Real Estate: eXp Realty Reports 60,000 Real Estate Agents Globally - Sakshi
Sakshi News home page

60 వేలకు పైగా రియల్టీ ఏజెంట్లు

Published Sat, Aug 21 2021 4:48 AM | Last Updated on Sat, Aug 21 2021 11:04 AM

eXp Realty Exceeds 60,000 Real Estate Agents - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్లౌడ్‌ ఆధారిత రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజ్‌ సేవలను అందించే కంపెనీ ఈఎక్స్‌పీ రియాల్టీ ఏజెంట్ల నమోదులో గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. గతేడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా 32,403 మంది ఏజెంట్లు ఉండగా.. ఇప్పుడది 60 వేల మార్క్‌ను అధిగమించింది. ఏటా 85 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. గతేడాది నవంబర్‌లో ఇండియాలో సేవలను ప్రారంభించిన ఈఎక్స్‌పీ రియల్టీలో ప్రస్తుతం 750కి పైగా ఏజెంట్లు, వెయ్యికిపైగా ప్రాపర్టీలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement