత గాలులు వీస్తున్నట్లు ఉంది. ఇది శుభసూచకం. ఇక్కడ మనం చేయాల్సిన పని క్లిష్టమైనదే. మా తండ్రి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. కశ్మీర్‌కు ఓ పర్యాటకుడు రావడం అంటే ఇక్కడ శాంతి కోసం పెట్టుబడి పెట్టడమేనని. భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడుతున్నట్లే ఇక్కడ కూడా సైనికులు మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు మరోరకంగా మనమూ యుద్ధం చేయాల్సిందే. పర్యాటకరంగం పరిఢవిల్లేలా చేయడమే ఆ యుద్ధం. మనం దేశం నుంచి విడిపోయిన్లు భావించరాదు. అతి పెద్ద దేశంలో భాగంగానే బతుకుతున్నామన్న భావన కలగాలి’ అంటూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల శ్రీనగరంలో జరిగిన భారత పర్యాటక ఏజెంట్ల సమ్మేళనంలో ప్రసంగించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివద్ధి చేయడం ద్వారా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయన్నది ఆమె అభిప్రాయంగా స్పష్టం అవుతోంది. ఆమె తన ఉపన్యాసాన్ని కాస్త గంభీర్యంగానే ప్రారంభించినా ఆమె మాటల్లో ఆర్ద్రత, ఆవేదనతోపాటు అశక్తత కూడా కనిపించింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పర్యాటకులు రావడం అంటే రాష్ట్రంలో శాంతి స్థాపనకు అది పెట్టుబడే అని ఎప్పుడూ చెప్పేవారు. అయితే ఆయన శాంతికి భంగం కలిగిస్తున్న వారిని ఎప్పుడూ మిలిటెంట్లు అని అనలేదు. వారిని తిరుగుబాటుదారులుగానే వ్యవహరించారు. గతంలో మొహబూబా ముఫ్తీ కూడా తిరుగుబాటుదారుల సమస్య అనే మిలిటెన్సీని వ్యవహరించారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపి ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమె భాష మారినట్లు ఉంది. ఆమె పర్యాటక ఏజెంట్ల సమ్మేళనాన్ని నిర్వహించి ‘ఇయర్ ఆఫ్ విజిటింగ్ కశ్మీర్’గా నిర్ణయించిన రెండు రోజులకే ఎదురు కాల్పుల్లో పౌరులు సహా 20 మంది మిలిటెంట్లు, సైనికులు మరణించారు. 2016, జూలైలో జరిగిన అల్లర్లలో దాదాపు వంద మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయి. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ హత్యతో ఆ అల్లర్లు చెలరేగాయి. అంతకుముందు మిలిటెంట్ కార్యకలాపాలకు అంతగా ప్రజల మద్దతు ఉండేది కాదని, 2016 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరగడంతోపాటు మిలిటెంట్ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కశ్మీర్ యూనివర్శిటీలో పనిచేస్తున్న పొలిటికల్స్ సైన్స్ ప్రొఫెసర్ తెలిపారు. రోజుకో ఏదోచోట కాల్పులు జరిగి పౌరులు కూడా మరణిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు ‘మోదీ నుంచి మెహబూబా వరకు అందరూ బాధ్యులే’ అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం ఆరుశాతం ఓట్లు నమోదయ్యాయంటే ఎన్నికల పట్ల, రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిందో తెలుస్తోంది. మెహబూబా తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎంపీ సీటుకు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం, గతేడాదే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి నేటికి నిర్వహించక పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ప్రజలకు కనిపించేవి. ఇప్పుడు వాటి ఉనికిని కూడా ప్రజలు గుర్తించడం లేదు. అందుకని మిలెటెన్సీ పెరుగుతోంది. మెహబూబా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆమె పట్లప్రజలకు సగం నమ్మకం పోయింది. సరైన పాలన అందించడంలో విఫలమైనందున ఆమె పట్ల పూర్తి విశ్వాసం పోయింది. కతువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను సైనికులు దారణంగా రేప్‌చేసి హత్య చేసిన కేసులో నిందితులకు మద్దతుగా జరిగిన ప్రదర్శనలో తన కేబినెట్లోని ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం పట్ల మెహబూబా మౌనం వహిచండం ఆమె మద్దతుదారులు కూడా సహించలేకపోతున్నారు. ఇక ఆఖరి కశ్మీర్ నిరంకుశ రాజు హరీ సింగ్ విగ్రహాన్ని ఆమె ఇటీవల ఆవిష్కరించడాన్ని వారు అంతకన్నా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ప్రోద్బలంతో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె నేడు సీఎం కుర్చీలో కూర్చున్న కీలుబొమ్మ మాత్రమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
మలేషియా ఉద్యోగం మొదటికే మోసం
మందస: ఉద్యోగాల పేరిట మోసాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులను లక్ష్యం చేసుకుని, దళారులు రూ. కోట్లలో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం యువతకు విదేశీ, స్వదేశీ ఉద్యోగాల పేరిట గాలం వేస్తున్నారు. ఈ వలలో వందలాది మంది నిరుద్యోగులు చిక్కుంటున్నారు. ఆదాయం మాత్రం ఎలా ఉన్నా.. పీకల్లోతు అప్పులు పాలవుతున్నారు. కుటుంబాలకు, కుటుంబాలే నాశనమవుతున్నాయి. ఇటీవల వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, నందిగాం, కంచిలి, కవిటి తదితర మండలాల్లోని ఉద్దానం ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను, యువకులను విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బ్రోకర్లు నిలువునా ముంచేశారు. ప్రస్తుతం బాధితులు మలేషియాలో ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సింగపూర్, మలేషియాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ సంస్థ ప్రచారం చేసింది. పలాస మండలంలో ఓ సబ్ బ్రోకర్‌తో మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 60 వేలు నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 30 నుంచి 50 మంది వరకు ఉద్దానానికి చెందిన యువకులు ఈ వలలో చిక్కుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మందస మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగాల బ్రోకర్ ఈ ప్రాంతంలోని సుమారు 25 నుంచి 30 మందికి ఉద్యోగాల వల వేశాడు. విశాఖలోని ఉద్యోగాల సంస్థ, పలాస, మందస మండలాల్లోని బ్రోకర్లు అతి తెలివిగా, చక్కగా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న యువకులు మలేషియాకు చేరుకున్నారు. వీరిలో డి.ఖగేశ్వరరావు, ఎన్.పాపారావు, టి.గణేశ్, నర్తు దానయ్య, కె.మోహనరావు, పి.బాలరాజు, జుత్తు చిరంజీవి, ఎన్.సోమేశ్వరరావు, బి.కృష్ణారావుతో పాటు 25 మంది ఉన్నారు. వీరంతా వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లోని కిడిసింగి, కాశీబుగ్గు, పలాస, నారాయణపురం, మొగిలిపాడు, కేసుపురం, చిన్నకేసుపురం తదితర ప్రాంతాలకు చెందినవారిగా తెలిసింది. ఉద్యోగాల బ్రోకర్లు వీరికి టూరిజం వీసా అందజేసి, ఉద్యోగాలకు మలేషియా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బాధితులు గమనించలేదు. రెండు, మూడు నెలల పాటు చిన్న, చిన్న కంపెనీల్లో చిరు ఉద్యోగాలు చేసిన వీరి వీసా గడువు ముగిసిపోయింది. వాస్తవానికి మలేషియా టూరిజం వీసా మూడు నెలలు ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగానికి వెళ్లిన వీరంతా వీసా గడువు పూర్తి కావడంతో ఉద్యోగాలు పోయాయి. చేతిలో డబ్బులు కూడా చెల్లిపోయాయి. దీంతో మలేషియాలో బాధలు అనుభవిస్తున్న వారంతా కుటుంబసభ్యులకు తెలిపారు. ఉద్యోగానికి వెళ్లి, పైసా ఆదాయం లేకపోగా, తమ పిల్లలు నానా కష్టాలు పడుతున్నారని తెలియడంతో వారి కుటుంబాలు మందస పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మలేషియా నుంచి తీసుకురావడానికి డబ్బు డిమాండ్ ఉద్యోగం పేరిట మలేషియా వెళ్లిన నిరుద్యోగులు తాము పడుతున్న కష్టాలు ఫోన్ల ద్వారా తెలియజేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. బ్రోకర్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, వారు దొరకడంలేదు. దొరికినా, మలేషియా నుంచి తిరిగి తీసుకురావడానికి రూ. 30 వేలు నుంచి రూ. 50 వేలు వరకు మళ్లీ డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేకుండా తమ పిల్లలు పడుతున్న కష్టాలు విని కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. అయోమయంలో బాధితులు ఓ బ్రోకరిది పలాస మండలం. మరో బ్రోకరిది మందస మండలం. వీరి ప్రధాన కార్యాలయం విశాఖపట్నం. బాధితులు సుమారు ఐదు మండలాలకు చెందిన వారు. దీంతో ఎవరిపై.. ఎలా.. ఏ స్టేషన్లో ఫిర్యాదు చేయాలో తెలియక బాధిత కుటుంబాలు మందస పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. పలాస పోలీసుల పరిధిలోకి కేసు వస్తుందని.. మందస మండలం పరిధిలోకి వస్తుందని చెబుతుండడంతో వాళ్లు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి, తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి. -
మస్కట్‌లో చిత్రహింసలు..
పెద్దాపురం: పొట్టకూటి కోసం స్వగ్రామాన్ని, అయిన వారిని వదులుకుని గల్ఫ్ దేశానికి వలస వెళ్లి అక్కడ ఏజంట్ చేతిలో చిత్రహింసలకు గురై నరకయాతన అనుభవిస్తున్న మహిళ మానవ హక్కుల సంఘం చొరవతో జిల్లాకు చేరింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన గోలి కుమారి ఆరు నెలల క్రితం కుటుంబ పోషణ కోసం భర్త, ఇరువురు కుమార్తెలను వదిలి మస్కట్ వెళ్లింది. పని కుదర్చుకున్న ఇంటి వద్ద అనారోగ్యంతో ఉండడంతో ఎవరైతే తీసుకువెళ్లారో ఆ కంపెనీకి కుమారిని పంపించేశారు. దీంతో ఒప్పందం ప్రకారం మస్కట్‌కు చెందిన వీసా కంపెనీ వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి కంపెనీ ఏజెంట్ నక్కా సీతా ఆమెను చిత్ర హింసలకు గురి చేస్తోంది. విషయాన్ని తన భర్త రత్నరాజుకు చెప్పడంతో ఆయన తన భార్యను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండను ఆశ్రయించారు. ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అక్కడి అధికారులు కుమారిని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడంతో బుధవారం కుమారి స్వగ్రామం కట్టమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా తను స్వగ్రామానికి రావడానికి కృషి చేసిన నూతలపాటి అప్పలకొండతో కలసి విలేకర్ల సమావేశంలో తన కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమైంది. సుమారు 15 మంది మహిళలు అక్కడ సీత అనే మహిళ వేధింపులకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి తనలా ఇబ్బందులకు గురవుతున్న వారిని స్వగ్రామానికి తీసుకురావాలని ఆమె కోరింది. అప్పలకొండ మాట్లాడుతూ గల్ఫ్ వంటి దేశాల్లో వేధింపులకు గురవుతున్న పలువురు మహిళలను తమ సంఘం తరఫున నుంచి స్వగ్రామాలకు తీసుకువస్తున్నామన్నారు. దీనికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జుత్తుక అప్పారావు., కుంచే నానీబాబు, వల్లీభాషాతో కుమారి కుటుంబ సభ్యులు ఉన్నారు. -
సులువుగా పాస్‌పోర్టు
పాస్‌పోర్టు అంటే దేశం వదిలి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతి పత్రం. పని ఏదైనాసరే విదేశాలకు వెళ్లాలనుకునే వారందరూ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. ఇది ఉంటేనే ఏ దేశంలోనైనా వీసా లభిస్తుంది. వీసా అంటే సదరు దేశంలోకి అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వాలు మంజూరు చేసే పత్రం. అంటే విదేశాలకు వెళ్లాలనుకునేవారికి మొట్టమొదట అవసరమయ్యేది ‘పాస్‌పోర్టు’. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు కేంద్రాలను ప్రజలకు మరింత చేరువ చేసింది. అయితే ఈ కేంద్రాలను ఏ దశలో, ఎలా సంప్రదించాలనే విషయంపై చాలామందికి అవగాహన లేదు. దీంతో ఉన్నత విద్యావంతులు సైతం ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అనంతపురం టౌన్: అనంతపురం ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో జిల్లావాసులు పాస్‌పోర్టు పొందడం సులువైంది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కోసం ఆన్లైన్లో ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి, పాస్ పోర్టు సేవా కేంద్రంలో ఏమేమి సర్టిఫికె ట్టు సమర్పించాలి తదితర ఆంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ♦ పాస్‌పోర్టుకు ఎవరికి వారే సొంతంగా(దళారులను ఆశ్రయించకుండా) నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ♦ పాస్‌పోర్టు ఏ దశలో ఉందో ఇలా తెలుసుకోవచ్చుపాస్పోర్టు సేవా కేంద్రంలో ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎక్కువ జాప్యం జరిగితే http://www.passportindia.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఊదా రంగులో కనిపించే ట్రాక్ అప్లికేషన్ స్టేటస్‌ను క్లిక్ చేయాలి. తద్వారా మన పాస్‌పోర్టు ఏ దశలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఏజెంట్లను ఆశ్రయించొద్దు పాస్‌పోర్టు కోసం ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే అన్ని వివరాలు చెబుతారు. వాటి ఆధారంగా పాస్‌పోర్టు కోసం ఆన్లైన్లో ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును చెల్లించి నమోదు చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన తేదీన నేరుగా పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి పాస్‌పోర్టు ఇస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – స్వాతి మధురిమ,తపాలా సూపరింటెండెంట్ మొదటి దశ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే మొదటిదశ ఆన్లైన్ దశ. ఇందులో మొదట www.passportindia.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. వెబ్సైట్లో కుడివైపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఫొటో కనిపిస్తుంది. ఎడమ వైపున ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్(పచ్చరంగు), న్యూ యూజర్ రిజిస్టర్నౌ(ఎర్రరంగు), ట్రాక్ అప్లికేషన్ స్టేటస్(నీలంరంగు), చెక్ అప్పాయింట్మెంట్ అవైలబు లిటీ(పసుపు పచ్చరంగు) అనే బాక్సులు నాలుగు ఉంటాయి. వాటిలో న్యూ యూజర్ రిజిస్టర్నౌ అనే ఎర్రరంగు బాక్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఒక చిన్న ఫ్రీ అప్లికేషన్ వస్తుంది. అందులో తమకు వర్తించే అంశాలను జాగ్రత్తగా పూరించాలి. మీ పేరు రిజిస్టర్ అయినట్లు లాగిన్ నెంబర్ (యూజర్ ఐడీ) వస్తుంది. రెండవ దశ యూజర్ ఐడీ వచ్చిన తర్వాత రెండో దశ ప్రారంభం మవుతుంది. ఈసారి వైబ్‌సైట్‌లోని నాలుగు గళ్లల్లో పచ్చగా ఉన్న ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు మనకు వచ్చిన నెంబర్ టైప్ చేసి లాగిన్లోకి వెళ్లాలి. దరఖాస్తు ఫారం వస్తుంది. అందులోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి మనకు వర్తించే వాటిని పూరించాలి. వైబ్‌సైట్‌లోని ఇన్ఫర్మేషన్ కార్నర్లో ఫీజు వివరాలుంటాయి. ఆన్లైన్లో రూ.1,500 ఫీజు చెల్లించాలి. అప్పుడు అక్నాలెడ్జ్మెంట్తోపాటు ఏఆర్ఎన్ ఫారం వస్తుంది. అప్పుడు మీరు ఎంపిక చేసుకున్న పాస్‌పోర్టు సేవా కేంద్రం లభ్యతను బట్టి స్లాట్‌ను కేటాయిస్తారు. తేదీతోపాటు టైమ్ సైతం వస్తుంది. దాని ప్రకారం దరఖాస్తుదారుడు పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లాలి. మూడవ దశ ఈ దశలో పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వెళ్లి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఏఆర్ఎన్ ఫారంతోపాటు ఒరిజనల్ సర్టిఫికెట్లు(పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో పొందుపరచిన ధ్రువీకరణ పత్రాలు) తీసుకెళ్లి మొదట రిసెప్షన్ కమ్ టోకన్ ఇష్యూ కౌంటర్లో సంప్రదించాలి. అక్కడ డ్యాక్యుమెంట్లు(ధ్రువీకరణ పత్రాలను) పరిశీలించి టోకెన్ నెంబర్ ఇస్తారు. పాస్‌పోర్టు సేవా కేంద్రం అధికారులు పిలిచేంత వరకు వెయిటింగ్ గదిలో వేచి ఉండాలి. ఆ తర్వాత మనకు వచ్చిన టోకెన్ నెంబర్‌ను బట్టి ఏ1, ఏ2, ఏ3 కౌంటర్లలో ఏదైనా ఒక కౌంటర్లోకి వెళ్తే అక్కడ ఫొటోతోపాటు బయోమెట్రిక్ విధానంతో రెండు చేతి వేలి ముద్రలను, సంతకాన్ని తీసుకుంటా రు. ఆ తర్వాత మన ధ్రువీకరణ పత్రాలు పరిశీలన కౌంటర్‌కు వెళతాయి. అనంతరం పాస్‌పోర్టు అధికారి కొన్ని ప్రశ్నల ద్వారా ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వాటిలో అక్షరం తేడా వచ్చినా వెనక్కి పంపిస్తారు. పరిశీలనాధికారి సంతృప్తి పొందిన తర్వాత పాస్‌పోర్టు జారీ కోసం మన వివరాలు విశాఖపట్నం రీజనల్ కార్యాలయానికి వెళతాయి. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుదారునికి దగ్గర్లోని పోలీసులు విచారణ చేసి రిపోర్టు పంపుతారు. ఎలాంటి కేసులు లేకుంటే పాస్‌పోర్టు మన చేతికి అందుతుంది. దీనికి సుమారు 15రోజులు పడుతుంది. -
దగాపడ్డ గిరిపుత్రులు
కూటికోసం... కూలికోసం... వలస వెళ్లిన గిరిపుత్రులకు ఎంత కష్టం... ఎంత నష్టం. ఐదు నెలలు ఎండనకా... వాననకా... కష్టపడిన ఆ యువతకు రిక్తహస్తమే మిగిలింది. పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి వారి శ్రమ దోపిడీ చేసిన ఏజెంట్ తీరుపై వారంతా మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గుమ్మలక్ష్మీపురం(కురుపాం): పొట్టకూటికోసం వలస పనుల కెళ్లిన తమచే పనిచేయించుకున్న ఏజెంట్ తమకు రావాల్సిన కూలి సొమ్మును ఎగ్గొట్టాడంటూ గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చినవంకధార, బబ్బిడి, అచ్చబ, వాడపుట్టి గ్రామాలకు చెందిన 22 మంది గిరిజన యువతీ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు కె.సోమేష్, సోములు, సిద్ధు, జగన్, శ్రీహరి, గణేష్, భాస్కరరావు, క్రిష్ణ, కె.రోజా, కె.శాంతి, సన్యాసి, ఎన్.మధు తదితరులు శనివారం ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్, మండల కార్యదర్శి మండంగి శ్రీనివాస్‌లతో కలిసి ఎల్విన్‌పేటలో విలేకర్లతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతీష్ అనే ఓ వ్యక్తి(ఏజెంట్) రోజుకు రూ.270లు చొప్పున కూలి వచ్చేలా పని ఇప్పిస్తానని తమను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెలగపూడి గ్రామంలో ఉన్న సంధ్య కంపెనీ సైట్స్(హేచరీస్)కు గత ఏడాది సెప్టెంబర్ 6న తీసుకెళ్లాడని చెప్పారు. అప్పటి నుంచి తమచే పగలు, రాత్రిళ్లు కూడా రొయ్యల కంపెనీలో పనులు చేయించుకున్నారని చెప్పారు. అయితే వచ్చి చాలా రోజులైనందున స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబీకులను చూసి వస్తామనీ కూలి సొమ్ములు ఇవ్వాలని ఏజెంట్ సతీష్‌ను అడగ్గా... ఒక్కొక్కరికి కేవలం రూ.8వేలు వంతున మాత్రమే అందజేసారని తెలిపారు. తమకు ఒక్కొక్కరికి రూ.40లు పైబడి ఇవ్వాల్సి ఉండగా రూ.8వేలే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగా, మళ్లీ వస్తేనే మిగతా డబ్బు చెల్లిస్తానని చెప్పాడని వారంతా వాపోయారు. చేసేది లేక వారం రోజుల క్రితం ఏజెంట్, కంపెనీ ప్రతినిధులకు చెప్పకుండా స్వగ్రామాలకు వచ్చామని, తమతో పాటు పనులకు వచ్చిన కె.త్రినాథ్, శ్యాం, కిరణ్, సంజయ్ అనే మరో నలుగురు అక్కడే ఉండిపోయారని చెప్పారు. తమతో సుమారు ఐదు నెలల పాటు పనిచేయించుకొని కూలి సొమ్ము ఇవ్వకుండా ఏజెంట్ అన్యాయం చేసాడని, దీనిపై గిరిజన సంఘం నాయకులకు తెలపగా వారితో పాటు ఎల్విన్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చామన్నారు. ఈ మేరకు వారంతా ఎల్విన్‌పేట ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడును కలసి సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్సై రొయ్యల చెరువు యజమానులతో పాటు ఏజెంట్ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి బాధితులకు మిగతా సొమ్ము తక్షణమే చెల్లించాలని, లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
లెర్నింగ్ లైసెన్సా.. అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు వాహన వినియోగదారులను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. కఠినమైన, తార్కికమైన ప్రశ్నలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే క్షణాల్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తుండగా నేరుగా వచ్చేవారు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు అవసరమైన సాధారణ పరిజ్ఞానం మేరకు వినియోగదారుల అవగాహనను అంచనా వేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా గందరగోళాన్ని సృష్టించే ప్రశ్నలతోనే ఫెయిల్ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా వచ్చేవారిని ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి గురి చేసి ఫెయిల్ చేస్తూ తప్పనిసరిగా ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో రవాణాశాఖలో అన్ని రకాల పౌరసేవలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినా ఏజెంట్లు లేకుండా ఎలాంటి పనులు కావడం లేదు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపైనే లెర్నింగ్ లైసెన్స్ ప్రశ్నలు ఉన్నప్పటికీ అభ్యర్ధులను తికమకపెట్టేలా ఉంటున్నాయి. దీంతో చాలామంది మొదటిసారి సరైన సమాధానాలను ఎంపిక చేయలేక ఫెయిల్ అవుతున్నారు. చివరకు ఏజెంట్లను ఆశ్రయించి రెండోసారి పాస్ అవుతున్నారు. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజూ సుమారు 1500 మంది లెర్నింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరవుతుండగా వారిలో సగటున 350 నుంచి 400 మంది ఫెయిల్ అవుతున్నారు. వీరందరూ దళారులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చేవాళ్లే కావడం గమనార్హం. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి... శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకునేందుకు రవాణాశాఖ అందజేసే లెర్నింగ్ లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా సదరు వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకొని, అన్ని రోడ్లపైన వాహనాలను నడిపేందుకు అనుభవాన్ని గడించాలి. అప్పుడు మరోసారి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. ఈ క్రమంలో లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అభ్యర్ధులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు సిగ్నల్స్, రూల్స్ అండ్ రోడ్ రెగ్యులేషన్స్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్, తదితర అంశాలపై ఈ ప్రశ్నలను రూపొందించారు. ఈ కేటగిరీల్లో మొత్తం 450 వరకు ప్రశ్నలతో ఒక క్వశ్చన్ బ్యాంక్‌ను రవాణాశాఖ సిద్ధం చేసింది. ఈ క్వశ్చన్బ్యాంకు నుంచే అభ్యర్ధుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఇందు లో కొన్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ‘సూర్యోదయానికి ముందు, తరు వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ లైట్ ఎలా ఉండాలి’. సాధారణంగా దీనికి ప్రతి ఒక్కరు ‘లైటు వెలిగించుకొని’ బం డి నడపాలనే భావిస్తారు. కానీ లైట్ లో భీమ్‌లో ఉండాలనేది సమాధానం. అలాగే రోడ్డు మీద గుంతల్లో నీళ్లు చిమ్ముతూ బండి నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలు ఏ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ’వాయు కాలుష్యం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది’ వంటి లెర్నర్కు సంబంధం లేని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. సమయాభావ సమస్యే... లెర్నింగ్ లైసెన్సు కోసం నిర్వహించే ఆన్లైన్ టెస్ట్‌లో 20 ప్రశ్నలకు సరైన జవాబులను ఎంపిక చేసేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు అరనిమిషం వ్యవధి లో సమాధానం గుర్తించాలి. అభ్యర్ధులు కనీసం 12 ప్రశ్నల కు సరైన సమాధానం గుర్తిస్తే చాలు. ఉత్తీర్ణులైనట్లుగా భావి ంచి లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో వాహ నం నేర్చుకొనేందుకు అనుమతి లభిస్తుంది. అయితే చాలామం ది అభ్యర్ధులు సరైన జవాబులు గుర్తించేందుకు సమ యం చాలడం లేదని అభిప్రాయపడుతున్నారు. ‘‘స్క్రీన్‌పై ఒక ప్రశ్నను చదివి అర్ధం చేసుకొని జవాబును గుర్తించే లోపే మరో ప్రశ్న ముందుంటుంది. దీంతో గందరగోళానికి గురవుతున్నాం.’’ అని మోతీనగర్‌కు చెందిన సంపత్ పేర్కొన్నా రు. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు సమయాన్ని 15 నిమిషాలకు పెంచాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఒక్కసారి చదువుకొని వస్తే చాలు.. చాలామంది ఒక్కసారైనా ప్రశ్నావళిని చూడకుండానే నేరుగా పరీక్షకు హాజరవుతున్నారని, దాంతో వారికి ఆ ప్రశ్నలు కఠినంగా కనిపిస్తున్నాయని సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో తెలిపారు. ‘ కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్న మాట నిజమే. గతంలో ఒక కమిటీ వేసి చాలా వరకు సరళీకరించాం. మార్పులు, చేర్పులు చేశాము. 827 ప్రశ్నలను సగానికి కుదించాము. క్వశ్చన్ బ్యాంకు ప్రింటెడ్ బుక్స్ అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉన్నాయి. రవాణాశాఖ వెబ్సైట్లో కూడా ఉంది. వెబ్సైట్లో మాక్ టెస్ట్‌కు కూడా హాజరు కావచ్చు. ఎలాంటి కసరత్తు లేకుండా, సన్నద్ధత లేకుండా వచ్చేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ’’ అని చెప్పారు. సరైన సమాధానాలను గుర్తించిన తరువాత ఫెయిల్ చేయడమంటూ ఉండదన్నారు. -
తల్లిని ఏజెంట్లు సౌదీలో అమ్మేశారని ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : తన తల్లిని ఇద్దరు ఏజెంట్లు సౌదీలో సేట్‌కు అమ్మేశాడని, ఏడాదిగా ఆమె ఆచూకీ లేదని కుమార్తెలు వాపోయారు. వారు సోమవారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డులోని శివాజీ నగర్లో ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పి.రామ్మూర్తి, క్రిష్ణమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రామ్మూర్తి సంపాదనతో ఇళ్ల గడవడం కష్టం కావడంతో ఇబ్బందులు పడేవారు. కుటుంబం ఆర్థికంగా బయటపడేందుకు ఇతర దేశాలకు పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాయచోటికి చెందిన ఏజెంట్లు జిలానీబాషా, మహ్మద్‌బాషాను ఏడాది క్రితం ఆశ్రయించారు. వారు క్రిష్ణమ్మకు సౌదీలోని ఉమర్‌కు చెందిన అబ్దుల్మినిమ్ సేట్ వద్ద దగ్గర ఉపాధి కల్పిస్తానని చెప్పి 11 నెలల క్రితం సౌదికి పంపించారు. ఇప్పటి వరకు ఆమె తమకు ఫోన్ చేయలేదని, ఆమె ఆచూకీ లేదని కుమార్తెలు, భర్త రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆరు నెలలుగా ఏజెంట్లను అడుగుతున్నా సమాధానం లేదన్నారు. పైగా అనుచరులతో దాడి చేయిస్తున్నారని కన్నీటిపర్వంతమయ్యారు. విచారణ చేసి ఎలాగైన తమ తల్లిని ఇండియాకు రప్పించి ఏజెంట్లపై చర్యలు తీసుకోవలని సీఐ సురేష్‌కుమార్‌ను కోరారు. -
ముగ్గురు భారతీయ యువతులకు విముక్తి
న్యూఢిల్లీ: ముగ్గురు భారతీయ యువతులతో పాటు మరో ఏడుగురు నేపాలీ యువతులకు భారత ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉపాధి నిమిత్తం వెళ్లిన యువతులు కెన్యా దేశంలోని మొంబాసా నగరంలో మోసపోయారు. వారి పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నగరంలోని ఓ ఇంట్లో బంధించారు. భారత హైకమిషన్ అధికారులు స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక కెన్యా పోలీసుల సహకారంతో వారిని విడిపించారు. వారిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నం చేసిన కెన్యాలో భారత హైకమిషనర్ అధికారిణి సుచిత్రా దురై, కరణ్ యాదవ్‌లను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అభినందించారు. అలాగే కెన్యా పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లపై కేసు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సుష్మాస్వరాజ్ వివరాలు పంపారు. ఈ విషయాలన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. -
వాళ్లు చెప్పరు! మీరే అడగాలి!
‘‘ప్రీమియం చాలా తక్కువ. 10 ఏళ్లు కడితే చాలు. చక్కని నిధి చేతికందుతుంది. పన్ను ఆదా చేసుకోవచ్చు...’’ ఇవీ చాలా మంది బీమా ఏజెంట్లు చెప్పే మాటలు. ఏజెంట్ల ద్వారా బీమా తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మాటలు వినే ఉంటారు. ఎందుకంటే సంప్రదాయ బీమా పాలసీలను విక్రయించటానికి ఏజెంట్లు ఇలా తియ్యటి మాటలు చెప్పటం సర్వసాధారణం. ఎన్నెన్నో గణాంకాలు కూడా వినిపిస్తుంటారు. కాకపోతే కొన్ని గణాంకాలను కావాలనే దాచిపెడతారు. వారు చెప్పిన విషయాలన్నీ కరెక్టే కావచ్చు!! కానీ కావాలని చెప్పనివి కూడా కొన్ని విషయాలుంటాయి. అలాంటివన్నీ స్వయంగా తెలుసుకోవాల్సిందే. అప్పుడే బీమా పాలసీ సరైనదో, కాదో తెలుసుకుని ఒక నిర్ణయానికి రాగలం. అందుకే... పాలసీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటో తెలియజేసేదే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం బీమా కంపెనీల వ్యాపారంలో అత్యంత కీలకమైనవి ఎండోమెంట్ పాలసీలే. ఇక యూనిట్ లింక్డ్ పాలసీలు (యులిప్), పొదుపుతో కూడిన బీమా రక్షణ పథకాలు సంప్రదాయ పాలసీల్లో భాగంగా ఉంటాయి. ఈ సంప్రదాయ పాలసీల్లోనే పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్లు ఉంటాయి. పార్టిసిపేటింగ్ ప్లాన్లలో పాలసీదారులు బీమా కంపెనీ చేసిన పెట్టుబడులపై వచ్చిన లాభాలను పొందుతారు. బోనస్ రూపంలో కంపెనీలు దీన్ని పంచుతాయి. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్లలో కచ్చితమైన హామీతో కూడిన రాబడులుంటాయి. నిజానికి సంప్రదాయ పాలసీల్లో రిస్క్ కవరేజీ చాలా తక్కువ. జీవితానికి తగిన రక్షణ కావాలని అనుకునేవారికి ఇవి తగినవి కానే కావు. వీటికి కట్టే ప్రీమియానికి మహా అయితే 10 రెట్ల బీమా రక్షణ లభిస్తుంది. ఇలా కాకుండా కేవలం బీమా రక్షణే కోరుకుంటే (టర్మ్‌పాలసీ) తక్కువ ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ లభిస్తుంది. సంప్రదాయ పాలసీల విషయంలో పాలసీ పత్రాలపై సంతకం చేసే ముందు తెలుసుకోవాల్సినవి ఇవే. ఛార్జీలు ఎంతో తెలుసా? సంప్రదాయ పాలసీల్లో ప్రీమియం అలోకేషన్ చార్జీ గురించి పాలసీదారులకు తెలిసింది తక్కువే. అలాగే, పరిపాలనా వ్యయాలు, మోర్టాలిటీ చార్జీలు కూడా గోప్యంగానే ఉంచుతారు. స్థూల, నికర రాబడులను బెనిఫిట్ ఇలస్ట్రేషన్ (బీఐ) నుంచి వేరు చేస్తే ఎక్స్పెన్స్ రేషియో ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. ఏజెంట్లు సరెండర్ చార్జీల గురించి అస్సలు ప్రస్తావించరు. సంప్రదాయ పాలసీల్లో సరెండర్ (పాలసీ వద్దని వెనక్కి ఇచ్చేయడం) చార్జీలు చాలా ఎక్కువ. పాలసీ తీసుకున్న తర్వాత తొలినాళ్లలో చెల్లించిన ప్రీమియంలో 70 శాతం వరకూ నష్టపోవాల్సి వస్తుంది. కాల వ్యవధి ముగింపుకు దగ్గర్లో సరెండర్ చేస్తే తక్కువ మొత్తంలో కోల్పోవాల్సి ఉంటుంది. పాలసీ పత్రాల్లో సరెండర్ చార్జీల ప్రస్తావన ఉంటుంది. కానీ, ఏజెంట్లు ఈ విషయాల గురించి దాదాపుగా చెప్పరు. బోనస్ గురించి తెలుసుకోవాలి... పార్టిసిపేటింగ్ ప్లాన్లలో బోనస్ గ్యారంటీగా వస్తుందని ఏజెంట్లు చెప్పే మాటల్ని నమ్మొద్దు. నిజానికి బోనస్ రూపంలో వచ్చే రాబడి ఒక శాతం ఐఆర్ఆర్ మాత్రమే. బీమా కంపెనీలు పార్టిసిపేటింగ్ ప్లాన్లలో తమ పెట్టుబడి నిధి వృద్ధి చెందితేనే బోనస్‌ను ప్రకటించాలి. కనుక పెట్టుబడులపై రాబడులు వచ్చిన సంవత్సరాల్లోనే బోనస్ వస్తుందని ఆశించొచ్చు. అలాగే, రాబడుల ఆధారంగా ఈ బోనస్ రేటు కూడా ఏటేటా మారిపోవచ్చు. బోనస్ రేటు అన్నది వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. పార్టిసిపేటింగ్ ప్లాన్లలో అధిక శాతం రాబడులను డెట్ విభాగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బీమా కంపెనీల బోనస్ రేటు కూడా తగ్గుతోంది. 2014లో ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులు 9 శాతంగా ఉంటే, ప్రస్తుతం అవి 6.8 శాతంగా ఉన్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సేవింగ్స్ సురక్షా పార్టిసిపేటింగ్ ప్లాన్‌లో 2014లో 2.25 శాతంగా ఉన్న బోనస్ రేటు 2017లో 1.75 శాతానికి తగ్గింది. సమ్ అష్యూర్డ్‌లో నిర్ణీత శాతం చొప్పున బోనస్‌ను బీమా కంపెనీలు ప్రకటిస్తుంటాయి. సాధారణంగా రెండు రకాల బోనస్‌లుంటాయి. రివర్షనరీ బోనస్ అనేది ఏటా బీమా కంపెనీ ప్రకటిస్తుంది. టెర్మినల్ బోనస్ మరొకటి. పాలసీని సరెండర్ చేసినా లేక కాల వ్యవధి తీరినా, పాలసీదారుడు మరణించిన సమయాల్లో చెల్లించేది టెర్మినల్ బోనస్. పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత సమ్ అష్యూర్డ్‌తో పాటు, జీఏ, రివర్షనరీ బోనస్, టెర్మినల్ బోనస్ చెల్లించడం జరుగుతుంది. అసలైన రాబడి ఎంత? సంప్రదాయ పాలసీల గురించి ఏజెంట్లు చెప్పే గొప్పల్లో ముఖ్యమైంది చెల్లించిన ప్రీమియం రెట్టింపు అవుతుందని. కానీ, ఇందులో వాస్తవం వేరు. నిజానికి చాలా వరకు నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ పాలసీలపై నికర రాబడులు 4– 5 శాతం మధ్యే ఉంటాయి. మరే ఇతర సంప్రదాయ పథకంలోనూ ఇంత తక్కువ రాబడులుండవు. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. 45 సంవత్సరాల వ్యక్తి ఏటా రూ.1.50 లక్షల చొప్పున పదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే 20వ సంవత్సరం ముగింపులో రూ.28 లక్షలు చేతికి అందుతాయి. ఇందులో వాస్తవ రాబడి 4 శాతమే. మెచ్యూరిటీ తీరిన తర్వాత చేతికందే మొత్తం గురించే చెబుతుంటారు కానీ... ఏటా ప్రీమియం రూపంలో ఎంతమేర చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని వివరంగా చెప్పరు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (అంతర్గత రాబడి రేటు) అన్నది ఎండోమెంట్ పాలసీల్లో వాస్తవ రాబడులు తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎన్నో కాలిక్కులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. రాబడిపై చెప్పేవన్నీ గొప్పలే... పొదుపుతో కూడిన బీమా పథకాల్లో ఇన్వెస్టర్లను ఆకర్షించేది గడువు తీరాక వచ్చే రాబడులే. పార్టిసిపేటింగ్, నాన్ పార్టిసిపేటింగ్ పథకాల్లో పాలసీ డాక్యుమెంట్లో భాగంగా బెనిఫిట్ ఇలస్ట్రేషన్ (బీఐ) కూడా ఉంటుంది. అంటే పాలసీదారుడు మరణిస్తే తన నామినీకి ఎంత మొత్తం అందుతుంది... లేక జీవించి ఉంటే గడువు తీరిన తర్వాత ఏ మేర ప్రయోజనం అందుతుంది... వంటి వివరాలు అందులో ఉంటాయి. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్లలో మెచ్యూరిటీ బెనిఫిట్ అన్నది పూర్తిగా హామీతో కూడినది. పెట్టుబడుల విలువ కాల వ్యవధి ముగింపు నాటికి ఎంతకు చేరుతుందన్న వివరాలు బీఐలో ఉంటాయి. పార్టిసిపేటింగ్ ప్లాన్ల విషయంలో బీమా కంపెనీ 4 శాతం రాబడుల ప్రకారం అయితే ఎంతొస్తుంది, 8 శాతం రాబడులు అయితే ఎంత లభిస్తుందన్న రెండు రకాల అంచనాలను వివరిస్తుంది. అయితే, ఈ గణాంకాలను చూసి అంత మేర వస్తాయని నిశ్చయమైపోవటం కరెక్టు కాదు. ఇవి కేవలం అంచనాలే కానీ, బీమా కంపెనీ ఇస్తున్న హామీతో కూడిన రాబడులు మాత్రం కాదు. జీవన్ సరళ్ కూడా అలాంటిదే... ఇలా గొప్పలు చెప్పిన పాలసీల్లో ఎల్ఐసీకి చెందిన జీవన్ సరళ్‌ను కూడా ఉదహరించొచ్చు. ఇది ఆరంభమైన సమయంలో ఏజెంట్లు చెప్పిన గొప్పలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి స్టాక్ మార్కెట్ రాబడులను ఉదహరిస్తూ కొందరైతే ఏకంగా 12–15 శాతం వార్షిక రాబడులను అంచనా వేసి పాలసీలు కట్టించారు. కట్టే వార్షిక ప్రీమియానికి ఏకంగా పాతిక రెట్ల బీమా రక్షణ లభిస్తుందని, వార్షిక రాబడులు భారీగా ఉంటాయి కనుక పదేళ్లు కడితే విపరీతమైన లాభాలొస్తాయని చెప్పారు. నిజానికి ఈ పాలసీలో రాబడులనేవి పదేళ్ల తరవాతే మొదలవుతాయనే విషయాన్ని మాత్రం చాలా మంది పాలసీదారులు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే పాలసీ ఆరంభమై ఇప్పటికి తొమ్మిదేళ్లు కావస్తుండగా... చాలామంది దీన్ని సరెండర్ చేసేశారు. చిత్రమేంటంటే 8 ఏళ్లు ప్రీమియం కట్టి సరెండర్ చేసిన వారికి కూడా... కనీసం వారు చెల్లించిన మొత్తం చేతికి రాలేదు. పదేళ్లు పూర్తయితే అప్పటిదాకా కట్టిన మొత్తం ప్రీమియంపై ఓ 4–5 శాతం రాబడి రావచ్చనేది ప్రస్తుతం ఉన్న అంచనా. నిజానికి ఈ తొమ్మిదేళ్లు ప్రీమియం కట్టిన వారు అప్పట్లోనే బీమా రక్షణ కోసం టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే... కట్టే ప్రీమియంలో 10 శాతానికే ఈ పాలసీ ఇచ్చినంత రక్షణ ఆ పాలసీ కూడా ఇచ్చేది. మిగతా 90 శాతం సొమ్మును బ్యాంకు ఆర్డీ, మ్యూచ్‌వల్ పండ్స్ ఇలా దేన్లో ఇన్వెస్ట్ చేసినా ఆ సొమ్ము రెట్టింపు అయ్యేది. ఇవన్నీ అర్థం చేసుకునేనేమో!! చాలామంది ఇప్పటికే ఈ పాలసీని సరెండర్ చేసేశారు. ధీరేంద్రకుమార్ వంటి నిపుణులు సైతం దీన్ని రాబడుల విషయంలో పూర్తి సందిగ్ధత ఉన్న పాలసీగా పేర్కొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వ్యయాలు తెలుసుకునేందుకే బీఐ! పైన చెప్పిన ఉదాహరణ బట్టి చూసినా... వాస్తవ రాబడులన్నవి అంచనాలపై కాకుండా బీమా కంపెనీ పెట్టుబడులపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. పార్టిసిపేటింగ్ ప్లాన్లలో కచ్చితంగా ఎంతొస్తుందన్నది ముందుగా చెప్పలేం. బీమా కంపెనీలు తమ పెట్టుబడులపై వచ్చే రాబడి ఆధారంగా వార్షికంగా బోనస్‌ను ప్రకటిస్తాయి. దీన్ని బట్టే రాబడులుంటాయి. కాకపోతే పార్టిసిపేటింగ్ ప్లాన్లలో వ్యయాలు తెలుసుకునేందుకు బీఐ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 8 శాతం రాబడుల అంచనాల పాలసీలో ఐఆర్ఆర్ అన్నది 5 శాతంగా ఉంటుంది. అంటే మూడు శాతం వ్యయాల రూపంలో పోతుంది. దీన్నే ఎక్స్పెన్స్ రేషియోగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాబడులు పరిమితమే... సంప్రదాయ పాలసీలు అధిక రాబడులను ఇవ్వలేవు. ఎందుకంటే అవి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం బీమా కంపెనీలు తమ ఆస్తుల్లో సగం మేర ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ ఆమోదిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. 15 శాతాన్ని ఆమోదిత హౌసింగ్, ఇన్ఫ్రా బాండ్లలో పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతమే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. కాబట్టి వీటికి రాబడులు పరిమితంగానే ఉంటాయన్నది గుర్తించాలి. -
‘గల్ఫ్’ మోసాలకు లైసెన్స్!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. నకిలీ, బోగస్ ఏజెంట్లకు ముకుతాడు వేసేందుకు ఉన్న నిబంధనలను కఠినతరం చేయాల్సింది పోయి.. మరింత సరళతరం చేసే విచిత్ర నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల వలస నియామకాలు చేపట్టే ఓవర్సీస్ మ్యాన్ పవర్ ఏజెన్సీల రిజిస్ట్రేషన్‌ను సునాయాసం చేస్తూ విదేశాంగ శాఖ గురువారం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పథకంతో నకిలీ ఏజెంట్లు అధికారికంగా రెచ్చి పోనుండగా.. విదేశాల్లో ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలని ఆశపడే నిరుద్యోగులు మరిన్ని మోసాలకు గురయ్యే ప్రమాదముంది. తాజాగా కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఏజెన్సీలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే.. ప్రభుత్వానికి కేవలం రూ.8 లక్షలు (బ్యాంకు గ్యారంటీ) డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు రూ.50 లక్షల డిపాజిట్‌తో పాటు మరో రూ.50 లక్షల ఆర్థిక లావాదేవీలుంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునే చాన్సుంది. ఇప్పుడు డిపాజిట్ సొమ్మును ఏకంగా ఆరో వంతుకు తగ్గించటంతో కొత్త ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా విస్తరించే అవకాశముంది. ఏదైనా పొరపాటు జరిగితే.. తమ డిపాజిట్లను ప్రభుత్వం జప్తు చేసుకొని నిరుద్యోగులకు తిరిగి చెల్లిస్తుందనే భయంతో ఏజెన్సీలు కొంత అప్రమత్తంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఖరీదైన ప్రక్రియ కావటం, ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రెంట్ వెరిఫికేషన్ లాంటి కఠిన నిబంధనల వల్ల నకిలీ ఏజెంట్లు అడ్డదారులను ఎంచుకునేవారు. 2 లక్షలకు పైగా తెలంగాణ వారు.. తెలంగాణ, ఏపీల నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌కు చాలా మంది వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వారు దాదాపు 2 లక్షల మందికిపైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఏజెంట్లు, నకిలీ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా మోసపోయిన నిరుద్యోగుల సంఖ్య సైతం తెలంగాణ జిల్లాల్లో అధికంగానే ఉంది. ఏటా వందలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏజెన్సీల రిజిస్ట్రేషన్ విధానాన్ని కేంద్రం సులభతరం చేయటంతో నకిలీ ఏజెంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయిందనే విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రూ.8 లక్షలతో వచ్చే లైసెన్సు కావడంతో నకిలీలు రెచ్చిపోయే ప్రమాదముంది. ప్రసుత్తం దేశంలో 1,246 మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలున్నాయి. తెలంగాణ, ఏపీల్లో 38 ప్రైవేటు, 2 ప్రభుత్వ ఏజెన్సీలున్నాయి. వంద మందికి ఉద్యోగావకాశం.. రాష్ట్రంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి వీసాలకు కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏజెన్సీల డిపాజిట్‌ను తగ్గించటంతో మోసాలు పెరిగే అవకాశముందని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు. కొత్త పథకం ప్రకారం ఒక్కో ఏజెన్సీకి ఐదేళ్ల పాటు లైసెన్సు అమల్లో ఉండటంతో పాటు వంద మందిని విదేశాలకు పంపించే అవకాశం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో మోసాలకు అలవాటు పడ్డ ఏజెన్సీలు ఈ లైసెన్సులను ఎరగా చూపి ఏటా వందలాది మంది నుంచి లక్షలు వసూలు చేసుకొని సొమ్ము చేసుకునే ప్రమాదముంది. 1983లో ఇమిగ్రేషన్ యాక్ట్‌లో భాగంగా ఓవర్సీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల రిజిస్ట్రేషన్ లైసెన్సు విధానం అమల్లోకి వచ్చింది. అప్పుడు లక్ష రూపాయల బ్యాంకు గ్యారంటీ డిపాజిట్ ఉండేది. క్రమంగా ఏజెన్సీలు మోసం చేయకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ గ్యారంటీని రూ.50 లక్షల వరకు పెంచుకుంటూ పోయింది. -
నా భార్యను కువైట్‌లో రూ.4 లక్షలకు అమ్మేశారు
నెల్లూరు, గూడూరు: ‘ఖతర్ దేశానికని చెప్పి.. కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ నా భార్యను రూ.4 లక్షలకు ఏజెంట్లు అమ్మేశారు. అక్కడ డబ్బులు ఇవ్వకుండా తనను నానా హింసలకు గురిచేస్తున్నారని ఆమె నాకు ఫోన్ చేసి బోరున విలిపించింది. నా భార్యను ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి.’ అని గూడూరు పట్టణానికి చెందిన పల్లిపాటి రమణయ్య అనే వ్యక్తి సోమవారం విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వివరాల మేరకు.. పట్టణంలోని పొట్టి శ్రీరాములు పార్క్ ప్రాంతానికి చెందిన రమణయ్య, పోలమ్మ భార్యభర్తలు. అందరి లాగే ఇతర దేశాలకు వెళ్లి బాగా సంపాదించాలని వీరు కూడా అనుకున్నారు. ఈ మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాలోని రైల్వే కోడూరుకు చెందిన గురవయ్య, మస్తాన్‌బాషా, శేషు, అమరావతి అనే ఏజంట్లును ఈ ఏడాది జనవరిలో కలిశారు. తమను ఖాతర్ దేశానికి పంపాలని కోరారు. దీంతో ఏజెం ట్లు రూ.1 లక్ష ఇవ్వాలని చెప్పారు. ఆ దంపతులు తమకున్న ఒకే ఒక ఇంటిని తాకట్టుపెట్టి ఏజంట్లకు నగ దు చెల్లించా రు. తీరా వారిని పంపే సమయంలో రమణయ్యకు వీసా రాలేదని పోలమ్మకు మాత్రమే వచ్చిందని చెప్పి.. ఆమెను ఖాతర్‌కు కాకుండా కువైట్‌కు పంపేశారు. అలా కువైట్‌కు వెళ్లిన పోలమ్మ నాలుగు నెలలపాటు మాత్రమే కొంత మొత్తం నగదు మాత్రమే తనకు పంపిందని రమణయ్య తెలిపాడు. ఆ తర్వాత భార్య పోలమ్మ తాను పని చేసే యజమాని డబ్బు ఇవ్వడం లేదని, తనను ఏజంట్లు రూ.4 లక్షలకు అమ్మేశారని భోరున విలపిస్తూ ఫోన్ చేసిందని వాపోయాడు. రూ.4 లక్షలు తీసుకొస్తేనే తిరిగి పంపుతామని వారు చెబుతున్నారని పోలమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్లు రమణయ్య వాపోయాడు. ఉన్న ఒక్క ఇంటినీ తాకట్టు పెట్టిన తాను రూ.4 లక్షలు ఎక్కడి నుంచి తేగలనని వాపోయాడు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులకు లేఖలు రాయడంతో పాటు రైల్వే కోడూరు పోలీసులతోపాటు, జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, తనకు న్యాయం చేయాలని రమణయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు. -
లైసెన్స్ దందా!
దళారీల జోక్యానికి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు బేఖాతరు అవుతున్నాయి. పేరుకు ఆన్లైన్ అన్న మాటే కానీ.. వ్యవహారం అంతా ఏజెంట్ల కనుసన్నల్లోనే సాగుతోంది. క్యూలో నిల్చొన్నా.. కొర్రీలతో కాలయాపన చేస్తుండటంతో ప్రజలు కూడా చేయి తడపక తప్పని పరిస్థితి. ఆన్లైన్ పుణ్యమా అని ‘వ్యాపారం’ తగ్గిపోయింది కాబోలు.. అధికారులు కూడా ‘మధ్యే’మార్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద కనిపించిన దృశ్యాలే ఇందుకు సాక్ష్యాలు. హిందూపురం అర్బన్: ‘‘రవాణా శాఖ కార్యాలయాల్లో దళారీలకు ప్రవేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని సహించబోం. కార్యాలయాల్లోకి పనుల కోసం వచ్చే వారిని పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తాం. ప్రజలకు సహాయం చేసేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తాం. దళారీల అక్రమాలపై నిఘాను పటిష్టం చేస్తాం.’’ – ఇదీ రవాణా శాఖ కమిషనర్ నిర్ణయం కొద్దిరోజుల పాటు ఈ ఆదేశాలు అమలయినా.. ఆ తర్వాత షరా మామూలే. ఆర్టీఓ కార్యాలయంలో దళారీలు లేనిదే పని జరగదనే విషయం అర్థమయ్యేందుకు ప్రజలు ఎన్నో రోజులు పట్టలేదు. చదువుకున్న వారైనా.. నిరక్షరాస్యులైనా మధ్యవర్తులను ఆశ్రయిస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఈ నెల 11న హిందూపూర్‌కు చెందిన ప్రకాష్ కొత్త బండి రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నంబర్ కోసం.. రవాణా శాఖ కార్యాలయంలో నేరుగా వెళ్లి కలిశాడు. బిల్లులు.. పత్రాలు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్.. ఇలా చాంతాడు నిబంధనలు చెప్పగా మూడు రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఫ్రెండ్ సలహా మేరకు ఏజెంట్‌ను కలిసి రూ.7,500 చేతిలో పెట్టడంతో ఇట్టే పనైపోయింది. అదేవిధంగా ఈనెల 5వ తేదీన చోళూరు గ్రామానికి చెందిన చరణ్ లెర్నింగ్ లైసెన్సు కోసం రూ.260 చలానా కట్టి, లైసెన్సు కోసం రూ.1200 మరో చలానా కట్టి ఆఫీసు సిబ్బంది చెప్పిన ఆధార్, దరఖాస్తు, ఫొటోలు అందజేసి ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యాడు. డిగ్రీ పూర్తిచేసిన ఇతను ఆన్లైన్ పరీక్ష పాస్ కాలేకపోయాడు. అతనితో పాటు పరీక్షకు హాజరైన పదవ తరగతి పాసైన బీడీ బంకు అబ్దుల్ పాసయ్యాడు. ఇతను దళారీకి రూ.5వేలు చెల్లించడంతో పని పూర్తయినట్లు తెలుసుకున్న ప్రకాష్.. తిరిగి ఆ ఏజెంట్‌ను కలిసి చలానాతో పాటు రూ.2వేలు సమర్పించుకోవడంతో ఎల్ఎల్ఆర్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. ఇలా.. ఆర్టీఓ కార్యాలయంలో ఎలాంటి పనైనా దళారీల ద్వారానే సాగుతోంది. ఏజెంట్ల దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కార్యాలయం పరిసరాల్లోని టీ బంకులు, జిరాక్సు షాపుల్లో ఏజెంట్లు పాగా వేసి పని కానిచ్చేస్తున్నారు. కార్యాలయం ప్రారంభానికి ముందు.. సాయంత్రం వేళల్లో ప్రయివేట్ వ్యక్తులు నేరుగా వెళ్లి పలు విభాగాల్లో చక్రం తిప్పుతుండటం గమనార్హం. దస్తూరి, ఇనిషియల్ కోడ్‌తో చేపట్టిన రిజిస్ట్రేషన్లు, ఇతరత్రాల లెక్కింపు రిజిస్ట్రేషన్, లైసెన్సు, నెంబర్ ఇలా ఏ పనికోసం వచ్చిన దరఖాస్తులనైనా చేతిరాత.. లేదంటే కోడ్ ఆధారంగా దందా సాగుతోంది. ఇలాంటి దరఖాస్తులకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టడం లేదని.. నేరుగా వచ్చే దరఖాస్తుల విషయంలోనే కొర్రీలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సవాలక్ష ప్రశ్నలతో విసిగించడం.. అవసరమైన కాగితాలన్నీ పూర్తిస్థాయిలో లేవని చెప్పి పంపుతుండటంతో దరఖాస్తుదారులు విధిలేని పరిస్థితుల్లో దళారీలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులు పూరించడం మొదలు.. క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా దళారీలు అన్ని పనులు సవ్యంగా చేసి పెడుతుండటంతో మధ్యవర్తులతోనే పని కానిచ్చేస్తున్నారు. జేబుకు చిల్లు పడుతుందనే విషయం తెలిసినా తప్పదన్నట్లు చేయి తడుపుతున్నారు. కనిపించని హెల్ప్‌డెస్క్ దళారీలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఆర్టీఓ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ప్రకటించినా.. హిందూపురంలో ఆ ఊసే కరువయింది. దరఖాస్తులు పూరించడం.. ఎలాంటి పత్రాలు సమర్పించాలి.. ఎక్కడ వీటిని అందజేయాలి? ఇతరత్రా సమస్యలకు ఇక్కడ సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇక్కడి సెక్యూరిటీ గార్డులు కనీసం లోపలికి వెళ్లనివ్వకపోవడం చూస్తే దళారీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. మరో నాలుగు రోజుల్లో ఆర్టీఓ కార్యాలయం సొంత భవనంలోకి మారుతున్న నేపథ్యంలో అక్కడైనా దళారీల దందాకు అడ్డుకట్ట వేసి కమిషనర్ ఆదేశాలను పాటించాలని స్థానికులు కోరుతున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం కార్యాలయం వద్ద సాధ్యమైనంత వరకు దళారీలు, మ«ధ్యవర్తులను నియంత్రిస్తున్నాం. గతంతో పోలిస్తే.. నేను బా«ధ్యత తీసుకున్న తర్వాత చాలా వరకు తగ్గింది. వారి జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటాం. ప్రయివేట్ బిల్డింగ్ కావడంతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు కష్టమయింది. కొత్త కార్యాలయంలోకి వెళ్లాక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి మరింత కఠినంగా వ్యవహరిస్తాం. – మల్లికార్జున, ఇన్చార్జి ఆర్టీఓ, హిందూపురం -
రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారానే విదేశాలకు వెళ్లాలి : డీఆర్వో
అనంతపురం అర్బన్: ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఏజెంటు ద్వారానే విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాలని ప్రజలకు జిల్లా రెవెన్యూ అధికారి సి.మల్లీశ్వరిదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బోగస్ ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లరాదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే సమయంలో ఇతరులు ఇచ్చిన పార్సిళ్లు, ప్యాకెట్లను తీసుకెళ్లరాదన్నారు. అలా వెళితే ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లిన తరువాత ముందుగా భారత దౌత్యవేత్తలను కలవాలన్నారు. మరింత సమాచారం కోసం 1800 113 090 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఫైనల్ లే అవుట్ రాలేదా? రెరాలో నమోదు తప్పనిసరి!
♦ విక్రయాలు జరిపే రియల్టీ పోర్టల్స్ కూడా రెరా పరిధిలోకే ♦ డెవలపర్లే కాదు.. బ్రోకర్లు, ఏజెంట్లూ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే ♦ రెరా అమలుతో రియల్టీ బ్రాండ్ అంబాసిడర్లూ ప్రకటనల్లో జాగ్రత్త సాక్షి, హైదరాబాద్ దశాబ్దం క్రితం స్థానిక సంస్థల నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకొని లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు విక్రయించేసి.. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల వంటి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జారుకున్నారు డెవలపర్లు. ఫైనల్ లే అవుట్ అనుమతులనూ తీసుకోలేదు. అయితే త్వరలోనే తెలంగాణలో అమల్లోకి రానున్న రెరా నిబంధనల్లో ఫైనల్ లే అవుట్ తీసుకొని వెంచర్లను కూడా రెరా పరిధిలోకి చేర్చారు. దీంతో ఆయా లే అవుట్లలో ఇప్పుడు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను ధిక్కరిస్తే.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఏజెంట్లు రెరా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ రాష్ట్రంలో మాత్రమే ప్లాట్ల క్రయ విక్రయాలు చేపట్టాలి. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లోనూ స్థలాలను విక్రయించాలంటే సంబంధిత రాష్ట్రంలోని రెరా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెరా వద్ద నమోదు చేయని ఫ్లాట్లను గానీ ప్లాట్లను గానీ విక్రయించడానికి వీల్లేదు. కేవలం రెరాలో నమోదు చేసుకున్న లే అవుట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లు రెరాలో నమోదు చేసుకోని పక్షంలో ప్రతి రోజూ రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. రెరా నిబంధనలను పాటించకపోతే ప్లాట్ విలువలో 5 శాతం జరిమానా, అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను దిక్కరిస్తే మాత్రం ప్లాట్ విలువ 10 శాతం జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష. రెండూ కూడా విధించవచ్చు. టైటిల్ గ్యారెంటీ ఇవ్వాల్సిందే.. హెచ్ఎండీఏ పరిధిలోనే కాదు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని లే అవుట్లను కూడా రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. కొనుగోలుదారులకు టైటిల్ గ్యారెంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైగా లే అవుట్లలో చేసే మౌలిక వసతులకు ఐదేళ్ల గ్యారెంటీ బాధ్యత కూడా డెవలపర్లదే. బ్రోచర్లో పేర్కొన్న విధంగా వెంచర్‌లోని అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేయాలి. లేకపోతే స్థల యజమానే కాదు ఏజెంటూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ‘‘అనుమతుల, పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసే ప్రభుత్వం మాత్రం డెవలపర్‌కు టైటిల్ గ్యారెంటీ ఇవ్వదు. కానీ, డెవలపర్ మాత్రం కొనుగోలుదారులకు ఇవ్వాలనడం సరైంది కాదని’’ రామ్ డెవలపర్స్ ఎండీ వనపర్తి రాము తెలిపారు. విక్రయాలు జరిపే పోర్టల్స్ రెరా పరిధిలోకే... ఆన్లైన్ ప్రాపర్టీ పోర్టల్స్ అడ్వరై్టజ్‌మెంట్ మాత్రమే చేస్తే రెరాలో నమోదు అవసరం లేదు. ఒకవేళ ఆయా పోర్టల్స్ డెవలపర్ల నుంచి కమీషన్ తీసుకొని ప్రాపర్టీలను విక్రయిస్తే మాత్రం రెరాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. ప్రకటనల విషయంలోనూ పోర్టల్స్ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్ట్‌లు, వెంచర్లను మాత్రమే ప్రచారం చేయాల్సి ఉం టుంది. అలాగే పత్రికలు, ప్రసార మాధ్యమాలు సైతం ఆయా ప్రాపర్టీలకు రెరా నంబరుం టేనే ప్రకటనలను తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో కొనుగోలుదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ధరలు పెంచనున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లు.. రెరాలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రెరా అమలయ్యాక నిర్మాణ గ్యారెంటీ విషయంలో మాత్రం డెవలపర్‌కు, కాంట్రాక్టర్లకు మధ్య జరిగే ఒప్పంద పత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, డెవలపర్ల మధ్య జరిగే ఒప్పంద పత్రంలో చ.అ. ధరలు, నిర్వహణ బాధ్యతలు తదితరాలుంటాయి. కానీ, రెరా అమలు తర్వాతి నుంచి భవన నిర్మాణ నాణ్యత విషయంలోనూ కాంట్రాక్టర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఓ డెవలపర్ తెలిపారు. ఎందుకంటే కొనుగోలుదారులకు నిర్మాణ గ్యారెంటీ బాధ్యత వహించేది డెవలపర్లే కాబట్టి! దీంతో ఇప్పటివరకు ఏడాది లీకేజీ నిర్వహణ బాధ్యతలకు మాత్రమే పరిమితమైన ఒప్పంద పత్రం నిబంధనల్లో రెరాతో ఐదేళ్ల గ్యారెంటీ నిబంధన కూడా ఉంటుందని తెలిపారు. అయితే నిర్వహణ కాలపరిమితి పెరగడంతో నిర్మాణ ధరలనూ పెంచక తప్పని పరిస్థితి అని కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సచితానంద్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సాధారణ నిర్మాణాలకు చ.అ.కు రూ.1,200, ఏడంతస్తుల వరకైతే రూ.1,350, ఆపైన నిర్మాణాలకైతే రూ.2 వేలపైమాటే చార్జీలున్నాయి. ఇవి రెరా అమలు తర్వాతి నుంచి సుమారు చ.అ. రూ.50–100 పెరుగుతాయని పేర్కొన్నారు. రియల్టీ బ్రాండ్ అంబాసిడర్లూ జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో స్థిరాస్తి సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునే సంస్కృతి పెరిగింది. అయితే గతంలో లాగా అంబాసిడర్లు కేవలం ప్రాజెక్ట్ వారీగా ఒప్పందం చేసుకుంటే సరిపోదు. రెరా అమలయ్యాక సంబంధిత ప్రాజెక్ట్ రెరాలో రిజిస్టరైందా? అనుమతి పత్రాలన్నీ సరిగా ఉన్నాయా? బ్రోచర్లో పేర్కొన్న హామీలనే ప్రకటనల్లోనూ చెబుతున్నాడా? వంటి అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించే కొనుగోలుదారులకు బ్రాండ్ అంబాసిడర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు బ్రోచర్లో లేని హామీలను సైతం బ్రాండ్ అంబాసిడర్ల చేత ప్రకటనలు చేయిస్తుంటారు. వీటికి ఆకర్షితులైన కస్టమర్లు కొనుగోళ్లు చేసేశాక.. హామీలు నెరవేర్చలేదనే కారణంగా ఫోరంను ఆశ్రయిస్తే గనక ప్రకటనల్లో నటించినందుకు గాను బ్రాండ్ అంబాసిడర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చే అవకాశముంది. ⇔ ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున వర్సిటీ పక్కన ఖాజా గ్రామంలో రామకృష్ణ హౌజింగ్ నిర్మిస్తున్న వెనుజియా ప్రాజెక్ట్‌కు మహేశ్‌బాబు, హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో డ్రీమ్ ఇండియా నిర్మిస్తున్న డ్రీమ్ రిసార్ట్‌కు అనిల్ కపూర్, సువర్ణ భూమి సంస్థకు ఎస్పీ బాల సుబ్రమణ్యం, కె విశ్వనాథ్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. -
నా బిడ్డనూ కువైట్‌లో అమ్మేశారు
చిత్తూరు: పిల్లలు పుట్టలేదని భర్త వేధించడంతో భరించలేక ఓ మహిళ పుట్టింటికి చేరుకుంది. ఇదే అదునుగా భావించి ఏజెంట్లు రంగ ప్రవేశం చేశారు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి కువైట్ కు పంపించారు. కువైట్ చేరుకున్న కొద్ది రోజుల్లోనే మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అక్కడి నుంచి ఒకసారి తన తల్లికి ఫోన్ చేసి తన గోడు వెల్లబోసుకుంది. తనను ఒక షేక్ కు అమ్మేశారని, ఆ షేక్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ కన్నీరుమున్నీరైంది. ఇది జరిగి మూడేళ్లవుతుంది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆ మహిళ ఉందో లేదో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అరవిందపురం గ్రామానికి చెందిన కొండగంటి జయరాజ్, మణెమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె మల్లిక. ఆమెను మదనపల్లెకు చెందిన ఆనంద్ అనే వ్యక్తితో 15 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. అయితే సంతానం లేకపోవడంతో భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. కొన్నేళ్లపాటు సహనం వహించినా భరించలేని స్థితితో మల్లిక తిరిగి పుట్టింటికొచ్చింది. దాంతో కొందరు ఏజెంట్లు వచ్చి మల్లికకు మాయమాటలు చెప్పడం ప్రారంభించారు. జిల్లాకు చెందిన చాలా మంది కువైట్ వెళ్లారని, అక్కడ మంచి జీతం వస్తుందని, జీవితం మారిపోతుందంటూ అనేక రకాలుగా మభ్యపెట్టడం ప్రారంభించారు. వారి మాటలు నమ్మి మల్లిక కువైట్ పయనమైంది. అంతే అక్కడికి వెళ్లిన తర్వాత గానీ తనను కువైట్ లోని ఒక వ్యక్తికి విక్రయించారని గ్రహించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు సోమవారం డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కురబలకోటకు చెందిన ఏజెంట్లు నజీర్, జాకీర్లు తన బిడ్డ మల్లికను కువైట్‌కు పంపించి అక్కడ ఒక సేట్‌కు అమ్మేశారని చెప్పారు. ఆరు నెలల కిందట తన కూతురు ఫోన్లో మాట్లాడి తన గోడును వినిపించిందనీ, కువైట్ లో తన బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని వెల్లబోసుకున్నారు. తన దేశానికి వెళ్లిపోతానంటే రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారనీ, సేట్‌కు రూ.2 లక్షలు చెల్లించి తనను వెంటనే తీసుకెళ్లాలని వేడుకున్నా ఏజెంట్లు నా బిడ్డకు న్యాయం చేయలేదంటూ మల్లిక తల్లి డీఎస్పీ ముందు వివరించారు. మదనపల్లె బసినికొండ కాలనీకి చెందిన వెంకటరమణ భార్య రాణిని 10 రోజుల క్రితం ఏజెంట్లు జాకీర్, నజీర్‌లు కువైట్‌కు పంపారని... ఆమె వెళ్లిన 6 రోజులకే అక్కడి చనిపోయినట్టు పత్రికల్లో రావడంతో అందుకు కారకులైన ఆ ఇద్దరు ఏజెంట్లే తమ బిడ్డకు కూడా తీరని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఏజెంట్లను కఠినంగా శిక్షించి మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ తల్లి రాణెమ్మ పేర్కొంది. -
లక్కీడిప్ నిర్వహకుల అరెస్్ట
ఆత్మకూరు: వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామ సమీపంలో జమ్ములమ్మ గుడివద్ద లక్కీడిప్ నిర్వహకులను అరెస్టు చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనుమతులు లేకుండా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్ ప్రైజస్, లక్ష్మీ నరసింహ ఎంటర్ ప్రైజస్‌లను అనంతపురానికి చెందిన లక్ష్మీరెడ్డి, శ్రీపతిరావు పేటకు చెందిన ప్రభాకర్‌రెడ్డిలు ఏర్పాటు చేశారన్నారు. కొద్ది మంది ఏజెంట్లను నియమించుకొని లక్కీడిప్ నిర్వహిస్తున్నారన్నారు. సమాచారం రావడంతో దాడిచేసి నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.55,000 నగదు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక ఇండికా విస్టా కారు, ఐదు సెల్ఫోన్లు, ఒక రోలింగ్ మిషన్, నాలుగువేల టోకెన్స్, 22 రశీదు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏజెంట్లు సాంబశివరావు, హుస్సేన్, సుబ్బారావు, రాముడులను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. దాడుల్లో సీఐ కృష్ణయ్య, వెలుగోడు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. మోసపోవద్దు... లక్కీడిప్‌లతో మోసపోవద్దని, ఎక్కడైనా ఇలాంటి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్ సూచించారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఎంటర్ ప్రైజస్, లక్ష్మీ నరసింహఎంటర్ ప్రైజస్ ద్వారా 9వేల మందితో రూ. 3కోట్లకు పైగా వసూలు చేసినట్లు తమ విచారణలో బయటపడిందన్నారు. ఆత్మకూరు ప్రాంతంలో కూడా ఇలాంటి ఉన్నాయని, వాటిపై దృష్టి సారించామన్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కాయ్ రాజా..కాయ్
► పదికి రూ.100, వందకు రూ.1000 ► వెంకటేశ్వరపురం కేంద్రంగా జోరుగా సింగిల్ నంబర్లాట ► ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో విచ్చవిడిగా జూదం నెల్లూరు: నగరంలోని వెంకటేశ్వరపురం కేంద్రంగా సింగిల్ నంబరు నిర్వహణ జోరుగా కొనసాగుతోంది. పదికి రూ.100, వందకు రూ.1000 వస్తుందని ఆశ చూపి కొందరు నిర్వాహకులు జూదాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నడుస్తున్నా ఈ మధ్య కాలంలో బహిరంగంగానే ఈ ఆట కొనసాగుతోంది. వెంకటేశ్వరపురంలో కేంద్రంగా జరుగుతున్న ఈ ఆట చుట్టు పక్కల ప్రాంతాలైన జనార్ధన్ రెడ్డి కాలనీ, పడుగుపాడు, కోవూరు, సాలుచింతల ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వందకు వెయ్యి వస్తుందన్న ఆశతో చిన్న, మధ్య తరగతి వారు ప్రధానంగా యువకులు ఆకర్షితులై ఈ ఆట ఆడుతూ అప్పుల పాలై నష్టపోతున్నారు. వెంకటేశ్వరపురంలో ఉన్న ఏజెంట్ల వద్ద వంద కడితే నంబరు తగిలితే రూ.1000 వస్తుంది. ఆ వెయ్యిలో ఏజెంట్ కమీషన్ రూపంలో రూ.200 పట్టుకొని రూ.800 ఇస్తున్నారు. రూ.10 నుంచి ఈ ఆట మొదలవుతోంది. వెంకటేశ్వరపురం సెంటర్లో ఉన్న ఏజెంట్లు ఈతంతగాన్ని నడిపిస్తూ కమీషన్లతో లబ్ధిపొందుతుంటే, దీని బారిన పడినవారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కష్టం చేసి కూలి డబ్బులు తెచ్చుకుని ఏజెంట్ల చేతుల్లో పెడుతున్నారు. ఓ వ్యక్తి ఇటీవల రూ.20 వేలు నంబర్ల ఆటలో పోగొట్టుకున్నట్లు తెలిసింది. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో మరిన్ని అప్పులు చేస్తూ అప్పుల పాలైపోతున్న పరిస్థితిలో కూరుకుపోయాడు. ప్రతి రోజూ ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి నంబర్లను ఏజెంట్లు ప్రకటిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. తెల్లవారు జాము నుంచే సెంటర్లలో నిర్వాహకుల సందడి మొదలవుతోంది. ఏ నంబరుకు ఆడితే ఎంత వస్తుంది.. ఎంత మంది పందెం పెట్టారు అన్న అంశంపై చర్చతో వీరి ఆట ప్రారంభమవుతోంది. గతంలో సింగిల్ నంబర్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పేద, మధ్య తరగతి వారే కాకుండా కొందరు వ్యాపారస్తులు సైతం ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. ఒక్క వెంకటేశ్వరపురంలోనే రోజుకు రూ.లక్ష వరకు ఈ ఆటలో లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో ‘కాటన్’ వలె ఇప్పుడు సింగిల్ నంబర్ల ఆటలో కూడా చాలా మంది డబ్బులు పొగొట్టుకొని బాధపడుతున్నారు. ముఖ్యంగా నిర్వాహకులు కొత్త వారిని ఆకర్షిస్తూ వారితో ఆట ఆడిస్తున్నారు. రూ. లక్షల్లో ఈ ఆట కొనసాగుతుందంటే ఈ వ్యసనం ఏ మేరకు వ్యాపించిదో తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి నిషేధిత ఆటలను పోలీసులు గుర్తించి మరికొంత మంది దీని బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
కోటి రూపాయలను మార్చడానికి గంట చాలట!
ముంబాయి : పాత నోట్లకు బదులు కొత్త నోట్లను ఎలా తీసుకోవాలి, రోజువారీ కార్యకలాపాలు ఎలా సాగించాలి అని కోట్లాది మంది ప్రజలు తలలు పట్టుకుంటుంటే, కొంతమంది మాత్రం కోట్లకు కోట్ల పాత నోట్లను ఒక్క గంటల్లోనే మార్చేసుకుంటున్నారు. ఎంచక్కా బ్లాక్‌మనీని కొత్త కరెన్సీ నోట్ల రూపంలోకి మార్చేసుకుని ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తెస్తే మాకేమన్నటూ వ్యవహరిస్తున్నారు. వీటికి అద్దం పడుతూ తాజాగా సీఐడీ, ఐటీ, సీబీఐ తనిఖీల్లో భారీగా కొత్త కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. అక్రమ మార్గంలో నగదు మార్చడానికి బ్లాక్‌మనీ హోల్డర్స్‌కు ఏజెంట్స్ సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఒక గంటల్లో వారు కోటి రూపాయలను మార్చేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా కమీషన్ తీసుకుంటున్నారని వెల్లడవుతోంది. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా వారు పాత నోట్లను తేలికగా మార్చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ రూ.5 కోట్లను మార్చాల్సిన పరిస్థితి వస్తే, కొన్ని షరతులతో వాటిని మారుస్తున్నామని వారే చెబుతున్నారు. చేసేది అక్రమమైనా ఎలాంటి బెరుకు, భయం లేకుండా, ప్రభుత్వం ఏం చేస్తుందిలే అనే ధోరణిలో ఎవరైనా నోట్లు మార్చుకోవాలంటే తమని సంప్రదించాలని పేర్కొంటున్నారు. అయితే కమీషన్‌గా 10 శాతం ఇవ్వాలంటున్నారు. అంటే కోటి రూపాయలను మారిస్తే రూ.10 లక్షలను వారు కమీషన్‌గా తీసుకుంటున్నారట. వీరికి లంచమిస్తూ చాలామంది పెద్దలు, బ్లాక్‌మనీ హోల్డర్స్ నగదు మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.. ఈ కుంభకోణంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకర్లు ప్రమేయం ఉందని కూడా వెల్లడవుతోంది. ఇటీవల వీటిని రుజువు చేస్తూ చాలామంది బ్యాంకర్లు పట్టుబడుతుండటం కూడా వీటికి నిదర్శనంగా మారుతోంది. బ్లాక్‌మనీ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాత నోట్ల రద్దు ఏ మేరకు సత్ఫలమిస్తుందో తెలియదు కానీ, కొత్త రకం అవినీతికి మాత్రం ఇది తెరతీసినట్టు ఓ ఇంగ్లీష్ దినపత్రిక జరిపిన పరిశోధనలో వెల్లడైంది. -
రవాణా శాఖ సేవలూ ఇకపై ఆన్లైన్లోనే..
–ఇక ఏజెంట్ల వ్యవస్థకు చెక్ –15 నుంచి షోరూముల్లో రిజిస్ట్రేషన్లు –వినియోగదారులకు ఊరట తణుకుః రవాణాశాఖలో సంస్కరణలు తెచ్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆన్లైన్ సేవలను అందిస్తుండగా ఈనెల 15 నుంచి షోరూముల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయల్లో రిజిస్ట్రేషన్లకు స్వస్తి పలికేందుకు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా కాలంగా తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో ఉంటున్న వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసి ఆయా షోరూముల్లో రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ విధానాన్ని జిల్లాకు వర్తింపజేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సేవలన్నీ ఆన్లైన్... జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసి ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఫ్యాన్సీ నెంబర్లు సైతం ఆన్లైన్లో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఏలూరు జిల్లా ఉపరవాణాశాఖ కార్యాలయం, భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో యూనిట్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలోని వాహన రిజిస్ట్రేషన్లు, డ్రై వింగ్ లైసెన్సులు, వాహన ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్, లైసెన్సుల రెన్యువల్స్, నకళ్లు వంటి 83 రకాల సేవలు అందిస్తుంటారు. ప్రసుతం ఈ సేవలన్నీ పొందడానికి వాహనదారులు ఆయా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు అధికారులు, వాహనదారులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా వాహనదారులే ఆన్లైన్ ద్వారా సేవలు పొందడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయా వాహన షోరూములకు అప్పగించనున్నారు. దీంతో వాహనం కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. వేలిముద్రతో సేవలు... మీసేవ, ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రాల్లో రవాణా సేవలు లభించనున్నాయి. ఇంటర్నెట్ కేంద్రాలు, వ్యక్తిగతంగా ఆన్లైన్లో సేవలు పొందే అవకాశం ఉంది. ఆయా సేవలకు ప్రభుత్వం నిర్థేశించిన ఫీజులతోపాటు నామమాత్రపు సర్వీసు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాహనదారుడు వేలి ముద్రతో సేవలు అందుకోవాల్సి ఉంది. ఇçప్పటికే ఆధార్ నమోదులో ఐరిస్, వేలిముద్రలు సేకరించడంతో రవాణాశాఖలో ప్రతి సేవకు ఆధార్ తప్పనిసరి కానుంది. షోరూంలో వాహనం కొనుగోలు చేయగానే 15 నిమిషాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్, గంట వ్యవధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇందుకు వాహనదారుడి సంతకం, వేలిముద్రలు అప్లోడ్ చేస్తారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌లోని వేలిముద్ర సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతరం పత్రాలు వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఈ విధానంపై జిల్లాలోని ఆయా షోరూం యాజమాన్యాలకు ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి 15నుంచి అమలు చేయనున్నారు. ఫ్యాన్సీ నెంబర్లు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్సీ నెంబర్ కావాల్సిన వాహనదారులు ఆయా రవాణాశాఖ కార్యాయాల్లో సంప్రదించాల్సి ఉంది. కార్యాలయానికి రానవసరం లేదు... వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వాహనదారుడు కార్యాలయానికి రాకుండానే శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఇందుకు వాహనదారుడి వేలిముద్రలు తీసుకోవడంతోపాటు వాహనం ఫొటోలు తీసి కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. అనంతరం కార్యాలయ అధికారులు నిర్థారించిన తర్వాత గంట వ్యవ««ధిలో శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో 15 రోజుల్లో స్పష్టత రానుంది. – ఎస్.సత్యనారాయణమూర్తి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఏలూరు -
గల్ఫ్ డ్రీమ్స్ చెదురుతున్నాయి
పొట్టచేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు ‘తూర్పు’వాసుల పయనం ఉపాధి ఉచ్చులో చిక్కుకుని విలవిల పనిభారం.. చాలీచాలని జీతం యజమానుల శారీరక, మానసిక వేధింపులు తోడవుతున్న ఏజెంట్ల మోసాలు విజిటర్ వీసాలతో ఇబ్బందులు ఉన్న ఊరిలో ఉపాధి కరువయ్యో.. బతుకు బరువయ్యో.. నాలుగు కాసులు వెనకేసుకుని.. జీవనరథాన్ని మరింత పైకి తీసుకువెళ్లవచ్చన్న ఆశో.. విదేశీ ఉపాధిపై మోజో.. ఏదైతేనేం..! బంగారు భవిత కోసం కలలు కని.. వాటిని సాకారం చేసుకోవాలన్న కాంక్షతో.. చాలామంది అప్పోసొప్పో చేసి.. తమపై వల వేసిన ఏజెంట్లకు సొమ్ములు సమర్పించుకుని.. రెక్కలు కట్టుకుని రివ్వుమంటూ గల్ఫ్ దేశాలకు ఎగిరిపోతున్నారు. తీరా వెళ్లాక..ఏజెంట్ల చేతిలో మోసపోయో.. అక్కడి యజమానుల నిరంకుశ వైఖరికి తాళలేకో.. వారు ఇచ్చే జీతాలు చాలకో.. కట్టుబానిసల కంటే దుర్భరంగా మారిన.. దిగజారిన జీవనానికి కలత చెందో.. తిరిగి సొంతగూటికి వచ్చేయాలనుకుంటున్నారు. కానీ.. గల్ఫ్ యజమానుల ‘గృహబందిఖానా’ నుంచి తప్పించుకునే దారి లేక.. తప్పించుకున్నా.. స్వదేశానికి చేరే మార్గం కానరాక.. రెక్కలు తెగిన పక్షులై.. అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బంగారు భవిత కోసం కన్న గల్ఫ్ కలలు చెదిరిపోవడంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులూ వ్యధాభరిత జీవనం సాగిస్తున్నారు. చెదిరిపోతున్న గల్ఫ్ కలలపై ‘సాక్షి’ ఫోకస్.. ‘తూర్పు’ నుంచి గల్ఫ్ దేశాలకు.. ∙జిల్లా నుంచి ఏటా 3 వేల మంది వరకూ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. ∙కోనసీమ నుంచి ఇప్పటికే 40 వేల మందికి పైగా గల్ఫ్ దేశాలైన మస్కట్, దుబాయ్, బహ్రెయిన్, కతార్, కువైట్, సౌదీ అరేబియా దేశాలకు వలస వెళ్లారు. ∙అక్కడి ఇళ్లల్లో పిల్లల సంరక్షకులుగా, వంట మనుషులుగా, డ్రైవర్లుగా, వాచ్మన్లుగా, వృద్ధులకు సహాయకులుగా పని చేస్తున్నారు. ∙వీరిలో 60 శాతం మంది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉపాధి పొందుతున్నప్పటికీ మిగిలిన 40 శాతం మందీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ∙జిల్లాలో దాదాపు 3 వేల మంది గల్ఫ్ ఏజెంట్లున్నారు. రాజోలు నియోజకవర్గానిదో ప్రత్యేకత జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నా.. కోనసీమలో మరింత ఎక్కువగా.. అందునా రాజోలు నియోజకవర్గం నుంచి ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 20 వేల మంది పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లారు. నియోజకవర్గంలో 60 గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామం నుంచీ కనీసం 300 మందికి తక్కువ కాకుండా విదేశాల్లో ఉన్నారు. ఒక్క సఖినేటిపల్లి గ్రామంలోనే 80 శాతం కుటుంబాల్లో.. కుటుంబానికి ఒకరు చొప్పున గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. అలాగే అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం తుమ్మలపల్లి, కొమరిగిరిపట్నం గ్రామాల్లో కూడా 70 శాతం కుటుంబాల్లో ఎవరో ఒకరు ఆ దేశాల్లో పని చేస్తున్నారు. వీసాలతో మోసాలు మొదలు కొన్ని సంవత్సరాలపాటు స్థిరపడేందుకు విదేశాలకు వెళ్తే పూర్తిస్థాయి వీసా, పాస్‌పోర్టు తీసుకోవాలి. విదేశాల్లోని బంధువుల ఇళ్లకు లేదా ఏవైనా పర్యాటక ప్రదేశాలు చూసి వచ్చేందుకు వీలుగా విజిటర్ వీసా జారీ చేస్తారు. ఈ వీసాపై వెళ్లినవారు మూడు నెలలకు తిరుగు ప్రయాణం కావాలి. గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం పంపించేవారిని ఈ విజిటర్ వీసాతోనే ఏజెంట్లు పంపిస్తున్నారు. అక్కడి షేక్‌ల ఇళ్లల్లో ప్రైవేటు అగ్రిమెంట్లతో పనులకు కుదుర్చుతున్నారు. నచ్చినా.. నచ్చకున్నా.. చచ్చినట్టు ఉండాల్సిందే తన ఇంట్లో పనికి కుదిరిన వ్యక్తికి సంబంధిత షేక్.. తన చిరునామాతో అధికారికంగా రెసిడెంటల్ సర్టిఫికెట్ మంజూరు చేయిస్తాడు. దీనినే ‘బతాకా’ అంటారు. పనిలో చేరగానే ఆ వ్యక్తి పేరుతో జారీ అయిన రెసిడెంటల్ సర్టిఫికెట్, వీసా, పాస్‌పోర్టులను ఆ షేక్ తీసుకుని తనవద్దే ఉంచుకుంటాడు. దీంతో పనిలో చేరాక నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఆ షేక్ వద్దే ఉండాలి. ఆవిధంగా ఉపాధి కోసం వెళ్లిన ఇల్లే ఆయా వ్యక్తులకు బందిఖానా అవుతుంది. ఆ చెర నుంచి ఎలాగోలా బయటపడినా స్వదేశం వెళ్లేందుకు వారివద్ద పాస్‌పోర్టు ఉండదు. బయటకు వచ్చాక పోలీసులకు పట్టుబడితే రెసిడెంటల్ సర్టిఫికెట్ చూపించలేక జైలు పాలవుతారు. ఒకవేళ పని కుదిర్చిన ఏజెంటు, సంబంధిత షేక్‌ల మధ్య సత్సంబంధాలు లేకపోతే, అగ్రిమెంటు కాలపరిమితి ముగిశాక ఆ వ్యక్తి పరిస్థితి అగమ్యగోచరమే అవుతుంది. అలాంటప్పుడే వీసా ఇబ్బందుల్లో పడిపోయి, దిక్కు లేని పక్షుల్లా ఆ దేశాల్లోనే.. షేక్‌ల ఇళ్లల్లోనే చాలామంది మగ్గిపోతున్నారు. షేక్‌ల ఇళ్ల నుంచి బయటపడినా.. పోలీసులకు చిక్కినప్పుడు అక్కడి భాష రాక సరిగా మాట్లాడలేక, ఆధారాలు చూపించలేక చాలామంది జైళ్ల పాలవుతున్నారు. అధికారిక అగ్రిమెంట్ అయితే ఓకే.. గల్ఫ్ దేశాల్లో షేక్‌లు తమ ఇంట్లో పని చేసేందుకు ఎవరినైనా భారత్ నుంచి తీసుకువెళ్లాలనుకుంటే.. ఏజెంట్ల సహాయంతో, ఆ వ్యక్తి చిరునామాతో ఇండియన్ ఎంబసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ వ్యక్తి పేరిట ఎంబసీకి రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తిని తన దేశం తీసుకువెళ్లి ఇంట్లో పని చేయించుకునేందుకు, ఆ షేక్‌కు, ఎంబసీకి మధ్య రెండేళ్ల కాల పరిమితితో అగ్రిమెంటు జరుగుతుంది. అందులో నిబంధనలు పొందుపరచి షేక్, పనికి వచ్చే వ్యక్తి సంతకాలను ఎంబసీ తీసుకుంటుంది. ఆ వ్యక్తిని రెండేళ్లలో పంపించేస్తే ఆ షేక్ డిపాజిట్ చేసిన రూ.2 లక్షలు ఇచ్చేస్తారు. ఒకవేళ చనిపోయినా లేదా తీవ్రంగా గాయపడినా ఆ వ్యక్తిని షేక్ సొంత ఖర్చులతోనే స్వదేశం పంపించాలి. రెండేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా షేకే సొంత ఖర్చులతో స్వదేశానికి సాగనంపాలి. ఈ అధికారిక అగ్రిమెంట్లను ఏడాది కాలంగా గల్ఫ్ దేశాలు కచ్చితంగా అమలు చేస్తున్నాయి. దీంతో ఇటీవల 50 నుంచి 60 శాతం మంది అధికారిక అగ్రిమెంట్లతోనే వెళుతున్నారు. మిగిలిన 40 శాతం మంది విజిటర్ వీసాలతో ఏజెంట్లు కుదిర్చే ప్రైవేటు అగ్రిమెంట్లతో పనులకు వెళ్తున్నారు. ఏజెంట్లు ఇక్కడ చెప్పేదొకటి.. అక్కడ జరిగేదొకటి గల్ఫ్‌కు అనేకమందిని పంపించిన అపార అనుభవంతో కొంతమంది ఏజెంట్లు ఆయా దేశాల్లో సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. జిల్లాలోని ఏజెంట్లకు ఫోన్లు చేసి ఫలానా పనుల కోసం ఇంతమంది కావాలని చెబుతారు. ఇక్కడ ఒక ఏజెంటు ఒక వ్యక్తిని గల్ఫ్ పంపిస్తే రూ.30 వేల వరకూ కమీషన్ ముడుతుంది. దీంతో ఇక్కడి ఏజెంట్లు గల్ఫ్ దేశాల్లో ఫలానా పని చేయాలి, నెలకు రూ.వేలల్లో జీతం వస్తుందని ఆశ చూపిస్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత షేక్ నెలకు రూ.10 వేలకు మించి ఇవ్వడు. దీంతో ఏజెంటు చెప్పినట్టు అధిక జీతం దక్కకపోవగా, పని భారం మాత్రం ఎక్కువవుతుంది. ఇలా గల్ఫ్ వెళ్లినవారిలో 70 శాతం మంది మహిళలే కావటంతో వారు పడే ఇబ్బందులు బయటకు చెప్పుకునేలా ఉండవు. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన అమ్మాజీ(40), అంబాజీపే టకు చెందిన సుబ్బాయమ్మ(35), ముమ్మిడివరం మండలం కొమనాపల్లికి చెందిన విజయలక్ష్మి(20) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురికీ ఓ ఏజెంట్ కతార్ దేశంలోని ఒకే ప్రాంతంలో ఉన్న మూడు ఇళ్లలో పనికి పంపించాడు. ఆ ముగ్గురికీ ఆ ఇళ్లల్లో తీవ్రమైన పని ఒత్తిడి పెరిగింది. అమ్మాజీ, సుబ్బాయమ్మ రోగాల బారిన పడ్డారు. పని చేయలేక అలసటతో అవస్థలు పడేవారు. తమ షేక్ చేతిలో పలుమార్లు దెబ్బలు కూడా తిన్నారు. పని ఒత్తిడి, చిత్రహింసలు భరించలేక స్వదేశానికి వచ్చేసి, చేసిన అప్పులను అతికష్టమ్మీద వడ్డీతో తీర్చుకుంటున్నారు. అనారోగ్యాల నుంచి గట్టెక్కేందుకు వైద్యానికి ఖర్చులు చేస్తున్నారు. తన ఇద్దరు సోదరిలకు అలా అవడంతో కతార్‌లోనే ఉన్న విజయలక్ష్మి మానసికంగా కుంగిపోతోంది. స్వదేశం వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడ వచ్చే రూ.10 వేల జీతానికి ఆరోగ్యాలను సహితం పణంగా పెట్టి, పనిభారంతో మహిళలు ఎలా నలిగిపోతున్నారో చెప్పటానికి ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల పరిస్థితే ఉదాహరణ. శేuŠ‡ ఇంట్లో 23 ఏళ్లు బందీగా.. పక్క ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు అకాన సత్యవతి. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి ఈమె 24 ఏళ్ల కిందట తన 40 ఏళ్ల వయసులో బహ్రెయిన్ వెళ్లింది. ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. కొద్ది రోజులు స్వదేశంలోని కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడింది. అంతే.. ఆ తర్వాత నుంచి 23 ఏళ్లపాటు ఆమె ఆచూకీ తెలియలేదు. బతికి ఉందో, చనిపోయిందో ఎటువంటి సమాచారమూ లేక కుటుంబీకులు నరక యాతన పడ్డారు. ఆమెను షేక్ తన ఇంట్లోనే బందీగా ఉంచి కుటుంబీలకు కనీసం ఫోన్ కూడా చేయనీయకుండా ఆంక్షలు పెట్టాడు. తన బహ్రెయిన్ వెళ్లినప్పుడు ఆమె ఇద్దరు కుమారులూ చిన్నపిల్లలు. ఇప్పుడు వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్న కుమారుడు రెండేళ్ల కిందట స్వయంగా బహ్రెయిన్ వెళ్లి తన తల్లి ఆచూకీ కనుగొని తీసుకువచ్చాడు. ప్రస్తుతం సత్యవతి వయసు 65 సంవత్సరాలు. నడి వయసులో ఉపాధికి పరదేశం వెళ్లి, వృద్ధురాలిగా సొంతూరికి, అతికష్టం మీద వచ్చింది. ఇళ్లల్లో పని పేరుతో కొందరు మహిళలు ఖైదీలకంటే దారుణంగా ఎలా మగ్గిపోతున్నారో చెప్పటానికి ఈమె కథ ఓ ఉదాహరణ. నడుం విరిగింది.. ఉపాధి పోయింది పై ఫొటోలో మంచం పట్టిన వ్యక్తి పేరు ముగ్గు రామారావు. రాజోలు మండలం శివకోడు 18 ఎకరాల కాలనీకి చెందిన ఇతడు గల్ఫ్ ఏజెంటు వలలో చిక్కుకున్నాడు. నెలకు రూ.40 వేల జీతం వచ్చే ఉద్యోగమని ఏజెంటు ఆశ చూపాడు. అది నమ్మి గల్ఫ్ వెళ్లేందుకు రామారావు అప్పు చేసి ఏజెంట్‌కు రూ.లక్ష సమర్పించాడు. ఆ ఏజెంట్ విజిటర్ వీసాతో రామారావును దుబాయి పంపించాడు. తీరా అక్కడ చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. ఏజెంట్ మోసంతో కుదేలైన రామారావు తిరిగి వచ్చేందుకు డబ్బుల్లేక అక్కడే ఓ అపార్ట్మెంట్ నిర్మాణంలో రోజువారీ కూలీగా పని చేశాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఇనుపరాడ్డు పడటంతో నడుము విరిగింది. భవన యాజమాని వైద్యం చేయించి, స్వదేశం పంపించే ఏర్పాట్లు చేశాడు. ఏడాది నుంచి ఇంటిపట్టునే మంచం పైనే రామారావు బాధ పడుతున్నాడు. భార్య చంటి టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు చిన్న పిల్లలతో, నడుము విరిగిన భర్తతో బతుకు బండిని చంటి భారంగా లాగుతోంది. రిపోర్టింగ్ : పరసా సుబ్బారావు (అమలాపురం టౌన్) / తోట సత్యనారాయణ (మలికిపురం) ఎడిటింగ్ : కేతవరపు భాస్కర్ లే అవుట్ : డి.ఎస్.వి.వి.ప్రసాద్ -
అగ్రిగోల్్డ ఏజెంట్ల నిరసన
కర్నూలు(న్యూసిటీ) : సంస్థలో డబ్బు పెట్టి మోస పోయిన తమను ఆదుకోవాలని అగ్రిగోల్్డ ఏజెంట్లు, కస్టమర్లు శనివారం బళ్లారి చౌరస్తా నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిధులను కాజేసిన అగ్రిగోల్డ్ ఎండీని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ల, కస్టమర్ల అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.మల్లికార్జున పాల్గొని మాట్లాడారు. -
జీవిత బీమాతో కుటుంబానికి ఆర్థిక భరోసా
రాజంపేట టౌన్: ఎల్ఐసీలో పాలసీ తీసుకోవడం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఎంతో ఆర్దిక భరోసా ఉంటుందని రాజంపేట జీవిత బీమా సంస్థ మేనేజర్ జీ.జాన్‌విక్టర్ తెలిపారు. స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలో ఆదివారం లియాఫీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జీవిత బీమా సంస్థకు ఏజెంట్లు మూలస్థంభాల్లాంటి వారన్నారు. ఏజెంట్ల కృషి వల్లే భారతదేశంలో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా ఉందని తెలిపారు. అంతకు ముందుగా ఎల్ఐసీ కార్యాలయం ఆవరణలో లియాఫీ జెండాను లియాఫీ అధ్యక్షుడు దండే సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఎగురవేశారు. ఈకార్యక్రమాల్లో లియాఫీ అధ్యక్షుడు దండే సుబ్రమణ్యం, కార్యదర్శి వసంతరాజు, కోశాధికారి జీ.రాజశేఖర్‌రాజు, సభ్యులు శంకర్‌నారాయణ, చల్లా గుర్రప్ప, టీ.నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లను పోలింగ్ బూత్ నుంచి తరిమికొట్టండి!
పశ్చిమ బెంగాల్: ప్రత్యర్ధి పార్టీ నాయకులను పోలింగ్ బూతుల నుంచి బయటకు లాగి చితక్కొట్టాలని కార్యకర్తలకు ఫోన్ ద్వారా చెప్తూ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధి సోనాలి గుహా చిక్కుల్లో పడ్డారు. సత్గాచియా ప్రాంతంలోని పోలింగ్ బూతులో ఈవీఎం సరిగా పనిచేయడం లేదంటూ ఆమె ఈసీకి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో పోలింగ్ బూతులోకి ఆమె వెళ్లడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డగించడంతో ఇరువురి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మమత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన సోనాలీ.. సీపీఎం వాళ్ల వల్లే ఈవీఎం పగిలిపోయిందని, వాళ్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు ఈడ్చి తరిమికొట్టాలని ఫోన్ లో కార్యకర్తలకు చెప్పారు. ఓటర్లందరూ తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనాలి వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది. సోనాలిపై కేసు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
'ఏజెంట్ల ప్రమేయం లేకుండా గల్ఫ్‌కు కార్మికులు'
తెలంగాణ హోంశాఖ, కార్మికశాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి రాయికల్ (కరీంనగర్) : ఏజెంట్ల ప్రమేయం లేకుండా కార్మికులను గల్ఫ్ దేశాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం, కార్మికశాఖల మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. హోం మంత్రి నాయిని శుక్రవారం దుబాయిలో మీడియాతో కాసేపు మాట్లాడారు. దుబాయిలోని సోలాపూర్‌లో తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోసియేషన్ ఆధర్యంలో నిర్వహిస్తున్న కార్మికుల కల్చరల్ కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటినుంచీ ఏజెంట్ల ప్రమేయం లేకుండా కార్మికులను గల్ఫ్ దేశాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ పౌండర్ శ్రీనివాసశర్మ, అధ్యక్షుడు జువాడి శ్రీనివాస్, ఉపాధక్షుడు రాజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. -
ఏజెంట్ల తప్పులకు బీమా సంస్థలదే బాధ్యత
న్యూఢిల్లీ: ఏజెంట్లు చేసే తప్పొప్పులన్నింటికీ బీమా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. ఒకవేళ ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో బీమా కంపెనీ రూ. 1 కోటి దాకా జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐఆర్డీఏ ఈ విషయాలు పేర్కొంది. ఈ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా బీమా ఏజెంట్ల కింద వ్యవహరించే వ్యక్తులపై రూ. 10,000 దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఎవరైనా సరే జీవిత బీమా, సాధారణ బీమా, వైద్య బీమా విషయంలో ఒకటికి మించి కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరించకూడదు. బీమా కంపెనీలు నియమించుకున్న ఏజెంట్లందరి వివరాలతో కూడిన ఒక జాబితా ఉండాల్సిన అవసరం ఉంది. -
రిక‘రింగ్’
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఏజెంట్లతో సంబంధం లేకుండా చిన్న మొత్తాలను నేరుగా పోస్టాఫీసులకు వచ్చి జమ చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే పోస్టల్ అధికారులు కొందరు ఇవేమీ పట్టించుకోవడం లేదు. కాసులకు కక్కుర్తి పడి ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని కమీషన్ రూపంలో స్వాహా చేస్తున్నారు. చిన్నమొత్తాల పొదుపును 2012 వరకు రెవెన్యూ శాఖ పర్యవేక్షించేది. చిన్న మొత్తాలను సేకరించేందుకు కలెక్టర్ ఏజెంట్లను నియమించేవారు. అయితే ఏజెంట్ల ప్రమేయం లేకుండా ప్రజలే నేరుగా పోస్టాఫీసులకు వెళ్లి రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీలు), టైమ్ డిపాజిట్లు (టీడీలు) చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో ఉన్న చిన్నమొత్తాల పొదుపు సంస్థ కార్యాలయాన్ని తీసివేసింది. కొత్త ఏజెంట్ల నియామకాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే పోస్టుమాస్టర్లు మాత్రం బినామీ ఏజెంట్లతో కమీషన్ నొక్కేస్తుండటం గమనార్హం. కొంతకాలంగా అనేక మంది పొదుపు చేయడంలో భాగంగా ఆర్డీలు, టైం డిపాజిట్లు చేసేందుకు నేరుగా పోస్టాఫీసులకు వస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని వాటిని బినామీ ఏజెంట్ల నంబర్ కోడ్‌చేసి కమీషన్ దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోస్టుమాస్టర్లకు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు జీతాలు వస్తున్నా టైమ్ డిపాజిట్లు, ఆర్డీలను బీనామీ ఏజెంట్లకు వేసి వేలాది రూపాయలు కమీషన్లతో జేబులు నింపుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు నగరంలో బజార్ పోస్టాఫీస్, బి.క్యాంప్, కొత్తపేట పోస్టాఫీసులతో పాటు నందికొట్కూరు, బేతంచెర్ల, ఎమ్మిగనూరు పోస్టాఫీసుల్లో ఎక్కువగా ఉంది. ఈ విషయం పోస్టల్ ఉన్నతాధికారులకు తెలిసినా వారికి మామూళ్లు అందుతుండటంతో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్లపై 4 శాతం, టైమ్ డిపాజిట్లపై 50 పైసల ప్రకారం కమీషన్ ఉంది. దాన్ని పోస్టుమాస్టర్లు బినామీ ఏజెంట్ల పేరుతో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మచ్చునకు కొన్ని ఉదాహరణలు.. కర్నూలుకు చెందిన సహెరాబేగం 2014 ఆగస్టు 25న బజారు బ్రాంచ్‌లో రూ. 8 లక్షల టైమ్ డిపాజిట్ చేశారు. దీనిని బినామీ ఏజెంటుకు వేసి కమీషన్ తీసుకున్నారు. కర్నూలుకు చెందిన సావిత్రి, రోసిరాజు గత ఏడాది సెప్టెంబరు 4న రూ. 1.50 లక్షల ప్రకారం టైమ్ డిపాజిట్లు చేశారు. వీటిని కూడా వారికి తెలియకుండా బినామీ ఏజెంట్లకు వేసి కమీషన్ తీసుకున్నారు. సువర్ణ అనే పేరున కమీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు. సమస్యను మా దృష్టికి తేవచ్చు.. : కె.వి.సుబ్బారావు, పోస్టల్ సూపరింటెండెంట్ వినియోగదారులకు వివరించి వారిని పోస్టాఫీసుల దాకా వచ్చేలా ఏజెంట్లు ప్రోత్సహిస్తున్నారు. దీంతో పోస్టుమాస్టర్లు వారికి కమీషన్లు ఇప్పిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరిస్తే మా దృష్టికి తేవచ్చు. -
రైతన్నకన్నెర్ర
ఎమ్మిగనూరు టౌన్ : ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డ్‌లో ఆదివారం కమీషన్ ఏజెంట్లు రైతులను దగా చేయడానికి చేసిన ప్రయత్నం వికటించింది. రైతులు కన్నెర్ర చేయడంతో అధికారులు దిగివచ్చారు. ఆరుగాలం కష్టించి పండించిన దిగుబడులను అమ్ముకునేందుకు యార్డ్‌కు తీసుకురాగా.. కనిష్ట ధర కన్నా, కొనుగోలుదారులు నిర్ణయించిన రేటు కన్నా.. తక్కువకు కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డ కమీషన్ ఏజెంట్లు ఆదివారం కూడా అలాగే చేయడానికి ప్రయత్నించగా రైతులు ఎదురుతిరిగారు. యార్డ్ ప్రధాన గేటును మూసివేసి ఆందోళనకు దిగారు. పోలీసులు, యార్డ్ అధికారులు జోక్యం చేసుకోవడంతో రైతులు ఆందోళనను విరమించారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌కు ఆదివారం రైతులు 20 వేల బస్తాల వేరుశనగ కాయలను తీసుకువచ్చారు. కనిష్ట ధరగా రూ.3001, గరిష్ఠ ధరగా రూ.5089 నిర్ణయించారు. భారీగా వచ్చిన సరుకును చూసి ఇదే అదునుగా భావించిన ఇద్దరు కమీషన్ ఏజెంట్లు దగాకు తెరతీశారు. వ్యాపారులు నిర్ణయించిన ధరల్లో అతి తక్కువ ఉన్న ధరను కమీషన్ ఏజెంట్లు పరిగణనలోకి తీసుకొని రైతులను దోపిడి చేయాలని పథకం వేశారు. అలాగే వ్యాపారులు నిర్ణయించిన ధరతో పాటు ఆదివారం పలికిన కనిష్ఠ ధర కన్నా తక్కువ ధరను టెండర్ ఫారంలో రాసి రైతులకు మీ సరుకు ఇంతే రేటు పలికిందని నమ్మించబోయారు. ఉదాహరణకు 4, 18వ లాట్(కుప్ప)లో ఉన్న వేరుశనగ దిగుబడులను వ్యాపారి రూ.3909లకు కొనుగోలు చేస్తున్నట్లు టెండర్ ఫారంలో నమోదు చేయగా ఇద్దరు కమీషన్ ఏజెంట్లు రూ.2270కు మీ సరుకు అమ్ముడుపోయిందని రైతులకు తెలిపారు. ఇలా మొత్తం 18 లాట్లలోని రైతులను కమీషన్ ఏజెంట్లు దగా చేయాలని ప్రయత్నించారు. అయితే కొంత మంది చదువుకున్న యువకులు కమీషన్ ఏజెంట్ల మోసాన్ని పసిగట్టి యార్డ్ కార్యాలయం ముందున్న నోటీస్ బోర్డును పరిశీలించారు. నోటీసు బోర్డులో కనిష్ఠ ధర రూ.3009లు, గరిష్ఠధర రూ.5089లు ఉండగా కమీషన్ ఏజెంట్లు రూ.1500 నుంచి రూ.3 వేల లోపు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో ఇతర రైతులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో రైతులంతా కలిసి వ్యాపారులు టెండర్ ఫారంలో నమోదు చేసిన ధరల వివరాలను పరిశీలించారు. కనిష్ఠ ధరతో పాటు వ్యాపారులు నిర్ణయించిన ధరల కన్నా తమ సరుకు తక్కువకు అమ్ముడుపోయిందని కమీషన్ ఏజెంట్లు నమ్మించడంపై రైతులు తిరగబడ్డారు. దీంతో కమీషన్ ఏజెంట్లు అక్కడి నుంచి తప్పించుకుపోయారు. రైతులంతా గుమిగూడి కమీషన్ ఏజెంట్ల ఆక్రమాలను ఎండగట్టాలని నిర్ణయించుకొని సాయంత్రం 4 గంటల సమయంలో మార్కెట్‌యార్డ్‌లో ఆందోళనకు దిగారు. ఆ తరువాత యార్డ్ ప్రధాన గేటును మూసివేశారు. దీంతో యార్డ్ లోపలికి వచ్చే వాహనాలన్నీ మంత్రాలయం రహదారిపై ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మార్కెట్‌యార్డ్ చైర్మన్‌కు, కార్యదర్శికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. దూషించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. పాటు జరిగిందని, తాను సరిదిద్ది న్యాయం చేస్తానని యార్డ్ కార్యదర్శి వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతులు ఇదే విషయమై పట్టణ ఎస్ఐ శంకరయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై యార్డ్ కార్యదర్శి యాసిన్‌ను విలేకరులు వివరణ కోరగా పొరపాటుతో పాటు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఉన్నతాధికారులు, చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి కమీషన్ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఏజెంట్ల గుప్పిట్లోనే పాస్‌పోర్టులు
మోర్తాడ్ : మలేసియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులకు సంబంధించిన పాస్‌పోర్టులను ఏజెంట్లు తమ గుప్పిట్లో ఉంచుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టు నుంచి బయట పడగానే ఏజెంట్లు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. పర్యాటకులకు స్వర్గధామంగా విరాజిల్లుతున్న మలేసియాలో బార్లు, రె స్టారెంట్లు, రిసార్టులు, పబ్‌లు, వాణిజ్య సముదాయాల్లో పనులు ఉన్నాయని నమ్మించి కార్మికులను మభ్య పెట్టారు. నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు రెండు వేల మందిని మలేసియాకు తరలించినట్లు అంచనా. వర్క్ వీసాలు ఇస్తామని నమ్మించిన ఏజెంట్లు కార్మికుల నుంచి లక్షన్నర రూపాయల చొ ప్పున వసూలు చేశారు. విజిట్ వీసాలు చేతిలో పెట్టి నట్టేట ముంచారు.ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమిటని ప్ర శ్నిస్తే వర్క్ వీసా కోసమని బురిడీ కొట్టించారు. కొందరు కార్మికులు మాత్రం ముందు జాగ్రత్తగా పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలను తమ వద్ద ఉంచుకున్నారు. వాటి ఆధారం గానే మలేసియాలో సెల్ సిమ్‌కార్డులను పొందారు. చెన్నైలోని ఏజెంటుకు ఫోన్ చేస్తే మరో రూ. 30వేలు చెల్లిస్తే పాస్‌పోర్టును ఇప్పిస్తామని స్పష్టం చేశాడని కార్మికులు వివరించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకపోయిన తాము మళ్లీ అంత డబ్బు ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు. చేతిలో పాస్‌పోర్టు లేకపోవడంతో దొంగచాటుగా దొరి కిన పని చేస్తు కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. మలేసియా పోలీసులకు చిక్కకుండా తలదాచుకుంటున్నారు. మలేసియాలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను పట్టుకుని జైళ్లో పెడుతున్నారు. జరిమానా చెల్లించినవారికి ఔట్ పాస్‌పోర్టును జారీ చేసి పంపిస్తున్నారు. జరి మానాతోపాటు విమాన టిక్కెట్‌కు అయ్యే ఖర్చును కార్మికులు సొంతంగా భరించాల్సి ఉంది. కార్మికులు జైళ్లో ఉండటంతో వారికి ఇంటి నుంచి సొమ్మును పంపాల్సిన అ వసరం ఏర్పడింది. మలేసియాలో కష్టాలు పడుతున్న మనవారిని ఇంటికి రప్పించాలని, ఏజెంట్లను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఎడారి బతుకులకు ఆసరా
తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా సిద్ధం ఏజెంట్ల మోసాలపై వలసజీవులకు బాసట విదేశీ యానానికి ముందు నైపుణ్యాల్లో శిక్షణ ఆపదలో ఉన్నవారి కోసం సత్వర చర్యలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ‘ఎన్ఆర్ఐ సెల్’ మృతుల కుటుంబాలకు లక్ష ఎక్స్‌గ్రేషియా సాక్షి, హైదరాబాద్: ఉపాధి అన్వేషణలో ఎడారి బాట పట్టి కష్టాల కడలిలో చిక్కుకుపోతున్న వలస జీవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ పటిష్ట విధానాన్ని(పాలసీ) రూపొందించింది. దేశం కాని దేశంలో నిస్సహాయ పరిస్థితుల్లో కూరుకుపోయి.. సహాయం కోసం మాతృదేశం వైపు ఆశతో చూసే తెలంగాణ బిడ్డలకు ఆపన్నహస్తం అందించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ‘తెలంగాణ ఎన్ఆర్ఐల సంక్షేమం, రాష్ట్రంలో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు పోత్సాహకం’ పేరుతో ప్రభుత్వం ఓ మూసాయిదా పాలసీని సిద్ధం చేసింది. గతేడాది జూలై 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ దీన్ని రూపొందించింది. ఇం దుకు కేరళలో విజయవంతమైన ఎన్ఆర్ఐ పాలసీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆర్థిక, న్యా య, హోం శాఖలు ఈ ముసాయిదా ను ఆమోదించాయి. ఇక దీనికి రాష్ర్ట కేబినెట్ ఆమోదం లభించడమే తరువాయి. ఇది అమల్లోకి వస్తే వలస జీవులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. నకిలీ ఏజెంట్లను గుర్తించడంలో ప్రజలకు సహకరించేందుకు అధీకృత ఏజెట్లు, అనధికార/నిషేధిత ఏజెంట్ల జాబి తాను ఎన్ఆర్ఐ వెబ్సైట్లో ప్రభుత్వం పెట్టనుంది. బాధిత కుటుంబాలకు పరిహారం పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి మృత్యువాత పడిన వారికి సంబంధించిన నిరుపేద కుటుం బాలకు ప్రభుత్వం లక్ష రుపాయల పరిహారం అందించనుంది. గతంలో కొన్ని ప్రత్యేకమైన కేసుల విషయంలోనే దీన్ని చెల్లించారు. కొత్త ఎన్ఆర్ఐ విధానం ప్రకారం బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం వర్తించనుంది. ఉమ్మడిరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రారంభమైన నాటి నుంచి 200 మంది మృతుల కుటుంబాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సరైన పాలసీ లేకపోవడంతో ప్రభుత్వం ఈ దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి పునరావాసానికీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎన్ఆర్ఐలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేందుకు సహకారం అందిస్తుంది. సింగిల్ విండో విధానం ద్వారా వారికి అనుమతులిస్తుంది. ఐటీఐలు, ‘ఔట్సోర్సింగ్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ’ సంస్థల ద్వారా నైపుణ్యాల పెంపులో శిక్షణ ఇప్పిస్తుంది. సత్వర చర్యలకు కొత్త యంత్రాంగం ఆపదలో చిక్కుకున్న ఎన్ఆర్ఐలను ఆదుకోవడానికి సత్వర చర్యలు చేపట్టేందుకు సచివాలయంలోని ఎన్ఆర్ఐ విభాగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయనుంది. సచివాలయంలో ఎన్ఆర్ఐల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తుంది. వలసలు ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో ‘ఎన్ఆర్ఐ సెల్’ ఏర్పా టు చేయనుంది. ఆన్లైన్ ద్వారా జనన, మరణ, వివాహ, ఉద్యోగ ధ్రువీకరణ పత్రాల అటెస్టేషన్ జరపనుంది. విదేశాలకు వెళ్లే ముందు శిక్షణ, కౌన్సెలింగ్, అవగాహన కల్పన కోసం విమానాశ్రమంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనుంది. నిరక్షరాస్యులైన బాధితులు భాషా సమస్యను ఎదుర్కోకుండా విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో తెలుగు అనువాదకులను నియమించనుంది. ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం అధికారిక వెబ్సైట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు వెల్లడిస్తుంది. అలాగే విదేశాల్లోని యాజమాన్యాలకు సమాచారం, సంక్షేమ కార్యక్రమాల అమలు వివరాలు పొందుపరుస్తుంది. కేరళలో విజయవంతం కేరళలో రెండు ప్రభుత్వ సంస్థలు అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీ విజయవంతమైంది. నోర్కా రూట్స్, నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డు అనే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విదేశాల్లోని మలయాళీల భద్రత, సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయి. నోర్కా రూట్స్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల అటెస్టేషన్, విదేశీ ప్రయాణానికి ముందు శిక్షణ, నైపుణ్యాల పెంపు, కాల్ సెం టర్, జాబ్ పోర్టల్, ఉద్యోగాల భర్తీ, గుర్తింపు కార్డుల జారీ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వేల్ఫేర్ బోర్డు పనిచేస్తోంది. రెండేళ్లు విదేశాల్లో పని చేసి తిరిగి వస్తే బోర్డులో సభ్యత్వం పొందవచ్చు. బోర్డు ద్వారా ఎన్ఆర్ఐలకు పింఛన్లు, మృతుల కుటుంబాలకు చేయూత అందుతున్నాయి. -
నమ్మితే నట్టేటికే..
సిరిసిల్ల రూరల్: నకిలీ గల్ఫ్ ఏజెంట్ల దందా సిరిసిల్లలో మళ్లీ మొదలైంది. అనుమతి లేకుండానే గల్ఫ్ ట్రావెల్స్ కార్యాలయాలు నెలకొల్పి ఇంటర్వ్యూలు నిర్వహించే స్థాయికి చేరింది. విదేశాల్లో మంచి ఉద్యోగం.. వేలల్లో జీతాలు అంటూ పలు కేబుల్ టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూ నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. వీటిని నమ్మి పలువురు నిరుద్యోగ యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు రూ.లక్షలు అప్పు చేసి నకిలీ ఏజెంట్ల చేతిలో పెడుతున్నారు. ఎలాగో అలా యువకులను గల్ఫ్‌కు పంపించినా అక్కడి కంపెనీల్లో కనీస వేతనాలు లేకపోవడం, ఏజెంట్లు చెప్పిన మాటలకు అక్కడి పరిస్థితులకు పొంతన లేకపోవడంతో తాము మోసపోయామనే విషయాన్ని గ్రహించి లబోదిబోమంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అక్కడ పనిలేక, తినేందుకు తిండిలేక, తలదాచుకునేందుకు ఆశ్రయం లేక, స్వదేశం వద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేక విలవిలాడుతున్నారు. తాజాగా సిరిసిల్ల డివిజన్లోని చందుర్తికి చెందిన శ్రీనివాస్, ఇదే మండలం రుద్రంగికి చెందిన కట్కూరి రాజలింగం, మల్యాలకు చెందిన సాగర్, అనిల్, బిట్ల సుమన్, సిరిసిల్ల మండలం బస్వాపూర్‌కు చెందిన బాలసాని శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మధు, మెదక్ జిల్లాకు చెందిన ఎల్లం నకిలీ గల్ఫ్ ఏజెంట్ మోసానికి బలయ్యారు. వీరికి మాయమాటలు చెప్పి మలేషియా పంపించగా, అక్కడ ఏజెంట్ చెప్పిన పని లభించక, తిరిగివచ్చే దారి లేక దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. తాము అనుభవిస్తున్న కష్టాలను వివరిస్తూ కుటుంబసభ్యులకు, మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేయడంతోపాటు లేఖలు రాశారు. దీంతో సిరిసిల్ల ప్రాంతంలో గల్ఫ్ ఏజెంట్ల దందా మరోసారి చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబసభ్యుల ధర్నా ఆగ్రహానికి గురైన బాధితుల కుటుంబసభ్యులు సిరిసిల్ల మండలం చంద్రంపేటలోని గల్ఫ్ ఏజెంట్ నవీన్‌గౌడ్ ఇంటెదుట మంగళవారం ధర్నా చేశారు. మలేషియాలో ఉన్న తమ వారికి ఏం జరిగినా నువ్వే బాధ్యత వహించాలని నవీన్‌గౌడ్‌ను హెచ్చరించారు. బాధితులు వారం రోజుల్లో ఇండియాకు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటానని ఏజెంట్ హామీ ఇచ్చాడు. వారం రోజుల్లో తమ వారిని రప్పించకుంటే నీ ఇంటి ముందు టెంట్ వేసి దీక్ష చేస్తామని బాధితుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. సిరిసిల్లలో గల్ఫ్ ఇంటర్వ్యూలు నాలుగు నెలల వ్యవధిలో సిరిసిల్ల పట్టణంలో మూడు గల్ఫ్ ఏజెంట్ల కార్యాలయాలు వెలిశాయి. ఈ కార్యాలయాల్లోనే నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకరికే మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనుమతి ఉన్నట్టు తెలిసింది. మిగతా వారు నిబంధనలు విరుద్ధంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం సంప్రదించండి.. అంటూ టీవీల్లో తమ ఫోన్ నంబర్లతో ప్రకటనలు ఇస్తున్నారు. అనుమతి ఉన్న ఏజెంట్లు మాత్రమే ఇంటర్వ్యూలు, ఇమిగ్రేషన్, ట్రావెల్స్ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. కానీ పలువురు ట్రావెల్స్‌ల పేరిట, వ్యక్తిగతంగా గల్ఫ్ ఏజెంట్లుగా చె లామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సిరిసిల్లలో పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో ఈ కార్యాలయాలు వెలిశాయి. ఈ విషయమై సిరిసిల్ల సీఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సిరిసిల్లలో ఇంటర్వ్యూలు ఒకరు మాత్రమే నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారు సంబంధిత ఏంబసీ నుంచి అనుమతి పత్రాలు తీసుకువచ్చి ఠాణాలో సమర్పించారని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా గల్ఫ్ ఏజెంట్లుగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ ఏజెంట్లపై కేసు ఎలిగేడు : కంపెనీ వీసాపై ఇరాక్‌కు పంపిస్తామని డబ్బులు తీసుకుని టూరిస్టు వీసాపై పంపిన నలుగురు లెసైన్స్‌లేని ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు జూలపల్లి ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. ఎలిగేడుకు చెందిన కుడుదుల రాంబాబు, కుడుదుల గౌతమ్, చెర్ల దుబ్బయ్య, లచ్చయ్య అదే గ్రామానికి చెందిన గుజ్జుల రాజేశంతో పాటు మరో ఏడుగురిని మోసగించి ఒక్కొక్కరి నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని ఇరాక్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. అక్కడికి వెళ్లాక పనులు లేకపోవడంతో రాజేశం సహా ఏడుగురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుజ్జుల రాజేశం ఫిర్యాదుకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. సర్కారు స్పందించాలె మలేషియాకు వచ్చే భారతీయులను బానిసలుగా, పని యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ తినడానికి తిండి సరిగా లేదు. మురికి నీరే దిక్కు. మా బాధలు చెప్పినా ఎవరూ పట్టించుకునేవారు లేరు. ఏజెంట్ మాటలు నమ్మి కంపెనీ నుంచి బయటకు వచ్చినం. ఇప్పుడు అటు కంపెనీకి వెళ్లలేక, ఇండియా రాలేక గోసవడుతున్నం. తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి మమ్మల్ని స్వదేశం చేర్చాలే. - సాగర్, మల్యాల మాలాగా మోసపోవద్దు టీవీలో యాడ్ చూసి మాలాగా మరెవరూ మోసపోవద్దు. ఆ యాడ్‌ను వెంటనే ఆపివేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుంటే నకిలీ ఏజెంట్లు నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసి మోసం చేస్తరు. ఏజెంటు మాటలు నమ్మి వచ్చినందుకు మా బాధలు అంతా ఇంతా కాదు. మా పాస్‌పోర్టులు ఇప్పించి ఇండియాకు వచ్చేలా చూడండి. - బూర అనిల్, మల్యాల -
ఏపీ మంత్రుల వింత పోకడ..!
-
ఏపీ మంత్రుల వింత పోకడ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల వింత పోకడ విచిత్రంగా ఉంది. వడ్డించేవారు మనవాళ్లు అయితే...అన్న చందంగా మంత్రులు ... ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఏజెంట్ల నియామకాల కోసం మంత్రల పేషీలో లాబీయింగ్ జోరుగా సాగుతోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...నందకుమార్ అనే వ్యక్తిని సిఫార్సు చేశారు. అది కూడా సామాన్య భక్తులకు సేవలు అందించేందుకే ఏజెంట్ల నియామకం అని పేర్కొనటం విశేషం. మంత్రుల సిఫార్సుల పరంపరను చూసి టీటీడీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లాబీయింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లినట్లు సమాచారం. -
భూ లావాదేవీల్లో స్థానికేతరులే ఎక్కువ
కీలకపాత్ర పోషిస్తున్న ఏజెంట్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలే కాకుండా వాటికి సమీపంలో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోగల భూములు, స్థలాలు కొనుగోలు చేయడానికి స్థానికేతరులే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రాజధాని గ్రామా ల తొలి జాబితా విడుదలకు ముందునుం చి తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే నవ్యాంధ్ర రాజధాని నిర్మించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో కొందరు గ్రామస్తులు తమ సమీప బంధువులు, స్నేహితులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని తమ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని వివరించి, ఇక్కడ భూము లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. వీరికితోడు బడా పారిశ్రామికవేత్తలు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ఇతర ప్రాంతాల్లోని తమ వర్గానికి చెందిన వారికి ఈ వివరాలను అందించారు. తుళ్ళూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోనే ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నా యి. అక్టోబర్, నవంబర్లలో ఇప్పటి వరకు జరిగిన భూముల కొనుగోళ్లలో స్ధానికేతరులే ఎక్కువగా కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రారు కార్యాలయాల రికార్డులు చెబుతున్నాయి. మంగళగిరి, తాడికొండల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అక్టోబర్‌లో మంగళగిరి రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో 1,207 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో కృష్ణా జిల్లా రూరల్, విజయవాడకు చెందినవారు ఎక్కువగా కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలన్నీ మంగళగిరి సబ్ రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలో ఉండగా, తుళ్ళూరు మండల పరిధిలోని ఐదు గ్రామాలు మంగళగిరి సబ్ రిజస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో 1,375 రిజస్ట్రేషన్లు జరిగితే అందులో విజయవాడకు చెందిన కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నారు. తుళ్ళూరు మండలాన్ని రాజధానిగా ప్రకటించిన తరువాత అక్టోబర్‌లో జరిగిన కొనుగోళ్లలో ఎక్కువమంది స్థానికేతరులు ఉన్నారు. వీటిలో 70 శాతం వరకు తుళ్ళూరు మండలంలోని గ్రామాల పరిధిలోని భూములు కొనుగోలు చేశారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు తుళ్ళూరు మండలంలోని రాయపూడి, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, మల్కాపురం గ్రామాలలోని భూములకు సంబంధించి 500కు పైగా రిజస్ట్రేషన్లు నమోదయ్యాయి. పెదకాకానిలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నెమ్మదించాయి. ఏప్రిల్‌లో 940, మేలో 924, జూన్‌లో 1,481, జూలైలో 1,574, ఆగస్టులో 702, సెప్టెంబర్‌లో 883, అక్టోబర్‌లో 507 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అక్టోబర్‌లో జరిగిన 507 రిజిష్ట్రేషన్లలో 95 శాతం ప్లాట్లు, 5 శాతం పొలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వీటిలోనూ 40 శాతం స్థానికులు కాగా, 60 శాతం మంది స్థానికేతరులున్నట్టు అధికారులు చెబుతున్నారు. అమరావతి రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలోని వైకుంఠపురం, పెద మద్దూరు, తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, వడ్లమాను, అనంతవరం గ్రామాలలో పొలాల కొనుగోలు అధికంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 160 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మరో 100 ఎకరాలు అగ్రిమెంట్ మీద కొనుగోలు చేశారు. వీటిలో 60 నుంచి 70 శాతం వరకు స్థానికేతరులే ఉన్నారు. పెదకూరపాడు మండలంలో రెండు నెలల నుంచి భూముల కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. -
రిచ్‌ఇండియా ఎండీని నిలదీసిన ఏజెంట్లు
ఉదయగిరి రూరల్: రిచ్ ఇండియా కంపెనీ ఎండీ నేరెళ్ల వేణుగోపాల్‌ను పలువురు ఏజెంట్లు చుట్టుముట్టారు. తాము చెల్లించిన నగదు చెల్లించాలని నిలదీశారు. ఈ ఘటన సోమవారం ఉదయగిరిలో జరిగింది. ఏజెంట్ల కథనం మేరకు.. జలదంకి మండలం చోడవరానికి చెందిన వేణుగోపాల్ 2010లో రిచ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. నెల్లూరు కేంద్రంగా వింజమూరు, నంద్యాల, పొద్దుటూరు, కర్నూలు, కందుకూరు లో బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. చెల్లించి న నగదుకు తక్కువ కాలంలోనే రెట్టిం పు ఇస్తామని ఆశచూపి ఏజెంట్ల ద్వారా సుమారు రూ.2.50 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఏడాది పాటు సక్రమం గా చెల్లించారు. అనంతరం నష్టాలు రావడంతో సంస్థ ఆస్తులను ‘విగార్’ కంపెనీకి అప్పచెప్పి నగదు పొందారు. ఆనగదుతో సీతారామపురం మండలం చింతోడు వద్ద పొలాలు కొనుగోలు చేసి శ్రీగంధం మొక్కలు నాటారు. బాండ్ల కాల పరిమితి ముగియడంతో ఏజెంట్లు నగదు చెల్లించాలని గతంలో అతన్ని పట్టుబట్టారు. ఆ సమయంలో చింతోడులోని పొలాలను ఇస్తానంటూ అగ్రిమెంట్ చేశారు. ఇటీవల ఆ పొలాలను పరిశీలించిన ఏజెంట్లు అవి ఎందుకూ పనికిరావని గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించి ఎండీని నిలదీయాలని భావించారు. ఈ క్రమంలో నంద్యాల, వింజమూరు ప్రాంతాలకు చెందిన ఏజెంట్లు పొలం రిజిస్ట్రేషన్‌కు వేణుగోపాల్‌ను పిలవడంతో సోమవారం ఉదయగిరి వచ్చాడు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టి నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు గమనించి వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కేసులు అవసరం లేదని ఏజెంట్లు పేర్కొనడంతో ఆయనను వదిలేశారు. తన ఇంటితో పాటు పొలాలను రాసిచ్చేందుకు వేణుగోపాల్ సుముఖత వ్యక్తం చేయడంతో రాజీపడ్డారు. తమకు నంద్యాల బ్రాంచ్ పరిధిలో రూ.55 లక్షలు, వింజమూరు బ్రాంచ్ పరిధిలో రూ.45 లక్షలు రావాల్సి ఉందని ఏజెంట్లు తెలిపారు. -
అగ్రిగోల్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఆదోని టౌన్: అగ్రిగోల్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆ సంస్థ ఏజెంట్లు, ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన పొదుపు, డిపాజిట్లకు వడ్డీతోపాటు చెల్లించాల్సిన నగదును యాజమాన్యం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తోందంటూ కార్యాలయ తలుపులు మూసి ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో కార్యాలయంలో ఉన్న సీనియర్లపై దాడిచేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్లు, ఖాతాదారులు వీరేష్, చంద్రమ్మ, లక్ష్మన్న, నర్సింహులు, లక్ష్మినారాయణ, సావిత్రి, దస్తగిరి, శరత్‌బాబు, రాము, అంజి, వెంకటేష్, ఈరన్న, పద్మ, రామాంజనేయులు, సురేష్ తదితరులు మాట్లాడుతూ 8నెలలుగా చెక్కులను పట్టుకొని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నా తమ గోడును పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఒక్కో చెక్కు రెండు, మూడు సార్లు బౌన్స్ అయిందని, రెండు, మూడు బ్యాంకులకు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం, సీనియర్లు చెప్పే మాటలకు, ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన లేదని ఆరోపించారు. గంటపాటు ఆందోళన చేసిన ఏజెంట్లు, ఖాతాదారులకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని అంతలోగా నగదు చెల్లిస్తామని సీనియర్ల నుంచి ఫోన్లు రావడంతో ఆందోళనను విరమించారు. దాదాపు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.5కోట్లు మేర డిపాజిట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఖాతాదారులు రామాంజినేయులు, సురేష్, పద్మ, చంద్రమ్మ తెలిపారు. -
సౌదీనావస్థ
సౌదీలో చిక్కుకున్న ఆరుగురు విశాఖ వాసులు ఉద్యోగాలిప్పిస్తామని మోసగించిన ఏజెంట్లు అయిదు నెలలుగా జీతాల్లేవు రోజూ రాత్రిపూటే భోజనం చిన్న గదిలో పది మంది నివాసం అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని గట్టెక్కించాలి. కొడుకు కిడ్నీ శస్త్ర చికిత్సకు డబ్బు సంపాదించాలి. ఆర్థిక సమస్యలను అధిగమించాలి... అందుకోసం విదేశం వెళ్లాలనుకున్నారు. అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు గుమ్మరించారు. సౌదీలో విమానం దిగాక మోసపోయామని తెలుసుకున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక విలపిస్తున్నారు. అయిదు నెలలుగా నరకయాతన పడుతున్నారు. స్వదేశానికి తీసుకురమ్మని వారి బంధువులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విశాఖ రూరల్ : సౌదీ అరేబియాలో ఉద్యోగాలిప్పిస్తామని కొందరు ఏజెంట్లు చేసిన ప్రకటనలు నమ్మి జిల్లాకు చెందిన చాలా మంది వారిని సంప్రదించారు. వెల్డర్, ఫిట్టర్, టెక్నికల్ ఉద్యోగాలిప్పిస్తామని, నెలకు రూ.20 వేలకు పైగా జీతమని, భోజనం, వసతి ఉచితమని ఏజెంట్లు నమ్మించారు. దీంతో అన్నెపు గోవిందరావు (నడుపూరు), గోల్కొండ శేషగిరిబాబు (బీహెచ్‌పీవీ), పిల్లా గణేష్ (శ్రీహరిపురం), ఎమ్డీ హఫీజుల్లా (పెదగంట్యాడ), రాయె శ్రీనివాసరావు (అనకాపల్లి), కోడెపు నరసింగరావు (కశింకోట)లు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఏజెంట్లకు సమర్పించి సౌదీ వెళ్లారు. రూపాయైనా జీతం ఇవ్వలేదు అక్కడికి వెళ్లాక చెప్పిన ఉద్యోగం కాకుండా కూలి పనులు చేయించారు. పనేదైనా నెలకు రూ.20 వేల జీతం వస్తుందన్న ఆశతో సంస్థ ప్రతినిధులు చెప్పిన ప్రతీ పని చేశారు. నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదు. చిన్న గదిలో 10 మందిని కుక్కడంతో నిద్రపోయేందుకు కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు. రోజూ రాత్రి పూట మాత్రమే భోజనం పెడుతున్నారు. అయిదు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ విలపిస్తున్నారు. ఫోన్ చేయడానికి కూడా డబ్బుల్లేక, సంస్థలో పనిచేస్తున్నవారు, బయటి వ్యక్తులను అర్ధించి వారి ఫోన్లతో ఇళ్లకు ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. తమ వారిని వెనక్కి రప్పించాలని కుటుంబ సభ్యులు ఇటీవలే కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. కష్టాలు తమ జీవితాలకు కొత్తేమి కాదని, డబ్బులు పోయినా తమ వారిని వెనక్కు రప్పిస్తే చాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. కలెక్టరేట్‌కు సమాచారం విశాఖ జిల్లావాసులు ఆరుగురు సౌదీలో చిక్కుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. హైదరాబాద్‌లోని ఎన్ఆర్ఐ ప్రొటోకాల్ విభాగం నుంచి వీరి చిరునామాలు కలెక్టరేట్‌కు రావడంతో రెవెన్యూ అధికారులు బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్న వారిని కలెక్టరేట్‌కు రప్పించి అక్కడ చిక్కుకున్న వారి పూర్తి వివరాలను సేకరించారు. కొందరి ఇళ్లకు రెవెన్యూ సిబ్బందిని పంపిస్తున్నారు. ఆరుగురు జిల్లా వాసులను నిర్థారించాక ఆ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. అనంతరం ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేస్తుందంటున్నారు. -
ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ టర్మ్ పాలసీ..
తక్కువ ప్రీమియంలతో అత్యధిక కవరేజీ అందించే టర్మ్ పాలసీలను ఆన్లైన్లో పలు బీమా కంపెనీలు అందిస్తున్నాయి. దేశీయంగా అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. సాధారణంగానే మిగతా పాలసీలతో పోలిస్తే టర్మ్ పాలసీల ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. అదే ఆన్లైన్లో తీసుకుంటే మరింత తగ్గుతాయి. ఏజెంట్ల ద్వారా తీసుకునే పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు సుమారు 35 శాతం తక్కువగా ఉంటున్నాయి. పాలసీలను విక్రయించినందుకు ఏజెంట్లకి ఇచ్చే కమీషన్ల భారం లేకపోవడం వల్ల ఆ ప్రయోజనాలను ఎల్ఐసీ లాంటి కంపెనీలు నేరుగా పాలసీదారులకు బదలాయిస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇస్తాయి ఈ పాలసీలు. పాలసీదారు మరణించిన పక్షంలో మాత్రమే సమ్ అష్యూర్డ్‌ని వారి కుటుంబసభ్యులకు అందిస్తాయి కంపెనీలు. ఒకవేళ అలాంటిదేమీ జరగని పక్షంలో కట్టిన ప్రీమియం తిరిగి రాదు. అందుకే.. మిగతా పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు కాస్త తక్కువగా ఉంటాయి. రూ. 50 లక్షలు పైబడిన కవరేజీ తీసుకుంటున్న పక్షంలో పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి ఒక రకంగానూ, అలవాటు లేని వారికి మరో రకంగానూ ప్రీమియంలు ఉంటాయి. కనీసం పదేళ్ల నుంచి 35 ఏళ్ల వ్యవధి దాక పాలసీ తీసుకోవచ్చు. మిగతా కంపెనీల ఆన్లైన్ పాలసీల విషయానికొస్తే 30 ఏళ్ల పురుషులు (నాన్-స్మోకర్) ప్రీమియంలు రూ. 4,500 నుంచి రూ. 10,130 దాకా ఉంటుండగా.. ఎల్ఐసీ పాలసీ రూ. 8,820 స్థాయిలో ఉంటోంది. ఏదైనప్పటికీ.. క్లెయిమ్‌లను చెల్లించడంలో ఎల్ఐసీ రికార్డు, ఇతరత్రా ప్రయోజనాల కారణంగా ఈపాలసీ మెరుగైనదేనన్నది పరిశీలకుల అభిప్రాయం. -
ఉద్యోగాలం
నిరుద్యోగులకు ఏజెంట్ల వల విదేశీ ఉద్యోగాల పేరిట టోకరా లక్షలు కాజేసి నకిలీ వీసాలు అందజేత విషయం తెలియక బాధితులు విలవిల ఇరాక్‌లో జిల్లా వాసులు చిక్కుకుపోవడంతో విషయం వెలుగులోకి.. స్పందించని జిల్లా యంత్రాంగం విశాఖపట్నం: విదేశాల్లో మంచి ఉద్యోగం.. వేలల్లో జీతం..విలాసవంతమైన జీవితం.. ఇలా నిరుద్యోగులకు ఏజెంట్లు ఆశ లు కల్పిస్తున్నారు. అందినంత గుంజుతున్నారు. నకిలీ వీసాలు, విజిటింగ్ వీసాలతో ఢిల్లీ, ముంబయి తీసుకెళ్లి అక్కడ నుంచి విదేశాలకు విమానం ఎక్కించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. తిరిగి వచ్చేందుకు డబ్బుల్లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ నెల 18న విశాఖ జిల్లాకు చెందిన 40 మంది యువకులను ఏజెంట్ ఇరాక్‌కు పంపాడు. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆ దేశంలోని నజాఫ్‌లో పనిలోకి తీసుకున్న కంపెనీ వీరిని ఓ కంటైనర్‌లో ఉంచింది. తిండీ, నీళ్లు లేక వారంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వారి స్నేహితులు ఆదివారం ఢిల్లీలోని సాక్షి కార్యాలయానికి వచ్చి గోడు వెలిబుచ్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయిన మరికొందరు విశాఖవాసులు తమను రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను మోసం చేశాడని, ఇరాక్‌లో ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో తీసుకున్నాడని సాక్షికి చెప్పారు. సుమారు రూ.60 లక్షల మేర తీసుకుని నకిలీ వీసాలు తమ చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాడని వాపోయారు. ఇరాక్‌లో చిక్కుకున్న తమ వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత్‌కు చేర్చాలని బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేడుకుంటున్నారు. ఫిర్యాదులు అందలేదు విశాఖ జిల్లాకు చెందిన 40 మంది నిరుద్యోగులు ఇరాక్‌లో చిక్కుకున్నారని తెలిసినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. కనీసం వారెవరన్నది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కలెక్టర్ ఆరోఖ్యరాజ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇతర అధికారులు ఈ విషయం పట్టించుకోలేదు. బాధిత కుటుంబాల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా ఎస్పీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటన గురించే తమకు తెలియదని చెప్పడం విశేషం. బాధితుల నుంచి ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. ఫిర్యాదులు అందితే భారత దౌత్య కార్యాలయానికి సమాచారమిస్తామని పేర్కొన్నారు. ఏజెంట్‌ను నమ్మి మోసపోయాం ‘మాది కశింకోటలోని గవరపేట...కూలి చేస్తే కానీ భుక్తి గడవని కుటుంబం. ఇద్దరు కుమారులు..పెద్ద వాడు ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. చిన్నవాడు బాపునాయుడిని ఏడో తరగతి వరకూ చదివించాం... గాజువాకలో ప్రైవేటుగా రూ.35 వేలు చెల్లించి వెల్డింగ్ నేర్పించాం. దుబాయి పంపించాం. అక్కడ రెండేళ్లు వెల్డర్‌గా పనిచేసి పనిలేక తిరిగొచ్చేశాడు. కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే మళ్లీ విదేశానికి ఉపాధికి వెళ్లాలని భావించాడు. ఇరాక్‌లో ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మి ఏజెంటు మేడిపాటి వెంకటకృష్ణకు రూ.లక్షన్నర అప్పు చేసి చెల్లించాం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 30 మందితో కలిసి నాలుగు నెలల క్రితం బాపునాయుడిని ఇరాక్ పంపించాం. అక్కడికెళ్లగానే ఏజెంటు బ్యాంకు ఖాతాద్వారా లక్షన్నర రూపాయలు కాజేసి ఉద్యోగం ఇప్పించకుండా పంపేశాడు. అటు డబ్బులు పోయి, ఇటు ఉద్యోగం రాక మోసపోయాం. - పెంటకోట అప్పలసత్తి, లక్ష్మి, కశింకోట (బాధితుని తల్లిదండ్రులు) బాధితులను ఆదుకోవాలి ఇరాక్‌లో పని కోసం వెళ్లి చిక్కుకుపోయిన విశాఖవాసులను వెనక్కి రప్పిం చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇరాక్‌లో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవాలి. టీడీపీ, బీజేపీ నేతలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. - గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ నేత -
ఆశపెట్టి.. అగాధంలోకి..
మోర్తాడ్ (నిజామాబాద్): భారీ వేతనం.. మంచి వసతి అంటూ ఆశపెట్టి విదేశాలకు పంపుతున్న ఏజెంట్లు వారి బతుకులను అగాథంలోకి నెడుతున్నారు. ఇరాక్‌లోని వివిధ కంపెనీల్లో పని కోసం పంపిన ఏజెంట్ల మోసపూరిత విధానాలు మన కార్మికుల పాలిట శాపంగా మారాయి. ఇరాక్ అంతర్యుద్ధం నేపథ్యంలో ఏజెంట్ల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిరుద్యోగులను మాయ చేసిన ఏజెంట్లు వర్క్ వీసాల పేర రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75వరకు వసూలు చేసి విజిట్ వీసాలను చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం వర్క్ వీసా ఉన్నవారిని మాత్రమే స్వస్థలాలకు వెళ్లడానికి ఇరాక్ ప్రభుత్వం అనుమతినిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారికి అనుమతి ఇవ్వకపోవడంతో వేలాది మంది కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. కిర్కుక్ ప్రాంతంలోని కార్వంచ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ గ్రూపు కంపెనీలో ఉన్న 250 మంది కార్మికులకు వర్క్ వీసాలు లేవు. ఈ ఒక్క కంపెనీలోనే కాక ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలలో ఉన్న అనేక కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అలాగే ఉంది. ఏళ్ల తరబడి ఇలాగే... దుబాయ్, ఖతర్, మస్కట్, బెహరాన్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లడం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి ఏళ్లుగా సాగుతోంది. గల్ఫ్‌లో పని చేస్తున్న వారి సంఖ్య పెరగడంతో పోటీ ఎక్కువై వేతనాలు తగ్గాయి. అయితే, ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ దేశాల్లో పునర్నిర్మాణం పనుల కోసం అమెరికా కంపెనీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పని చేయడానికి కార్మికులు అధికంగా అవసరం అయ్యారు. అంతేకాక మిలట్రీ క్యాంపుల్లోను పని చేయడానికి కార్మికులు కావాల్సి వచ్చింది. దీంతో కార్మికులకు అక్కడి కంపెనీలు వేతనాలను ఎరగా వేసింది. ఇరాక్‌లో పని చేస్తే నెలకు 400 నుంచి 500 అమెరికన డాలర్లు వేతనంగా లభిస్తాయని, భోజనం.. వసతి సౌకర్యం ఉంటుందని ఏజెంట్లు ఆశ పెట్టారు. ఈ పరిస్థితుల్లో వర్క్ వీసాలు లేకున్నా.. వేతనాలు వస్తాయనే ఉద్దేశంతో ఎంతో మంది భారతీయులు ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌కు వెళ్లారు. ఇందులో తెలుగువాళ్లే ఎక్కువగా ఉన్నారు. అయితే, ఏజెంట్లు తమకు మూడు నెలల విజిట్ వీసాలను ఇచ్చారని, ఇరాక్ వెళ్లిన తరువాత వర్క్ పర్మిట్ ఇస్తారని చెప్పారని కార్మికులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే, వర్క్ పర్మిట్ మాత్రం ఇవ్వలేదని, వేతనం వస్తుంది కదా అని వీసాల విషయం ఎవరిని అడగలేదని పేర్కొంటున్నారు. ఏజెంట్ల హుండీ దందా.. వర్క్ వీసాలు లేని వారు కంపెనీ క్యాంపులను విడిచి బయట తిరిగే పరిస్థితి లేదు. దీంతో కార్మికులు ప్రతి నెల వారి వేతనాలను ఇంటికి పంపడానికి అధికారికంగా ఉన్న మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలను వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుండీ దందాకు అవకాశం ఏర్పడింది. నిరుద్యోగులను పంపించిన ఏజెంట్లే హుండీ దందా చేస్తున్నారు తమ ప్రతినిధులను నియమించుకుని కార్మికులు ప్రతి నెలా పంపే సొమ్మును హవాలా ద్వారా కార్మికుల ఇళ్లలో చెల్లిస్తున్నారు. దొరకని లెక్కలు.. భారత్ నుంచి ఇరాక్‌కు నేరుగా వెళ్లే అవకాశం లేకపోవడం.. ఏజెంట్లు వయా దుబాయిగా ఇరాక్‌కు పంపుతుండడంతో ఇక్కడి నుంచి ఇరాక్‌కు వెళ్లిన వారెందరు అనే లెక్క తేలడం కష్టంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇరాక్ వెళ్లినప్పటికీ వారిలో చాలా మంది దుబాయ్ నుంచి వెళ్లడంతో వారికి సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు. దీంతో ఇరాక్‌లో ఉన్న వారి లెక్క కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. -
అవినీతికి లెసైన్స్!
ప్రభుత్వ కార్యాలయాలంటేనే అవినీతి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. అయితే, వాటన్నింట్లోకల్లా రోడ్డు రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. లంచాలు తీసుకునేందుకు తామంతా లెసైన్సులు పొందినట్లుగా అక్కడి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుంటారు.నేరుగా చేసే అక్రమాలు చాలవన్నట్లు ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారంతా ఏజెంట్ల ద్వారానే తమను సంప్రదించేలా పరిస్థితిని మార్చేశారు. దీంతో ఏజెంట్లు అడిగినంతా ముట్టజెప్పి ఆర్టీవో అధికారులు, సిబ్బంది ద్వారా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శి : రోడ్డు రవాణా శాఖ జిల్లా కార్యాలయం ఒంగోలు నగరంలో ఉండగా, దాని పరిధిలో దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయాల్లో డ్రైవింగ్ లెసైన్సులు మంజూరు చేయడం, పలు వాహనాల రిజిస్ట్రేషన్లు, బ్రేక్ చేయించడం తదితర పనులు చేస్తుంటారు. అయితే, కొన్నేళ్లుగా అవినీతికి నిలయాలుగా ఆర్టీవో కార్యాలయాలు మారడంతో ప్రస్తుతం ఆయా కార్యాలయాలకు ప్రజలు నేరుగా వెళ్లడం మానేశారు. జిల్లా కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం నుంచి దర్శి, మార్కాపురం, చీరాల, కందుకూరు పట్టణాల్లోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాల్లో ఏ పని కోసమైనా ముందుగా ఆయా కార్యాలయాల చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉండే ఏజెంట్లను సంప్రదించాల్సి వస్తోంది. కొన్నేళ్ల క్రితం అనధికారికంగా ప్రారంభమైన ఈ ఏజెంట్ల వ్యవస్థ ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాల్లో అధికారులు, సిబ్బందికంటే కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ప్రజలకు ఆర్టీవో కార్యాలయంలో ఏ పని అవసరమైనా ముందుగా ఏజెంట్లను సంప్రదిస్తున్నారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులు, సిబ్బంది సైతం ఏజెంట్లతో చేతులు కలిపి వారి ద్వారా వచ్చిన వారికి వెంటనే పనులు చేసి పంపిస్తుండటం, నేరుగా కార్యాలయంలో సంప్రదించిన వారిని రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఏజెంట్లు వివిధ పనుల కోసం తమను సంప్రదించే వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన దానికంటే రెండుమూడు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. వాటిలో కొంత మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి ముట్టజెప్పి సులభంగా పనులు చేయిస్తున్నారు. మిగిలిన మొత్తంతో తమ జేబులు నింపుకుంటున్నారు. ఏజెంట్లకు నంబర్ల కేటాయింపు... ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాల్సినదానికంటే అదనంగా ఒక్కో పనికి ఒక్కో రేటును ఏజెంట్లు నిర్ణయించారు. అన్నిపత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనులు చేస్తుండటంతో ప్రజలకు వారు అడిగినంతా సమర్పించుకోక తప్పడం లేదు. ఏజెంట్లంతా వివిధ పనుల కోసం నిత్యం కార్యాలయానికి వచ్చే ప్రజలను పీల్చిపిప్పిచేస్తూ తమ జేబులు నింపుకుంటుంటారు. ఇలా చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైనప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం, స్థానికంగా పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఏజెంట్ల చెప్పుచేతల్లో ఉంటూ వారిచ్చే లంచాలకు కక్కుర్తిపడి పనులు చేస్తుండటంతో ఏళ్ల తరబడి ఈ పరిస్థితిలో మార్పులేకుండా పోయింది. దర్శి ఎంవీఐ కార్యాలయం వద్ద 18 మంది ఏజెంట్లున్నారు. అధికారులు, సిబ్బంది వీరితో కుమ్మక్కై వారందరికీ ఏకంగా 18 నంబర్లు కేటాయించారు. ఏజెంట్లు తమ ద్వారా కార్యాలయంలోకి పంపే ఫైలుపై తమకు కేటాయించిన నంబర్ వేస్తారు. అలా వచ్చిన వారికే అధికారులు పనులు చేసి పంపిస్తుంటారు. ఇలా పనులు చేయించినందుకుగానూ జనం నుంచి చలానాలకన్నా అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని సాయంత్రానికి అధికారులు, ఏజెంట్లు పంచుకుంటారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుండటం విశేషం. కొత్త మంత్రిపైనే ఆశలు... ప్రస్తుతం జిల్లాకు చెందిన దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖామంత్రిగా నియమితులవడంతో ఆయనపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని ఆ శాఖ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అధికారులు, సిబ్బంది నిజాయితీగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి అడ్డదారుల్లో హైస్పీడ్‌తో వెళ్తున్న వారిని మార్చడం అంత సులభం కాదు. దీనిపై మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
ఏజెంట్లు x రవాణాశాఖ
సాక్షి, నెల్లూరు : రవాణాశాఖలో వేళ్లూనుకుని పోయిన అవినీతి గుట్టు ఏజెంట్లు, ఆ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య వివాదంతో రట్టవుతోంది. దీంతో రవాణాశాఖలో అవినీతి అనుపానులు ఏజెంట్లు బయట పెట్టడంతో ఆ శాఖ అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. ఇన్నాళ్లు తాము పెంచి పోషించిన ఏజెంట్లు తమపైనే తిరుగుబాటు చేయడంతో ఇక వారి ఆధిపత్యానికి కళ్లెం వేసేందుకు సిద్ధమయ్యారు. ‘రవాణా శాఖలో సేవలన్నీ పారదర్శకమే. ప్రతి పని ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఏ పనికైనా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించండి’- అని అధికారులు కార్యాలయం వద్ద బోర్డులు ఏర్పాటు చేసినా.. ఏ పనైనా ఏజెంట్లు లేకుండా జరిగే ప్రసక్తే లేదనేది నిర్వివాదాంశం. ప్రజలు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పనిలేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, యూజర్ చార్జీలు మినహా అదనంగా ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నా.. ఇక్కడ జరుగుతున్న తంతుకు పొంతన లేదు. ఇక్కడ జరిగే అవినీతి బహిరంగమే అయినప్పటికీ అంతా రహస్యమే అన్నట్లుగా ఉంటుంది. ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. పేరుకు మాత్రం అంతా పారదర్శకం అని చెప్పుకునే ఆ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులదే (ఏజెంట్లదే) పెత్తనం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజెంట్ లేనిదే కార్యాలయంలో చిన్న పని కూడా జరగని పరిస్థితి. ఇదంతా నిత్యం జరిగే తంతే అయినప్పటికీ కొద్ది రోజులుగా ఏజెంట్లకు, అధికారులకు మధ్య పొసగడం లేదు. దీంతో నిత్యం అక్కడ గొడవలే. పది రోజులు క్రితం అక్తర్ అనే ఏజెంట్ కార్యాలయంలో చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. అక్తర్ మద్యం సేవించి కార్యాలయంలోకి వచ్చి అధికారులను బహిరంగంగా నిలదీయడం..ఆ తర్వాత పరిణామాలతో ఆ శాఖ అవినీతి గుట్టు వీధిన పడింది. అయితే కొందరు ఏజెంట్లు ఇతడ్ని విలన్‌గా చిత్రీకరించడమే కాకుండా ఆ తంతును చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా కెమెరా మెన్లపై కూడా విరుచుకుపడ్డారు. ఏజెంట్ అక్తర్‌పై కార్యాలయ సిబ్బంది 5వ నగర పోలీసుస్టేషన్లో, నగర డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏజెంట్లు వర్సెస్ సిబ్బంది ఈ వివాదం ఇంతటితో ఆగడం లేదు. తాజాగా బుధవారం ఓ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వాహనాన్ని ఏజెంట్లు అడ్డుకునే వరకు వెళ్లింది. ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించకపోవడంపై మండిపడ్డారు. మీ గుట్టంతా మా చేతుల్లో ఉందంటూ అధికారులు, సిబ్బందిని బ్లాక్ మెయిల్ చేసే వరకు వచ్చింది. నిన్నటి వరకు తమ వద్ద చేతులు కట్టుకుని ఎంతో వినయత ప్రదర్శించే ఏజెంట్లు ఏకులా వచ్చి మేకులా తయారయ్యారని అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థను చాలా ఏళ్ల క్రితం రద్దు చేశారు. అయితే అనధికారికంగా ఏజెంట్ల వ్యవస్థ నడుస్తూనే ఉంది. చాప కింద నీరులా గుట్టుగా సాగిపోయే తమ అవినీతి కార్యకలాపాలు రట్టవుతుండటంతో ఏజెంట్లను కార్యాలయంలోకి అనుమతించ కూడదని అధికారులు గట్టి నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయ ఏఓ ఒకరు తాను నిర్వహించాల్సిన విధులను పక్కన పెట్టి ప్రవేశ గేట్ వద్ద కాపలా కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పరిణామాలు ఏ పరిస్థితికి దారితీస్తాయోనని ఏజెంట్లు ఆందోళన చెందుతున్నారు. పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూనే అధికారుల అవినీతి అనుపానులను బయటపెడతామంటూ వారిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏజెంట్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు ఏ మాత్రం పట్టుబిగిస్తారో వేచిచూడాల్సిందే. స్వచ్ఛందంగా వచ్చి పని చేయించుకోండి ఆర్టీఏ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే వినియోగదారులు ఏజెంట్లను ఆశ్రయించకుండా హెల్ప్‌డెస్క్ ద్వారా పనులు చేయించుకోవాలని కార్యాలయ ఏఓ కరీమ్ తెలిపారు. అనధికారిక వ్యక్తులనెవరిని కార్యాలయం లోపలికి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్ల్లు కీలకం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆయా పార్టీల తరఫును నియమితులైన ఏజెంట్ల పాత్ర కీలకం కానుంది. ప్రతి ఓటును అధికారులు వారి కళ్లెదుటే లెక్కిస్తారు. లెక్కింపు పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఉండేందుకే ఏజెంట్ల నియామకానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈవీఎంలను క్షుణ్ణంగా గమనించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏజెంట్లపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఏజెంట్లకు అర్హులు వీరు.. ఏజెంట్లు జిల్లా వాసులై ఉండాలి 18 ఏళ్లపై వారు మాత్రమే అర్హులు నేర చరిత్ర, ప్రవర్తన సరిగాలేని వారు అనర్హులు ఇష్టారాజ్యంగా బయటకు.. లోపలకు తిరగరాదు బ్యారికేడ్లను దాటి లోపలికి చొచ్చుకుని రాకూడదు మద్యం తాగి కౌంటింగ్ కేంద్రాలకు రాకూడదు ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్‌లు ఉన్న వారినే కేంద్రాల్లోకి అనుమతిస్తారు -7.30 గంటలకే కేటాయించిన టేబుళ్ల వద్ద కూర్చోవాలి {Mమ శిక్షణతో వ్యవహరించాలి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఏజెంట్లు ముందుస్తుగా సంబంధిత ఎన్నికల అధికారుల ద్వారా పాసులు తీసుకోవాలి