
కో-వర్కింగ్ సెంటర్ ఆపరేటర్లు ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది రికార్డు స్థాయిలో 2.24 లక్షల సీట్లను అద్దెకు తీసుకున్నారు. 2023తో పోలిస్తే 43.6 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ సంస్థల నుండి మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని రియల్టీ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం.. 2023లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే, కోల్‌కత, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లలో మొత్తం 1.56 లక్షల డెస్క్‌లను కో–వర్కింగ్ లేదా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు కార్పొరేట్ సంస్థలకు అందించాయి. గత ఏడాది ఆపరేటర్లు బెంగళూరులో 64,000, పుణే 38,000, ఢిల్లీ ఎన్‌సీఆర్ 38,000, ముంబై 28,000, హైదరాబాద్ 26,000, చెన్నైలో 25,000 సీట్లను అద్దెకు ఇచ్చాయి. కోల్‌కత, అహ్మదాబాద్ కేవలం చెరో 1,900 సీట్లకే పరిమితం అయ్యాయి.
బలమైన వృద్ధి నమోదు..
ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రాపర్టీ యజమానుల నుండి అద్దెకు ఆఫీసు స్థలాన్ని తీసుకుని.. మౌలిక సదుపాయాలతో కార్పొరేట్స్, నిపుణులు, వ్యక్తులకు వర్క్‌స్పేస్‌ను అందిస్తాయి. ‘సంప్రదాయ కార్యాలయాల ఏర్పాటుతోపాటు మేనేజ్డ్ వర్క్‌స్పేస్‌ను అంతర్జాతీయ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.
దీంతో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ ప్రస్తుత సంవత్సరంతోపాటు రాబోయే కాలంలో బలమైన వృద్ధి నమోదు చేయనుంది. దీంతో మేనేజ్డ్ స్పేస్ ఆపరేటర్ల ద్వారా ప్రధాన నగరాల్లోని గ్రేడ్ ఏ/ఏ+ ఆస్తులను మరింతగా పెంచుతుంది’ అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఫ్లెక్స్ విభాగం హెడ్ రమిత అరోరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment